For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమీర్ ఖాన్ 25 కేజీలు తగ్గిన ఫ్యాట్ టు ఫిట్ సీక్రెట్..!

కొద్ది సమయంలోనే.. 25 కేజీల బరువు అమీర్ ఖాన్ ఎలా తగ్గాడన్న దానిపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. మరి అమీర్ ఖాన్ 25 కేజీలు ఎలా తగ్గాడు ? ఈ హీరో ఫ్యాట్ టు ఫిట్ సీక్రెట్ ఏంటో చూసేద్దామా..

By Swathi
|

ఓ సినిమాలో క్యారెక్టర్ కోసం అమీర్ ఖాన్ తన శరీరాన్నే మార్చేసుకున్నాడు. తనను తాను ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నాడు. ఏ సినిమాలో అయినా విభిన్నత చూపించే అమీర్ ఖాన్.. ఈసారి డాంగల్ సినిమా కోసం.. అంతే కొత్త తరహాలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

Aamir Khan Weight Loss Journey: Fat to Fit transformation For Dangal

ముందుగా అమీర్ ఖాన్ ఈ సినిమా కోసం.. భారీగా బరువు పెరుగుతాడు. అలా పెరిగిన అదనపు బరువు తగ్గించుకోవడానికి అంటే 25 కేజీల బరువు తగ్గడానికి చాలా కష్టపడ్డాడు. అదికూడా 50 ఏళ్ల వయసులో ఇంత సాహసం చేయడం నిజంగానే.. అతనికి నటనపై ఉన్న డెడికేషన్ ని తెలుపుతుంది.

సాధారణంగా బరువు పెరిగినవాళ్లంతా బరువు తగ్గడానికి రకరకాల ఫీట్స్ చేస్తుంటారు. ఈ రోజుల్లో ఇది చాలా కామన్ గా కనిపిస్తుంది. రకరకాల డైట్స్, ఎక్సర్ సైజులు ఫాలో అవుతున్నా.. ఫలితం పొందక ఢీలా పడిపోతుంటారు. అయితే అమీర్ సాహసం వైపు పొట్టతో బాధపడేవాళ్ల చూపులన్నీ ఉన్నాయి. ఈ స్టార్ హీరో అంత కొద్ది సమయంలోనే.. 25 కేజీలు ఎలా తగ్గాడన్న దానిపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. మరి అమీర్ ఖాన్ 25 కేజీలు ఎలా తగ్గాడు ? ఈ హీరో ఫ్యాట్ టు ఫిట్ సీక్రెట్ ఏంటో చూసేద్దామా..

డైట్, వ్యాయామం

డైట్, వ్యాయామం

50 శాతం డైట్ ద్వారా బరువు తగ్గిస్తే 25 శాతాన్ని వ్యాయామం, 25శాతం విశ్రాంతి ద్వారా తగ్గించవచ్చని అమీర్ ఖాన్ ఫిట్ నెస్ సీక్రెట్ చెబుతోంది.

బ్యాలెన్డ్స్ డైట్

బ్యాలెన్డ్స్ డైట్

20 శాతం హెల్తీ ఫ్యాట్స్ నుంచి క్యాలరీలు, 30 శాతం క్యాలరీలను ప్రొటీన్స్ ద్వారా, 50 శాతం క్యాలరీలను కార్బొహైడ్రేట్స్ నుంచి పొందాలని అమీర్ సూచిస్తున్నాడు.

కార్బోహైడ్రేట్స్

కార్బోహైడ్రేట్స్

సాధారణంగా బరువు తగ్గాలంటే కార్బొహైడ్రేట్స్ కి దూరంగా ఉండాలని సూచిస్తారు. కానీ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి, మెదడుకి గ్లూకోజ్ అందుతుంది.

వ్యాయామం

వ్యాయామం

రోజుకి 6 గంటలపాటు ఫిజికల్ యాక్టివిటీ చేసేవాడట. అలాగే బ్యాలెన్డ్ డైట్ ఫాలో అయ్యేవాడట. సైక్లింగ్, ట్రెక్కింగ్, టెన్నిస్ ఆడటం వల్ల శరీరంలో క్యాలరీలు బాగా కరుగుతాయని సూచిస్తున్నాడు.

నిద్ర

నిద్ర

రోజుకి 10 నుంచి 12 గంటలపాటు నిద్రపోయేవాడట. నిద్ర చాలా ముఖ్యమైనది.

తరచుగా ఆహారం

తరచుగా ఆహారం

ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకుండా.. తరచుగా వెంటవెంటనే ఆహారం తీసుకోవడం వల్ల.. మెటబాలిజం రేటు పెరుగుతుంది. అందుకే తాను ప్రతి అరగంటకు ఒకసారి ఆహారం తీసుకునేవాడినని అమీర్ వివరిస్తున్నాడు.

ఫుడ్ డైట్

ఫుడ్ డైట్

బ్రేక్ ఫాస్ట్ లో పచ్చి కోడిగుడ్డు, ఆకుకూరలు, మాంసంను మధ్యాహ్నం భోజనం సమయంలో, గ్రిల్డ్ చేసిన మటన్, సలాడ్ ని రాత్రి డిన్నర్ లో చేర్చుకున్నాడట. ఇక మధ్యలో నట్స్, ప్రొటీన్ షేక్స్ తీసుకునేవాడట.

వ్యాయామానికి ముందు

వ్యాయామానికి ముందు

వ్యాయామానికి ముందు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగేవాడట. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

పాల ఉత్పత్తులకు దూరంగా

పాల ఉత్పత్తులకు దూరంగా

పాలు, పాల ఉత్పత్తులకు అమీర్ ఫ్యాట్ టు ఫిట్ సమయంలో దూరంగా ఉన్నాడట.

శరీరంలో మార్పు

శరీరంలో మార్పు

శరీరంలో మార్పు రావడానికి కీలకమైనది డైట్. మీరు ఎంత వ్యాయామం చేశారన్నది కాదు.. ఎంత కఠినంగా డైట్ ఫాలో అయ్యారన్నదే ముఖ్యం. డైట్ సరిగా ఫాలో అవకపోతే.. ఫలితాలు చూడలేరు.

English summary

Aamir Khan Weight Loss Journey: Fat to Fit transformation For Dangal

Aamir Khan Weight Loss Journey: Fat to Fit transformation For Dangal. Aamir Khan said he still follows the old-fashioned calorie count system to stay fit.
Desktop Bottom Promotion