Latest Updates
-
తమిళనాడు స్టైల్ చేపల కూర..ఒక్కరే మొత్తం తినేసేంత రుచిగా ఉంటది -
ఇంటికొచ్చి రంగులేేసే పెయింటర్ తో మహిళ ఎఫైర్..భర్తను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ..అసలు ట్విస్ట్ ఏంటంటే.. -
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు
వ్యాయామం తర్వాత ఎట్టిపరిస్థితుల్లో తినకూడని ఆహారాలు..!
వ్యాయామం ద్వారా ఎక్కువ ఫలితాలు పొందాలి, అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలి అంటే..వ్యాయామం చేసే వాళ్లు ఖచ్చితంగా కొన్ని డైట్ టిప్స్ ఫాలో అవ్వాలి. మరి వ్యాయామం చేసిన తర్వాత తినకూడని ఆహారాలేంటో చూద్దాం..
మీరు రెగ్యులర్ గా వ్యాయామం చేస్తారా ? రెగ్యులర్ గా వ్యాయామంతోనే రోజుని ప్రారంభింస్తారా ? ఒకవేళ అవును అయితే.. కొన్ని ఆహారాలను వ్యాయామం తర్వాత ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు.
ప్రతిరోజూ వ్యాయామం చేసే అలవాటు ఉంటే.. మన ఆరోగ్యం చాలా కాలం బాగుంటుందని మనకు తెలుసు. అలాగే వ్యాయామం రెగ్యులర్ గా చేస్తే.. అనేక రకాల అనారోగ్య సమస్యలు, వ్యాధులు, డయాబెటిస్, ఒబేసిటీ వంటి సమస్యలు కూడా దూరంగా ఉంటాయి.

వ్యాయామంతో పాటు.. హెల్తీ డైట్ కూడా ఫాలో అయినప్పుడే.. ఆ వ్యక్తి హెల్తీగా ఉంటాడు. వ్యాయామం అనేక రకాల వ్యాధులను, లక్షణాలను నివారిస్తుంది. అలాగే కొన్ని వ్యాధులకే వ్యాయామమే మందుగా పనిచేస్తుంది.
కాబట్టి.. వ్యాయామం ద్వారా ఎక్కువ ఫలితాలు పొందాలి, అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలి అంటే..వ్యాయామం చేసే వాళ్లు ఖచ్చితంగా కొన్ని డైట్ టిప్స్ ఫాలో అవ్వాలి. మరి వ్యాయామం చేసిన తర్వాత కొన్ని ఆహారాలను ఎట్టిపరిస్థితుల్లో తినకూడదు.

వెజిటబుల్స్
పచ్చికూరగాయలు ఆరోగ్యకరమే అయినా.. వ్యాయామం తర్వాత తినకూడదు. వ్యాయామం తర్వాత అనేక పోషకాలను కోల్పోయి ఉంటుంది. అలాంటప్పుడు కేవలం పచ్చికూరగాయలు మీ శరీరానికి వాటిని అందించలేవు.

స్వీట్స్
వ్యాయామం తర్వాత తినకూడని ఆహారాల్లో స్వీట్స్, పేస్ట్రీలు ఒకటి. వీటిల్లో పంచదార ఎక్కువగా ఉండటం వల్ల.. ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ ని అడ్డుకుంటాయి. కాబట్టి. .వ్యాయామం తర్వాత స్వీట్స్ కి దూరంగా ఉంటే.. ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.

స్పైసీ ఫుడ్
స్పైసీ ఫుడ్స్ అయిన చాట్స్, ఇతర మంచూరియాలను వ్యాయామం తర్వాత తీసుకోకూడదు. వ్యాయామం శరీరం రికవర్ అవుతుంది. కానీ.. స్పైసీ ఫుడ్ తీసుకుంటే.. శరీరం రికవర్ అవడాన్ని నెమ్మదిగా మారుస్తుంది.

ఫ్యాటీ ఫుడ్స్
వ్యాయామం తర్వాత అన్ హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఫ్రైస్, చిప్స్, సమోసా వంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు. వ్యాయామం తర్వాత.. కొద్ది మోతాదు కూడా.. ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోకూడదు.

ఎనర్జీ బార్స్
అనేక రకాల ఎనర్జీ బార్స్ లో.. షుగర్, ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి వ్యాయామం తర్వాత.. ఎనర్జీ ఇచ్చిన ఫీలింగ్ కలిగించినా.. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని ఇంబ్యాలెన్స్ చేస్తాయి.

బీన్స్
వ్యాయామం తర్వాత.. బీన్స్ తీసుకోకూడదు. ఇవి గ్యాస్ట్రిక్ట్స్, ఇన్ డైజెషన్ వంటి సమస్యలకు కారణమవుతాయి.



Click it and Unblock the Notifications
