Latest Updates
-
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.!
నో డైట్, నో ఎక్సర్ సైజ్ ! స్లిమ్ అండ్ ట్రిమ్ గా మార్చే సింపుల్ ట్రిక్స్.. !
అధిక బరువు, పొట్ట సమస్య అనేవి ఇప్పుడు చాలా కామన్ గా వినిపిస్తున్న సమస్యలు. చిన్న వయసులోనే కొంతమందికైతే.. పెళ్లి కూడా కాకముందే.. పొట్ట సమస్యతో బాధపడుతున్నారు. బెల్లీ ఫ్యాట్ ఏర్పడిందంటే.. దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టమని భావిస్తారు. నిజమే.. కాస్త కష్టమే అయినప్పటికీ.. కొన్ని టిప్స్ ని పక్కాగా ఫాలో అయితే.. బెల్లీ ఫ్యాట్ కరిగిపోవడం కావడం ఖాయం.
వెయిట్ లాస్ జర్నీలో మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ?
బరువు తగ్గడానికి వ్యాయామం, డైట్, వాకింగ్, ఆకలి చంపుకోవడం.. ఇలా రకరకాలుగా తెగ కష్టపడిపోతుంటారు. అయినా సరైన ఫలితం కనిపించక ఢీలాపడుతూ ఉంటారు. ఇలా దిగులు పడేకొద్దీ బరువు మరింత పెరుగుతారని తాజాగా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కాబట్టి బరువు తగ్గాలనే ఆలోచన ఉండాలి కానీ.. అదే సమస్యగా భావించకూడదు.
పొట్ట మాత్రమే కాదు, టోటల్ బాడీ ఫ్యాట్ కరిగించే టాప్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్
భోజన పరిమాణం తగ్గించి, జంక్ ఫుడ్ మానేసి, వ్యాయామం చేసేసి అలసిపోయారా ? ఎన్ని చేసినా బరువు తగ్గడం లేదని దిగులు పడుతున్నారా ? అయితే.. ఇలాంటి చింతలన్నింటినీ.. వదిలేయండి. బరువు తగ్గి స్లిమ్ అండ్ ట్రిమ్ గా మారడానికి సరికొత్త, సింపుల్ టిప్స్ ఉన్నాయి. డైట్ ఫాలో అవకుండా, వ్యాయామం చేసి కష్టపడకుండా.. ఇష్టమైన ఆహారాన్ని మానేయకుండా.. స్లిమ్ గా మారే.. సరికొత్త సింపుల్ టిప్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. వెంటనే ఫాలో అయిపోండి..

రెండు గంటలకు ఒకసారి
తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకుంటే సరిపోదు. పరిమాణం విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండాలి. ప్రతి రెండు గంటలకు ఒకసారి తినాలి. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునేవాళ్లు ఈ సింపుల్ టిప్ ఫాలో అవ్వాలి.

పరిమాణం తగ్గించడం
అయితే శరీరానికి మించి తినకూడదు. నెమ్మదిగా ప్రతిసారీ తీసుకునే పరిమాణం తగ్గిస్తూ పోవాలి. శరీరానికి కావాల్సిన పోషకాలు అందినప్పుడు మీకు ఆహారం తృప్తినిస్తుంది. అప్పుడు మీరు క్యాలరీలు తీసుకోవడాన్ని తగ్గించగలుగుతారు.

టీవీ చూడకుండా
ఆహారం తినేటప్పుడు కేవలం ఫుడ్ పైనే ధ్యాస పెట్టాలి. తినేటప్పుడు టీవీ చూడటం, ఫోన్ చూడటం వల్ల మీరు భోజనం చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. దీనివల్ల మీ శరీరానికి కావాల్సిన దానికంటే ఎక్కువ తినేస్తారు.

మెదడుకి సంకేతాలు
అంతేకాదు తినేటప్పుడు టీవీ చూడటం వల్ల.. పొట్ట డిస్ట్రబ్ అయి.. మెదడుకి సంకేతాలు పంపించదు. దీనివల్ల మీరు ఎంత తింటున్నారనేది గ్రహించడం కష్టంగా మారుతుంది.

సరిగ్గా నమలడం
చాలామంది ఆహారాన్ని గాబరాగా తినేస్తూ... సరిగా నమలకుండా ఉంటారు. దీనివల్ల ఆహారం జీర్ణమవడం కష్టంగా మారుతుంది. అంతేకాదు.. మెదడుకి సిగ్నల్స్ కూడా సరిగా అందక.. ఎక్కువ పరిమాణం తినడానికి ఆస్కారం ఉంటుంది. నమలకపోవడం వల్ల.. ఎయిర్ లోపలికి పీల్చుకుని, బ్లోటింగ్ కి కారణమవుతుంది.

తినాలనిపించినది తినడం
మీరు ప్రతిసారీ మీకు ఇష్టమైన ఆహారాన్ని తినకుండా మానేయాల్సిన అవసరం లేదు. మీకు ఏది తినాలనిపిస్తే అది తినండి. కానీ.. మోతాదుకి మించి తినకూడదు. మళ్లీ ఆకలి అనిపించకుండా తినాలి.

ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి తినడం
ఇండియన్స్ కి ఫ్యామిలీతో కలిసి తినడం అలవాటుగా ఉంటుంది. ఒంటరిగా, ఒత్తిడికి లోనై తినడం వల్ల ఆహారం ఎక్కువ పరిమాణం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్స్ తో కలిసి తింటే.. తక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది.

చిన్న ప్లేట్స్ లో తినడం
చిన్న ప్లేట్స్ లో నిండుగా పెట్టుకుని తినడం వల్ల.. మీరు తక్కువ తిన్నా చాలా ఎక్కువ తిన్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల తక్కువ క్యాలరీలు తీసుకుంటారు. స్లిమ్ గా మారడానికి ఛాన్స్ దొరుకుతుంది.

పొడవాటి గ్లాసులు
చిన్న ప్లేట్ తిన్నట్టుగానే, పొడవుగా, వెడల్పు తక్కువగా ఉండే గ్లాసులను జ్యూస్ లు తీసుకోవడానికి ఎంచుకోవాలి. దీనివల్ల మీరు తీసుకునే.. పరిమాణం తక్కువగా ఉంటుంది.

బ్రేక్ ఫాస్ట్ లో ప్రొటీన్ ఫుడ్
సరైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల బరువు తగ్గడం తేలికవుతుంది. అయితే ప్రొటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గి.. తీసుకునే ఆహారం పరిమాణం తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడూ ప్రొటీన్ ఫుడ్ నే అల్పాహారంలో చేర్చుకోండి.



Click it and Unblock the Notifications