For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొట్టిగా ఉన్నారా డోంట్ వర్రీ... నేచురల్ గా హైట్ పెరగడానికి 10 సూపర్ ఫుడ్స్ ,,!!

మహిళలైనా..మగవారైనా పొడవుగా నాజూగ్గా ఉంటే అందంగా కనబడుతారు. పొడవుగా ఉన్నవారు ఎలాంటి డ్రెస్సులు వేసి, మరింత అట్రాక్షన్ గా కనబడుతారు. అయితే కొంత మందిలో హార్మోనుల ప్రభావం , మరికొన్ని ఇతర కారణాల వల్ల పొడవు

By Lekhaka
|

మహిళలైనా..మగవారైనా పొడవుగా నాజూగ్గా ఉంటే అందంగా కనబడుతారు. పొడవుగా ఉన్నవారు ఎలాంటి డ్రెస్సులు వేసి, మరింత అట్రాక్షన్ గా కనబడుతారు. అయితే కొంత మందిలో హార్మోనుల ప్రభావం , మరికొన్ని ఇతర కారణాల వల్ల పొడవు పెరగలేకపోతారు.

అలాంటి వారిలో మీరు ఒక్కరైతే?ఈ ఆర్టికల్ మీకోసమే. ఆశ్చర్యం ఏంటంటే, ఆహారాల ద్వారా హార్మోనులను సమత్యులం చేసుకోవచ్చు. హార్మోనులు సమతుల్యం అయితే ఆటోమాటిక్ గా పొడవు పెరుగుతారు. అందుకు కొన్ని ఆహారాల లిస్ట్ ను తయారుచేయడం జరిగింది. ఇవి నేచురల్ గా పొడవు పెంచడంలో సహాయపడతాయి .

 Top 10 foods that will help to increase height naturally


జెనటిక్స్ ఆధారంగా పొడవు పెరగడం ఆధారపడి ఉంటుంది. అమ్మాయిలు 18 ఏళ్ళవరకూ పొడవు పెరుగుతారు. అబ్బాయిలు 20ఏళ్ళ వరకూ పొడవు పెరుగుతారు. అయితే కొన్ని ప్రత్యేమైన విషయాల వల్ల లైఫ్ స్టైల్ మరియు రెగ్యులర్ గా తీసుకునే డైట్ వంటివి హైట్ మీద ప్రభావం చూపుతాయి.

హైట్ పెంచడంలో కొన్ని రకాల వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా సహాయపడుతాయన్న విషయం మీకు తెలుసా?డైలీ డైట్ లో విటమిన్ సి, మ్యాంగనీస్, జింక్, క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, ప్రోటీన్స్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇవి పొడవు పెరగడానికి సహాయపడే హార్మోనుల గ్రోత్ ను పొడవును పెంచుతాయి.

అందువల్ల మీరు నేచురల్ గా పొడవు పెరగడం ఎలా అని తెలుసుకోవాలని ఉంటే ఈ ఆర్టికల్ మీకు తప్పనిసరిగా సహాయపడుతుంది. హైట్ ను పెరిగేందుకు సహాయపడే హార్మోన్ ''హ్యుమన్ గ్రోత్ హార్మోన్ హెచ్ జిహెచ్). ఈ హార్మోన్ ను పిట్యూటరీ గ్రంథులు విడుదల చేస్తాయి. ఇవి బాడీ హైట్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అందువల్ల, హైట్ ను పెంచే ఆహారాలు తీసుకోవడం మంచి ది. అటువంటి ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం..

డైరీ ప్రొడక్ట్స్ :

డైరీ ప్రొడక్ట్స్ :

డైరీ ప్రొడక్ట్స్ లో పాలు, చీజ్, పెరుగు వంటి వాటిలో పొడవు పెరగడానికి సహాయపడే న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో క్యాల్షియం, ప్రోటీన్స్, విటమిన్ ఎ, బి, డి, ఇలు అధికంగా ఉండటం వల్ల హైట్ ను నేచురల్ గా పెంచుతాయి.

గుడ్లు:

గుడ్లు:

పొడవు పెరగడానికి గుడ్లు సహాయపడుతాయి. గుడ్డులో హై క్వాలిటీ ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి . వీటిలో ఉండే విటమిన్ డి, క్యాల్షియం, రిబోఫ్లెవిన్, బోన్స్ ను స్ట్రాంగ్ గా మార్చి, పొడవు పెరగడానికి సహాయపడుతాయి.

చికెన్ :

చికెన్ :

25ఏళ్ళ తర్వాత కూడా పొడవు పెరగాలని కోరుకునే వారు, చికెన్ బెస్ట్ ఫుడ్. చికెన్ లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇది పొడవును పెంచే టిష్యులన్ బిల్డప్ చేయడానికి మరియు మజిల్ గ్రోత్ కు సహాయపడుతుంది.

సోయా బీన్స్ :

సోయా బీన్స్ :

సోయా బీన్స్ నేచురల్ గా పొడవును పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. సోయా బీన్స్ రెగ్యులర్ గా తినడం వల్ల ఇది ప్రోటీన్స్, మరియు ఫొల్లెట్ , విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, మరియు ఫైబర్ ను పెంచుతుంది. ఇది టిష్యు మాస్ ను మెరుగుపరచడంలో, డెన్సిటిని పెంచడంలో సహాయపడుతుంది.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటిపండ్లలో మినిరల్స్ క్యాల్షియం మాంగనీస్, పొటాషియం, హెల్తీ ప్రొబయోటిక్ బ్యాక్టీరియా వంటివి ఎక్కువగా ఉన్నాయి. ఇవి పొడవు పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

ఓట్ మీల్:

ఓట్ మీల్:

ఓట్ మీల్ కూడా ప్రోటీన్స్ పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. హైట్ ను పెంచడంలో ఇది గ్రేట్ నేచురల్ రెమెడీ. మజిల్ మాస్ పెంచడంలో బాగా సహాయపడుతుంది.

నట్స్ అండ్ సీడ్స్ :

నట్స్ అండ్ సీడ్స్ :

నట్స్ , మరియు సీడ్స్ ను బెస్ట్ ఫుడ్స్ గా భావిస్తారు. ఇవి హైట్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. వీటిలో హెల్తీ ఫ్యాట్స్, అమినో యాసిడ్స్, ఎసెన్సియల్ న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి . బాడీ టిష్యులన్ పెంచడంలో ఇది సహాయపడుతుంది. కొత్త టిష్యులను ఏర్పరచడాన్ని ప్రోత్సహిస్తాయి. ఇవి శరీరంలో పొడవును పెంచే హార్మోనులను క్రమబద్దం చేస్తుంది.

లీఫీ గ్రీన్ వెజిటేబుల్ :

లీఫీ గ్రీన్ వెజిటేబుల్ :

నేచురల్ గా పొడవు పెరగడం ఎలాగో తెలుసుకోవాలంటే, , గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. వీటిలో న్యూట్రీషియన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మరియు డైటరీ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో పొడవును పెంచే హార్మోన్స్ ను క్రమబద్దం చేస్తుంది.

చేపలు:

చేపలు:

నేచురల్ గా హైట్ పెరగడానికి చేపలు కూడా సహాయపడుతాయి. చేపల్లో ప్రోటీన్స్, విటమిన్ డి, వంటి పొడవు పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ఇవి బోన్ డెవలప్ మెంట్, బోన్ డెన్సిటిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

అశ్వగంధ :

అశ్వగంధ :

నేచురల్ గా పొడవు పెరగాలనుకునే వారు, అశ్వగంధను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.. ఇది మూలిక వంటిది. ఇందులో మినిరల్స్, అధికంగా ఉంటాయి. శరీరంలో బోన్స్ స్ట్రాంగ్ గా పెరగడానికి , బోన్ డెన్సిటిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది హైట్ పెరగడానికి సహాయపడుతుంది.

English summary

Top 10 foods that will help to increase height naturally

We all wish to become tall due to the many perks associated with it and the attraction we receive the way all clothes go down well with our figure.
Story first published: Tuesday, December 27, 2016, 8:39 [IST]
Desktop Bottom Promotion