For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి 10 ఎఫెక్టివ్ న్యాచురల్ టిప్స్

By Mallikarjuna
|

ప్రతి మహిళ అందంగా , నాజూగ్గా కనబడాలని కోరుకుంటుంది. ముఖ్యంగా యవ్వనంలో ఉన్న వారు, వారి వార్డ్ రోబ్ లో తప్పని సరిగా అందమైన జీన్స్ ప్యాంట్ ఉండాలని కోరుకుంటుంది. తనకు ఇష్టమైన జీన్స్ ప్యాంట్ లో అందంగా, ఫిట్ గా నాజూగ్గా కనబడలాని కోరుకుంటుంది. అయితే దురద్రుష్టవశాత్తు ఆమెకు నచ్చిన జీన్స్ ధరించలేకపోవచ్చు. ఎందుకుంటే నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయి, ఎక్సెస్ ఫ్యాట్ కారణంగా క్యారీ బ్యాగుల్లాగా కనబడుతుంటుంది.

నడుము చుట్టూ కొవ్వు పేరుకుంటే తప్పని సరిగా ఆరోగ్యం గురించి కూడా కాస్త భయపడాల్సిందే, ఇటు అందంతో పాటు ఆరోగ్యం కూడా పాడవుతుంది. బెల్లీ ఫయాట్ కరిగించుకోవడం కోసం బాధకరమైన మరియు ఖరీదైన వైద్యచికిత్సలో చేయించుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఎఫెక్టివ్ మరియు చౌకైన చిట్కాలు ఉన్నాయి. వీటిని కనుక ఫాలో అయితే తప్పకుండా పొట్ట చుట్టు పేరుకుపోయిన ఫ్యాట్ ను బర్న్ చేసి, కొన్ని రోజుల్లోనే తప్పకుండా బరువు తగ్గుతారు.

ఈ బెల్లీ ఫ్యాటనింగ్ టిప్స్ ను పోషకాహార నిపుణులు, ఆరోగ్య నిపుణుల సమక్షంలో నిర్ధారింపబడినవి. ఇవి ఖచ్చితంగా మీ నడుము చుట్టుకొలతను తప్పకుండా తగ్గిస్తాయి. ఈ చిట్కాలు పాటించడం వల్ల మీరు కోరుకున్న స్లిమ్ ఫిట్ దుస్తులు కూడా ధరించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే బెల్లీ ఫ్యాట్ ను కరిగించే ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం...

1. మ్యాజిక్ అవర్స్ లో తినడం

1. మ్యాజిక్ అవర్స్ లో తినడం

పోషకాహార, మరియు ఆరోగ్య నిపుణులను అభిప్రాయం ప్రకారం మ్యాజిక్ అవర్స్ అంటే మధ్యహ్నం 3 నుండి 4 pm. అధిక ప్రోటీన్స్ ఉన్న ఆహారాలను తీసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సమయం అని సూచిస్తారు. ఈ సమయంలో కాస్త చిన్ని లోఫ్యాట్ చీజ్ ను తినడం లేదా ప్రోటీన్ బార్ తినడం లేదా బాదం , లేదా ఆపిల్ వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినడం ఆరోగ్యానికి మంచిది. అలాగే ప్రోటీన్ మిల్క్ షేక్ కూడా తాగవచ్చు.

ప్రయోజనాలేంటి?

• ఈ ప్రోటీన్ స్నాక్స్ మెటబాలిజం రేటును పెంచి షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి .

• బెల్లీ ప్రాంతంలో ఫ్యాట్ చేరకుండా ఇన్సులిన్ లెవ్స్ ను తగ్గిస్తాయి.

• అలాగే ప్రతి 3 to 4 గంటలకొకసారి తప్పకుండా ఏదో ఒక హెల్తీ ఆహారం తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.

2. బాల్ ఎక్సర్ సైజ్

2. బాల్ ఎక్సర్ సైజ్

వారంలో నాలుగు సార్లు బాల్ ఎక్చైంజ్ ఎక్సర్ సైజ్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది, అలాగే ఈ వ్యాయామం చేసే సమయంలో సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి.

వ్యాయామం చేసే విధానం:

• వెల్లకిలా క్రింద నేలమీద పడుకోవాలి. తలక్రింద చేతులను ఉంచాలి. కాళ్ళు నిటారుగా చాచి పెట్టుకోవాలి.

• గ్రావిటీ ఎక్సర్ సైజ్ బాల్ ను తీసుకుని తల నుదురు బాగంలో ఉంచి దాని మీద తలను ఉంచి చేతులతో పట్టి ఉంచాలి.

• ఇప్పుడు నిధానంగా బాల్ ను మీ చాతీ మీద నుండి క్రిందికి అలాగే కాళ్ళ వరకు తీసుకెళ్లీ కాళ్ళను పైకి లేపి, పాదాల మద్యన బాల్ ను అదిమి పట్టాలి.

• ఇప్పుడు బాల్ ను కాళ్ళతోనే తిరిగి ఫ్లోర్ మీద పెట్టి, మీ చేతులు తలక్రింద స్ట్రెయిట్ గానే ఉంచాలి

• ఈ వ్యాయామాన్ని రోజుకు 10 నుండి 12 సార్లు చేయాలి.

3. మితాహారాన్ని తీసుకోవాలి

3. మితాహారాన్ని తీసుకోవాలి

బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవాలంటే ఆహారం మితంగా తీసుకోవాలి. తినే ఆహారం ఆరోగ్యకరమైనది, ప్రోటీన్స్, పోషకాలు, మోనోశ్యాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉన్నఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. త్రుణధాన్యాలు అధికంగా తీసుకోవడం వల్ల పొట్ట ఉదరంలో కొవ్వు కరగడానికి మంచి ఉపాయం

• డైలీ డైట్ లో బ్రౌన్ రైస్, క్వీనా, బార్లీ, ఓట్స్, గోదుమలు, వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవచ్చు.

• వేరుశెనగ బట్టర్ అవొకాడో, ఆలివ్ ఆయిల్, ఆలివ్స్, నట్స్, మిల్క్ ప్రొడక్ట్స్, వంటివి డైలీ డైట్ లో చేర్చుకుంటే బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది.

4. బాక్సింగ్ ప్లస్ కార్డియో వ్యాయామాలు

4. బాక్సింగ్ ప్లస్ కార్డియో వ్యాయామాలు

వారంలో 5 సార్లు కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల బాడీ వెయిట్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే బాక్సింగ్ పంచెస్ వల్ల కార్డియో వ్యాయామల వల్ల కండరాలు గట్టిపడుతాయి. బెల్లీ త్వరగా కరుగుతుంది.

• బాక్సింగ్ తో పాటు కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల బెల్లీ వద్ద ఎక్కువ క్యాలరీలను కరిగించుకోవచ్చు.

• పంచ్ ఎక్సర్ సైజ్ చేసే పమయంలో చేతులకు ఒకటి రెండు పౌండ్ల బరువు చేరవచ్చు. అయితే ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి, బలాన్ని ఇస్తాయి.

• రోజూ 15 నిముషాలు పంచెస్, మిగిలిన 15 నిముషాలు కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల మీ పొట్ట ఉదరంలో కొవ్వు చాలా ఎఫెక్టివ్ గా కరిగిపోతుంది.

5. సాధ్యమైనంత వరకూ పంచదార తగ్గించాలి

5. సాధ్యమైనంత వరకూ పంచదార తగ్గించాలి

సైజ్ జీర్ బెల్లీ ఫిగర్ ను మెయింటైన్ చేయాలంటే, పంచదార వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. జీరో షుగర్ మెయింటైన్ చేయడం వల్ల తప్పని సరిగా బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవచ్చు . ఇలా చేయడం వల్ల శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ తక్కువగా ఉంటుంది.

• అన్ని సమయంలో శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం స్వీట్స్, పంచదార వాడకం పూర్తిగా మానేయాలి.

• ఇలా చేయడం వల్ల శరీరంలోని గ్లూకగాన్ అనే హార్మోన్ బెల్లీ ఫ్యాట్ మెయింటైన్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

6. ఆహారాన్ని నమిలి తినడం:

6. ఆహారాన్ని నమిలి తినడం:

బెల్లీ ఫ్యాట్ కరిగించే ఒక అద్భుతమైన మంత్రం, తినే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. బాగా నమిలి తినడం వల్ల తన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. కడుపుబ్బరం తగ్గిస్తుంది.

• నోట్లో ఏ ఆహారాన్ని పెట్టుకున్నా బాగా మెత్తగా కరిగే వరకూ నమిలి తినాలి.

• నోట్లో ఆహారం బాగా మెత్తగా అయ్యే వరకూ ఆహారాన్ని ఏమాత్రం మింగకండి.

• ఆహారం బాగా నమిలి తినడం వల్ల జీర్ణం బాగా అవుతుంది. జీర్ణక్రియ సులభతరం అవుతుంది. మరో లాభం ఇలా బాగా నమలడం వల్ల ఎక్కువ ఆహారం తీసుకోవాలనే కోరిక కలగదు. దాంతో జీర్ణ శక్తి పెరిగీ బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది.

7. ఫ్లాట్ బెల్లీ మెను

7. ఫ్లాట్ బెల్లీ మెను

బెల్లీ ఫ్యాట్ ను త్వరగా తగ్గించుకోవాలనికోరుకుంటున్నట్లై, ఈ ఫ్యాట్ బెల్లీ డైట్ ను రెగ్యులర్ గా ఫాలో అవ్వాలి.

• బ్రేక్ ఫాస్ట్: గోధుమ పిండితో తయారుచేసిన బ్రెడ్ లేదా ఇతర త్రుణధాన్యాలతో తయారుచేసి బ్రెడ్ తీసుకోవాలి. అలాగే ఒక కప్పు బెర్రీస్ ను తీసుకోవాలి.

• లంచ్ కోసం: చెర్రీ టమోటోలు ఆలివ్ ఆయిల్ తో , నిమ్మరసంతో గార్నిష్ చేసిన టోఫు, ఆకుకూరలు, అవొకాడో సలాడ్స్ తీసుకోవాలి.

• స్నాక్స్: రెండు టేబుల్ స్పూన్ల సన్ ఫ్లవర్ సీడ్స్, ఒక కప్పు పెరుగు తీసుకోవాలి.

• డిన్నర్ కి: రోస్ట్ చేసిన పొటాటో, గ్రిల్డ్ సాల్మన్, లేదా ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ అధికంగా ఉన్న ఫిష్, ఆలివ్ ఆయిల్, ఆస్పరాగస్, గార్లిక్ మిశ్రమాన్ని తీసుకోవాలి.

8. లాఫింగ్ యోగ

8. లాఫింగ్ యోగ

నవ్వడం వల్ల పొట్ట ఉదరంలో కండరాలు బలపడుతాయి,

• నవ్వడం ఆరోగ్యం మాత్రమే కాదు, కొవ్వు కూడా కరిగిస్తుంటే ఆశ్చర్యపడాల్సిందే.

• లాఫింగ్ యోగా క్లాసులకు జాయింన్ అవ్వడం వల్ల బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు.

9. ఇతర బాడీ పార్ట్స్ మీద కూడా ఏకాగ్రత పెట్టడం

9. ఇతర బాడీ పార్ట్స్ మీద కూడా ఏకాగ్రత పెట్టడం

పొట్ట ముందుకు పొడుచుకు రావడం ఏ ఒక్కరికీ ఇష్టముండదు, మీ పొట్టను ఇతరులు చూసి నవ్వుకోకూడదనుకుంటే, మీ ద్రుష్టిని మీ శరీరంలోని ఇతర బాడీ పార్ట్స్ మీద కూడా పడేలా చేయాలి.

వర్కింగ్ టిప్స్

• మీరు అందమైన , ఆకర్షనీయమైన కాళ్ళను కలిగి ఉన్నట్లు ఫీలవుతుంటే, మీరు స్కర్ట్, మరియు స్లిమ్ ప్యాంట్స్ ధరించాలి.

• షోల్డర్ మీర వీక్ గా కనబడుతుటే, డీప్ నెక్ లైన్ కలిగిన బోట్ నెక్ దుస్తులు ధరించాలి.

• అలాగే మీ బాడీ షేప్ కు తగ్గట్టు బ్రా ధరించాలి.

10. డిసిబిఏ ను కలవడం

10. డిసిబిఏ ను కలవడం

రెండు మూడు వారాల్లో ఫ్లాట్ బెల్లీ పొందడానికి రెండు ఇంచీల బెల్లీని తగ్గించుకోవడానికి డిసిబిఎను అనుసరించాలి. డిసిబిఎ లో మొదటిది డైట్, రెండవది కార్డియో, మూడవది బిల్డ్ మజిల్, నాల్గవది అబ్డోమినల్ వ్యాయామం

• ఉదయం లేచిన దగ్గర నుండి ఆక ఆరోజులో మీరు తీసుకునే ఆహారం ఆరోగ్యకరమైనదై ఉండాలి.

• ఒక రోజులో కనీసం 20 నిముషాల సమయం వ్యాయామానికి కేటాయించాలి. ఇలా వారంలో 5 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

• శరీరానికి బలం చేకూర్చే వ్యాయామాలను రోజులో 25 నిముషాల చేయడం వల్ల శరీరానికి బలం వస్తుంది. ఇలా వారంలో 5 సార్లు చేస్తే మంచిది.

• ఆబ్డామినల్ వ్యాయామాన్ని రోజులో 5 నిముషాలు వారంలో 5 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది

English summary

10 Effective Natural Ways to Burn Belly Fat Tips

Stomach does not look good on your body. If you think that how you reduce it, then it has some natural ways too. Working hours and sit-in routines have a bad effect on our health.
Story first published:Tuesday, October 24, 2017, 18:42 [IST]
Desktop Bottom Promotion