పది ఆహారాలను రోజూ తీసుకుంటే బరువు తగ్గడం తేలికే!

Posted By:
Subscribe to Boldsky

హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయినప్పుడు మాత్రమే.. బరువు తగ్గడం సాధ్యమవుతుంది. వ్యాయామం, ఇతర శారీరక యాక్టివిటీస్ వల్ల శరీరం షేప్ లో ఉంటుంది, కానీ.. మీరు బరువు తగ్గాలి అనుకుంటే.. న్యాచురల్ పద్ధతులు పాటించండి. ఇప్పుడు చెప్పబోయే ఆహారాలపై నమ్మకం ఉండాలి, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి.

పది ఆహారాలను రోజూ తీసుకుంటే బరువు తగ్గడం తేలికే!

ఈ 10 ఆహారాలను ప్రతి రోజూ కంపల్సరీ తీసుకోవడం వల్ల.. మీరు అనుకున్న బరువు తగ్గడాన్ని ఎవరూ ఆపలేరు. కాబట్టి.. ఖచ్చితంగా వీటిని మీ డైలీ డైట్ లో చేర్చుకుని.. క్రమం తప్పకుండా తిని చూడండి. ఇవి హెల్తీ ఫుడ్స్ కావడం, ఫ్యాట్ కరించే సత్తా కలిగి ఉండటం, పోషకాలు అందించే ఆహారాలు కావడం వల్ల వీటిని మీకు సూచిస్తున్నాం.

బరువు తగ్గించుకోవడానికి బీట్ రూట్ జ్యూస్ తో 5 సులభ మార్గాలు

బాదం:

బాదం:

బాదంలో యాంటీఆక్సిడెంట్స్, న్యూట్రీషియన్స్, మరియు ప్రోటీన్స్ అధికంగా ఉండటం బరువు తగ్గించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. బాదం నమలడం వల్ల విడుతలయ్యే ఫ్యాట్స్ ఆకలిని కానివ్వకుండా ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉండే భావన కలిగిస్తుంది . మరియు ఇందులో ఉండే హై ఫైబర్ కంటెంట్ బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

కీరకాయ

కీరకాయ

కీరకాయల్లో ఎక్కువ శాతం నీళ్లు ఉంటాయి. తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇవి పొట్టలో ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. కాబట్టి రెగ్యులర్ డైట్ లో వీటిని ఖచ్చితంగా చేర్చుకోవాలి.

ఎగ్స్

ఎగ్స్

ఎవరైతే.. ప్రతి రోజూ ఉదయం కోడిగుడ్డు తింటారో వాళ్లు.. రెండు రెట్లు వేగంగా, ఎక్కువగా బరువు తగ్గుతారు.

బరువు తగ్గాలంటే పుదీనా ఎలా ఉపయోగించాలి, పుదీనాతో ఇతర ప్రయోజనాలేంటి?

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ లో మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది పొట్టలో చేరుకున్న ఫ్యాట్ ని కరిగిస్తుంది. రోజుకి ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ చాలా ఆరోగ్యకరం, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

అరటిపండు

అరటిపండు

అరటిపండులో పొటాషియం ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్ ని కరిగిస్తుంది. పొటాషియం శరీరంలో సాల్ట్, వాటర్ లెవెల్ ని తగ్గిస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా అరటిపండు తినండి.

సోంపు

సోంపు

సోంపులో ఫైబర్, మాంగనీస్, క్యాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రతి రోజూ భోజనం తర్వాత ఒక స్పూన్ సోంపు గింజలు తీసుకుంటే.. అద్భుతంగా బరువు తగ్గేస్తారు. కావాలంటే.. ప్రయత్నించి చూడండి.

వేసవిలో శరీరాన్ని ఆహ్లాదపరిచి, ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే కుకుంబర్ వాటర్ రిసిపి

పెరుగు

పెరుగు

పెరుగులో ఉండే క్యాల్షియం కొలెస్ట్రాల్ హార్మోన్ ని తగ్గిస్తుంది. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా శరీరంలో గ్యాస్, బ్లోటింగ్ సమస్యను నివారిస్తుంది.

పుచ్చకాయ:

పుచ్చకాయ:

పుచ్చకాయలో 92శాతం నీరు ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ మరియు సి, మరియు లైకోపిన్ అధికంగా ఉన్నాయి. అంతే కాదు పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల బరువును చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది .

మష్రుమ్స్ :

మష్రుమ్స్ :

వెజిటేరియన్స్ అయితే, మాంసాహారలకు బదులుగా మీకు నచ్చిన రుచికరమైన ఫుడ్స్ ఎంపిక చేసుకోవడం ఉత్తమ ఎంపిక. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా మష్రుమ్ ను తీసుకోవడం వల్ల ఇది క్యాలరీలను తగ్గిస్తుంది మరియు బరువును కూడా తగ్గిస్తుంది.

హాట్ చిల్ పెప్పర్స్ :

హాట్ చిల్ పెప్పర్స్ :

భోజనానికి అరగంట ముందు హాట్ చిల్ పెప్పర్స్ ను తీసుకోవడం వల్ల మీరు రెగ్యులర్ గా తీసుకొనే ఆహారం యొక్క మోతాదు కంటే 10శాతం తక్కువగా తీసుకోగలుగుతారు. బరువు తగ్గించడంలో ఇది ఒక గ్రేట్ ఫుడ్ గా భావిస్తారు.

English summary

10 Foods: Eat Them Daily for Rapid Weight Loss!

10 Foods: Eat Them Daily for Rapid Weight Loss!, These 10 foods if consumed daily, no one can stop you from achieving the body you have always
Subscribe Newsletter