అధిక బరువును తగ్గించే ఆహారాలు

Written By: Bharath
Subscribe to Boldsky

శరీరంలో ఉండే అదనపు కొవ్వు పదార్థాలను, అధిక బరువును తగ్గించుకోవడానికి చాలామంది నానా ఇబ్బందులుపడుతుంటారు. ఇందుకోసం ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతుంటారు. ఎలాంటి ఆహారాలు తినాలో తెలియక చాలామంది ఇబ్బందిపడుతుంటారు. మీ మెనూలో కొన్ని ఆహారాలను చేర్చుకుని వాటిని కొన్ని రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. దీంతో మీరూ అధిక బరువు సమస్యను అధిగమిస్తారు.

రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేస్తే చాలు. ఇందుకోసం పాటించే డైట్ కు చాలా డబ్బులు వెచ్చించాల్సి వస్తుందా అని సందేహపడుతూ ఉంటారు. అయితే తక్కువ బడ్జెట్ లోనే కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే మీలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా పేరుకుపోవు. అలాగే అధిక బరువు సమస్య మిమ్మల్ని వేధించదు. అలాంటి ఆహారాలు ఏమిటో మీరూ ఒకసారి చూడండి.

1. వోట్స్

1. వోట్స్

అధిక బరువును తగ్గించడానికి వోట్స్ బాగా పని చేస్తాయి. అంతేకాకుండా వీటికి ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు. తక్కువ ధరకే వోట్స్ మీకు మార్కెట్లో దొరుకుతాయి. ఓట్స్ శరీరంలోని కొవ్వును బాగా కరిగించేస్తాయ. ఓట్స్‌లో అధికంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఓట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి. ఓట్స్ మీల్ మీకు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తుంది. జీర్ణశక్తి మెరుగవుతుంది. ఓట్ మీల్ ద్వారా క్రమంగా బరువుతగ్గుతారని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. వోట్మీల్ లో రుచి కోసం చక్కెరను ఉపయోగించండి. దానికి బదులుగా స్టెవియా, తేనె లేదా మసాలా లేదా జాజికాయ వంటి సుగంధ ద్రవ్యాలను ఉపయోగించండి. ఇవి మీ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి.

2. గ్రీక్ యోగర్ట్

2. గ్రీక్ యోగర్ట్

గ్రీక్ యోగర్ట్ కూడా ఎక్కువ ధర ఉండదు. ఇది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఊబకాయాన్ని తగ్గించడానికి గ్రీక్ యోగర్ట్ బాగా పని చేస్తుంది. ఇందులో ఎక్కువగా మాంసకృత్తులుంటాయి. ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచేలా చేస్తాయి. ఇందులోఅధిక కాల్షియం ఉంటుంది. ఇందులోని ప్రోటీన్స్ మీలో ఆకలిని తగ్గిస్తాయి. అలాగే గ్రీక్ యోగార్ట్ లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని కూడా తరుచుగా తీసుకుంటూ ఉండాలి. గ్రీక్ యోగార్ట్ ద్వారా దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ మీ శరీరానికి అందుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రోజూ ఒక గిన్నె గ్రీక్ యోగార్ట్ ను తీసుకోండి. రుచికోసం బెర్రీలు, నట్స్, తృణధాన్యాలను కలుపుకుని తినండి.

3. ఎయిర్ పాప్డ్ పాప్ కార్న్

3. ఎయిర్ పాప్డ్ పాప్ కార్న్

మీకుపాప్కార్న్ తినడం ఇష్టంగా ఉంటే బయట దొరికే వాటికి బదులుగా మీరే ఇంట్లో తయారు చేసుకుని తినండి. కాస్త ఉప్పు తక్కువగా వేసుకోండి. దీనికి పెద్దగా మీరు డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఎయిర్ పోప్డ్ పాప్కార్న్ లో చాలా తక్కువ కేలరీలుంటాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్లు, మినర్సల్స్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ -ఏ, భాస్వరం, జింక్, మాంగనీస్, ఐరన్, కాపర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.

4. గ్రేఫ్ ఫ్రూట్

4. గ్రేఫ్ ఫ్రూట్

గ్రేఫ్ ఫ్రూట్ కూడా చాలామంచిది. ఇందులో విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గ్రేఫ్ ఫ్రూట్ బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్- సీ ఎక్కువగా ఉంటుంది. ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. రేట్ కూడా కాస్త అందుబాటులోనే ఉంటుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్లు ఏ, బీ-6, పొటాషియం, ఫోలేట్, థియామిన్, కాల్షియం, ఐరన్, రాగి, భాస్వరం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి.

5. ఆపిల్

5. ఆపిల్

ఆపిల్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణవ్యవ్యస్థను మెరుగుపరుస్తుంది. శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను తొలగించి బరువు పెరగకుండా చూస్తుంది. ఫైబర్, విటమిన్ మినరల్స్ ఇందులో ఉంటాయి. బరువు తగ్గేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. రోజూ యాపిల్ తింటే మీరు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం కూడా ఉండదు. యాపిల్స్ లో విటమిన్ సి, బి-కాంప్లెక్స్ విటమిన్లు, కాల్షియం, పొటాషియం, భాస్వరం అధికంగా ఉంటాయి.

6. గ్రీన్ టీ

6. గ్రీన్ టీ

గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాటచిన్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. రోజూ రెండు కప్పుల గ్రీన్ టీని తాగాలి . ఉదయం పరగడపున గోరువెచ్చని గ్రీన్ టీకి, కొద్దిగా తేనె మిక్స్ చేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. మీరు ఇందుకోసం పెద్దగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. గ్రీన్ టీ లో ఉండే పాలీ ఫినాల్స్ మన శరీరంలో ఉండే ట్రై-గ్లిసరైడ్స్ లను విచ్చిన్నం చేస్తుంది. దీంతో మీరూ ఈజీగా బరువు తగ్గుతారు.

7. గుడ్లు

7. గుడ్లు

గుడ్లు ప్రోటీన్ లను అధికంగా కలిగి ఉంటాయి. అల్పాహారంలో వీటికి తీసుకుంటూ ఉండండి. వీటిని తినటం వలన శరీరానికి తక్కువ కెలోరీలు అందుతాయి. ప్రోటీన్స్ అధికంగా అందుతాయి. గుడ్లను అల్పాహారంగా తినటం వలన ఎక్కువగా ఆకలిగా అనిపించదు. అంతేకాకుండా ఇవి మీకు విరివిగా లభిస్తాయి.

8. క్యారెట్ బాగా పని చేస్తుంది

8. క్యారెట్ బాగా పని చేస్తుంది

క్యారెట్స్ కూడా బరువు తగ్గడానికి బాగా పని చేస్తాయి. వీటిని నేరుగా గానీ, లేదంటే కూరలుగా చేసుకుని గానీ, లేదంటే జ్యూస్ లాగా తాగొచ్చు. ఇందులో క్యాలరీలు తక్కువగానూ, పీచు పదార్థం ఎక్కువగానూ ఉంటుంది. ఉదయం పూట ఒక పెద్ద గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగితే.. మళ్లీ భోజనం సమయం వరకు మీకు ఆకలి కూడా వేయదు. అంతేకాకుండా అందులోని ఫైబర్ కొవ్వును కరిగిస్తుంది. దీంతో సులభంగా బరువు తగ్గుతారు. వీటి కోసం మీరు ఎక్కువగా డబ్బు కూడా ఖర్చే చేయాల్సిన అవసరం లేదు.

9. బ్రోకలీ

9. బ్రోకలీ

బ్రోకలీలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది బరువు తగ్గించేందుకు బాగా సహాయపడుతుంది. ఇది ఎక్కువగా ఖరీదు ఉండదు. అందువల్ల మీరు రోజూ బ్రోకలితో తయారు చేసే ఫుడ్స్ తింటూ ఉంటే ఎంతో మంచిది.

10. నారింజ పండు

10. నారింజ పండు

బరువు తగ్గించడానికి ఆరెంజ్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ క్యాలోరీలను అందించే డిషెస్ లకి బదులగా నారింజ పండ్లను తినటం మంచిది. నారింజ పండులో అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్ సీ ఉంటాయి. ఇవి జీవక్రియ రేటును పెంచి ఆకలి అనిపించకుండానే శరీర బరువు తగ్గిస్తాయి. అందువల్ల రెగ్యులర్ గా వీటిని తింటూ ఉండండి.

11. సాల్మన్ చేప

11. సాల్మన్ చేప

శరీర బరువు తగ్గించటంలో సాల్మన్ లేదా సలోన్ చేప బాగా పని చేస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందించే ఫాట్స్ ఇందులో ఉంటాయి. . శరీర బరువును శక్తివంతంగా తగ్గించే ఒమేగా-3 అనే ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కవగా ఉంటాయి. శరీర బరువు తగ్గించుకోటానికి సాల్మన్ చేపను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

12. బ్రౌన్ రైస్

12. బ్రౌన్ రైస్

బ్రౌన్ రైస్ లో తక్కువ క్యాలోరీలు ఉంటాయి. ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుది. దీంతో మీ బాడీకి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. అలాగే ఫ్యాట్ పెరగదు. బ్రౌన్ రైస్ తినటం వలన రోజంతా ఆకలిగా అనిపించదు. సులభంగా బరువును ఇది తగ్గిస్తుంది. ఈ ఆహారాలన్నింటికీ కూడా మీరు ఎక్కువగా డబ్బు కేటాయించాల్సిన అవసరం లేదు. అందువల్ల మీ రెగ్యులర్ డైట్ లో వీటిని చేర్చుకోండి. వీటి రోజూ తినడం వల్ల మీరు అధిక బరువు సమస్యను అధిగమిస్తారు.

English summary

Best Budget Foods for Weight Loss

Losing weight is a tough task, but knowing what foods are good for you is half the battle.Here some Best Budget Foods for Weight Loss.
Story first published: Monday, November 27, 2017, 15:00 [IST]
Subscribe Newsletter