For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జిమ్ కు మొదటసారి వెళ్లేముందు గుర్తు ఉంచుకోవాల్సిన 9 అతిముఖ్యమైన చిట్కాలు

ఆరోగ్యకరంగా ఉండటానికి మరియు శరీరాకృతిని తమకు నచ్చినట్లు ఉంచుకోవడానికి చాలామంది జిమ్ లో చేరుతుంటారు. చాలా జిమ్ లలో కార్డియోవాస్క్యూలర్ వ్యాయామాలు మరియు వెయిట్ లిఫ్టింగ్ ఇలా రెండిటిని కలిపి చేయిస్తుంటార

By R Vishnu Vardhan Reddy
|

ఈ మధ్య కాలంలో యువతి యువకులు జిమ్ కి వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. జిమ్ కి వెళ్లాలంటే అందుకు అయ్యే ఖర్చు కూడా భారీ గానే ఉంటోంది. చాలా మంది వివిధరకాల జిమ్ లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వారికి అనువైన జిమ్ ని ఎంచుకొని అందులో చేరుతున్నారు. మీరు కూడా అలానే గనుక చేస్తుంటే ధన్యవాదాలు. ఎందుకంటే ఆరోగ్యవంతమైన జీవితం సాగించడానికి మీరు కూడా మొదటి అడుగు వేశారు.

మనకందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, క్రమం తప్పకుండా శారీరిక వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇలా చేయడం ద్వారా సాధారణంగా ఎన్నో రకాల వ్యాధులను మరియు దీర్ఘకాలిగా వ్యాధులను నయం చేసుకోవచ్చు.

దీనికి తోడు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా శారీరికంగా మరియు మానసికిరంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇదంతా నిజం అని రుజువు చేయడానికి శాస్త్రీయంగా చాలా అధరాలు ఉన్నాయి. జిమ్ ని బాగా చేయాలంటే కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి.

Tips To Keep In Mind Before Joining A Gym

మీరు బరువు తగ్గుదామనుకుంటున్నారా ? లేక కండలు పెంచాలనుకుంటున్నారా ? లేక మీ శరీరాకృతిని చాలా అద్భుతంగా మార్చుకుందాము అని భావిస్తున్నారా ? ఆలా అయితే సహజ సిద్ధంగా జిమ్ లో చేసే వ్యయం ద్వారా వీటన్నింటిని పొందవచ్చు.

మొదట్లో శారీరిక వ్యాయామం చేయడం అనేది చాలా కష్టతరంగా అనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో వ్యాయామం చేసే వ్యక్తులు, ఇక చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు. కానీ, ఎప్పుడైతే వ్యాయామం చేయడానికి అలవాటు పడతారో, ఇక అప్పటి నుండి మంచి ఫలితాలను చూడటం ప్రారంభిస్తారు. కొద్దీ రోజుల తర్వాత వ్యాయామం మీ జీవితంలో భాగం అయిపోతుంది.

చేసే పనులు, ఆహారం మొదలగు వాటిల్లో ఎలాగైతే విభిన్న రకాల వ్యక్తులకు, విభిన్న రకాల అభిరుచులు మరియు ఆసక్తులు ఉంటాయో, అలానే వ్యాయామంలో కూడా ఒక్కొక్కరు ఒక్కో రకమైన వ్యాయామాన్నిఇష్టపడతారు.

మన శరీర తత్వం, మనం పొందాలనుకునే శరీర ఆకృతి, మన శరీరానికి సంబంధించి ఎలా మలచుకోవాలి అనే ఆలోచనలు ఇలా ఎన్నింటినో నిజం చేయడానికి విభిన్న రకాల వ్యాయామాలు వివిధ స్థాయిల్లో చేయాల్సి ఉంటుంది. విభిన్న రకాల ఆలోచనలు కలిగిన ప్రజలు వాళ్ళ ఇష్టం మరియు ఆసక్తికి అనుగుణంగా వారికి నచ్చిన వ్యాయామాలను ఎంచుకొని చేస్తుంటారు.

జుంబా, క్రాస్ ఫిట్, కార్డియో, వెయిట్ లిఫ్టింగ్, డాన్స్, జాగింగ్, రన్నింగ్ మరియు ఇంటిపనుల్లో పాలుపంచుకోవడం ఇలాంటి విభిన్న రకాల వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి.

ఆరోగ్యకరంగా ఉండటానికి మరియు శరీరాకృతిని తమకు నచ్చినట్లు ఉంచుకోవడానికి చాలామంది జిమ్ లో చేరుతుంటారు. చాలా జిమ్ లలో కార్డియోవాస్క్యూలర్ వ్యాయామాలు మరియు వెయిట్ లిఫ్టింగ్ ఇలా రెండిటిని కలిపి చేయిస్తుంటారు. కండలు పెరగడానికి మరియు బరువు తగ్గటానికి ఈ రెండు ఎంతగానో తోడ్పడతాయి.

మీరు మీ శరీరాకృతిని బాగా మార్చుకొని ఆరోగ్యంగా జీవించాలి అనే ఉద్దేశ్యంతో జిమ్ లో చేరాలి అని భావిస్తున్నారా ? అలా అయితే కొన్ని విషయాలను మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.వాటి గురించి ఎప్పుడు మనం తెలుసుకుందాం.

చిట్కా #1 : మొదట ఉచితంగా ప్రయత్నించండి :

చిట్కా #1 : మొదట ఉచితంగా ప్రయత్నించండి :

చాలా నగరాలలో ఉన్న జిమ్ లు ఎన్నో ఆకర్షణీయమైన మెంబర్షిప్ ఆఫర్ లను ప్రకటిస్తున్నాయి. అయితే చాలా వాటిల్లో సరైన పరికరాలు ఉండకపోవచ్చు లేదా మంచి శిక్షణ ఇచ్చేవారు లేకపోవచ్చు. చాలా జిమ్ లు మూడు నుండి ఏడూ రోజుల పాటు ఉచితంగా తమ జిమ్ లో చేరి, తమ జిమ్ వాతావరణం నచ్చిన తర్వాత మాకు డబ్బులు ఇవ్వండి అని చెబుతున్నాయి. కావున మీరు జిమ్ లో చేరే ముందు ఖచ్చితంగా ఈ ఉచిత ఆఫర్ ని వినియోగించుకొని వివిధ రకాల జిమ్ లకు వెళ్లి అక్కడ ఉన్న పరిసరాలన్నీ మీకు సరిపోయే విధంగా ఉన్నాయా లేదా, అక్కడ గనుక చేరితే మీకు ప్రయోజనం ఉంటుందా లేదా అని మీరు బేరీజు వేసుకున్న తర్వాత, మీకు ఏదైతే ఉత్తమం అనిపిస్తుందో అందులో చేరండి.

చిట్కా #2 : మీకు దగ్గరలో ఉన్న జిమ్ ను ఎంచుకోండి :

చిట్కా #2 : మీకు దగ్గరలో ఉన్న జిమ్ ను ఎంచుకోండి :

మీరు ఉంటున్న ప్రదేశం నుండి ఒకటి నుండి రెండు కిలోమీటర్ల లోపే జిమ్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే, ఒకవేళ జిమ్ గనుక బాగా దూరంలో ఉంటే చాలా మంది వ్యక్తులు బద్ధకం వల్ల అంత దూరం ప్రయాణించలేక తరచూ జిమ్ కి వెళ్లకుండా ఎగ్గొడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా జిమ్ గనుక మీకు దగ్గరగా ఉంటే, నడుచుకుంటూనో లేదా సైకిల్ పైనో వెళ్తారు. ఇలా చేయడం ద్వారా వ్యాయామానికి ముందు మీరు సన్నద్ధత అవ్వడానికి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

చిట్కా #3 : పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అని పరిశీలించండి :

చిట్కా #3 : పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అని పరిశీలించండి :

మీరు చేరుతున్న జిమ్ పరిశుభ్రంగా ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించండి. మీరు వ్యాయామం చేసిన తర్వాత మీ ముఖాన్ని కడుక్కోవడానికి విశ్రాంతి గది బాగుందా మరియు అక్కడ వేసిన మ్యాట్లు శుభ్రంగా ఉన్నాయా ? మరియు అక్కడ వ్యాయామం చేసే పరికరాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారా ? ఇలా అన్ని విషయాలను పరిశీలించండి. ఒక వేళ జిమ్ ని గనుక శుభ్రంగా గనుక ఉంచకపోతే, మీరు వ్యాధుల భారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుచేతనంటే చాలా మంది వ్యక్తులు ప్రతిరోజూ పరికరాలను వాడుతుంటారు. ఆ సమయంలో విపరీతమైన చెమట వాటి పై పడుతూ ఉంటుంది.

చిట్కా #4 : వైద్యుని వద్దకు వెళ్లి ఒకసారి పరీక్ష చేయించుకోండి :

చిట్కా #4 : వైద్యుని వద్దకు వెళ్లి ఒకసారి పరీక్ష చేయించుకోండి :

మీరు జిమ్ లో చేరే ముందు వైద్యుని వద్దకు వెళ్లి ఒకసారి మీ శరీరం మొత్తాన్ని పరీక్షించుకోండి. జిమ్ లో విపరీతమైన మరియు తీవ్రమైన శారీరిక వ్యాయామం చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా కార్డియో మరియు వెయిట్ లిఫ్టింగ్ కలిపి మరీ చేయిస్తారు. అందుచేత మీరు ఏమైనా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా లేక మరేదైనా పెద్ద వ్యాధులతో బాధపడుతున్నారా అనే విషయం తెలుసుకోవడం మంచిది. ఆలా గనుక పరీక్షించుకోలేకపోతే మీరు చేసే తీవ్రమైన వ్యాయామాల వల్ల మీ యొక్క ఆరోగ్య పరిస్థితి దిగజారిపోయే ప్రమాదం ఉంది.

చిట్కా #5 : శిక్షణ ఇచ్చే వ్యక్తి సహాయం తీసుకోండి :

చిట్కా #5 : శిక్షణ ఇచ్చే వ్యక్తి సహాయం తీసుకోండి :

చాలా జిమ్ లలో శిక్షకులు మరియు వ్యక్తిగత శిక్షకులు ఉంటారు. మీరు వ్యాయామం ప్రారంభించే ముందు వారితో మాట్లాడండి. మీరు ఎలాంటి వ్యాయామం చేయాలి అనే విషయానికి సంబంధించి మీ యొక్క శారీరిక లక్షణాలు దృష్టిలో పెట్టుకొని అందుకు సంబంధించిన సూచనలు సలహాలు ఇస్తారు. బరువు తగ్గడానికి చేసే వ్యాయామాలు, కండలు పెంచడానికి పనికిరాకపోవచ్చు. కావున శిక్షకుల యొక్క సూచనలు సలహాలు తీసుకొని మొదట్లో వారి యొక్క ఆధ్వర్యంలో వ్యాయామం చేయడం మంచిది.

చిట్కా #6 : మీ శరీరానికి ఏమైనా గాయాలు అయ్యాయా అనే విషయాన్ని మీ శిక్షకులకు తెలియజేయండి :

చిట్కా #6 : మీ శరీరానికి ఏమైనా గాయాలు అయ్యాయా అనే విషయాన్ని మీ శిక్షకులకు తెలియజేయండి :

మీ శరీరంలో ఎక్కడైనా గాయం అయ్యి ఉంటే లేదా దీర్ఘకాలంగా ఏదైనా నొప్పితో బాధపడుతూ ఉంటే, ఉదాహరణకు మోకాలి నొప్పి, వెన్ను నొప్పి మొదలగు వాటి గురించి మీ యొక్క శిక్షకులకు తెలియజేయడం చాలా ముఖ్యం. ఆలా చెప్పడం ద్వారా ఆయా ప్రాంతాల్లో ఒత్తిడి పెంచే వ్యాయామాలను మీతో చేయనీయకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. అంతేకాకుండా ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని క్లిష్ట సమస్యలను కొనితెచ్చుకోకుండా అరికట్టవచ్చు.

చిట్కా #7 : అతిముఖ్యమైన పరీక్షలన్నింటిని మొదట్లోనే చేయించుకోండి :

చిట్కా #7 : అతిముఖ్యమైన పరీక్షలన్నింటిని మొదట్లోనే చేయించుకోండి :

మీ బరువుని, శరీరంలో ఉన్న కొవ్వు శాతాన్ని, మీ యొక్క శరీర తత్వాన్ని మొదలగు అతి ముఖ్యమైన విషయాలన్నింటినీ మీ యొక్క శిక్షకుల ద్వారా జిమ్ లో మొదటిరోజే పరీక్ష చేయించుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు ఎంత బరువు తగ్గారో లేదా మీ యొక్క కండలు ఎంతలా పెరిగాయి అనే విషయానికి సంబంధించి ఎప్పటికప్పుడు మీ వృద్ధిని అంచనా వేసుకునేందుకు అవకాశం దొరుకుతుంది.

చిట్కా #8 : మీరు తినే ఆహారానికి కూడా సమానమైన ప్రాముఖ్యత ఇవ్వండి :

చిట్కా #8 : మీరు తినే ఆహారానికి కూడా సమానమైన ప్రాముఖ్యత ఇవ్వండి :

మీరు జిమ్ లో చేసే వ్యాయామానికి అనుగుణంగా మీరు ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆలా చేయడం ద్వారా మీ యొక్క ఆరోగ్య లక్ష్యాలను కూడా తొందరగా చేరుకోవచ్చు. సరైన పౌష్టికాహారం తీసుకోకుండా జిమ్ లో వ్యాయామం చేయడం మంచి పద్దతి కాదు. మీ శ్రమ అంతా వృధా ప్రయాసే అవుతుంది. మీ శిక్షకుడి యొక్క సహాయం లేదా ఆహార నిపుణుల సలహా తీసుకొని మీ యొక్క వ్యాయామాలకు అనుగుణంగా సమతుల్యతతో కూడిన పౌష్టికాహారం తీసుకోవడం మంచిది.

చిట్కా #9: జిమ్ లో స్వీయ చేతన తో వ్యవహరించకండి :

చిట్కా #9: జిమ్ లో స్వీయ చేతన తో వ్యవహరించకండి :

మొదటిసారి జిమ్ కి వెళ్ళినప్పుడు కొద్దిగా భయం భయంగా ఉంటుంది. కొంతమంది వ్యక్తులు కొన్ని రకాల వ్యాయామాలు చేయడానికి మరీ ఎక్కువగా సంకోచిస్తుంటారు. చేస్తే వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని ఒక భావనకు కూడా లోనవుతుంటారు. కానీ, మీరు గుర్తు ఉంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, మీ ఆరోగ్యం కోసం మీరు చేస్తున్నారు. కావున మీరు చేసే వ్యాయామం పై పూర్తి దృష్టిని కేంద్రీకరించండి. మిగతా అపోహలను, ఆలోచనలను పక్కనపెట్టండి.

English summary

Tips To Keep In Mind Before Joining A Gym

Exercising regularly can prevent and treat a number of ailments. Gymming is known to be one of the most effective forms of exercises. So, here are a few tips to keep in mind before joining a gym for the first time.
Story first published:Wednesday, December 13, 2017, 16:56 [IST]
Desktop Bottom Promotion