అధిక కొవ్వు కల డైట్ నిజానికి బరువు తగ్గటంలో సాయపడుతుంది, పరిశోధనల్లో తేలింది.!

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

బరువు తగ్గడానికి ప్రతిఒక్కరు ముందు చేసేది,కొవ్వు పదార్థాలు తినడం నివారించడం.కొవ్వు పదార్థాలు మన ఆరోగ్యానికి మంచిది కాదు అని మన బుర్రలో బలంగా పాతుకుపోయింది, ముఖ్యంగా మీరు బరువు తగ్గాలని చూస్తే.

కానీ మీకు తెలుసా మీరు చేస్తున్న పెద్ద తప్పు అదే అని?.కొవ్వు పదార్థాలు పూర్తిగా మానేస్తే అది మీ శరీరానికి ఇంకా ఎక్కువ నష్టం కలిగిస్తుంది, పైగా మీకు బరువు తగ్గే ప్రక్రియలో ఏమీ సహాయపడదు కూడా.

వినడానికి వింతగా అనిపించచ్చు కానీ, ఎక్కువ కొవ్వు ఉన్న ఆహార డైట్ ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గడానికి తోడ్పడుతుంది అని ఒక కొత్త పరిశోధనలో కనుక్కున్నారు.

weight loss

ఈ పద్ధతిలో కొవ్వు కణాలు పెద్దవిగా పెరిగి ఊబకాయం మరియు లావు అవ్వకుండా ఉండే మార్గాన్ని గుర్తించారు.

కాబట్టి బరువు తగ్గటానికి,కొవ్వు ఎక్కువ ఉన్న డైట్ సరిగ్గా ఎలా సహాయపడుతుంది?ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించాలంటే కొవ్వు,ఉన్న మూడు స్థూలపోషకాలలో ముఖ్యమైనది.కొవ్వు నాడీకణం తొడుగు పూతకి సహాయం చేస్తుంది.

మానవ కణజాలాలు కొవ్వుతో తయారు చేయబడి ఉంటాయి.అందుకే కొవ్వు మొత్తానికి డైట్ నుంచి దూరం చేయడం అంత మంచిది కాదు.

పరిశోధన కోసం,సెయింట్ లుయిస్, వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో, పరిశోధకులు ఎలుక యొక్క కొవ్వు కణాలలో హెడ్జ్ హాగ్ మార్గాన్ని సక్రమం చేసి వాటికి కొవ్వు పదార్థం ఎక్కువ ఉన్న ఆహారాన్ని పెట్టి లావవకుండా చేశారు.

పరిశోధకుల ప్రకారం,వారి బృందం కనుక్కున్న ఈ మార్గం, ఊబకాయాన్ని తగ్గించటానికి కొత్త చికిత్సగా మారచ్చు.

కొవ్వు పేరుకుపోవడం అంటే ముఖ్యంగా, పెరిగిపోయిన కొవ్వు కణాల పరిమాణం వల్ల మరియు ప్రతీ కొవ్వు కణం పెద్దగా పెరిగి ఇంకా ఎక్కువ కొవ్వుని నిలవ చేసుకుంటుంది.

ఇలా కొవ్వు కణాలు విస్తరిస్తేనే లావవుతారు కానీ ఎక్కువ కొవ్వు కణాలు ఉంటే కాదు.టీం తమ మొత్తం దృష్టి, శరీరంలో ఉన్న ఎన్నో కణజాలాలలో ఉన్న హెడ్జ్-హాగ్ ప్రోటీన్ మార్గం మీద పెట్టింది.

ఎనిమిది నెలల తరువాత ఈ పరిశోధనలో కనుగొన్న నిజాలు ఏంటంటే, హెడ్జ్-హాగ్ మార్గాన్ని సక్రమం చేయని ఎక్కువ కొవ్వు డైట్ ఉన్న ఎలుకలు లావయ్యాయి.ఇంకోపక్క హెడ్జ్-హాగ్ మార్గాన్ని సక్రమం చేసిన ఎలుకల బరువు సరిగ్గానే ఉన్నది.అవి సాధారణ డైట్ పాటించిన వాటి కంటే ఎక్కువ బరువు ఏమీ పెరగలేదు.

హెడ్జ్-హాగ్ మార్గం కొవ్వు కణాల పెరుగుదలని ఆపి, కొవ్వు పేరుకుపోకుండా నివారిస్తుందని పరిశోధకులు నమ్ముతున్నారు.

"ఈ-లైఫ్" అనే పత్రికలో ఈ అధ్యయనం ప్రచురింపబడింది.

మరోవైపు,కొన్ని ఆరోగ్యకరమైన కొవ్వు ఎక్కువ ఉండే పదార్థాల గురించి తెలుసుకోండి.

1) అవకాడోస్

1) అవకాడోస్

అవకాడోలో కొవ్వు నిండి ఉంది.కాని అవకాడోలో ఉన్న కొవ్వు మంచి కొవ్వు, అది ఓలిక్ ఆమ్లము అనబడే మోనోసాచ్యురేటెడ్ కొవ్వు.అవకాడో లో ఫైబర్ మరియు పొటాషియం ఉండి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

2) డార్క్ చాక్లేట్స్

2) డార్క్ చాక్లేట్స్

డార్క్ చాక్లేట్స్ మంచి కొవ్వు మరియు కేలరీలు కలిగి ఉంటాయి.దాని అనామ్లజనక లక్షణాల కారణంగా అది కొలెష్ట్రాలని మరియు రక్తపోటుని తగ్గిస్తుంది.పైగా తగిన మోతాదులో డార్క్ చాక్లేట్ తింటే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతంది.

3) నట్స్

3) నట్స్

నట్ గింజల్లో ప్రోటీన్లు,ఫైబర్,విటమిన్-ఈ మరియు ఇతర ఖనిజాలు ఘనంగా ఉంటాయి.నట్'స్ రోజూ తింటే గుండె జబ్బు మరియు మధుమేహాన్ని నివారించడమే కాకుండా అధిక బరువు పెరగకుండా కాపాడుతుంది.

4) చియా విత్తనాలు

4) చియా విత్తనాలు

చియా విత్తనాలలో, గుండెకి మంచిదైన ఒమెగా-3-ఫాటీ ఆమ్లాలు ఉంటాయి.మంటకి వ్యతిరేక లక్షణాలు కలిగి ఉన్న చియా విత్తనాలు, రక్త పోటు తగ్గించి మరియు గుండె పరిస్థితి మంచిగా ఉండేలా సహాయపడతాయి.

5) అదనపు వర్జిన్ ఆలివ్ నూనె

5) అదనపు వర్జిన్ ఆలివ్ నూనె

అదనపు వర్జిన్ ఆలివ్ నూనె,ఓలిక్ ఆమ్లము లాంటి మంచి కొవ్వు కలిగి ఉంటుంది.అదనంగా దీనిలో విటమిన్-ఈ, విటమిన్-కె మరియు శక్తివంతమైన అనామ్లజనకాలు ఉంటాయి. ఇది మంటని ఎదుర్కోవడంలో ,రక్తపోటు తగ్గించడంలో మరియు గుండె పోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయ పడుతుంది.

English summary

High Fat Diet Can Actually Help You To Lose Weight, Finds Research

A new study has found that a high-fat diet can actually help one to lose weight in a healthy way. The study has identified a pathway to prevent fat cell from growing larger that leads to weight gain and obesity.
Story first published: Tuesday, December 12, 2017, 14:00 [IST]
Subscribe Newsletter