ఒక్క రోజుకు 1 కిలో బరువు తగ్గించే నిమ్మరసం

Posted By:
Subscribe to Boldsky

నిమ్మకాయ ద్వారా సహజసిద్ధంగా పోషకాలు పొందవచ్చు. అలాగే.. బరువు తగ్గడం నిమ్మకాయతో చాలా ఈజీగా సాధ్యమవుతుంది. ఒక్క రోజుకు 1 కిలో బరువు తగ్గించే నిమ్మరసం శరీరంలో ఫ్యాట్ ని కరిగించడానికి ఉపయోగపడుతుందని సైంటిఫిక్ గా నిరూపించారు. ఇందులో విటమిన్ సి, ఫైబర్ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. ఆకర్షణీయమైన బాడీ షేప్ పొందడానికి కూడా ఉపయోగపడుతుంది.

"ది న్యూట్రిషన్ అండ్ మెటబోలిక్ రిసెర్చ్ సెంటర్" వారు వివరించిన దాని ప్రకారం, నిమ్మరసంలో ఉండే విటమిన్ 'C' కొవ్వులను కరిగించటమే కాకుండా, కొవ్వు కణాలను కాల్షియం గ్రహించేలా ప్రోత్సహిస్తుంది. ఈ కొవ్వు కణాలలోకి గ్రహించబడిన కాల్షియం అధికంగా తినాలనే కోరికను చంపివేస్తుంది, ఫలితంగా బరువు పేరే ప్రక్రియను పరోక్షంగా తగ్గిస్తుంది. "అరిజోన స్టేట్ యూనివర్సిటీ" వారు, ఎవరైతే నిమ్మ, నారింజ, ద్రాక్ష పండ్ల వంటి విటమిన్, మినరల్ లను కలిగి ఉండే వాటిని తినటం వలన వారి శరీర బరువు పెరగకుండా ఉంటారని పరిశోధనలలో తెలుపబడింది.

ఒక్క రోజుకు 1 కిలో బరువు తగ్గించే నిమ్మరసం

రోజుకి ఒక నిమ్మకాయ తీసుకుంటే.. ఫ్యాట్ కి దూరంగా ఉన్నట్టే అని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే శరీరంలో పేరుకున్న మలినాలను, కెమికల్స్ ని బయటకు పంపి ఫ్యాట్ ఫ్రీ బాడీ పొందడానికి నిమ్మ సహకరిస్తుంది. కాబట్టి నిమ్మకాయను బరువు తగ్గడానికి నిమ్మరసంను ఎలా ఉపయోగించాలి, ఏవిధంగా బరువు తగ్గడానికి సహాయపడుతుందో ఇప్పుడు చూద్దాం..

కావల్సిన దార్థాలు :

కావల్సిన దార్థాలు :

కీరదోసకాయ: ఒకటిలో సగ భాగం (ముక్కలుగా కట్ చేసుకోవాలి)

తులసి ఆకులు : కొద్దిగా

ఆపిల్ : 1 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)

నిమ్మకాయ: సగం(రసం పిండుకోవాలి)

అల్లం : చిన్న ముక్క

ఒక గ్లాసు నీళ్లు

తయారీ:

తయారీ:

పైన సూచించిన పదార్థాలన్నీ మిక్సీ జార్ , ఒక గ్లాసు నీళ్లతో జ్యూస్ తయారుచేసుకోవాలి. దీన్ని మరో గ్లాసు నీళ్లు చేర్చాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ఈ నిమ్మ జ్యూస్ ను రెగ్యులర్ గా ఒక నెలరోజుల పాటు తీసుకుంటే తప్పకుండా బరువు తగ్గుతారు. అలాగే శరీరంలో పోషకాలను బ్యాలెన్స్ చేయడానికి బాదం, మరియు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల ఇవి బరువు తగ్గించడంతో పాటు శరీరానికి కావల్సిన పోషకాలను అందిస్తుంది.

జ్యూస్ తాగిన అరగంట తర్వాత బాదం అరకప్పు తీసుకోవాలి:

జ్యూస్ తాగిన అరగంట తర్వాత బాదం అరకప్పు తీసుకోవాలి:

అధిక బ‌రువు, ఊబ‌కాయంతో బాధ ప‌డేవారు త‌మ ఆహారంలో బాదంను చేర్చుకోవ‌డం వ‌ల్ల‌ శ‌రీర బ‌రువు ఆరోగ్య‌క‌ర స్థాయికి చేరుకుంటుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు. బాదంలో అధిక స్థాయిలో పోష‌కాలు, త‌క్కువ స్థాయిలో సాచురేటేడ్ కొవ్వు ప‌దార్ధాలు క‌లిగి ఉంటాయి. స‌రైన ఆహార ప్ర‌ణాళిక‌తోపాటు తేలికపాటి వ్యాయామాల‌ను చేస్తూ బాదంల‌ను తినుట వ‌ల‌న బ‌రువు త‌గ్గ వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అధిక బ‌రువున్న వారు ఆహారంలో బాదంల‌ను క‌లుపుకోవ‌డం వ‌ల‌న 65 శాతం మంది కేవ‌లం ఆరు నెల‌ల్లోనే బ‌రువు త‌గ్గార‌ని ఆ జ‌ర్న‌ల్ ప్ర‌క‌టించింది.

అలాగే బాదంతో పాటు ఖర్జూరాలను 4-5 తీసుకోవాలి:

అలాగే బాదంతో పాటు ఖర్జూరాలను 4-5 తీసుకోవాలి:

ఖర్జూరం అత్యధికంగా న్యూట్రీషియన్స్ ఉన్నటువంటి ఆహారం పదార్థం. ఎందుకంటే ఖర్జూరంలో విటమిన్స్, మినిరల్స్, క్యాల్షియం, మినిరల్స్, మరియు ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఈ హెల్తీ ఫుడ్ అనీమియా నుండి అన్ని రకాల ఆరోగ్య సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అందుకే దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలని కోరుతున్నారు పోషకాహార నిపుణులు...ఖర్జూరాలలో బరువు తగ్గించడంలో ఖర్జూరాలు ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా బరువు తగ్గించుకోవాలని కోరుకుంటే మీరు మీ రెగ్యులర్ డైట్ లో ఖర్జూరంలను తప్పనిసరిగా జోడించాలి.

బరువు తగ్గించే లెమన్ డ్రింక్ తర్వాత డైట్ టిప్స్:

బరువు తగ్గించే లెమన్ డ్రింక్ తర్వాత డైట్ టిప్స్:

1. లంచ్ కు మొదటి ఆప్షన్ : ఓట్స్ తీసుకోవాలి. ఓట్స్ తో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ చేర్చి తీసుకోవాలి.

2. లంచ్ కు రెండవ ఆప్షన్ : బ్రౌన్ బ్రెడ్ సాండ్విచ్ :

బ్రౌన్ బ్రెడ్ మీద టమోటో , ఉల్లిపాయ, పచ్చిమిర్చిని స్లైస్ గా కట్ చేసి తీసుకోవచ్చు.

3. అంచ్ కు మూడవ ఆప్షన్ :ఆయిల్ లేకుండా రోటీ, దాల్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. దాల్ తో పాటు ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చి తీసుకోవచ్చు.

పరగడుపున కపాలబాతి ప్రాణాయం

పరగడుపున కపాలబాతి ప్రాణాయం

వీటితో పాటు పరగడుపున కపాలబాతి ప్రాణాయం 10 నిముషాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో బ్రీతింగ్, యోగా వ్యాయామాల వల్ల బ్రెయిన్ కు ఆక్సిజన్ సులభంగా అందుతుంది. టెన్షన్, స్ట్రెస్ తగ్గిస్తుంది. ఒబేసిటి తగ్గిస్తుంది. దాంతో ఫ్యాట్ కరిగించుకుని, బరువు తగ్గించుకోవచ్చు.

నిమ్మరసం ఎలా బరువు తగ్గింస్తుంది? అందులో ఉన్న పోషకాలు

నిమ్మరసం ఎలా బరువు తగ్గింస్తుంది? అందులో ఉన్న పోషకాలు

అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ లను మరియు తక్కువ స్థాయిలో క్యాలోరీలను అందించే నిమ్మ, శరీర బరువు తగ్గించే సరైన ఆహారంగా చెప్పవచ్చు. శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు పదార్థాలను కరిగించే ఆహార పదార్థాలలో నిమ్మ కూడా ఒకటి. బరువు తగ్గాలి అనుకునే వారు చేయవలసింది "తీసుకునే క్యాలోరీల సంఖ్య కన్నా, ఖర్చు చేసే క్యాలోరీల సంఖ్య అధికంగా ఉండాలి". నిమ్మను రోజు తీసుకోవటం వలన క్యాలోరీలు తక్కువ అందించబడటమే కాకుండా, కొవ్వు పదార్థాలను కూడా వేగంగా కరిగించి వేస్తుంది. నిమ్మను నీటిలో పిండి లేదా సలాడ్ లలో పిండుకొని తినండి.

నిమ్మలో 1.9 గ్రాముల ఫైబర్ లు ఉంటాయి

నిమ్మలో 1.9 గ్రాముల ఫైబర్ లు ఉంటాయి

సాధారణ పరిమాణంలో ఉండే నిమ్మలో 1.9 గ్రాముల ఫైబర్ లు ఉంటాయి, రోజుకు శరీరానికి కావలసిన ఫైబర్ లలో 6 శాతం వరకు వీటి నుండే పొందవచ్చు. నిమ్మను తినటం వలన ఎక్కువ సమయం వరకు ఆకలిగా భావించరు. ఫలితంగా శరీర బరువు తగ్గుతుంది.

ఒక నిమ్మ దాదాపు 19.5 మిల్లి గ్రాముల విటమిన్ 'C'లను కలిగి ఉంటుంది

ఒక నిమ్మ దాదాపు 19.5 మిల్లి గ్రాముల విటమిన్ 'C'లను కలిగి ఉంటుంది

ఒక నిమ్మ దాదాపు 19.5 మిల్లి గ్రాముల విటమిన్ 'C'లను కలిగి ఉండి, రోజులో స్త్రీలకు కావలసిన విటమిన్ 'C' లో 26శాతం మరియు పురుషులకు కావాల్సిన 21.8 శాతం వరకు విటమిన్ 'C' అందిస్తుంది. భౌతిక కార్యాలను నిర్వహించటానికి, కండరాల ద్రుడత్వానికి మరియు ప్రమాదానికి గురైన చర్మం, ఎముకలు, కణాల మరమ్మత్తుకు మరియు ఆరోగ్యకర స్థాయిలో ఉంచటానికి విటమిన్ 'C' తప్పక అవసరం.

జర్నల్స్ ఆఫ్ ద అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషియన్ వారు

జర్నల్స్ ఆఫ్ ద అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషియన్ వారు

జర్నల్స్ ఆఫ్ ద అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషియన్ వారు ప్రచురించిన దాని ప్రకారం, నిమ్మ శరీర బరువును తగ్గించుటలో సమర్థవంతంగా పని చేస్తుందని నొక్కి చెప్పారు. సరైన స్థాయిలో విటమిన్ 'C' తీసుకొని వారితో పోలిస్తే, శరీరానికి కావాల్సిన స్థాయిలో విటమిన్ 'C' లను తీసుకునే వారిలో 30 శాతం కొవ్వు పదార్థాలు కరిగించబడతాయని ఈ అధ్యయనాలలో వెల్లడించబడింది.

మంచి ప్రణాలిక, నిమ్మతో శరీర బరువును తగ్గించుకోండి.

మంచి ప్రణాలిక, నిమ్మతో శరీర బరువును తగ్గించుకోండి.

శరీర బరువు తగ్గించే శక్తి నిమ్మ కలిగి ఉన్నప్పటికి, తీసుకునే క్యాలోరీలు మరియు ఖర్చుచేసే క్యాలోరీల మొత్తాలపై శరీర బరువు ఆధారపడి ఉంటుంది. కావున, మంచి ప్రణాలికలను తయారు చేసుకొని, నిమ్మను కూడా కలుపుకొని, శరీర బరువును తగ్గించుకోండి.

English summary

Lemon To Reduce 1 Kilo Per Day in Telugu

Lemon To Reduce 1 Kilo Per Day, read more to know about ...
Subscribe Newsletter