చాలెంజ్ : ఒక్క నిమ్మ రసంతో ఎఫెక్టివ్ గా బరువు తగ్గవచ్చు..!!

Posted By:
Subscribe to Boldsky

ఆరోవాసన, ఎల్లో...గ్రీన్ కలర్ లో ఇంపుగా కనిపించే నిమ్మపండు చూస్తూ నోరూరిస్తుంటుంది. నిమ్మపండు రసంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు బ్యూటీ బెనిఫిట్స్ ఉండటం కూడా మీకు తెలిసినదే. అయితే బరువు తగ్గించుకోవడానికి నిమ్మపండును ఉపయోగిస్తారన్న విషయం మీకు తెలుసా! నడుము చుట్టుకొలత , చేతులు, తొడల్లో కొవ్వు కరిగించడంలో ఎపెక్టివ్ గా పనిచేస్తుంది.

నిమ్మరసంలో బెల్లీని కరిగించే ఎఫెక్టివ్ గుణాలున్నాయి. నిమ్మరసంలో ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉంది. ఇంకా కొలెస్ట్రాల్ కు , స్ట్రెస్ కు కారణమయ్యే కార్టిసోల్ హార్మోన్ ను కట్ డౌన్ చేయడానికి సహాయపడే విటమిన్స్ కూడా ఇందులో ఉన్నాయి.ఇవి స్ట్రెస్ హార్మోన్స్ ను తగ్గించి శరీరంలో ఫ్యాట్ చేరకుండా నివారిస్తాయి.

నిమ్మరసంలో ఫాలీ ఫినాల్స్ అధికంగా ఉన్నాయి. ఇది కొవ్వు చేరకుండా బరువు పెరగకుండా చేస్తుంది. నిమ్మతొక్కలో కూడా పెక్టిన్ అనే కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఎక్కువ సమయం ఆకలి కాకుండా, పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.

అంతే కాదు బరువు తగ్గించుకునే క్రమంలో నిమ్మరసం కంటె ఎఫెక్టివ్ అయినది, చౌకైనది మరొకటి లేదంటే నమ్మసఖ్యం కాదు. కాబట్టి, బరువు తగ్గించుకునే క్రమంలో నిమ్మరసంను ఏవిధంగా ఉపయోగించుకోవాలి. ఎఫెక్టివ్ మార్గాలేంటి అని తెలుసుకోవాలి. కేవలం ఒక్క నిమ్మరసంతో ఎంత ఎఫెక్టివ్ గా బరుతు తగ్గించుకోవచ్చన్న విషయం ఈ ఆర్టికల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఎలాగంటే..

1. డిటాక్స్ వాటర్ :

1. డిటాక్స్ వాటర్ :

లెమన్ వాటర్ లో డి లెమనిన్ అనే కంటెంట్ ఉంటుంది.ఇది నిమ్మతొక్కలో ఉండే పవర్ ఫుల్ కాంపౌండ్. ఇది కాలేయంలోని ఎంజైమ్స్ ను క్రమబదం చేస్తుంది. కాలేయంలోని వ్యర్షాలను శుభ్రం చేస్తుంది. దాంతో లివర్ లో మెండిగా తిష్టవేసిన ఫ్యాట్ ను ఎఫెక్టివ్ గా కరిగిస్తుంది. ఈ విధంగా మీరు బరువు తగ్గించుకునే మార్గాన్ని లెమన్ వాటర్ తెలియజేస్తుంది.

2. లెమన్ టీ :

2. లెమన్ టీ :

ఒక కప్పు టీలో నిమ్మరసం జోడించడం వల్ల గ్రీన్ టీ తాగడం కంటె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నిమ్మరసంను గ్రీన్ టీ కలిపి తాగినా మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది బరువు తగ్గడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గించుకునే ప్లాన్ లో లెమన్ టీ తప్పకుండా ఉండాలి.

3. లెమన్ ఫ్లేవర్డ్ రోస్టెడ్ వెజ్జీస్ :

3. లెమన్ ఫ్లేవర్డ్ రోస్టెడ్ వెజ్జీస్ :

వెజిటేబుల్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది న్యూట్రీషియన్స్ ను ఎక్కువగా అందిస్తుంది. రోస్ట్ చేసి, వెజిటేబుల్స్ లో కొద్దిగా నిమ్మరసంను చిలకరించడం వల్ల వెజిటేబుల్స్ లో ఆరోమా వాసనతో క్యాలరీలు తక్కవ కాబట్టి, రెగ్యులర్ సలాడ్స్ లో కూడా జోడించి తీసుకోవడం వల్ల ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవచ్చు.

4.హోం మేడ్ డ్రెస్సింగ్ :

4.హోం మేడ్ డ్రెస్సింగ్ :

కెమికల్స్, షుగర్ ఫిల్డ్ డ్రెసింగ్ ఫుడ్స్ వల్ల బరువు తగ్గే ప్రొసెస్ ఆలస్యం అవుతుంది. వీటికి బదులుగా సలాడ్స్ , ఇతర ఫుడ్స్ ప్రిపరేషన్ లో డ్రెస్సింగ్ గా నిమ్మరసంను ఉపయోగించడం ఉత్తమం.బరువు తగ్గించుకునే క్రమంలో ఇది ఒక ఉత్తమ మార్గం.

5. హెల్తీ డెజర్ట్ :

5. హెల్తీ డెజర్ట్ :

ఓట్స్, కోకనట్ లేదా ఇతర డ్రెసెర్ట్స్ మీకు ఆఫర్ చేసినప్పుడు అందులో కొన్ని చుక్కల నిమ్మరసం చిలకరించుకోవడం మంచిది. బరువు తగ్గించడంలో ఇది బెస్ట్ ఆప్షన్.

6.ఓట్స్ తో పాటు :

6.ఓట్స్ తో పాటు :

నిమ్మరసంను ఎక్కువగా తీసుకోవడానికి మరో మార్గం ఓట్స్, ఇతర టిఫిన్స్ తో జోడించి తీసుకోవచ్చు. ఇలా రెగ్యులర్ గా ఏదో ఒకరూపంలో తీసుకోవడం వల్ల ఎఫెక్టివ్ గా బరువు తగ్గుతారు.

7.ఫ్యాన్సీ ఐస్ క్యూబ్స్ :

7.ఫ్యాన్సీ ఐస్ క్యూబ్స్ :

డిటాక్సిఫైయింగ్ వాటర్ మీకు కావాలంటే ఫ్యాన్సీ ఐస్ క్యూబ్స్ నుఎంపిక చేసుకోవాలి. ఐస్ ట్రేలో లెమన్ జ్యూస్ నింపి ,ఈ క్యూబ్స్ ను మీకు నచ్చిన అన్ని రకాల బెవరేజెస్ లో మిక్స్ చేసుకోవచ్చు.

8. ఆహారాల తయారీలో:

8. ఆహారాల తయారీలో:

కొన్ని ఆహారాల వేపుళ్లలో కొన్ని రకాల ఫ్యాట్ పదార్థాలు, ఉప్పు వంటి వాటి కంటే నిమ్మరసం ఉపయోగించడం మంచిది. నిమ్మరసంను మాంసాహారాలు మ్యారినేట్ చేయడానికి, ఉడికించడానికి, డిజర్ట్స్ లో ,వెజ్జీస్ లో మిక్స్ చేసుకోవచ్చు.

9. బ్రౌన్ రైస్ రుచికరంగా వండటానికి :

9. బ్రౌన్ రైస్ రుచికరంగా వండటానికి :

బరువు తగ్గించే క్రమంలో బ్రౌన్ రైస్ కూడా గ్రేట్ గా సహాయపడుతాయి. ఒకే విధంగా తినడం బోర్ గా అనిపిస్తుంటే, బ్రౌన్ రైస్ కు కొద్దిగా నిమ్మరసం చేర్చి వండి తినవచ్చు. ఈ రెండింటి కాంబినేషన్ కూడా బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

10. హెల్తీ కాక్ టైల్ :

10. హెల్తీ కాక్ టైల్ :

సుగరీ డెన్స్ మిక్సర్ లో లెమన్ డ్రాప్ కాక్ టైల్ తయారుచేసుకోవచ్చు. అరకప్పు ఓడ్కా విత్ ఫ్రెష్ లెమన్ జ్యూస్ మరియు 1/4 కప్పు షుగర్ ను మిక్స్ చేసుకోవాలి.

English summary

Proven And Effective Ways To Lose Weight With Lemon

Lemon is known to have belly-flattening effects. One lemon is known to contain an entire day's worth of Vitamin C. This nutrient is known to cut down the levels of cortisol, which is a stress hormone that triggers hunger and fat storage.
Story first published: Friday, March 17, 2017, 15:25 [IST]
Subscribe Newsletter