మీ ఉద్యోగమే.. మీ బరువు పెంచుతుంది !

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సగభాగం ఆఫీస్ లోనే గడుపుతారు. మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు పని ఒత్తిడితో బిజీ బిజీగా గడిపే ప్రాంతం కూడా ఆఫీసే. అయితే చాలామంది బరువు పెరగడానికి కూడా ఆఫీసులే కారణం అవుతున్నాయి. ఎందుకంటే ఎక్కువ సమయాన్ని మనం అక్కడే వెచ్చిస్తుంటాం.

మంచి ఆహారపు అలవాట్లను ఆ వాతావరణంలో ప్లాన్ చేసుకోకపోవడం, ఫిజికల్ యాక్టీవిటిస్ ఎక్కువగా లేకపోవడం ఇందుకు కారణాలు. ఆఫీస్ అంటేనే రోజుంతా కూర్చొని పని చేసే వాతావరణమే ఎక్కువగా ఉంటుది.

దీంతో మీరు తక్కువ తిండి తిన్నా కూడా బరువు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆఫీసు వల్ల బరువు ఎలా పెరుగుతారనే దానికి సంబంధించిన కొన్ని విషయాలు మేము వివరిస్తున్నాం. మీరూ తెలుసుకోండి.

ఈజీగా 15కేజీల బరువు తగ్గాలంటే.. జీరా డైట్ బెస్ట్

 కంపెనీ ఇస్తున్నారా.. అయితే బరువుపెరిగేస్తారు

కంపెనీ ఇస్తున్నారా.. అయితే బరువుపెరిగేస్తారు

మీరు లంచ్ పూర్తి చేశాక మీ సహోద్యోగి మీ దగ్గరకు అలా బటయకు వెళ్లొద్దాం అని అంటారు. కాసేపు మాట్లాడుకుంటూ స్నాక్స్ తిందామంటాడు. మీరు దాన్ని తిరస్కరించలేరు. అయితే ఇలాంటి విషయాలే మీరు ఎక్కువగా తినడానికి కారణం అవుతాయి. అంతేకాకుండా ఆఫీసులోని కోలిగ్స్ తో కలిసి లంచ్ చేసేపటప్పడు కూడా మనం మాటల్లో పడి ఎక్కువగా తినేస్తూ ఉంటాం. అలాగే మీ సహోద్యోగిని ఇంట్లో కొన్ని వంటకాలు తయారు చేసి తీసుకొచ్చిదనుకో. కొత్త వంటకం తయారు చేశాను.. ఒకసారి టేస్ట్ చేయండంటూ మిమ్మల్ని అడుగుతుంది. దీంతో మీరు కూడా తింటారు. ఇలాంటి ఉదాహరణలు ఆఫీసులలో ఎన్నో ఉంటాయి. దీంతో మీ బాడీలో కేలరీల మోతాదు పెరుగుతుంది. ఫలితంగా మీరు బరువు పెరుగుతారు.

ఒత్తిడి లో ఏదంటే అది ఆర్డరివ్వడం

ఒత్తిడి లో ఏదంటే అది ఆర్డరివ్వడం

మీరు కొన్ని సందర్భాల్లో సలాడ్ తిని జ్యూస్ తాగితే సరిపోతుందనుకుంటారు. అయితే ఆఫీసుల్లో ఉండే ఒత్తిళ్ల పరిస్థితుల వల్ల మీరు పిజ్జా ఆర్డర్ చేస్తారు. అనేక మంది ఉద్యోగులు ఒత్తిళ్లను భరించలేక ఎక్కువగా జంక్ ఫుడ్ ను ఆర్డర్ చేస్తూ ఉంటారని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. దీంతో చాలామంది ఆఫీసుల్లో ఎక్కువగా తింటుంటారని తేలింది.

తినడంపై దృష్టి ఉండదు

తినడంపై దృష్టి ఉండదు

కొన్నిసార్లు మీరు ఆఫీసు పనుల్లో బిజీగా ఉంటారు. ఆ సమయంలో తింటున్నప్పుడు మీ దృష్టి అంతకూడా ఆఫీస్ పనుల మీదే ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు కేవలం ఆహారాన్ని నములుతుంటారని కాని దానిపై దృష్టి పెట్టి తినరు. మీ ఆలోచన అంతా మీరు ఆఫీస్ లో చేయాల్సిన పనులపైనే ఉంటుంది. మీరు ఇలా చేయడం వల్ల తిన్నది కూడా ఒంటపట్టదు. అలాగే ఆహారాన్ని కూడా మీరు సరిగ్గా నమిలరు. కొన్ని సందర్భాల్లో వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటే మీరు అన్నం కూడా సరిగ్గా తినకుండా అంతా డస్ట్ బిన్ లో పడేస్తు ఉంటారు. బరువు పెరగడానికి మీ ఆఫీసు కారణం అని చెప్పడానికి ఇది ఒక కారణంగా చెప్పవచ్చు.

త్వరగా బరువు పెంచే శక్తి ఈ ఆహారాలకే ఉంది...

మన చుట్టూ ఉండే పరిసరాలు

మన చుట్టూ ఉండే పరిసరాలు

మీ ఆఫీసులోని లివింగ్ కండీషన్స్, ఉష్ణోగ్రత కూడా మీ ఆహారపు అలవాట్లను ప్రభావితం చేస్తాయి. అలాగే మీరు ఉండే వెలుగు సరిగ్గా లేకుటే మీరు ఎక్కువ తినడానికి అవకాశం ఉందని ఒక అధ్యాయనంలో వెల్లడైంది. అలాగే ఎయిర్ కండిషన్డ్ స్పేస్ కూడా మీ ఆకలిపై ప్రభావం చూపుతుంది. ఉక్కిరి బిక్కిరి చేసే ఆఫీసువాతావరణంలో మీరు ఎక్కువ సేపు గడపుతుంటారు కాబట్టి వీలైనంత వరకు అప్పుడప్పడు అలా బయటకు వెళ్లి చల్లని, ఆహ్లదకరమైన గాలిని పీల్చుకుంటే మంచిది.

ఆఫీస్ నుంచి లేట్ గా వెళ్లడం

ఆఫీస్ నుంచి లేట్ గా వెళ్లడం

సాధారణంగా మీరు ఆఫీసు నుంచి సాయంత్రం 6 గంటలకల్లా వెళ్లిపోవొచ్చు. కానీ మీరు మాత్రం రోజూ రాత్రి 8 గంటలకు ఆఫీస్ నుంచి వెళ్తున్నారు. దీనివల్ల సాయంత్రం మీరు వ్యాయామం లేదా ఇదర వర్క్ వుట్స్ కోసం కేటాయించుకున్న సమయం వేస్ట్ అయిపోతుంది. అయితే ఇంటిక వెళ్లేలోపే మీకు ఆకలి దంచేస్తుంది. అందుకే పోతూ పోతూ రోడ్డు సైడ్ పై ఉండే కొట్లలో కాస్త తినిపోతారు. మీ ఆఫీస్ జీవితం మీ ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపుతుందడానికి ఇదొక నిదర్శనం.

కూర్చొని పని చేయడం

కూర్చొని పని చేయడం

ఆఫీసుల వల్ల బరువు పెరగడానికి ఉండే కారణాల్లో ఇది ప్రముఖమైనది. మీ ఉద్యోగంలో భాగంగా మీరు ఎక్కువగా కూర్చొనే పని చేయాల్సి వస్తోంది. దీంతో మీ శరీరంలోని కేలరీలు తగ్గే అవకాశం ఉండదు. దీంతో మీ శరీరంలో ఫ్యాట్ పెరిగిపోతుంది.

 నిద్ర లేకపోవడం

నిద్ర లేకపోవడం

ఆఫీస్ వర్క్, మీకు ఉండే టార్గెట్స్ మీ నిద్రను పాడు చేస్తాయి. ఇక ఆఫీసులో మీరే బాస్ అయితే మీపై మరింత ప్రభావం ఉంటుంది. దీంతో మీరు కనీసం విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఇబ్బందిపడుతుంటారు. మీ నిద్ర కూడా సరిగ్గా పట్టదు. మీ హార్మోన్లలో సమతుల్యత కూడా ఉండదు. దీంతో మీరు పరోక్షంగా స్థూలకాయానికి గురవుతారు. ఇలా మీరు పని చేసే ఆఫీస్ పలురకాలుగా మీరు బరువుపెరగడానికి కారణం అవుతుంది. అందువల్ల వీలైనంత వరకు ఆఫీస్ స్ట్రెస్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తూ ఉండండి.

English summary

Reasons For Weight Gain Due To Your Job

Are you in a sedentary job that forces you to sit for most part of the day? If you are eating less and still gaining weight then your sedentary job could be one reason behind it. Here are some reasons behind weight gain in office.
Story first published: Wednesday, November 1, 2017, 13:00 [IST]
Subscribe Newsletter