For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 12 మార్గాలను గనుక పాటిస్తే నిద్రించేటప్పుడు బరువు పెరగరు

By R Vishnu Vardhan Reddy
|

సాధారణంగా చాలా మంది అనుసరించే అలవాట్ల వల్ల వారికి తెలియకుండానే బరువు పెరిగిపోతుంటారు.

మీ పై మీరు సాధ్యమైనంత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలని భావిస్తే మరియు అనవసరంగా బరువుని పెరగకూడదు అని అనుకుంటే క్రింద చెప్పబడిన ఈ రాత్రిపూట అలవాట్లను గుర్తించి ఆ సమయంలో ఏమి చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అలవాట్ల వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.

ఆ అలవాట్లు యొక్క ప్రభావం గురించి చాలా మందికి అవగాహన లేదు.

1.చాలా తక్కువసేపు నిద్రపోవడం :

1.చాలా తక్కువసేపు నిద్రపోవడం :

చాలా తక్కువసేపు నిద్రపోవడం వల్ల బరువు పెరిగిపోతారు. మొత్తంగా ఇది జీర్ణ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రక్రియ బాగా నెమ్మదిస్తుంది. ఇందువల్ల బరువు పెరగడం మొదలవుతుంది.

దీనికితోడు విపరీతమైన ఆకలి కూడా వేస్తుంది. మీ శరీరం ఉత్పత్తిచేసే కార్టిసాల్ ని విపరీతంగా పెంచుతుంది.

అసలు మరచిపోకూడని విషయం ఏమిటంటే, ఎవరైతే చాల తక్కువసేపు నిద్రపోతారో అటువంటి వారు చాలా తక్కువసేపు శారీరిక వ్యాయామం చేస్తారు. దీనికి తోడు ఎక్కువగా అలసిపోయినట్లు ఉంటారు. పైన చెప్పబడిన ఇలా అనేక కారణాలు దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు రాత్రిపూట కనీసం 7 నుండి 8 గంటలు పడుకోవాలి.

2. రాత్రిపూట ఎక్కువగా భుజించడం :

2. రాత్రిపూట ఎక్కువగా భుజించడం :

రోజు చివరిలో అంటే, రాత్రిపూట ఆహారాన్ని తీసుకొనేటప్పుడు చాలా ఎక్కువగా అవసరానికి మించి ఆహరం గనుక తీసుకున్నట్లైతే, విపరీతంగా బరువు పెరుగుతారు. ఎక్కువ ఆహరం తీసుకున్నా లేక ఎక్కువగా అనిపించే ఆహారం తీసుకున్నా సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఈ సమయంలోనే జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది.

దీనికి తోడు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, టి.వి ముందు కూర్చొని అస్సలు ఆహారం తినకూడదు. ఇది చాలా ప్రమాదకరం. ఇలా చేస్తున్నారు అంటే మీరు తింటున్న ఆహారం పై అస్సలు దృష్టిని కేంద్రీకరించడంలేదు అని అర్ధం. మనం తింటున్న ఆహారం పై నియంత్రణను ఉంచుకోవాలి.

<strong>ఈజీగా 15కేజీల బరువు తగ్గాలంటే.. జీరా డైట్ బెస్ట్</strong>ఈజీగా 15కేజీల బరువు తగ్గాలంటే.. జీరా డైట్ బెస్ట్

3. ఆహారం తీసుకున్న వెంటనే పడకగదికి వెళ్లడం :

3. ఆహారం తీసుకున్న వెంటనే పడకగదికి వెళ్లడం :

రాత్రిపూట ఆహారం తీసుకున్న వెంటనే ఏ పనిచేయకుండా చాలామంది పడకగదికి వెళ్లిపోతుంటారు. ఈ మధ్యలో ఏ పని చేయరు. ఈ చెడ్డ అలవాటు వల్ల శరీరంలో విపరీతంగా కొవ్వు పెరిగిపోతుంది. చివరిగా దీనివల్ల కలిగే ఒక అనర్ధం ఏమిటంటే, సరిగ్గా ఆహారం జీర్ణం అవ్వదు.

మీరు పడుకోవడానికి మరియు ఆహారం తినడానికి మధ్య కనీసం ఒకటిన్నర నుండి రెండు గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి. ఇలా గనుక చేస్తే అధిక బరువు పెరగరు.

4. రాత్రిపూట బాగా వేయించిన ఆహారం తినటం :

4. రాత్రిపూట బాగా వేయించిన ఆహారం తినటం :

నిద్రపోయే మునుపు అనారోగ్యాన్ని కలిగించే ఆహారాన్ని పూర్తిగా నిషేధించండి. వీటిని గనుక నిషేదించకపోతే పూర్తిగా బరువు పెరిగిపోతారు.

వేయించిన ఆహారాలు రాత్రిపూట తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఎన్నో కేలరీల శక్తి శరీరానికి వచ్చేస్తుంది. కానీ, అవి ఖర్చు కావు. ఇందువల్ల కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. దీని వల్ల రాత్రిపూట సరైన నిద్ర కూడా పట్టదు.

ఉత్తమమైన మార్గం ఏమిటంటే, ఆరోగ్యవంతమైన ఆహారాలు సేవిస్తూ, సరైన పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో సమతుల్యతను పెంపొందించి ఆరోగ్యంగా ఉండవచ్చు.

5. రాత్రి పూట బాగా కారంగా ఉండే ఆహారాలను తినటం :

5. రాత్రి పూట బాగా కారంగా ఉండే ఆహారాలను తినటం :

రాత్రి పూట మరీ ఎక్కువ కారంగా ఉండే ఆహారాన్ని కూడా అస్సలు తీసుకోకూడదని సూచిస్తున్నారు.

ఏదైనా బాగా కారంగా ఉన్న ఆహారాన్ని తిన్నా లేదా ఎక్కువ పచ్చి మిరపకాయలు ఉన్న ఆహారాన్ని తిన్నా అవి సరిగ్గా అరగవు. ఇందువల్ల సరిగ్గా నిద్రపట్టదు.

మీరు నిద్రపోతున్న సమయంలో చాలా గంటలు ఏమి తినకుండానే ఉంటారు. కావున ఇటువంటి సమయంలో బాగా కారంగా ఉన్న ఆహారాలను రాత్రిపూట తినటం వల్ల పొట్టలో ఉన్న ఆమ్లాల వల్ల విపరీతమైన నొప్పి వచ్చే అవకాశం ఉంది అందుచేతనే ఇటువంటి ఆహారాలను రాత్రిపూట అస్సలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. మిగతా రోజులో బాగా కారంగా ఉన్న ఆహారాలను తీసుకోండి. కానీ, నిద్రపోయే ముందు ఇలాంటి వాటిని తీసుకోకపోవడం వల్ల అధిక బరువు ని అరికట్టవచ్చు.

6.కార్బోహైడ్రాట్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినటం :

6.కార్బోహైడ్రాట్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినటం :

శరీరానికి కావాల్సినంత శక్తిని ఇవ్వడమే కార్బోహైడ్రాట్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. పడుకునేటప్పుడు ఎవ్వరికి ఇంత శక్తి సాధారణంగానే అవసరం ఉండదు.

దీనికి తోడు వాటిలో శుద్ధి చేసిన చక్కెర పదార్ధాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని వెంటనే ఖర్చు చేయాలి లేదంటే అవి కొవ్వుగా మారిపోతాయి.

<strong>ఈ ట్రిక్స్ పాటించండి.. బరువు తగ్గండి </strong>ఈ ట్రిక్స్ పాటించండి.. బరువు తగ్గండి

7. తీపి లేదా ఐస్ క్రీం వంటి పదార్ధాలు సేవించడం:

7. తీపి లేదా ఐస్ క్రీం వంటి పదార్ధాలు సేవించడం:

చక్కెర మరియు శుద్ధి చేయని పిండి కొవ్వు రూపంలో కణాలలో పోగు అవుతాయి. అందుచేత వీటిని సాయంత్రం పూట తినటం అనే ఆలోచన అంత మంచిది కాదు. ఎందుకంటే, వీటి వల్ల లభించే క్యాలరీలను మన శరీరం ఆ సమయంలో వెంటనే ఖర్చు చేయలేదు

వీటికి బదులుగా మంచి పళ్ళను సేవించడం మంచిది. ఇవి సాధారణంగానే తియ్యగా, రుచికరంగా, పోషకాలతో పాటు కొవ్వులేకుండా కూడా ఉంటాయి.

8.చిరు తిండ్లు :

8.చిరు తిండ్లు :

రాత్రిపూట చిరు తిండ్లు అస్సలు తినకండి.

రాత్రిపూట ఆహారాన్ని తీసుకున్న తరువాత, ఫ్రిడ్జ్ లోనో లేదా అరల్లోనో చిరు తిండ్ల కోసం వెతుకుతుంటే కనుక అది చాలా చెడ్డ ఆలోచనా పద్ధతి. వీటి వల్ల అనవసరమైన క్యాలరీలు శరీరంలోకి చేరతాయి. రాత్రిపూట అవి అస్సలు ఖర్చు కావు.

ఇంత అధిక శక్తి లభించడం వల్ల కూడా నిద్ర సరిగ్గా పట్టదు. దీనికి తోడు మన శరీరం కూడా వీటిని సక్రమంగా వినియోగించుకోలేదు. ఇవి ఖచ్చితంగా శరీర బరువుని పెంచుతాయి.

9. రాత్రిపూట ఆహారాన్ని తీసుకోకపోవడం :

9. రాత్రిపూట ఆహారాన్ని తీసుకోకపోవడం :

రాత్రిపూట ఆహారం తీసుకోకపోవడం సరైన ఆలోచన అస్సలు కాదు. ఈ అతిముఖ్యమైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల బరువు తగ్గొచ్చేమో గాని, దానితోపాటు జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మందగిస్తుంది.

దీని వల్ల, మీరు తదుపరిగ తీసుకొనే ఆహార సమయంలో మరింత ఎక్కువ ఆకలిగా ఉంటారు. రాత్రిపూట ఆహారం తీసుకోకపోవడం వల్ల మీలో ఆతురత భావాలూ ఎక్కువగా పెరిగిపోతాయి. దీని పర్యవసానంగా కండ తగ్గిపోయి కొవ్వు పెరిగిపోతుంది.

10. కాఫీ లేదా మద్యాన్ని త్రాగటం :

10. కాఫీ లేదా మద్యాన్ని త్రాగటం :

కాఫీ ని పొద్దున్న పూట మాత్రమే త్రాగండి.

మద్యాన్ని మరియు కాఫీ ని నిద్రపోయే ముందు అస్సలు సేవించకండి. ఎందుకంటే ఈ రెండు నిద్ర పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఈ రెండు ఎన్నో అధిక క్యాలరీలను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా మీ నిద్రకు భంగం కలిగిస్తాయి మరియు మీరు అధిక బరువు పెరిగే అవకాశం ఉంది.

దీనికి బదులుగా ఒక కప్పు గోరువెచ్చని పాలని లేదా ఒక గ్లాసు నీటిని తీసుకోవడం తెలివైన పని.

11. మొబైల్ ఫోన్ మరియు కంప్యూటర్ ని వాడటం :

11. మొబైల్ ఫోన్ మరియు కంప్యూటర్ ని వాడటం :

సెల్ ఫోన్ మరియు కంప్యూటర్ తెరల నుండి వెలువడే నీలి కాంతి మరియు రేడియో తరంగాలు మీ నిద్ర యొక్క సాధారణ ప్రక్రియను మార్చివేస్తాయి. అందువల్ల ఆరోగ్యవంతమైన బరువుని నిర్వహించడం కష్టతరం అవుతుంది.

కనీసం నిద్రపోయే ఒక గంట ముందు నుండీ వీటి జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది. దీనికి బదులుగా మంచి పుస్తకాన్ని చదవండి లేదా మీకు ఇష్టమైన సంగీతాన్ని వినటం చాలా ఉత్తమమైన మార్గం.

12. చాలా ఆలస్యంగా నిద్రపోవడం :

12. చాలా ఆలస్యంగా నిద్రపోవడం :

చాలా ఆలస్యంగా నిద్రపోవడం అనేది మంచి అలవాటు కాదు. ఉదారణకు రాత్రి ఒంటి గంట తర్వాత పడుకుంటే విపరీతమైన బరువు పెరుగుతారు. ఎందుకంటే మీ శరీరం యొక్క సాధారణ నిద్ర వ్యవస్థ పై పోరాటం చేసి మీరు బాగా నిద్రపోవాల్సి ఉంటుంది.

English summary

Top 12 Ways to Avoid Gaining Weight While Sleeping

Top 12 Ways to Avoid Gaining Weight While Sleeping, know to more about read on..
Desktop Bottom Promotion