సెక్సీ పార్ట్స్ : నడుము చుట్టూ పేరుకున్న ఫ్యాట్ కరిగించే బెస్ట్ ఫుడ్స్

By: Mallikarjuna
Subscribe to Boldsky

అందంగా ఉండాలంటే చర్మం రంగు ఒకటే సరిపోదు. చర్మ రంగుతో పాటు, శరీరం కూడా నాజూగ్గా ఉండాలి. అందంగా తెల్లగా ఉండి నడుము చుట్టుకొలత మాత్రం ఊహించని విధంగా ఎక్కువగా ఉంటే ఇక ఎంత అందమైన దుస్తులు ధరించినా ప్రయోజనం ఉండదు. నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు కారణంగా, ఎంత మంచి దుస్తులు ధరించినా అందాన్ని హరించేస్తుంది.

ఇలా నడుము చుట్టూ ఫ్యాట్ చేరడాన్ని టైర్ , స్పేర్ టైర్ ఇలా ఎవరికి నచ్చిన పేర్లు వారు పెట్టుకుంటుంటారు. అయితే ఇలాంటి పరిస్థిని నివారించుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం.

శరీరంలో కొవ్వు కరిగించి.. పొట్టతగ్గించుకొనేందు పరిష్కార మార్గం..!

అందమైన శరీరాక్రుతి కలిగి ఉండాలి. అందమైన డ్రెస్ ధరించాలని ఎవరికుండదు చెప్పండి, కానీ ఈ అదనపు కొవ్వు టైయర్ల వల్ల ఉన్న అందాన్ని పాడుచేస్తుంది. ఇటువంటి సమస్యతో మీరు కూడా బాధపడుతున్నట్లైతే ఖచ్చితంగా ఈ ఆర్టికల్ మీకోసమే.

నడము చుట్టుకొలతను పెంచేసిన కొవ్వు కరిగించుకోవడానికి కొన్ని ఆహారాలున్నాయి. వీటిలో పోషకాలు ఎక్కువ, క్యాలరీ తక్కువ. ఇవి బరువు తగ్గించడం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. నడుము చుట్టుకొలతను తగ్గించుకోవడంలో పండ్లు, కూరలు, లెగ్యుమ్స్ , త్రుణధాన్యాలు, ప్రోటీన్లు మరియు లోఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ వంటివి శరీరానికి శక్తినందిస్తూ ఆకలిని తగ్గిస్తాయి.

మరి బ్యాక్ ఫ్యాట్ మరియు, నడుము చుట్టు పేరుకున్న కొవ్వును కరిగించే ఆహారాలేంటో చూద్దాం..

1. ఓట్స్ బ్రాన్:

1. ఓట్స్ బ్రాన్:

ఓట్స్ బ్రాన్ లో 18గ్రాముల ఫైబర్, 20 గ్రాముల ప్రోటీన్స్ ఉన్నాయి. లోఫ్యాట్ మిల్క్ లో ఓట్స్ బ్రాన్ కలిపి ఉదయం అల్పాహారంలో తీసుకోవాలి. ఇది బ్యాక్ ఫ్యాట్ ను తొలగిస్తుంది.

2. స్వీట్ పొటాటో:

2. స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటోలో కార్బోహైడ్రేట్స్ తక్కువ. ఆలస్యంగా జీర్ణమవుతాయి. దాంతో మిమ్మల్ని ఎక్కువ సమయంలో ఆకలి కాకుండా చేస్తుంది. దీన్ని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల రెగ్యులర్ గా 21 రోజులు దీన్ని తీసుకుంటే 7 పౌండ్ల బరువు తగ్గుతారు.

3. గోధుమలు:

3. గోధుమలు:

నడుము చుట్టు పేరుకున్న కొవ్వు కరిగించుకోవాలంటే గోధుమలు సహాయపడుతాయి. త్రుణధాన్యాలతో తయారుచేసే ఆహారాలు తీసుకోవడం వల్ల వాటిలో ఉండే ఫైబర్ కొవ్వు కరిగించడాని సహాయపడుతాయి. అదనపు కొవ్వు చేరకుండా చేస్తాయి.

నడుము, తొడలు చుట్టూ పేరుకున్న ఫ్యాట్ కరిగించే అల్లం వాటర్..!!

4. బ్లాక్ రైస్:

4. బ్లాక్ రైస్:

బ్లాక్ రైస్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.ఫైబర్, విటమిన్ ఇ ఎక్కువ, షుగర్స్ తక్కువ. ఎక్కువ యాంటీఆక్సిడెంట్స్, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

5.వైట్ టీ:

5.వైట్ టీ:

వైటీ లిపోలిసిస్ ను పెంచుతుంది, ఇది ఫ్యాట్ ను కరిగిస్తుంది. కొవ్వు చేరడానికి కారణమయ్యే అడోపజనిసిస్ ఫ్యాట్ సెల్స్ కరిగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ టీలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది కొవ్వును శక్తిగా మార్చడంలో కాలేయం పనితీరు వేగవంతం చేస్తుంది.

6. బ్లాక్ బీన్స్:

6. బ్లాక్ బీన్స్:

బ్లాక్ బీన్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇంకా ఇది లోఫ్యాట్ కలిగినది. ఇంకా ఇది శరీరంలోని కొవ్వు కరగించడంలో కూడా గొప్పగా సహాయపడుతుంది.

7. అవొకాడో:

7. అవొకాడో:

అవొకాడోలో ఫైబర్ ఎక్కువ, దీన్నే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్ అని అంటారు. అవొకాడో సలాడ్స్ ,జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ఒక అవొకాడోలోనిమ్మరసం , 2 స్పూన్ల కొత్తిమీర తరుగు మిక్స్ చేసి, చిటికెడు ఉప్పు చేర్చి తీసుకోవాలి. ఈ జ్యూస్ లో 7 గ్రాములపైన ఫైబర్ అధికంగా ఉంటుంది.

8.చిక్ పీస్ పాస్తా :

8.చిక్ పీస్ పాస్తా :

ఇందులో ప్రోటీన్స్ ఎక్కువ. పాస్తాలో కంటే ఇందులో ఫైబర్ నాలుగు రెట్లు అధికం.మజిల్ బిల్డ్ చేసే ఫ్యాట్ ఫైటర్ గా పనిచేస్తుంది. ఇది ఒక బెస్ట్ డైట్ గా పనిచేస్తుంది.

9. పచ్చిబఠానీలు:

9. పచ్చిబఠానీలు:

ఇవి క్రంచీ స్నాక్స్, ఒక కప్పు పచ్చిబఠానీలలో 7 గ్రాములు ప్రోటీన్స్, 6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. స్నాక్ గా దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గిస్తుంది, నడుము చుట్టుకొలత పెంచుతుంది.

5 రోజుల్లో బెల్లీ ఫ్యాట్ కరిగించే అమేజింగ్ డ్రింక్ ...

10. డార్క్ చాక్లెట్:

10. డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, బరువు తగ్గిస్తుంది. ఇందులో గుండె ఆరోగ్యాన్ని పెంచే యాంటీఆన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఎక్కువ. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

11. బాదంలు:

11. బాదంలు:

బాదంలలో డైటరీ ఫైబర్ ఎక్కువ. ఒక కప్పు బాదంలో విటమిన్ ఇ 20మిల్లీగ్రాలు ఉంటుంది. ఇంకా వీటిలో మోనోశ్యాచురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్స్ అధికం.

12. గ్రేప్ ఫ్రూట్ :

12. గ్రేప్ ఫ్రూట్ :

గ్రేప్ ఫ్రూట్ లో బాడీ ఫ్యాట్ బర్న్ చేయడానికి సహాయపడుతుంది. ఇందులో్ పవర్ ఫుల్ ఫైటో కెమికల్స్ అధికంగా ఉన్నాయి.

English summary

Foods To Reduce Love Handles

Foods to reduce love handles are oats bran, sweet potatoes, shredded wheat, etc. Read to know about the best foods to burn love handles.
Story first published: Monday, July 10, 2017, 10:10 [IST]
Subscribe Newsletter