For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొట్ట చుట్టూ కొవ్వు కరిగించే మన వంటింటి నేస్తాలు: పసుపు+నిమ్మరసం.!

ప్రస్తుత జనాభాలో ఎక్కువ మంది ప్రజలు ఓవర్ వెయిట్, ఎక్సెస్ బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారు. బెల్లీ ఫ్యాట్ కు అనేక కారణాలున్నాయి, ఆల్కహాల్, స్మోకింగ్, ఆహారపు అలవాట్లు, వ్యాయామా లోపం వల్ల బెల్లీ ఫ్యాట్ ఇల

|

ప్రస్తుత జనాభాలో ఎక్కువ మంది ప్రజలు ఓవర్ వెయిట్, ఎక్సెస్ బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారు. బెల్లీ ఫ్యాట్ కు అనేక కారణాలున్నాయి, ఆల్కహాల్, స్మోకింగ్, ఆహారపు అలవాట్లు, వ్యాయామా లోపం వల్ల బెల్లీ ఫ్యాట్ ఇలాంటి పరిస్థితి వల్ల శరీరంలో బ్యాలెన్స్ తప్పుంది.

శరీరంలో అసమతుల్యత వల్ల ఫ్యాట్ సెల్స్ ను విచ్ఛిన్నం చేయడం మీద ప్రభావం చూపుతుంది. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరగించడానికి మన వంటగదిలో అందుబాటులో ఉండే అతి చౌకైన రెండు నేచురల్ రెమెడీస్ పొట్ట ఫ్యాట్ ను ఇట్టే కరిగించేస్తాయి. అవేంటంటే పసుపు మరియు నిమ్మరసం. ఈ రెండింటి కాంబినేషన్ తో చాలా ఎఫెక్టివ్ గా పొట్ట ఫ్యాట్ ను బర్న్ చేసుకోవచ్చు.

పసుపులో డైటరీ ఫైబర్, క్యాల్షియం, పొటాషియం, సోడియం, ఐరన్, జింక్ వంటివి మినిరల్స్ అధికంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్, నియాసిన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇలు పుష్కలంగా ఉన్నాయి. అంతే కాదు ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయోటిక్ గుణాలు, యాంటీఆక్సిడెంట్ యాంటీసెప్టిక్,, కుర్కుమిన్ అనే కంటెంట్ పొట్టకొవ్వును కరిగించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి.

పసుపులో ఉండే విటమిన్స్ మరియు మినిరల్స్ స్టొమక్ ఫ్యాట్ ను బర్న్ చేయడంలో ఎక్సలెంట్ గా పనిచేస్తాయి. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సెల్యులార్ డ్యామేజ్ కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ కు సహకరిస్తాయి. శరీరంలో మెటబాలిక్ రేటును పెంచుతాయి. ఆకలిని కంట్రోల్ చేస్తాయి.

పసుపులో ఉండే కుర్కుమిన్ అనే పవర్ ఫుల్ కంటెంట్ పొట్టచుట్టూ, కాలేయం చుట్టూ కొవ్వు పేరుకోకుండా నివారిస్తుంది . పసుపు లాగే మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ నిమ్మరసం .

నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. నిమ్మరసంలో ఉండే పెక్టిన్ ఒక నేచురల్ ఫైబర్. ఇది ఆకలిని తగ్గిస్తుంది. బరువు కంట్రోల్ చేసుకోవచ్చు. నిమ్మరసంలో ఉండే పీచు వంటి పదార్థం కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఇంకా నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇందులో ఉండే క్లెన్సింగ్ లక్షణాలు శరీరంలోని వ్యర్థాలను బయటకు నెట్టివేస్తుంది.

ఈ రెండి కాంబినేషన్ పదార్థాలు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను నివారిస్తుంది. మెటబాలిజం రేటును పెంచుతుంది. బెస్ట్ టమ్మీ ఫ్యాట్ బర్నర్ గా పనిచేస్తాయి. స్టొమక్ ఫ్యాట్ కరిగించడంలో పసుపు, నిమ్మరసం పనిచేస్తాయంటే ఒక్కింత్ ఆశ్చర్యం కలిగించవచ్చు. అదెలాగో మీరు తెలుసుకోవాలంటే పసుపు నిమ్మరసంతో తయారుచే చేసే రిసిపి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే...

1. పసుపు-నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీళ్ళు

1. పసుపు-నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీళ్ళు

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మపండు రసాన్ని, 1/4 టీస్పూన్ పసుపును మిక్స్ చేయాలి. రెండూ మిక్స్ చేసిన తర్వాత స్వీట్నెస్ కోరుకునే వారు కొద్దిగా తేనె మిక్స్ చేసి మరో మారు మూడు బాగా కలగలిసేలా మిక్స్ చేసి తాగాలి. గోరువెచ్చగా ఉండగానే తాగాలి.

ఉదయం అల్పాహారానికి ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ టర్మరిక్ లెమన్ వాటర్ ను రోజులో రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కొన్ని వారాల పాటు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

2. పసుపు లెమన్ గోల్డెన్ పేస్ట్

2. పసుపు లెమన్ గోల్డెన్ పేస్ట్

ఒక నిమ్మ పండులోని నిమ్మరసంను ఒక చిన్న కప్పులోనికి తీసుకుని అందులో అరటీస్పూన్ పసుపు వేసి మిక్స్ చేయాలి. అందులో 1/4టీస్పూన్ బ్లాక్ పెప్పర్ మరియు 1/4 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేయాలి. ఈ రెండూ పదార్థాలు బాగా మిక్స్ అయ్యే పేస్ట్ లా తయారయ్యే వరకూ మిక్స్ చేయాలి.

నిమ్మరసం, బ్లాక్ పెప్పర్, ఆలివ్ ఆయిల్ ఈ మూడింటి కాంబినేసన్ ఫ్యాట్ ను త్వరగా బర్న్ చేసి కుర్కుమిన్ లక్షణాలను పెంచి వేగంగా పొట్ట కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని 1లేదా 2 టీస్పూన్లు తీసుకుని, రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది బెస్ట్ బెల్లీ ఫ్యాట్ బర్నర్ రెమెడీ.

ఈ హోం రెమెడీని మీల్స్ తర్వాత తీసుకోవడం మంచిది. కేవలం పసుపు మాత్రమే తీసుకోవడం వల్ల అసిడక్ రిఫ్లెక్షన్, అసిడిటికి కారణం అవుతుంది. అందుకనీ ఇలా మిక్స్ చేసి పరగడుపున తీసుకున్నా ఎలాంటి సమస్య ఉండదు.

3. పసుపు లెమన్ టీ

3. పసుపు లెమన్ టీ

మీడియం మంట మీద ఒక కప్పు పాలను బాగా వేడి చేయాలి. తర్వాత అందులో అరటీస్పూన్ నిమ్మరసం, అరటీస్పూన్ తేనె మిక్స్ చేయాలి. అలాగే వెనీలా ఎక్స్ ట్రాక్ట్ ను కూడా మిక్స్ చేయాలి. ఇది జోడించడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే అరటీస్పూన్ పసుపు కూడా మిక్స్ చేసి, తక్కువ మంట మీద వేడి చేయాలి. తర్వాత క్రిందికి దింపుకుని వడగట్టి గోరువెచ్చగా తాగాలి. ఈ టర్మరిక్, లెమన్ టీని రోజు ఒక వారం రోజులు తాగిచూండండి ఫలితం మీకే తెలుస్తుంది. ఇది ఔషధగుణాలు కలిగిన ఒక ఉత్తమమైన టీ. దీన్ని భోజనానికి ముందు లేదా భోజనం తర్వాత తీసుకోవచ్చు.

4. పసుపు, నిమ్మరసం మిక్స్ చేసిన సలాడ్స్

4. పసుపు, నిమ్మరసం మిక్స్ చేసిన సలాడ్స్

స్టొమక్ ఫ్యాట్ ను కరిగించుకోవాలంటే పసుపు, నిమ్మరసంను రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. ముఖ్యంగా సలాడ్స్ లో కూడా చేర్చుకోవచ్చు. వెజిటేబుల్ సలాడ్స్ కు ఒక స్పూన్ నిమ్మరసం, అరటీస్పూన్ నిమ్మరసం, అరటీస్పూన్ దాల్చిన చెక్క మిక్స్ చేసి తినాలి. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు బెల్లీ ఫ్యాట్ ను కరిగించడంలో అద్బుతంగా సహాయపడుతుంది.

ముందు జాగ్రత్త:

ముందు జాగ్రత్త:

గౌట్ పెయిన్, కిడ్నీ స్టోన్స్ లేదా గాల్ బ్లాడర్ స్టోన్స్ తో బాధపడే వారు ఈ రెమెడీని వాడకూడదు. సర్జరీ చేయించుకున్నవారు కూడా తీసుకోకూడదు. డాక్టర్ ను సంప్రదించి తీసుకోవచ్చు. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, ప్రెగ్నెంట్ మహిళలు కూడా ఈ హోం రెమెడీని ఫాలో అవ్వకపోవడం మంచిది.

English summary

Turmeric, Lemon Remedy For Quick Stomach Fat Reduction

Now, you may be wondering how to reduce belly fat using turmeric and lemon, isn't it? Well, try these simple and effective turmeric-lemon recipes to lose stomach fat faster.
Desktop Bottom Promotion