బరువు తగ్గటానికి గోధుమగడ్డి జ్యూస్ ఎలా ఉపయోగపడుతుంది; జ్యూస్ తయారీ తెలుసుకోండి!

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మీ ఇంటి దగ్గర పార్కుల్లో జూస్ అమ్ముకునే వాళ్ళు తమ దగ్గర గోధుమ గడ్డి,ఒక ట్రే, ఒక బ్లెండర్ పెట్టుకోని కూర్చోనుండడం మీరు చూసే ఉంటారు.ఒక వేళ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళుంటే, గోధుమ గడ్డి రసం తాగడం వలన కలిగే ప్రయోజనాల గురించి చెప్పేవారు.

గోధుమ గడ్డి రసం తాగడం వలన కలిగే అన్ని ప్రయోజనాలలో అత్యంత పెద్దది బరువు తగ్గటం. దానికి మీకు కావాల్సిందల్లా ప్రతీ ఉదయం ఒక గ్లాసు గోధుమ గడ్డి రసం.

recipes weight loss

గోధుమ గడ్డి క్లోరోఫిల్, ముఖ్యమైన విటమిన్లు -విటమిన్ ఏ, సి, ఈ, కాల్షియం,ఐరన్, మెగ్నీషియం,పొటాషియం మరియు అమైనో ఆమ్లాలు దొరికే ఉత్తమమైన పదార్థం.

మరోవైపు, గోధుమ గడ్డి గురించి ఉత్తమమైన విషయం ఏంటి అంటే అది బజారులో చాలా సులభంగా దొరుకుతుంది మరియు ఒక వేళ దానిని నాణ్యతగా తీసుకోవాలంటే ఒక కుండిలో ఎవరి ఇంట్లో అయిన పెంచుకోవచ్చు.

కనుక మీరు బరువు తగ్గడానికి కష్టపడుతుంటే, మీరు తప్పకుండా గోధుమ గడ్డి రసం తాగాల్సిందే.మొదట మీకు అది తాగడం కష్టం అనిపించచ్చు కానీ, మెల్లగా కొన్ని రోజుల్లో దాని రుచి మీకే నచ్చుతుంది.

అసలు గోధుమ గడ్డి రసం శరీర బరువు తగ్గించటానికి ఎలా సహాయపడుతుంది?

అసలు గోధుమ గడ్డి రసం శరీర బరువు తగ్గించటానికి ఎలా సహాయపడుతుంది?

ఉన్న అన్ని పోషక పదార్థాలలో , గోధుమ గడ్డిలో సెలీనియం, థైరాయిడ్ గ్రంధి యొక్క పనితీరులో ప్రధాన భాగం పోషిస్తుంది.మీ శరీర బరువు నిర్వహణకి సహకరించడంలో థైరాయిడ్ శరీరంలో ఉన్న అవయవాల్లో ప్రధాన శరీర భాగం.

అందుకే థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యంగా పనిచేయడానికి,ఒక గ్లాసు గోధుమ గడ్డి రసం సహాయ పడుతుంది.ఇది తిరిగి శరీర బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆకలిని తగ్గించుట:

ఆకలిని తగ్గించుట:

ఈ గోధుమగడ్డిలో అన్ని ప్రధాన పోషక పదార్థాలు ఉండటం వలన శరీరం అనవసరమైన ఆహారాన్ని కోరుకోదు. ముఖ్యంగా చాలా మందిలో బరువు పెరగడానికి కారణమైన చిరు తిండ్ల మీద కూడా కోరిక తగ్గిస్తుంది.

మీ శరీరంలో,అవసరమైన ఖనిజాలు లేక మంచి కొవ్వు పదార్థాలు అనబడే మెగ్నీషియం, ఐరన్ మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు లోపించినప్పుడు మీ శరీరం ఖనిజాలని వెతకడం మొదలుపెడుతుంది.

కనుక, మీరు ఈ గోధుమ గడ్డి రసం పరగడుపున పొద్దునే తాగినప్పుడు, ఇది మీకు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంచడమే కాకుండా, అధికంగా తిండి తినాలనే కోరికని తగ్గించి ఎక్కువ తినకుండా నివారిస్తుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

అంతే కాకుండా, మీకు గోధుమగడ్డి రసం తయారు చేసే ఉత్తమ పద్దతి తెలుసుకోవాలనుంటే, ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు:

కావాల్సిన పదార్థాలు:

1. కొంత గోధుమగడ్డి(4-5 అంగుళాల పొడుగు)

2. సగం గ్లాసు నీళ్ళు

3. కొన్ని చుక్కల నిమ్మరసం

గోధుమగడ్డి రసం తయారు చేసే విధానం:

గోధుమగడ్డి రసం తయారు చేసే విధానం:

గోధుమగడ్డి రసం తయారు చేసే విధానం:

కొంత గోధుమగడ్డి తీసుకోని,2-3 ముక్కలు గా కోయాలి

ఆ కోసిన గోధుమగడ్డి ని తీసుకోని బ్లెండర్లో వేయాలి.

ఒక అర కప్పు నీళ్ళు కూడా బ్లెండర్ లో పోయాలి.

గోధుమగడ్డిని మరియు నీళ్ళని బాగా కలపాలి.

రసాన్ని తీయాలి.

ఎవరికైతే దాని రుచి నచ్చలేదో,కొన్ని చుక్కల నిమ్మరసం వేసుకోని తాగచ్చు.

జాగ్రత్తలు:

గోధుమగడ్డి రసం ఎప్పుడూ, ఖాళీ పొట్ట మీదే తాగాలి. ఒకవేళ భోజనం చేశాక తాగితే వికారం వస్తుంది.

English summary

How Wheatgrass Juice Helps Lose Weight

Wheatgrass has plenty of health benefits. It is rich in chlorophyll, essential vitamins, minerals and amino acids. Drinking a glass of wheatgrass juice every day on an empty stomach helps one to lose weight effectively.