For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్క్ ప్లేస్ వద్ద ఈ పది మార్గాలను పాటించడం ద్వారా వెయిట్ ను తగ్గించుకోవచ్చు.

|

ఉద్యోగస్తులు ఆఫీస్ లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతారు. కాబట్టి, వెయిట్ లాస్ కోసం ప్రయత్నించే వారు అందుకు తగిన కేర్ ను వర్క్ ప్లేస్ లో తీసుకోవడం ద్వారా కూడా ఆశించిన ఫలితం పొందుతారు. డెస్క్ జాబ్స్ అనేవి చాలామటుకు 7 నుంచి 9 గంటల పనివేళలు కలిగి ఉంటాయి. ఆఫీస్ చైర్ లో గంటలకొద్దీ కూర్చుని కంప్యూటర్ వర్క్స్ కలిగిన జాబ్స్ లో కనీసం ఆహారాన్ని తీసుకునేందుకు కూడా సమయం చిక్కదు. అయితే, ఎక్కువసేపు కూర్చునే ఉండటం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రాణాపాయ స్థితికి చేరుకునే ప్రమాదం కలదు.

కొన్నిసార్లు, మీ జాబ్స్ అనేవి ఒత్తిడితో కూడుకున్నవి అయి ఉండటం వలన మీరు ఎక్కువగా తినడానికి ఆసక్తి కనబరిచే ఆస్కారం ఉంది. ఇందువలన, అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడతారు. అందువలన, మీరు వెయిట్ ను తగ్గించుకోవడానికి సరైన ప్రణాలికను సిద్ధం చేసుకోవాలి.

బ్రేక్ అనేది లేకుండా ఎక్కువసేపు డెస్క్ వద్దే సమయం గడిపితే మీ మెటబాలిజం మందగిస్తుంది. ఒబేసిటీ సమస్య తలెత్తుతుంది. అలాగే హార్ట్ డిసీస్ ల తో పాటు ఆర్తరైటిస్ వంటివి కూడా తలెత్తుతాయి.

అందువలన, మీ ఆఫీస్ లైఫ్ స్టైల్ ను కాస్తంత సవరించుకోవాలి. ఆఫీస్ లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు తీసుకురావడం ద్వారా ప్రాణాపాయ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.

ఆఫీస్ లో బరువును తగ్గించుకునేందుకు పాటించవలసిన చిట్కాలను ఇందులో పొందుబరిచాము.

1. తగినంత నీటిని తీసుకోండి:

1. తగినంత నీటిని తీసుకోండి:

ఆఫీస్ వేళలలో నీటిని తగినంత తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ సమస్యను అరికట్టవచ్చు. అలాగే, తలనొప్పిని కూడా అరికట్టవచ్చు. చిరు ఆకలి కూడా తగ్గుతుంది. దాంతో, అనవసరమైన స్నాకింగ్ ను నివారించవచ్చు. అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ ఎక్సర్సైజ్ ప్రకారం మహిళలు రోజుకు 2.7 లీటర్ల నీటిని తీసుకోవాలి. పురుషులు రోజుకు 2.8 లీటర్ల నీటిని తీసుకోవాలి. తాగునీరు శరీరానికి తగినంత ఎనర్జీని అందిస్తుంది.

2. చూయింగ్ గమ్:

2. చూయింగ్ గమ్:

వర్కింగ్ హవర్స్ లో చూయింగ్ గమ్ ని తీసుకోవడం వలన అలర్ట్ గా ఉంటారు. ఆందోళన తగ్గుతుంది. అలాగే ఒత్తిడి కూడా తగ్గుతుంది. సలైవరీ కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. తద్వారా ఫ్యాట్ సెల్స్ అనేవి బెల్లీ ఏరియాలో పేరుకుపోవడం జరగదు. అందువలన, మీ వెయిస్ట్ లైన్ పెరగదు. కాబట్టి చూయింగ్ గమ్ ని వర్క్ ప్లేస్ లో నమలడం ప్రారంభించండి మరి!

3. లంచ్ ని ఇంటినుంచే ప్యాక్ చేసుకోండి:

3. లంచ్ ని ఇంటినుంచే ప్యాక్ చేసుకోండి:

రోజూ లంచ్ హవర్స్ లో ఫాస్ట్ ఫుడ్స్ పై ఆధారపడడం తగ్గించండి. ఈ ఫుడ్స్ లో కేలరీలు అధికంగా లభిస్తాయి. ఇవి శరీర బరువును పెంచుతాయి. ఇవి మీలోని చురుకుదనాన్ని తగ్గిస్తాయి కూడా. కాబట్టి, పోషకాహారాన్ని ఇంటి నుంచే తెచ్చుకోవడం మంచిది.

4. గ్రీన్ టీ ని తాగండి:

4. గ్రీన్ టీ ని తాగండి:

ఉదయాన్నే ఆఫీస్ కు చేరుకోగానే ఒక కప్పుడు గ్రీన్ టీ ని తీసుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు ఇన్స్టెంట్ గా ఛార్జ్ అవుతారు. గ్రీన్ టీ ద్వారా కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అంతేనా, ఈ గ్రీన్ టీ వలన అధిక బరువు సమస్య కూడా తగ్గిపోతుంది. కాబట్టి గ్రీన్ టీ ని ప్రయత్నించండి మరి.

5. మెట్లను ఉపయోగించండి:

5. మెట్లను ఉపయోగించండి:

మెట్లను ఉపయోగించండి. ఎలివేటర్ వాడకాన్ని తగ్గించండి. లేదంటే బరువు తగ్గడం కష్టం. ఆఫీస్ లో మెట్లను ఉపయోగించడం ద్వారా ఎన్ని పౌండ్ల బరువును తగ్గుతారో తెలుసుకుని ఆశ్చర్యపోతారు. వాకింగ్ లో తగ్గించుకునే కేలరీల కంటే రెట్టింపు కేలరీలను మెట్లను ఉపయోగించడం ద్వారా తగ్గించుకుంటారు. కాబట్టి, ఇప్పటి నుంచే మెట్లను ఉపయోగించడం ప్రారంభించండి మరి.

6. డెస్క్ వద్ద నించోండి:

6. డెస్క్ వద్ద నించోండి:

ఒక అధ్యయనం ప్రకారం డెస్క్ వద్ద కూర్చునే కంటే నించోవడం వలన అదనపు కేలరీలు ఖర్చవుతాయి. కూర్చోవడం కంటే నించోవడం వలన గంటకు దాదాపు 50 కేలరీలు ఖర్చవుతాయి. అంతేకాక, బ్లడ్ షుగర్ లెవల్స్ మెరుగవుతాయి. కొర్ స్ట్రెంత్ పెరుగుతుంది. పోశ్చర్ తో పాటు మెంటల్ హెల్త్ పై సానుకూల ప్రభావం కనిపిస్తుంది.

7. మీల్స్ మధ్యలో సలాడ్స్ ని తీసుకోండి:

7. మీల్స్ మధ్యలో సలాడ్స్ ని తీసుకోండి:

లంచ్ టైం లో లేదా మీల్స్ మధ్యలో మీకు ఆకలి తీరేందుకు అనవసర ఫుడ్ క్రేవింగ్స్ ను అరికట్టేందుకు సలాడ్స్ ని తీసుకోవడం మంచిది. డెస్క్ జాబ్స్ వారు సలాడ్స్ కి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం మంచిది. చికెన్ మరియు ఎగ్స్ వంటి ప్రోటీన్స్ ను అలాగే అవొకాడో మరియు బీన్స్ వంటి ఫైబర్ ను సలాడ్స్ లో జోడించండి. ఎండబెట్టిన టమాటోలను అలాగే నట్స్ ను కూడా సలాడ్స్ లో టాపింగ్ గా వాడవచ్చు.

8. చియా సీడ్స్ ను దగ్గర ఉంచుకోండి:

8. చియా సీడ్స్ ను దగ్గర ఉంచుకోండి:

చియా సీడ్స్ బాక్స్ ని దగ్గరగా ఉంచుకోవడం వలన వర్క్ చేస్తున్నప్పుడు కూడా శరీరానికి కావలసినంత పోషకాలను అందించవచ్చు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చియా సీడ్స్ లో పుష్కలంగా లభిస్తాయి. అలాగే, ఇందులో, ఫైబర్, ప్రోటీన్ మరియు కేల్షియం కూడా సమృద్ధిగా లభిస్తుంది. శరీరం వీటిని సులభంగా గ్రహిస్తుంది. అందువలన, మీకు కడుపు నిండినట్లు అనిపిస్తుంది.

9. ప్రతి గంటకి కనీసం రెండు నిమిషాల నడకకు ప్రాధాన్యమివ్వండి:

9. ప్రతి గంటకి కనీసం రెండు నిమిషాల నడకకు ప్రాధాన్యమివ్వండి:

డెస్క్ జాబ్ లో ఉన్నా కూడా ప్రతి గంటకు రెండు నిమిషాల పాటు నడవడం మరచిపోకండి. 20 సెకండ్ల నడకతో ముగించకండి. ఆఫీస్ లో కొలీగ్స్ తో కాసేపు మాట్లాడుతూ నడక సాగించండి. క్లినికల్ జర్నల్ ఆఫ్ అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ ప్రకారం ప్రతి గంటకు రెండు నిముషాలు నడవడం వలన ఎక్కువసేపు కూర్చోవడం వలన కలిగే దుష్ప్రయోజనాలను ఎక్కువ శాతం అరికట్టవచ్చు.

10. హెల్తీ స్నాక్స్ ని దగ్గర ఉంచుకోండి:

10. హెల్తీ స్నాక్స్ ని దగ్గర ఉంచుకోండి:

ఆకలి వేసినప్పుడు హెల్తీ స్నాక్స్ ను తీసుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలి. ఫ్రైడ్ ఐటమ్స్ ని అవాయిడ్ చేయాలి. హెల్తీ స్నాక్స్ ను తీసుకోవడం వలన బరువు తగ్గుతారు. హోల్ గ్రైన్ క్రాకర్స్, రోస్టెడ్ చిక్ పీస్, పీనట్ బటర్, ఆపిల్స్, బనానాస్, స్లైస్డ్ కేరట్స్ మరియు కుకుంబర్స్ వలన శరీరానికి తగినంత పోషకాలు లభిస్తాయి. అధిక బరువు సమస్య వేధించదు.

English summary

10 Best Ways To Lose Weight At Work

Sitting at a desk at work for a longer period of time without any breaks could slow down metabolism, increase obesity, cause heart diseases, arthritis and other diseases. The best ways to lose weight at a workplace are to drink enough water, opt for healthy snacks, salads, chia seeds, take the stairs and pack your lunch from home.
Story first published:Saturday, February 24, 2018, 16:39 [IST]
Desktop Bottom Promotion