For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ శరీర బరువును తగ్గించుకోవడానికి ఈ 10 రకాల ఆహారాలను తినడం మానేయండి !

మీ శరీర బరువును తగ్గించుకోవడానికి ఈ 10 రకాల ఆహారాలను తినడం మానేయండి !

|

శరీరంలో ఉన్న అదనపు బరువును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలను చేయడం ద్వారా మీకు చాలా ఎక్కువ సమయం పడుతుంది, అవునా ? అయినప్పటికీ, ఆహారాన్ని తగ్గించడం, వ్యాయామాలను చేయడం వల్ల కూడా మీ శరీరంలో ఉన్న అదనపు కొవ్వు - శరీరాన్ని విడిచి పెట్టడానికి నిరాకరిస్తోంది. అలా ఎక్కడ తప్పు జరిగిందో అని మీరు ఆశ్చర్యపోతుంటారు. అయితే కొన్ని సార్లు, మీరు తీసుకొనే కొన్ని ఆహార ఉత్పత్తుల వల్ల సమస్య కావచ్చు.

ఈ రకమైన ఆహార పదార్థాలు ఆకలి, హార్మోన్లు, క్యాలరీల విచ్ఛిన్నం వంటి వాటిపై భిన్నమైన ప్రభావాలను కలిగి ఉంటాయి. ఈ రకమైన ఆహార ఉత్పత్తులు మీ శరీరానికి సరైన పోషకాలను అందించకపోవడం వల్ల మీరు ఈ అధ్వానమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

10 Foods To Stop Eating To Lose Weight

మీరు శరీర బరువును తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, ఈ క్రింద తెలిపిన ఆహార ఉత్పత్తులను వాడటం మానివేయండి. అంతేకాకుండా, మీరు ఇలాంటి ఆహారపదార్థాలను తరచూ తినడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులను పొందుతారు.

ఇలాంటి ఆహారాలను తినడం వల్ల, పెద్దగా ఇబ్బందులేవీ రావని చాలామంది భావిస్తారు. కానీ బరువు తగ్గాలని కోరుకునే వారి లక్ష్యాలను మాత్రం చాలా దూరం చేస్తుంది.

మీ బరువును తగ్గించుకోవడం కోసం మానేయాల్సిన ఆహారాలు జాబితాను ఇక్కడ సిద్ధం చేశాము.

1. MSG గల ఆహారాలు :

1. MSG గల ఆహారాలు :

బాగా ఫ్రై చేసిన చికెన్, తయారుగా ఉన్న ఆహార పదార్థాలు, ప్రాసెస్ చేయబడిన మాంసం, నూడుల్స్, అనేక ఇతర ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటిలో వాడబడే "మోనోసొడియం గ్లుటామాట్" (MSG) అనేది చాలా వ్యసనపరమైన రుచిని పెంచుతుంది. MSG కలిగిన ఆహార పదార్ధాల వినియోగం బరువు పెరుగుటకు కారణం కావచ్చు. MSG ను కలిగి ఉన్న ఆహారాలలో తరచూగా ఉపయోగించే 70 మంది పురుషులు & స్త్రీలను, MSG వాడని వ్యక్తులతో పోలిస్తే 3 రెట్ల అధిక బరువును కలిగి ఉండవచ్చని పరిశోధకులు కనుగొన్నారు.

2. కృత్రిమమైన తీపిరుచులు :

2. కృత్రిమమైన తీపిరుచులు :

కృత్రిమమైన తీపిరుచులు శరీరంలో ప్రతికూల ప్రభావాలను సృష్టిస్తాయి. సుక్రోలస్, సాచరిన్ (లేదా) అస్పర్టమి వంటి కృత్రిమ తీపిరుచులను కలిగి ఉన్న వ్యక్తులు 2వ రకం డయాబెటిస్, ఊబకాయం & శరీరంలో గ్లూకోస్ నిల్వల అసంబద్ధమైన వృద్ధిని కలిగి ఉంటారు. ఈ కృత్రిమ తీపిరుచులకు బదులు తేనె (లేదా) మొలాసిస్ వంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిన పదార్థాలను ఉపయోగించడం వల్ల, మీ శరీర బరువును కోల్పోయేలా చేసేందుకు సహాయపడుతుంది.

3. పిజ్జా :

3. పిజ్జా :

పిజ్జా చాలా పాపులర్ అయిన ఫాస్ట్ ఫుడ్ & ఇది చాలా అనారోగ్యకరమైనదని భావిస్తారు. పిజ్జాలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి, అలాగే బరువు పెరుగుటకు ఉపకరించే శుద్ధి చేసిన పిండిని & ప్రాసెస్ చేయబడిన మాంసము వంటి అనారోగ్యకరమైన పదార్థాలను కలిగి ఉంటాయి. మీరు ఒక పిజ్జాని తిని ఆస్వాదించాలనుకుంటే, ఆరోగ్యకరమైన పదార్థాలను ఉపయోగించి ఇంట్లో తయారు చేసిన దానిని ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన పిజ్జాలను తయారు చేసే పిజ్జా సెంటర్ల కోసం వెతకండి.

4. ఫ్రెంచ్ ఫ్రైస్ & పొటాటో చిప్స్ :

4. ఫ్రెంచ్ ఫ్రైస్ & పొటాటో చిప్స్ :

ఫ్రెంచ్ ఫ్రైస్ & పొటాటో చిప్స్ కొవ్వును కలిగి ఉండే అనారోగ్యకరమైన పదార్ధాలు. వీటిలో బరువును పెంచే కేలరీలను చాలా ఎక్కువగా కలిగి ఉంటాయి. పొటాటో చిప్స్ ఇతర ఆహార పదార్థాల కంటే ఎక్కువ బరువును కలుగజేస్తాయని ఒక అధ్యయనంలో కనుగొనబడింది. కాల్చిన (లేదా) బాగా వేయించిన బంగాళాదుంపలలో క్యాన్సర్-కారణమయ్యే యాక్రిలామైడ్లు అని పిలవబడే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. అందువల్ల మీరు వీటికి దూరంగా ఉండటమే చాలా మంచిది.

5. షుగర్ను కలిగి ఉన్న డ్రింక్స్ :

5. షుగర్ను కలిగి ఉన్న డ్రింక్స్ :

సోడాస్ వంటి షుగర్ను కలిగిన డ్రింక్స్ ఈ భూమి మీదనే అనారోగ్యకరమైన వాటిలో ఒకటి. అవి బరువును పెంచటంలో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉంటాయి & వీటిని అధిక పరిమాణంలో వినియోగించినప్పుడు ప్రతికూలమైన ఆరోగ్య ప్రభావాలను కలిగి ఉంటాయి. షుగర్ డ్రింక్స్లో గల కేలరీలు మీకు పూర్తి అనుభూతిని కలుగచేయలేవు & మీరు వీటిని సాధారణంగా తీసుకోవడం వల్ల శరీరానికి అధిక కేలరీలను జోడిస్తుంది. అంతేకాకుండా మధుమేహంతో బాధపడేవారికి, ఈ పానీయాలు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచి కాదు.

6. వైట్ బ్రెడ్ :

6. వైట్ బ్రెడ్ :

వైట్ బ్రెడ్ చాలా శుద్ధి చేయబడి, చక్కెరను అధికంగా కలిగి ఉండే పదార్ధము. ఇది అధికమైన గ్లైసెమిక్ను కలిగి ఉంది & అలాగే మీ రక్తంలో చక్కెర స్థాయిలను స్పైక్ చేయవచ్చు. అదృష్టవశాత్తూ, వైట్ బ్రెడ్కి గోధుమ రొట్టె వంటి అనేక ఇతర రకాల ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కొన్ని ఇతర ఛాయస్లు కార్న్బ్రెడ్ & బాదం పిండి బ్రెడ్లు ఉన్నాయి. మీరు వైట్ బ్రెడ్కు బదులుగా ధాన్యపు రొట్టెలను తినవచ్చు.

7. కాండీ బార్స్ :

7. కాండీ బార్స్ :

కాండీ బార్లు చాలా అనారోగ్యకరమైనవి, అవి అదనపు చక్కెరతో పూర్తిగా నిండి ఉంటాయి. వీటిలో కేలరీలు & పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. చాక్లెట్లో 200-300 గ్యాలరీలు సగటు పరిమాణాన్ని కలిగి ఉంటాయి. మీరు చిరుతిండి కావాలన్న కోరికను గాని కలిగి ఉంటే పండ్లను, పండ్ల రసాలను (లేదా) నట్స్ను తినండి.

8. సోడా :

8. సోడా :

ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే వారు సోడా వినియోగాన్ని మానివేస్తారు కానీ, కొందరు తాగడానికి ఇష్టపడతారు. ఒక్క బాటిల్ సోడాను తల తమకేమీ కాదని చాలామంది నమ్ముతారు. అయితే ఈ సోడాలు మీ శరీర బరువును తగ్గించే లక్ష్యాలను అణచివేయడమే కాకుండా రక్తపోటును పెంచడం, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడం, మధుమేహం, పిల్లల్లో ఊబకాయం, డీహైడ్రేషన్, శరీరంలో అదనపు కొవ్వు వంటి అనేక ఆరోగ్య పరిస్థితులకు కారణం కావచ్చు.

9. పాస్ట్రీస్ & కుకీలు :

9. పాస్ట్రీస్ & కుకీలు :

పాస్ట్రీస్ & కుకీలు షుగర్ & రిఫైండ్ చేసిన పిండి వంటి అనారోగ్యకరమైన పదార్థాలతో పూర్తిగా నిండి ఉంటాయి. అవి మీ ఆరోగ్యానికి చాలా హానికరమైనవి & బరువును పెంచుటకు దారితీసే కృత్రిమ ట్రాన్స్ ఫ్యాట్స్ కలిగి ఉండవచ్చు. పాస్ట్రీస్, కుకీలు & కేకులు వంటివి అధిక కాలరీలను, తక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. మీరు తీపి తినాలన్న కోరికను గానీ కలిగి ఉంటే, డార్క్ చాక్లెట్ను తినండి.

10. క్యాలరీలు ఎక్కువగా ఉండే కాఫీలు :

10. క్యాలరీలు ఎక్కువగా ఉండే కాఫీలు :

కాఫీ కెఫిన్ను కలిగి ఉంది, అలాగే ఇది మీ జీవక్రియను పెంచుతుంది & స్వల్పకాలంలోనే కొవ్వును తగ్గిస్తుంది. అయినప్పటికీ, కృత్రిమమైన క్రీమ్లు, చక్కెర వంటి అనారోగ్యకరమైన పదార్ధాలను కలిగి ఉండటం వల్ల సానుకూలమైన ప్రభావాలను కలిగి ఉండవు. క్యాలరీలు ఎక్కువగా ఉండే కాఫీలు, ఖాళీ కేలరీలతో ఉంటాయి. మీరు కాఫీ కావాలనుకుంటే, బరువు కోల్పోవటానికి ప్రయత్నించినప్పుడు బ్లాక్ కాఫీని తాగటం చాలా ఉత్తమం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కెఫిన్ వినియోగం రోజుకు సుమారు 400 mg మాత్రమే ఉండాలి.

English summary

10 Foods To Stop Eating To Lose Weight

Food products can have vastly different effects on hunger, hormones and how many calories you burn. Some food products that you get today are worse because they don't provide nutrients to the body. The foods to stop eating to lose weight are high-calorie coffee drinks, artificial sweeteners, pizza, French fries, potato chips, MSG foods, etc..
Story first published:Tuesday, April 10, 2018, 14:37 [IST]
Desktop Bottom Promotion