For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గడానికి మిరియాలు, అలాగే వీటివల్ల మరికొన్ని అద్బుత ఆరోగ్య ప్రయోజనాలు

మసాలా వంటకాలలో చిటికెడు మిరియాల పొడి వేస్తే రుచి మరింత పెరుగుతుంది, కాదంటారా? లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలకు పేరుగాంచిన ఈ మిరియాలు సుగంధ ద్రవ్యాలలో రాజు లాంటిది. మిరియాలలో మెగ్నీషియం, కాపర్, మాంగనీస్

By Lakshmi Bai Praharaju
|
Health Benefits With Black Pepper: మిరియాల తో అద్బుత ఆరోగ్య ప్రయోజనాలు !

మసాలా వంటకాలలో చిటికెడు మిరియాల పొడి వేస్తే రుచి మరింత పెరుగుతుంది, కాదంటారా? లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలకు పేరుగాంచిన ఈ మిరియాలు సుగంధ ద్రవ్యాలలో రాజు లాంటిది. మిరియాలలో మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి మినరల్స్ అధికంగా ఉన్నాయి.

మిరియాలలో పీచు పదార్ధం, తక్కువ మోతాదు ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు కూడా ఉన్నాయి. మిరియాలు అతిసారం, మలబద్ధకాన్ని నిరోధించి, జీర్ణక్రియకు దోహాద పడుతుంది. మిరియాలు ప్రేగుల్లో వాయువు ఏర్పడకుండా నిరోధించి, చెమటను పెంపొందించి, మూత్రవిసర్జనను ప్రోత్సహిస్తుంది.

health benefits of black pepper for weight loss

మిరియాలలో యాంటీ-బాక్టీరియా, యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఉండడం వల్ల ఇవి అంటువ్యాధులు రాకుండా ఉండడానికి సహాయపడి, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని సరిచేస్తుంది.

<strong>మిరియాలలో ఘాటైన రుచే కాదు.. గమ్మత్తైన హెల్త్ బెన్పిట్స్ కూడా</strong>మిరియాలలో ఘాటైన రుచే కాదు.. గమ్మత్తైన హెల్త్ బెన్పిట్స్ కూడా

ఆయుర్వేదం ప్రకారం, మిరియాలు చెవి నొప్పి, పుళ్ళను కూడా నివారించడానికి సహాయపడుతుంది.

ఈ ప్రయోజనాలను అందించడమే కాకుండా, మిరియాలు స్దూలకయంపై పోరాడడానికి ఉపయోగపడుతుంది, బరువు తగ్గించే ఆహార పదార్ధాలలో సువాసన ఏజెంట్ గా ఉపయోగించుకోవచ్చు. బరువు తగ్గడానికి మిరియాలలో ఉన్న 10 ఆహార ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

1.మిరియాలలో శక్తివంతమైన మిశ్రమాలు ఉన్నాయి

1.మిరియాలలో శక్తివంతమైన మిశ్రమాలు ఉన్నాయి

మిరియాలు పైపెరిన్ అనే శక్తివంతమైన మిశ్రమం ఉంది, ఇది మిరియాలకు మంచి రుచిని ఇస్తుంది. ఈ మిశ్రమం నూతన కొవ్వు కణాలు ఏర్పడడంలో కలుగచేసుకుని, అడిపోజేనేసిస్ అనే ప్రతిచర్య మీ నడుముని తగ్గించి, కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.

2.మిరియాలు ఫైటో న్యూట్రిఎంట్స్ ని కలిగి ఉంటాయి

2.మిరియాలు ఫైటో న్యూట్రిఎంట్స్ ని కలిగి ఉంటాయి

ఆహార సరైన సమీకరణలో మిరియాలు చికిత్సగా పనిచేస్తాయి. అంతేకాకుండా, మిరియాల బయటి పొర కొవ్వు కణాల విచ్చిన్నతను ప్రేరేపించే శక్తివంతమైన ఫైటో న్యూట్రిఎంట్లను కలిగి ఉంటుంది.

3.మిరియపు గింజలు, తమలపాకులు

3.మిరియపు గింజలు, తమలపాకులు

బరువు తగ్గడానికి, కొన్ని మిరియపు గింజలకు రెండు తమలపాకులను జోడించి రోజుకు ఒకసారి నమలండి. మిరియాలు, తమలపాకులు రెండూ మీ శరీరం నుండి కొవ్వును తగ్గించి, బరువును తగ్గించడానికి సహాయపడతాయి కాబట్టి ఈ పద్ధతి బరువు తగ్గే విషయంలో శక్తివంతంగా పనిచేస్తుంది.

<strong>బ్లాక్ పెప్పర్లో దాగి ఉన్న ఔషధగుణాలు మీకు తెలుసా...</strong>బ్లాక్ పెప్పర్లో దాగి ఉన్న ఔషధగుణాలు మీకు తెలుసా...

4.మిరియాలు తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి

4.మిరియాలు తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి

మీరు క్యాలరీలను నియంత్రించే కొవ్వు తగ్గే ఆహరం తీసుకుంటుంటే, మీ ఆహారంలో మిరియాలను జతచేయండి. ఒక టీస్పూన్ మిరియాలలో కేవలం 8 క్యాలరీలు మాత్రమే ఉంటాయి, ఇది సాస్, మరినేడ్స్ కోసం తక్కువ క్యాలరీలకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.

5.మిరియాలు కొత్త కొవ్వు కణాల ఏర్పాటును నిరోధిస్తుంది

5.మిరియాలు కొత్త కొవ్వు కణాల ఏర్పాటును నిరోధిస్తుంది

ప్లాస్మా, లిపిడ్ ప్రోఫైల్స్ లో కొవ్వు ఆమ్లాలు, ట్రై గ్లిజరైడ్స్, ఫాస్ఫోలిపిడ్స్, కొవ్వు స్థాయిలను తగ్గించడానికి మిరియాలు పేరుగాంచాయి. ఇది మంచి కొలెస్ట్రాల్ గాఢతను పెంచుతుంది, శరీరంలో కొత్త కొవ్వు కణాలు ఏర్పడకుండా ఆపుతుంది.

6.మిరియాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి

6.మిరియాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి

కొవ్వు ఆమ్ల జీవక్రియ ద్వారా ప్రధానంగా లిపిడ్ జీవక్రియను, వాటి పనులను ప్రభావితం చేయడానికి మిరియాలు కనుగొనబడ్డాయి. మిరియాలు అనేవి ధర్మోజేనిక్ ఆహరం. ఇది జీవక్రియను వేగవంతం చేయడానికి సహాయపడి, తద్వారా శరీర జీవక్రియ రేటుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.

7.మిరియం ఊబకాయ ప్రేరిత ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధిస్తుంది

7.మిరియం ఊబకాయ ప్రేరిత ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధిస్తుంది

అధిక కొవ్వు కలిగిన ఆహరం తీసుకునే ఊబకాయులు ఆక్సీకరణ ఒత్తిడి ప్రేరేపించడంలో ప్రధాన ప్రమాద కారకంగా ఉంది. ఆక్సీకరణ వత్తిడి వల్ల క్యాన్సర్, పార్కిన్సన్స్ వ్యాధి, అల్జీమర్ వ్యాధులు వస్తాయి. మిరియాలు అధిక కొవ్వు ఆహార ప్రేరిత ఆక్సీకరణ ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది.

8.మిరియాలు శరీరంలో క్యాలరీలను కరిగిస్తుంది

8.మిరియాలు శరీరంలో క్యాలరీలను కరిగిస్తుంది

మీరు ఇతర సుగంధ ద్రవ్యాలతో మిరియాలు కలిపిన ఏదైనా ఆహరం తిన్నపుడు క్యాలరీలు కరగడం గమనించవచ్చు. ఆహరం తిన్న కొన్ని గంటలలోనే తీసుకున్న అదనపు క్యాలరీలను మిరియాలు కరిగిస్తాయి.

9.మిరియాలు వేగంగా పోషకాలను గ్రహిస్తాయి

9.మిరియాలు వేగంగా పోషకాలను గ్రహిస్తాయి

మీరు బరువు తగ్గే ఆహరం తీసుకునేటపుడు, అందులో మిరియాలు జతచేయండి. దానికి కారణం ఏమిటంటే, మిరియాలు ఇతర ఆహారపదార్ధాల నుండి ఎక్కువ మొత్తంలో పోషకాలు అరిగే సామర్ధ్యాన్ని కలిగి ఉండి శరీరానికి ప్రయోజనాన్ని కలిగిస్తుంది, అందువలన బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

 10.మిరియాలు అవయవాల లోపల కొవ్వును కరిగిస్తుంది

10.మిరియాలు అవయవాల లోపల కొవ్వును కరిగిస్తుంది

అవయవాల లోపల ఉండే కొవ్వు వల్ల అధిక రక్తపోటు, టైప్ 2 మధుమేహం, డిమెంషియా, కొన్ని రకాల క్యాన్సర్ వంటి వివిధ జబ్బులకు దారితీస్తుంది. మిరియాల లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ-మైక్రోబయాల్ లక్షణాలు మీ పొట్టలోని అవయవాల లోపల ఉన్న కొవ్వుపై పోరాడతాయి.

ఈ ఆర్టికిల్ ని షేర్ చేయండి!

ఈ ఆర్టికిల్ చదవడం మీకు ఇష్టమైతే, మీకు ఇష్టమైన వారితో దీన్ని పంచుకోండి.

English summary

10 Health Benefits Of Black Pepper For Weight Loss

Black pepper is the king of spices known to offer innumerable health benefits. Black pepper is rich in minerals like magnesium, copper, manganese, calcium, phosphorous, iron, etc. Apart from the benefits that it offers, black pepper has potential benefit of fighting obesity and can be used as a source of flavour in a weight-loss diet.
Desktop Bottom Promotion