For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ డైట్ లో ఈ 11 మార్పులూ మీ వెయిట్ లాస్ గోల్ కి తోడ్పడతాయి

|

వెయిట్ లాస్ కై కృషి ఎంతో అవసరం. నిజానికి అవాంఛిత కొవ్వును త్వరితంగా కరిగించేందుకు అనేక డైట్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ డైట్ ప్లాన్స్ వలన మీకు ఆకలి తీరకపోవచ్చు. సంతృప్తిగా ఆహారాన్ని తీసుకున్న భావన కలగదు. కాబట్టి, ఈ ఆర్టికల్ లో డైట్ లో తీసుకోవలసిన కొన్ని మార్పులూ చేర్పులూ గురించి ప్రస్తావించాము. ఇవి వెయిట్ లాస్ కై తోడ్పడతాయి.

ఒక పౌండ్ కొవ్వు అనేది 3,500 కేలరీలతో సమానమని మీకు తెలుసా? రోజుకు దాదాపు 500 కేలరీలను ఆహారం ద్వారా అలాగే ఎక్సర్సైజ్ ద్వారా తగ్గిస్తే వారంలో మీరు ఒక పౌండ్ తగ్గడానికి అవకాశం ఉంది.

Simple Changes In Diet To Lose Weight

అయితే, వెయిట్ ని తగ్గాలనుకున్న వారికి మోటివేషన్ తో పాటు డెడికేషన్ అవసరం. వారు వెయిట్ లాస్ కై హార్డ్ వర్క్ కూడా చేయాలి. కానీ, ఇక్కడ ప్రస్తావించబడిన ఈ సింపుల్ ట్రిక్స్ అనేవి తక్కువ శ్రమతోనే వెయిట్ లాస్ కై తోడ్పడతాయి.

మీ లైఫ్ స్టయిల్ లో మార్పులు అలాగే వెయిట్ లాస్ కై మీరు ఎంచుకునే మార్గాలూ వెయిట్ లాస్ గోల్ ని అఛీవ్ చేసేందుకు మీకు తోడ్పడతాయి. మీరు ఎన్ని కేలరీలు తీసుకుంటున్నారు అలాగే ఎన్ని కేలరీలు కరిగిస్తున్నారు అన్నది ఇందులో ముఖ్యమైన విషయం.

డైట్ లోని చిన్న చిన్న మార్పుల ద్వారా వెయిట్ లాస్ గోల్ ని అఛీవ్ చేయడం గురించి తెలుసుకోవడానికై ఈ ఆర్టికల్ ను చదవండి.

1. లిక్విడ్ కేలరీస్ ను తెలివిగా ఎంచుకోండి

స్వీటెన్డ్ డ్రింక్స్ మరియు బెవెరేజెస్ అనేవి కేలరీలను అమాంతం పెంచుతాయి. అయినా, మీకు సాలిడ్ ఫుడ్స్ ని తీసుకోవడం ద్వారా కలిగే సంతృప్తి కలగదు. ఆకలి తీరదు. కాబట్టి, స్వీటెన్డ్ డ్రింక్స్ ను తీసుకోవడం అవాయిడ్ చేయండి. వాటికి బదులుగా నీళ్లు మరియు సిట్రస్ ఫ్రూట్స్ కలగలిపిన మిశ్రమాన్ని లేదా ప్లెయిన్ వాటర్ ని ప్రిఫర్ చేయండి. అలాగే హోమ్ మేడ్ ఫ్రూట్ జ్యూస్ ని చిన్న చిన్న పోర్షన్స్ గా తీసుకోండి. మీల్స్ మధ్యలో ఆకలిగా అనిపిస్తే ఒక గ్లాసుడు లో కేలరీ అలాగే పోషక విలువలు పుష్కలంగా కలిగిన వెజిటబుల్ జ్యూస్ ను ప్రిఫర్ చేయండి. ఆల్కహాల్ ద్వారా కూడా కేలరీస్ ఎక్కువగా పేరుకుంటాయి. అందువలన, ఆల్కహాల్ ని అవాయిడ్ చేస్తే కేలరీల ఇంటేక్ ను అదుపులో ఉంచుకోవచ్చు.

2. తాజా పదార్థాలను ఎక్కువగా తీసుకోండి:

ఫ్యాట్ మరియు కేలరీలు ఎక్కువగా కలిగిన పదార్థాలను తీసుకోవడం కంటే లో కేలరీ కలిగిన ఫ్రూట్స్ ను అలాగే వెజిటబుల్స్ ను ఎక్కువగా తీసుకోవడమనేది ఉత్తమం. హెల్త్ ఎక్స్పర్ట్స్ సూచనల ప్రకారం లంచ్ లేదా డిన్నర్ ని విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అలాగే ఫైటో న్యూట్రియెంట్స్ కలిగిన వెజిటబుల్ సలాడ్ లేదా సూప్స్ ని తీసుకోవడంతో ప్రారంభించడం ఆరోగ్యానికి మంచిది. ఇవి మీకు కడుపు నిండిన భావనను కలిగించి ఆకలిని తగ్గిస్తాయి.

3. మీ ఆకలిని తెలుసుకోండి:

డైట్ లో చేసుకునే చిన్న మార్పు మీ వెయిట్ పై ప్రభావం ఎక్కువగా చూపుతుంది. మీ ఆకలిపై అవగాహనను ఏర్పరచుకోవడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. మీరు నిదానంగా ఆహారాన్ని తీసుకోవాలి. తీసుకునే ఆహారంపై దృష్టి పెట్టాలి. ప్రతి బైట్ ను ఆస్వాదించాలి. ఎందుకంటే ఈ విధంగా మీరు ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తున్నారో మీకు అవగాహన వస్తుంది. లేదంటే, మీరు శరీరానికి కావలసిన దానికంటే ఎక్కువ కేలరీలను తీసుకునే ప్రమాదం ఉంది.

4. ప్రతి రోజూ సలాడ్స్ ను తీసుకోవడం

ఆరోగ్యకరమైన సలాడ్ డైట్ తో బరువు తగ్గడమేలా? మీ లంచ్ టైమ్ మీల్ ను హెల్తీ గ్రీన్స్ తో లోడై ఉన్న హెవీ మరియు లార్జ్ వెజిటబుల్ సలాడ్స్ తో రీప్లేస్ చేసుకుంటే వెయిట్ లాస్ గోల్ ను మీరు రీచ్ అవగలుగుతారు. మీరు వెజిటేరియన్ అయితే మీ సలాడ్ లో నట్స్, అవొకాడోతో పాటు అన్ని రకాల కూరగాయలు అలాగే ఫైబర్ ఉండాలి. ఇవి మీ మీల్ కి రంగును అద్దుతాయి. మీరు నాన్ వెజిటేరియన్ ఐతే లీన్ ప్రోటీన్ ను మీ డైట్ లో భాగంగా చేసుకోవచ్చు.

5. నిమ్మను జోడించిన మూడు లీటర్ల నీటిని తీసుకోవాలి

నీళ్లను సమృద్ధిగా తీసుకోవడం వలన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చన్న విషయం తెలిసినదే. నీళ్ల ద్వారా పొందే లాభాన్ని ఇంకొక స్థాయి పెంచడానికి మీరు 3 లీటర్ల వేడినీటిలో నిమ్మ రసాన్ని జోడించి ప్రతి రోజూ తీసుకోవాలి. నిమ్మ మరియు వేడి నీటి కాంబినేషన్ అనేది అదనపు పౌండ్స్ ని కరిగించేందుకు తోడ్పడుతుంది. అంతేకాక, లెమన్ వాటర్ అనేది మీకు పొటాషియంతో పాటు విటమిన్ సి ని అందిస్తుంది. ఒక నిమ్మకాయ ద్వారా లభించే రసంలో 11 కేలరీలు, 48 మిల్లీగ్రాముల పొటాషియం మరియు 18 మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది.

6. రెడ్ మీట్ ను తీసుకునే మోతాదు తగ్గించాలి

మీ డైట్ లో రెడ్ మీట్ అనేది భాగమైతే, మీరు దీని మోతాదును తగ్గించుకోవాలి. రెడ్ మీట్ ని తీసుకోవడం తగ్గిస్తూ ఉంటే మీకు ఆహారం ద్వారా అందే కేలరీల సంఖ్య తగ్గుతూ వస్తుంది. తద్వారా, వేగవంతంగా బరువు తగ్గే అవకాశం ఉంది. రెడ్ మీట్ ని తీసుకోవాలని మీరనుకుంటే వారానికి ఒకటి లేదా రెండు సార్లకు దీన్ని పరిమితం చేయండి.

7. ఇన్స్టెంట్ ఫుడ్ గా ఆల్మండ్స్:

మీరు హడావిడిగా ఉన్నప్పుడు ఏ ఫుడ్ ను ప్రిఫర్ చేస్తారు? బర్గర్ లేదా శాండ్విచ్ కదా? అయితే, ప్రతిసారి వీటిపై ఆధారపడటం వలన మీ డైట్ ప్లాన్ దెబ్బతింటుంది. క్విక్ స్నాక్ గా మీరు రా నట్స్ ని పరిగణించడం మంచిది. ఆల్మండ్స్, జీడిపప్పు, పిస్తా వంటివి మీకు ఇన్స్టెంట్ స్నాక్ గా ఉపయోగపడతాయి. నట్స్ అనేవి బ్లడ్ షుగర్ లెవల్స్ ని స్టెబిలైజ్ చేస్తాయి. అధ్యయనాల ప్రకారం 22 బాదాం మరియు 15 జీడిపప్పులు డైట్ ప్లాన్ ప్రకారం క్రమ పద్దతిలో రోజు వారి సిఫార్సు చేయదగిన మోతాదులో తీసుకుంటే తక్కువ బరువు పెరుగుతారు అలాగే హంగర్ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి.

8. ప్రతి మీల్ లో ప్రోటీన్ ను భాగంగా చేసుకోండి

లీన్ ప్రోటీన్ ను ప్రతి మీల్ లేదా స్నాక్ లో భాగంగా చేసుకుంటే కడుపు నిండిన భావన ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది. లో ఫ్యాట్ యోగర్ట్, చిన్న పోర్షన్ నట్స్, ఎగ్స్, బీన్స్, లీన్ మీట్స్ మరియు పీనట్ బటర్ వంటివి ఆకలిని తీరుస్తాయి. హెల్త్ ఎక్స్పర్ట్స్ సూచనల ప్రకారం చిన్న చిన్న మీల్స్ ను తరచూ తీసుకుంటే అంటే ప్రతి మూడు లేదా నాలుగు గంటలకొకసారి తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ స్టేబుల్ గా ఉంటాయి అతిగా ఆహారాన్ని తీసుకోవడం తగ్గుతుంది.

9. హోల్ గ్రీన్స్ ను ఎంచుకోండి:

రిఫైండ్ గ్రైన్స్ కు బదులుగా బ్రౌన్ బ్రెడ్, హోల్ గ్రెయిన్ బ్రెడ్, పల్సస్ మరియు లెజ్యుమ్స్ వంటి హోల్ గ్రెయిన్స్ ను ప్రిఫర్ చేస్తే డైట్ ద్వారా మీకు తగినంత ఫైబర్ లభిస్తుంది. మీకు కడుపు నిండిన భావన త్వరగా కలుగుతుంది. హోల్ వీట్ బ్రెడ్ మరియు పాస్తా, హోల్ రై, క్రాకర్స్ కూడా హోల్ గ్రెయిన్ ఫుడ్స్ కోవలోకి వచ్చే ఇంకొన్ని పదార్థాలు.

10. ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ ని చేయండి:

చాలా మంది బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేయడం ద్వారా వెయిట్ లాస్ గోల్ ను అఛీవ్ చేయవచ్చన్న అభిప్రాయంలో ఉంటారు. ఈ అభిప్రాయం సరైనది కాదు. నిజానికి, బ్రేక్ ఫాస్ట్ ని తీసుకోవడం ద్వారా మీకు హంగర్ క్రేవింగ్స్ ఉండవు. మధ్యాహ్నం మాత్రమే మీకు ఆకలి వేస్తుంది. అప్పుడు వెయిట్ లాస్ ప్లాన్ కి తగినట్టుగా మీరు మీల్స్ ను తీసుకోవచ్చు. కాబట్టి, ఫ్రూట్స్ తో గార్నిషింగ్ చేయబడిన ఒక కప్పుడు హోల్ గ్రెయిన్ సెరల్ ని అలాగే లో ఫ్యాట్ డైరీని బ్రేక్ ఫాస్ట్ గా ప్రిఫర్ చేస్తే వెయిట్ లాస్ గోల్ ముందుకు సాగుతుంది.

11. ఫుడ్ పోర్షన్స్ సైజ్:

మీరు తీసుకునే ఫుడ్ పోర్షన్స్ సైజ్ ను పది నుంచి ఇరవై శాతం వరకు తగ్గిస్తే మీరు వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంది. మెజరింగ్ కప్స్ ని వాడేటప్పుడు పదార్థాలు ఏ మోతాదులో వాడతారో మీకు అవగాహన వస్తుంది. చిన్న చిన్న బౌల్స్ ని అలాగే కప్స్ ని మెజరింగ్ కోసం అందుబాటులో ఉంచుకోండి. ఈ విధంగా మీరు ఆహారాన్ని తగిన మోతాదులో తీసుకుంటారు.

English summary

11 Simple Changes In Diet To Lose Weight

Losing weight needs a lot of effort. Of course, there are plenty of fad diets that work to shed off that unwanted fat rapidly, but the downside of these diets is they leave you feeling hungry and deprived of food. So, today in this article, we will be discussing the simple changes to make in your diet to lose weight.
Story first published:Friday, June 22, 2018, 11:07 [IST]
Desktop Bottom Promotion