For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చామంతి టీ మీ ఆరోగ్యానికి మేలు చేసే 15 మార్గాలు

చామంతి టీ మీ ఆరోగ్యానికి మేలు చేసే 15 మార్గాలు

|

ప్రపంచంలో కొద్దిమందే మాజికల్ డ్రింక్ అయిన 'టీ’ని ఇష్టపడరు! చాలా రకాల రుచుల్ని,సువాసనల్నీ అందించే ఈ పానీయం సాధారణంగా మరిగించిన నీటిలో కమేలియా సినెన్సిస్ మొక్క ఆకులను వేయటం వలన తయారవుతుంది, ఈ టీని ప్రపంచవ్యాప్తంగా ఔషధ లేదా మామూలు విశ్రాంతి కోసం తాగుతారు.

అందరూ అనేట్లు-“టీ నిజంగానే జీవితానికి అమృతంలాంటిది!’ అవును, మనందరం అనుభవపూర్వకంగా తెలుసుకునే ఉంటాం, ఈ వాక్యం సరైనదే అని.

15 Ways How Chamomile Tea Benefits Your Health

రకరకాల టీలు ఉన్నాయి, బ్లాక్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ, ఊలాంగ్ టీ మొదలైనవి చాలా. టీలో మరో కేటగిరీ హెర్బల్ టీ. ఇది వివిధ రకాల మొక్కల సారం, దినుసులు లేదా మొక్కల భాగాలను వేడినీటిలో మరగబెట్టి,నానబెట్టి తయారయ్యే డికాక్షన్ తో చేసేది.

ఇవి మామూలు టీల వంటివి కాదు, మామూలు తేయాకు ఉండదు, కెఫీన్ కూడా. కానీ నిజమైన టీలలాగా, హెర్బల్ టీలను కూడా మీ మూడ్ ప్రకారం చల్లగా లేదా వెచ్చగా తాగవచ్చు!

ఈ ఆర్టికల్ లో, మనం ఒక హెర్బల్ టీ అయిన చామంతి పువ్వుల టీ గురించి, దాని లాభాల గురించి లోతుగా తెలుసుకుందాం.

చమోమిలె టీ అంటే ఏమిటి?

ఇది చామంతి పువ్వులను ఎండబెట్టి, వేడినీళ్ళతో కలిపి చేసే ఒక డికాక్షన్. చామంతి పువ్వులు తెలుపు,పసుపు రంగుల్లో డైసీ పువ్వుల్లానే ఉంటాయి.ఇవి డైసీ కుటుంబానికి చెందిన ఒక సువాసనభరిత యూరోపియన్ మొక్క, ముఖ్యంగా యూరోప్,ఆసియా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా ఖండాల్లో వేసవి కాలంలో కన్పిస్తాయి.

చామంతి టీ లాభాలు

1.చర్మ సమస్యలను నయం చేస్తుంది

1.చర్మ సమస్యలను నయం చేస్తుంది

చామంతి టీలోని వాపు వ్యతిరేక లక్షణాలు ఎండకి కమిలిపోవటం, గజ్జి, చర్మంపై మంట వంటి చర్మసమస్యలకి ఉపశమనం అందిస్తుంది. టీని తయారుచేసి, చల్లబర్చి సమస్య ఉన్నచోట నెమ్మదిగా,వత్తుగా పూయండి.

2.చర్మం రంగు మెరుగుపరుస్తుంది

2.చర్మం రంగు మెరుగుపరుస్తుంది

చర్మంపై ఉపయోగిస్తే చామంతి టీ తన అద్భుత ప్రభావాలను చక్కగా చూపిస్తుంది. అది మీ చర్మాన్ని శుభ్రపరిచి, సహజమైన బ్లీచ్ గా, మాయిశ్చరైజర్ గా పనిచేసి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.

3.మొటిమలు, మొటిమల మచ్చలను తొలగిస్తుంది

3.మొటిమలు, మొటిమల మచ్చలను తొలగిస్తుంది

చామంతి టీని మీ చర్మంపై రాయడం వలన మొటిమల మచ్చలను తగ్గిస్తుంది,ఇదేకాక, దానిలోని యాంటీసెప్టిక్, వాపు వ్యతిరేక లక్షణాల వలన కొత్తగా మొటిమలు రావడాన్ని నివారిస్తుంది.

4.వయస్సు మీరే లక్షణాలనుండి రక్షిస్తుంది

4.వయస్సు మీరే లక్షణాలనుండి రక్షిస్తుంది

చామంతి టీ ఉత్పత్తుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే డామేజ్ నుంచి రక్షిస్తాయి.ఇది కణాలు,కణజాలాలని తిరిగి ఏర్పడేలా చేస్తుంది, రంథ్రాలను టైట్ అయ్యేలా చేసి, వయస్సు మీరే వేగాన్ని తగ్గిస్తుంది.

5.కంటి చుట్టూ వాపును, నల్ల వలయాలను తగ్గిస్తుంది

5.కంటి చుట్టూ వాపును, నల్ల వలయాలను తగ్గిస్తుంది

చల్లని చామంతి టీ బ్యాగులు (వాడేసిన తర్వాత ఫ్రిజ్ లో పెట్టి) కంటి మీద పెట్టుకోవటం వలన నల్ల వలయాలు, వాచిన కళ్ళు వెంటనే తగ్గిపోతాయి. ప్రత్యామ్నాయంగా, ఇది మీ కళ్ళు అలసిపోతే వెంటనే వాటికి విశ్రాంతినిస్తుంది. చల్లని టీబ్యాగులు కంటి మీద పెట్టేముందు కనీసం 4-5 నిమిషాలు కళ్లను మసాజ్ చేసి, తర్వాత చల్ల నీరుతో కడిగేయండి.

6.సహజమైన స్క్రబ్

6.సహజమైన స్క్రబ్

అవును, మీరు చదివినది నిజమే.చామంతి టీని పాలపొడితో కలిపి మీ ముఖం, శరీరానికి సహజమైన స్క్రబ్ గా ఉపయోగించవచ్చు. ఇది మంచి ఎక్స్ ఫోలియేటర్ లా పనిచేసి మురికి, చనిపోయిన చర్మకణాలను తొలగించి మృదువైన, మెత్తని, తాజా చర్మాన్ని మీకందిస్తుంది.

7.చుండ్రును తగ్గిస్తుంది

7.చుండ్రును తగ్గిస్తుంది

షాంపూతో తలంటుకున్నాక రెగ్యులర్ గా దీన్ని వాడండి, మీ జుట్టు కుదుళ్ళకి చాలా ఉపశమనాన్ని ఇచ్చి, అలా చుండ్రును నివారిస్తుంది.

8.మంచిగా నిద్రపట్టేలా చేస్తుంది

8.మంచిగా నిద్రపట్టేలా చేస్తుంది

మీకు నిద్రలేమి సమస్య ఉంటే, అంటే స్లీప్ ఏప్నియా, ఇన్సోమ్నియా వంటి సమస్యలు ఉంటే, ఈ చామంతి పూల టీ మంచి చిట్కా అవుతుంది. ఇది నాడీవ్యవస్థను రిలాక్స్ చేసి నిద్రపట్టేలా చేస్తుంది. కెఫీన్ లేకపోవటం వలన కూడా ఇది ప్రతిరాత్రి మెరుగైన నిద్రకోసం తాగే మంచి డ్రింక్ అవుతుంది.

9.మంచి రోగనిరోధకశక్తిని పెంచుతుంది

9.మంచి రోగనిరోధకశక్తిని పెంచుతుంది

చామంతి టీలోని బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలు మీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపర్చి మిమ్మల్ని బ్యాక్టీరియా కారణంగా వచ్చే వివిధ వ్యాధులు,ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.

10.జలుబుకి మంచి చిట్కా

10.జలుబుకి మంచి చిట్కా

వేడి కప్పు చామంతి టీ తాగితే మీకు జలుబు నుండి ఉపశమనం వెంటనే దొరుకుతుంది. చామంతి టీ ఆవిరి పీల్చినా కూడా జలుబు నయం అవుతుంది.

11.కండరాల, పిరియడ్స్ నెప్పులు తగ్గుతాయి

11.కండరాల, పిరియడ్స్ నెప్పులు తగ్గుతాయి

చామంతి టీలోని వాపు వ్యతిరేక అలాగే యాంటీస్పాస్మోడిక్ లక్షనాలు నొప్పిని త్వరగా తగ్గిస్తాయి. పొట్ట,పేగులు,పిరియడ్స్ ఇట్లా ఏ రకమైన నెప్పులు లేదా క్రాంప్స్ కైనా చామంతి టీ తాగితే త్వరగా రిలీఫ్ వస్తుంది.

12.జీర్ణసమస్యలను నివారిస్తుంది, పరిష్కరిస్తుంది

12.జీర్ణసమస్యలను నివారిస్తుంది, పరిష్కరిస్తుంది

చామంతి టీ జీర్ణాశయానికి రిలాక్సెంట్ గా పనిచేసి, పేగులలో ఇర్రిటబుల్ బోవెల్ సిండ్రోం, గ్యాస్, ఉబ్బరం, గాస్ట్రోఎంట్రైటిస్,ఫ్లాట్యులెన్స్, డయేరియా, వాంతులు,వికారం మొదలైనవాటిని నయం చేస్తుంది.

13.మానసిక వత్తిడిని తగ్గిస్తుంది

13.మానసిక వత్తిడిని తగ్గిస్తుంది

చామంతి టీని తాగటం వలన మనస్సుపై సానుకూల ప్రభావం పడి, ఆందోళనను,మానసిక వత్తిడిని తగ్గిస్తుంది.

14.గుండె ఆరోగ్యానికి మంచిది

14.గుండె ఆరోగ్యానికి మంచిది

ఎల్డిఎల్ అధిక స్థాయిలను తగ్గించటం లేదా చెడ్డ కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించటం ద్వారా చామంతి టీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

15.చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది

15.చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది

రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి, ఇన్సులిన్ ను రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి చామంతి టీని డయాబెటిస్ పేషంట్లు తీసుకోవటం చాలా మంచిది.

English summary

15 Ways How Chamomile Tea Benefits Your Health

15 Ways How Chamomile Tea Benefits Your Health,There are very few people worldwide, who are not fond of the magical drink called 'Tea'! A beverage that offers a variety of aromas and flavours, commonly prepared in hot or boiling water added to cured leaves of Camellia sinensis plant, the tea is used as a medicinal or r
Desktop Bottom Promotion