For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గడం కోసం ప్రజలు చేసే 5 ప్రధాన తప్పులు ఇవి

|

అనేకమందికి ఊబకాయం అనేది జీవితంలోనే ప్రధాన సమస్యగా ఉంటుంది. తెలిసీ, తెలియని అనేక కారణాలు ఊబకాయానికి హేతువులుగా ఉన్నాయి. మనలో అనేకులు జీవితంలో ఎదో ఒక సందర్భంలో ఈ సమస్యను ఎదుర్కొంటూనే ఉంటారు. దీన్ని కలిగి ఉండడం, భరించడం ఎంత కష్టమో, తగ్గించుకోవడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. కొందరు పట్టుదలతో ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తూ ఫలితాలను పొందగలుగుతున్నారు, కానీ కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన ఫలితాలు పొందలేకపోగా అనారోగ్యాల బారిన పడుతున్నారు కూడా.

మరియు సమాజంలో కొందరి హేళనల కారణంగా ఆత్మన్యూనతకు గురికావడం, క్రమంగా డిప్రెషన్ వంటి సమస్యలను ఎదుర్కొనవలసిన పరిస్థితులు కూడా దాపురిస్తుంటాయి. కొన్ని త్యజించడం, కొన్నిటికి అలవాటు పడడం మూలంగా, ఒక ప్రణాళికాబద్దమైన జీవన శైలిని అలవర్చుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ప్రతి ఒక్కరికీ ఒకే ప్రణాళిక సరిపోకపోవచ్చు. క్రమంగా ఒక్కోసారి అన్ని రకాల ప్రయత్నాలను చేసినా ఫలితం రాకపోవచ్చు.

కానీ ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, మీ పట్టుదల, క్రమ శిక్షణలో కాదు తప్పు, మీరు అనుసరిస్తున్న మార్గాల్లో ఏదో తెలియని అంశం మిమ్ములను వెనక్కి లాగుతూ ఉంది. ముఖ్యంగా క్రింద పొందుపరచబడిన 5 ప్రధాన అంశాలు కారణాలుగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

1) ప్రధానంగా నిద్రలేమి

1) ప్రధానంగా నిద్రలేమి

మీకెవరైనా చెప్పారా ఎక్కువగా నిద్రపోవడం కారణంగా బరువు పెరుగుతారని? క్రమంగా మీరు నిద్ర తక్కువగా పోవడం వంటి చర్యలకు ఉపక్రమిస్తున్నారా?. అయితే వెంటనే ఈ అలవాటుకు స్వస్తి పలకండి. తక్కువ నిద్రను కలిగి ఉన్నారంటే, మీరు ఎక్కువ అలసటను కలిగి ఉన్నారనే అర్ధం. ఈ పరిస్థితి మీకు కార్బోహైడ్రేట్స్(పిండి పదార్ధాలు) మీదకు మనసు వెళ్ళేలా చేస్తుంది. క్రమంగా మీరు తీసుకునే ఆహారం, మీ బరువు తగ్గాలన్న కోరికను భగ్నం చేయవచ్చు.

ఇక రెండవ కారణం, నిద్ర లేమి కారణంగా 2 ప్రధానమైన హార్మోన్లలో సమతుల్యత లోపిస్తుంది. లెప్టిన్ హార్మోన్ కడుపు నిండిన అనుభూతిని ప్రేరేపించగా, అవసరం కన్నా తక్కువ ఆహారం తీసుకోవడం జరుగుతుంది. మరియు గ్రెలిన్ హార్మోన్ ఆకలిని ప్రేరేపించేదిలా ఉంటుంది, క్రమంగా అవసరానికి మించిన ఆహారాన్ని తీసుకునేలా ఉసిగొల్పుతుంది. ఈ హార్మోన్ల అసమతుల్యం, మీ ఆహారప్రణాళికపై ప్రధానంగా ప్రభావాన్ని చూపిస్తుంది. కావున రోజులో కనీసం 6 నుండి 7 గంటల నిద్ర ఉండేలా ప్రణాళిక చేసుకోవాలి.

2) ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా అయిష్టంగా తీసుకోవడం

2) ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా అయిష్టంగా తీసుకోవడం

ఈ ప్రపంచంలో సాధారణంగా బరువు తగ్గాలన్న ఆలోచన, సహచరుల మరియు సమాజంలోని హేళనల నుండే మొదలవుతుంది. ఇది నిజం. ఆత్మన్యూనతకు లోనై సత్వర ఫలితాలకోసం, సత్వర నిర్ణయాలకు పూనుకుని సరైన ప్రణాళిక లేక శరీరాన్ని, మనసును అస్తవ్యస్తం చేసుకుంటున్న అనేక మంది భాధితులు మన చుట్టూతానే ఉన్నారు. బరువును కోల్పోవాలన్న కసితో ఆహారం మీద శ్రద్ద పెట్టకపోవడం, క్రమంగా ఆహారమంటేనే విరక్తిని ప్రదర్శించడం జరుగుతుంటుంది. ఇష్టమైన ఆహారం కళ్ళ ముందు ఉన్నా కూడా తీసుకోడానికి సిద్దంగా ఉండరు. ఇటువంటి అలవాట్లు మీకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా, సరైన పోషకాలు శరీరానికి అందక ప్రతికూల పరిస్థితులు కలిగే సూచనలు కూడా ఉన్నాయి.

3) మీ కేలరీలను ట్రాక్ చేస్తున్నారా అసలు

3) మీ కేలరీలను ట్రాక్ చేస్తున్నారా అసలు

మీరు బరువు తగ్గాలని ఆలోచిస్తున్నారా? అయితే మీ ఆహార ప్రణాళిక పట్ల మీకంటూ ఒక అవగాహన ఉండాలి. మీరు తీసుకునే ఆహారంలోని కాలరీల సంఖ్య ట్రాక్ చేయడంతో పాటు, వ్యాయామం, మరియు ఇతర కార్యకలాపాల ద్వారా ఖర్చయ్యే కాలరీల సంఖ్య గురించి సరైన అంచనా ఉండాలి. లేనిచో కాలరీలు అసాధారణంగా పెరగడం లేదా తగ్గ్గడం కారణంగా సరైన ఫలితాలను పొందలేరు. కావున మంచి ఆహార ప్రణాళిక పాటించడంతో పాటు, క్రమబద్దమైన వ్యాయామాన్ని కూడా కలిగి ఉండాలి. వీలయితే వారానికోసారి బరువును చూసుకోవడం, కాలరీ ట్రాక్ బాండ్లను ధరించడం వంటి వాటి ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. కొందరు ఈ స్మార్ట్ బాండ్స్ సరిగ్గా కాలరీలను ట్రాక్ చేయదు అని అంటారు. ఈ ప్రపంచంలో ఏ డివైజ్ కూడా కాలరీలు, స్టెప్ కౌంటింగ్ విషయంలో ఖచ్చితత్వాన్ని చూపలేవు. కానీ, మన శరీరం పట్ల ఒక అవగాహన వచ్చేందుకు ఎంతగానో సహాయం చేస్తుంది.

4) మీరు అల్పాహారం దాటవేస్తున్నారా

4) మీరు అల్పాహారం దాటవేస్తున్నారా

ఒక తెలివైన పాత సామెత, 'రాజు/రాణి వంటి అల్పాహారం, ఒక యువరాజు/రాకుమారి వంటి భోజనం మరియు ఒక పాపర్ వంటి డిన్నర్ తీసుకోవాలి' అని. అల్పాహారం నిజానికి రోజులోని అతి ముఖ్యమైన భోజనం. మీరు నిద్రపోతున్నప్పుడు మీరు ప్రాథమికంగా 6 నుండి 8 గంటలు మీ శరీరాన్ని ఆకలితో ఉంచవలసి వస్తుంది. కావున శరీరం తిరిగి శక్తిని పొందే క్రమంలో అల్పాహారం ఎంతగానో సహాయపడుతుంది.

అల్పాహారం తీసుకోకపోవడం మూలంగా వ్యాయామం చేయడానికి శక్తి మరియు ప్రేరణ కూడా ఉండదు. క్రమంగా ఆలోచనలు మందగించడం, లేదా పరిస్థితులకు తగ్గట్లు సరిగా స్పందించడం వంటివి చేయలేరు. మరియు మీ రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుముఖం పడుతాయి. కావున, శరీరానికి అవసరమైన పోషకాలు అందాలంటే అల్పాహారం తప్పని సరి

5) మీ ఆహార ప్రణాళిక మీకు సరిపడలేదేమో చూస్కోండి

5) మీ ఆహార ప్రణాళిక మీకు సరిపడలేదేమో చూస్కోండి

బరువు తగ్గాలన్న ఆలోచన రాగానే ఇంటర్నెట్, న్యూస్ పేపర్స్, మాగజైన్స్, సన్నిహితుల సూచనలు వంటి అనేక మూలాల ద్వారా అనేక ఆహారప్రణాళికల గురించి తెలుసుకోవడం, క్రమంగా ఒకదాన్ని ఎంచుకుని అనుసరించడం వంటివి చేస్తుంటారు. కానీ ఇక్కడ ఒకే ఒక్క విషయం విస్మరిస్తుంటారు. ఆ ఆహార ప్రణాళిక మీకు సరిపోతుందా లేదా అని?

ఆహార ప్రణాళిక అనేది, శరీర తత్వాలు, వాతావరణ పరిస్థితులు, స్థల మార్పిడులు, ఆహారపు అలవాట్లు, వ్యాధులు, ఆర్ధిక పరిస్థితులు, మొదలైన అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకునే ఆహార ప్రణాళికను ప్రారంభించాలి. లేనిచో ఆ ప్రణాళిక మీకు సరిపడకపోవడం, ప్రతికూల సమస్యలు రేకేత్తడం వంటివి జరిగే అవకాశాలున్నాయి. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు కాబట్టి, వారి బరువు తగ్గింపు ప్రణాళికలు కూడా ఒకేలా ఉండవు. కావున సరైన ఆహారప్రణాళిక కోసం ఒక మంచి ఆహార నిపుణున్ని సంప్రదించడం మేలు.

ఇటువంటి అనేక ఆరోగ్య సంబంధ విషయాల కోసం, బోల్డ్స్కీ పేజిని తరచూ సందర్శించండి.

English summary

5 Common Mistakes People Make When Trying to Lose Weight

Not losing weight in spite of having tried everything - dieting, exercise, A to Z? The good news is that you're not alone on the boat, there are many others. The second good news is that you're making one of 10 common dieting mistakes most people make in their weight loss journey. The third good news is that you just need to rectify those mistakes.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more