కేవలం ఒకే నెలలో ఈ ఏడు సులభ మార్గాల ద్వారా ఫ్లాట్ టమ్మీని పొందవచ్చు

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ఫ్లాట్ టమ్మీని కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, జంక్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకోవడం, తగినంత వ్యాయామం లేకపోవడం అలాగే వృత్తి రీత్యా ఎక్కువసేపు కూర్చుని ఉండటం వంటివి అధిక బరువు సమస్యను కలిగిస్తాయి. ఇటువంటి జీవనశైలిని పాటిస్తూ బరువుని తగ్గించుకోవడం అలాగే ఫ్లాట్ టమ్మీని పొందటం అంత సులభం కాదు.

ఒకవేళ కేవలం 30 రోజులలో మీ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించి మీకు ఫ్లాట్ టమ్మీని అందించే అద్భుతమైన ఎక్సర్సైజ్ రొటీన్ గురించి మీకు తెలిస్తే? ఆశ్చర్యంగా ఉంది కదూ?

7 Simple Ways To Get A Flat Tummy In Just One Month

కేవలం నెలరోజులలో బెల్లీ ఫ్యాట్ ను తొలగించుకోవడమెలా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఈ పోస్ట్ మీకోసమే. కేవలం 30 రోజులలో మీకు ఫ్లాట్ టమ్మీని అందించే అద్భుతమైన రొటీన్ గురించి ఇందులో చర్చించాం. ఆ రొటీన్ గురించి తెలుసుకోవాలని ఉబలాటపడుతున్నారా? ఇంకెందుకాలస్యం, ఈ పోస్ట్ ను పూర్తిగా చదివేయండి మరి.

డైట్ లో కొన్ని చేంజెస్, కాస్తంత ఆత్మవిశ్వాసం, కొన్ని కొర్ ఎక్సర్సైజ్ లతో ఫ్లాట్ టమ్మీని మీరు పొందవచ్చు. ఈ కింద వివరించబడిన స్టెప్స్ ను పాటించి ఫ్లాట్ టమ్మీని పొందడానికి అడుగులు వేయండి మరి.

1. మీ మైండ్ ను సిద్ధం చేసుకోండి:

1. మీ మైండ్ ను సిద్ధం చేసుకోండి:

ఏ లక్ష్యాన్నైనా సాధించాలంటే ముందుగా మీరు ఆ లక్ష్యంపై గురిని ఏర్పరచుకోవాలి. దృఢమైన సంకల్పం కలిగి ఉండాలి. బరువును తగ్గించుకునేందుకు శరీరంలో పేరుకుపోయిన అదనపు కేలరీలను అలాగే ఫ్యాట్ ను ఖర్చు చేయాలి. ఆహారపుటలవాట్లను మార్చుకోవడంతో పాటు తగినంత వ్యాయామాన్ని చేయడం ద్వారా మీరు ఫ్లాట్ టమ్మీని పొందగలుగుతారు.

2. ట్రైనర్ ని లేదా గైడ్ ని ఎంచుకోండి:

2. ట్రైనర్ ని లేదా గైడ్ ని ఎంచుకోండి:

కేవలం ఒకే నెలలో ఫ్లాట్ టమ్మీని పొందాలన్న దృఢమైన ఆశయంతో మీరున్నట్లైతే సరైన ట్రైనర్ లేదా గైడ్ పర్యవేక్షణ తప్పనిసరి. వారి పర్యవేక్షణలో మీరు మీ టార్గెట్ ని చేరుకోగలుగుతారు. అదనపు బరువును తగ్గించి కోర్ మజిల్స్ ని బలపరిచే అబ్డోమినల్ ఎక్సర్సైజ్ లను ట్రైనర్ మీకు సూచిస్తారు. ట్రైనర్ పర్యవేక్షణలో మీరు మీ లక్ష్యాన్ని సవ్యంగా సాధించగలుగుతారు.

3. వ్యాయమ నియమాలను పాటించండి:

3. వ్యాయమ నియమాలను పాటించండి:

సరైన వ్యాయమ నియమాలను పాటించండి. 50 క్రంచ్ సిటప్స్ ఉండేలా జాగ్రత్తపడండి. అలాగే, ఉదరంపై పేరుకుపోయిన ఫ్యాట్ ను తొలగించేందుకు అబ్డోమినల్ మజిల్స్ పై ఒత్తిడిని కలిగించే వేరే ఏ విధమైన వ్యాయామాన్నైనా మీరు మీ వ్యాయమ రొటీన్ లో జోడించాలి. సిట్ అప్స్ ని చేసేటప్పుడు మీ బ్యాక్ ని స్ట్రైట్ గా ఉంచడం తప్పనిసరి. ఈ విధంగా చేయడం ద్వారా సిటప్స్ తరువాత మీకు వెన్ను నొప్పి వంటి ఇబ్బందులు తలెత్తవు. అలాగే, ఫ్యాట్ ను కరిగించి కోర్ అబ్డోమినల్ మజిల్స్ కి బలాన్నిచ్చే ప్లాంక్ ఎక్సర్సైజులని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి.

4. బాల్ ఎక్సర్సైజులకి ప్రాధాన్యతనివ్వండి:

4. బాల్ ఎక్సర్సైజులకి ప్రాధాన్యతనివ్వండి:

సరైన బాడీ బాలన్స్ ని మెయింటైన్ చేయడానికి అలాగే కోర్ అబ్డోమిన్ మజిల్స్ ని బలపరచడానికి బాల్ ఎక్సర్సైజులు ఉపయోగపడతాయి. అందువలన, మీ వ్యాయమ రొటీన్ లో బాల్ ఎక్సర్సైజ్ లను కూడా జోడించాలి. తద్వారా, ఒకే నెలలో ఫ్లాట్ టమ్మీని పొందేందుకు ఎక్కువ అవకాశాలన్నాయి. మీ పాదాలతో బాల్ ని హోల్డ్ చేస్తూ క్రంచెస్ ని చేయడమనేది బాల్ ఎక్సర్సైజులలో ఒక పద్దతి. ఈ పద్దతిలో బాల్ కదలకుండా అలాగే పడిపోకుండా పాదాలతో హోల్డ్ చేయాలి. జాక్ నైఫ్ సిటప్ అనేది బాల్ ఎక్సర్సైజ్ లో ఇంకొక పద్దతి.

5. హెల్తీ డైట్ ను తీసుకోండి:

5. హెల్తీ డైట్ ను తీసుకోండి:

సరైన విధంగా బరువును తగ్గించుకోవాలనుకుంటే హెల్తీ డైట్ కి తగిన ప్రాధాన్యతనివ్వాలి. మీ డైట్ లో ఫైబర్ అలాగే మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆల్మండ్స్ వంటి పదార్థాలు ఉండాలి. తద్వారా అబ్డోమినల్ మజిల్స్ ని బలపరచుకోవచ్చు. అలాగే, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభించే పదార్థాలను మీ డైట్ లో భాగం చేయాలి. వీటివలన హెల్తీ మెటబాలిక్ యాక్టివిటీ ప్రోమోట్ అవుతుంది. అందువలన, మీకు తరచూ ఆకలి వేయదు. కడుపు నిండిన భావన కలుగుతుంది. సాల్మన్, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ వంటివి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభించే పదార్థాలు. అలాగే, సోయా మిల్క్ ను కూడా మీ డైట్ లో భాగంగా చేసుకోవాలి. ఈ పదార్థం కూడా మీకు ఫ్లాట్ బెల్లీని అందిస్తుంది.

6. కేలరీలను తక్కువగా తీసుకోండి:

6. కేలరీలను తక్కువగా తీసుకోండి:

ఫ్లాట్ టమ్మీని పొందాలనుకుంటే మీరు తీసుకునే కేలరీల మోతాదును మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కేలరీలను తక్కువగా తీసుకోవడం ద్వారా మీరు ఆశించిన ఫలితాలను సరైన సమయంలో పొందగలుగుతారు. మీరు ఫ్రీ టైం లో తీసుకోవాలనుకునే కేలరీ రిచ్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయడం ఉత్తమం.

7. మీ ప్రణాళికకు కట్టుబడి ఉండండి:

7. మీ ప్రణాళికకు కట్టుబడి ఉండండి:

చివరగా, మీరు మీ ప్రణాళికకు కట్టుబడి ఉండడం అత్యంత ముఖ్యమైనది. లేదంటే, మీరు ఒకే నెలలో ఫ్లాట్ టమ్మీని పొందలేరు. ఎక్సర్సైజులను చేయకపోయినా, ఆహారనియమాలను ఉల్లంఘించినా మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు. మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు సరైన ట్రైనర్ పర్యవేక్షణలో ఫ్లాట్ టమ్మీని పొందేందుకు కృషి చేయాలి. రిజల్ట్స్ త్వరగా రావాలని అనవసరంగా కంగారు పడి ఆరోగ్యాన్ని పాడుచేసుకోకుండా సరైన ప్రణాళికను పాటించడం ద్వారా మీరు ఎంచుకున్న టైమ్ ఫ్రేమ్ లో మీరు గొప్ప ఫలితాలను పొందగలుగుతారు.

ఇప్పుడు మీకు ఒక నెలలో ఫ్లాట్ టమ్మీని పొందే మార్గాలు తెలిసాయి కదా, ఇప్పుడు మీరు వీటిని ప్రయత్నిస్తారో లేదో తెలియచేయండి. ఫ్లాట్ టమ్మీని పొందేందుకు ఆరోగ్యకరమైన పద్దతులను పాటించడం అంత కష్టమైన విషయం కాకపోయినా సులభతరం మాత్రం కాదు. లక్ష్యాన్ని సాధించాలన్న బలమైన ఆకాంక్ష కలిగి ఉండాలి. కాబట్టి, ఇప్పుడు మీరు మీ లక్ష్యం దిశగా కృషి చేయండి. ఫ్లాట్ టమ్మీని పొందండి. ఇంకెందుకాలస్యం, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి.

English summary

7 Simple Ways To Get A Flat Tummy In Just One Month

7 Simple Ways To Get A Flat Tummy In Just One Month,Wondering how to lose belly fat in a month? That is what this post talks about. A kickass routine which can give you a flat tummy in just 30 days! Can’t wait to know what it is? Then just relax and read! With changes in diet, core exercises and confidence, you can
Subscribe Newsletter