For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు తప్పక భుజించవలసిన ఏడు ప్రోబయోటిక్ ఆహార పదార్థాలు!

|

మీకు ఎప్పుడైనా కడుపులో ఇబ్బంది లేదా యోనిలో ఇన్ఫెక్షన్లు కలిగినట్లయితే, అప్పుడు మీరు ఎంత అసౌకర్యంగా భావించారో,కదా!

ఒక పురాతన భారతీయ సామెత ప్రకారం,ఒక వ్యక్తి యొక్క ఉదర ఆరోగ్యం సరిగా లేనట్లయినా లేదా ప్రత్యుత్పత్తి భాగాలలో ఇన్ఫెక్షన్లు ఉన్నా అవి ఇతర అనారోగ్యములకు దారితీస్తాయి.

అనేక శాస్త్రీయ సిద్ధాంతాలు, పైన చెప్పిన సామెత నిజమని తెలియజేస్తున్నాయి. జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యము కాపాడుకుంటే, మీ సంపూర్ణ శరీరం ఆరోగ్యంగా ఉన్నట్లే!

కనుక జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యవసరం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటుంది.

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంతోపాటు, మీ ప్రేగులలో నివసించే ఆరోగ్యకరమైన బాక్టీరియా ఉత్పత్తిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యము.

అనారోగ్యకరమైన ఆహారాలు తినేటప్పుడు, ఆరోగ్యకరమైన బాక్టీరియా కాలనీలు నశించి, జీర్ణ సమస్యలకు కారణమవుతాయి.

అదే రకమైన ఆరోగ్యకరమైన బాక్టీరియా, యోనిని ఆరోగ్యంగా ఉంచడానికి యోని యొక్క లైనింగ్ లో కూడా ఉంటుంది.

ప్రోబయోటిక్స్, ప్రేగులు మరియు యోని యొక్క లైనింగ్ లో ఆరోగ్యకరమైన బాక్టీరియా ఉత్పత్తి చేయడానికి చాలా అవసరమని మనందరికీ తెలిసిందే!

మనమందరం కేవలం పెరుగు మాత్రమే మనకు అందుబాటులో ఉన్న సహజ ప్రోబయోటిక్ ఆహారం అని అనుకుంటాం. కానీ, ప్రోబయోటిక్స్ కలిగి ఉన్న అనేక ఇతర ఆహారాలు కూడా ఉన్నాయి.

ఇక్కడ సహజ ప్రోబయోటిక్ ఆహారం యొక్క జాబితాను మీ కొరకు అందిస్తున్నాం. చదవండి మరి!

1. బంగాళాదుంపలు

1. బంగాళాదుంపలు

బంగాళాదుంపలు అక్కడ అత్యంత ప్రాచుర్యం పొందిన కూరగాయలలో ఒకటి. చాలామందికి ఇష్టమైన కూరగాయ ఇదన్న వాస్తవం మనకు తెలిసినదే ! అయితే, బంగాళాదుంపలను రోజు తినడం వలన, మరీ ముఖ్యంగా బంగాళాదుంపల వేపుడు తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. పచ్చి లేదా ఉడికించిన బంగాళాదుంపలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.

వండిన బంగాళాదుంపలను కొన్ని నిమిషాలు పాటు చల్లబరిచి వాటిని తినడం వలన మీ ప్రేగులలో బ్యాక్టీరియా ఉత్పత్తి మెరుగుపడుతుంది, వండి, చల్లార్చిన బంగాళదుంపలలో ప్రోబయోటిక్ రూపంలో ఉండే పిండిపదార్ధం ఉంటుంది.

2. పండని అరటి పండు:

2. పండని అరటి పండు:

మనలో ఎక్కువమంది పండిన పండ్లను తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే, అవి రసంతో కూడుకుని, మృదువుగా మరియు రుచిగా ఉంటాయి. ముఖ్యంగా,మరి అరటి పండు విషయానికి వస్తే , మనలో చాలామంది వాటిని సరిగా పండి, పసుపురంగులో ఉండాలని కోరుకుంటారు.

అయితే, అధ్యయనాల ప్రకారం వెలుపలకు ఇంకా ఆకుపచ్చగా ఉన్న పందాని అరటిపండు సహజ ప్రోబయోటిక్స్ ను కలిగి ఉంటాయి. ఇవి ప్రేగులు మరియు యోనిలో ఆరోగ్యకరమైన బాక్టీరియా ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.

3. సౌర్క్రాట్

3. సౌర్క్రాట్

సౌర్క్రాట్ అనేది ఒక రకమైన వంటకం.దీనిని చక్కగా తురిమిన క్యాబేజీని, ఊరగాయలను తయారుచేసినట్టుగా పులియబెట్టి చేస్తారు. , దీనివలన ఫర్మెంటేషన్ ప్రక్రియ జరిగి , ఆ సమయంలో, ఆరోగ్యకరమైన లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది.

అందువల్ల, ఈ పదార్ధాన్ని తిన్నప్పుడు, దానిలోని లాక్టిక్ ఆమ్లం, ప్రేగులలో మరియు యోని కుహరంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. కనుక సౌర్క్రాట్ కూడా ఒక అద్భుతమైన సహజ ప్రోబయోటిక్ అని చెప్పుకోవచ్చు.

4. డార్క్ చాక్లెట్

4. డార్క్ చాక్లెట్

పిల్లలు మరియు పెద్దలు అందరికి కూడా చాక్లెట్ అంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది, నిజమా?కాదా? డార్క్ చాక్లెట్, ఒక ఆరోగ్యకరమైన చాక్లెట్. ఇది బరువు కోల్పోవడం సహా క్రుంగబాటు, ఆందోళన, మొదలైన అనేక అనారోగ్యాల చికిత్సలో తోడ్పడుతుంది.

అంతేకాకుండా, డార్క్ చాక్లెట్ కూడా సహజ ప్రోబయోటిక్ గా పనిచేస్తుంది, ఇది ప్రేగుల యొక్క గోడలలోకి శోషించబడి, ఆరోగ్యకరమైన బాక్టీరియా ఉత్పత్తిని పెంచుతుంది.

5. వెల్లుల్లి

5. వెల్లుల్లి

వెల్లుల్లి మన వంట గదులలో మసాలా తయారికి ఉపయోగపడే ఒక సహజ పదార్ధం మరియు ఇది ఆహార పదార్థాలకు రుచిని జోడిస్తుంది. అంతేకాకుండా, వెల్లుల్లిలో అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సాధారణ జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లు మరియు నొప్పులు తగ్గించడం, పాటుత్వాన్ని మెరుగుపరచడం వంటి పనులు చేస్తుంది.

అలాగే, వెల్లుల్లి మరొక సహజ ప్రోబయోటిక్ గా నిరూపించబడింది. ఇది ప్రేగులు మరియు యోనిలో ఉండే ఆరోగ్యకరమైన బాక్టీరియా ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. వెల్లుల్లిని పచ్చిగా లేదా వండిన రూపంలో తీసుకున్నా కూడా ప్రయోజనకారిగా ఉంటుంది.

6. తాజా చీజ్

6. తాజా చీజ్

మనకు చీజ్ తో తయారు చేయబడిన పిజ్జాలు, పాస్తా, మొదలైన అన్ని పదార్థాలు ఇష్టమే! అయితే, ఈ ఆహారాలలో వేసే చీజ్ అనారోగ్యకరమైనది. ఇది ప్రాసెస్ చేయబడిన ఉత్పత్తి.

అలాకాకుండా, ప్రాసెస్ చేయబడని తాజా చీజ్ లో ప్రోటీన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నందున, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. అంతేకాక, ఈ చీజ్ కూడా ఒక అద్భుతమైన ప్రోబయోటిక్ ఆహారం. ఇది ప్రేగులలో ఆరోగ్యకరమైన బాక్టీరియా ఉత్పత్తి పెంచడానికి తోడ్పడుతుంది.

7. ఊరబెట్టిన ఆలివ్

7. ఊరబెట్టిన ఆలివ్

ఊరబెట్టిన ఆలివ్ లను, ఉప్పు లేదా వినెగర్ ద్రావణంలో ఆలివ్ పండ్లను ఊరబెట్టి తయారు చేస్తారు. ఈ విధంగా చేస్తే,ఆలివ్ లు దీర్ఘకాలం పాటు నిల్వ ఉంటాయి. ఈ పద్ధతి పాటించడం వలన ఆలివ్ లకు ప్రత్యేకమైన రుచి వస్తుంది.

ఈ ఆలివ్ లకు ప్రేగులలో మరియు యోని లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉత్పత్తిని మెరుగుపరిచే సామర్ధ్యం ఉన్నందున ,వీటిని అద్భుతమైన సహజ ప్రోబయోటిక్ గా చెప్పుకోవచ్చు.

English summary

7 Super-Healthy Probiotic Foods You Should Be Consuming

Digestive problems like acidity, bloating, gas, etc., are very common & can make you feel extremely uncomfortable & sick. Probiotics like yoghurt can help you keep your digestive system healthy. A few more natural probiotics are cold potatoes, unripe banana, sauerkraut, dark chocolate, garlic, raw cheese & pickled olives.