For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  వైద్యుల ప్రకారం ఈ ఎనిమిది బరువు తగ్గే చిట్కాలు అత్యంత హీనమైనవి

  |

  ఒకవేళ మీరు బరువు తగ్గాలన్న ఆలోచన చేస్తున్నవారైతే , ఆ ప్రకారంగా మీ ఆహరప్రణాళికలో మరియు జీవన శైలిలో మార్పులు చేస్కునే ప్రయత్నాలలో ఉండడం సహజం. మరియు అలా మార్చడం మీకు పెద్ద కష్టం కూడా కాదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఊబకాయానికి గురైన వారు బరువును కోల్పోవడం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియే. ఒక ప్రణాళికా బద్దమైన జీవన శైలి లేనిచో, ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్ధమే.

  అనారోగ్యకర జీవన విధానం, అలవాట్లు అనగా వ్యాయామం లేకపోవడం, అసంబద్దమైన ఆహార ప్రణాళిక, ఒత్తిడులు, కుర్చీలకు అతక్కపోయే ఉద్యోగాలు, ఆరోగ్యకర ఆహారానికి ప్రయత్నాలే చెయ్యకపోవడం మొదలైనవి ఊబకాయానికి ప్రధాన కారకాలుగా ఉన్నాయి.

  ఈ విధంగా ఎవరైనా బరువు అసాధారణంగా పెరుగుతూ ఉన్న ఎడల, ఆకలి మందగించడం, హార్మోనుల అసాధారణ హెచ్చుతగ్గులు, కీళ్ళ నొప్పులు, అజీర్ణం, రక్తపోటు, శరీరంలో క్రొవ్వు పేరుకొని పోవడం, గుండె సంబంధ సమస్యలు, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు, కాలేయ సంబంధ వ్యాధులు, కాన్సర్ మొదలైనవి తలెత్తే అవకాశాలు మెండుగా ఉంటాయి.

   Worst Weight Loss Tips According To Doctors

  ఒకవేళ మీరు ఊబకాయానికి గురవుతున్నా, లేదా ఊబకాయం వలన తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న ఎడల, ఖచ్చితంగా మీరు బరువు తగ్గే దిశగా జీవన శైలిలో మరియు ఆహార ప్రణాళికలలో ఆరోగ్యకరమైన మార్పులు తీసుకుని రావలసిన అవసరం ఉన్నది.

  అలాగని ఏ చిట్కాలను పడితే ఆ చిట్కాలను అనుసరించడం ద్వారా, ఒక్కోసారి అవి లాభాలను కలిగించకపోగా నష్టాన్ని మిగులుస్తుంటాయి. కావున ప్రణాళిక సరైనదిగా ఉండేలా చూసుకోవలసి ఉంటుంది.

  వైద్యుల సూచనల ప్రకారం , బరువు తగ్గడానికి “పాటించ కూడని” కొన్ని చిట్కాలను పొందుపరచడమైనది. గమనించవలసినది.

  1.శీఘ్ర పరిష్కారానికి ఆహార ప్రణాళికలు:

  1.శీఘ్ర పరిష్కారానికి ఆహార ప్రణాళికలు:

  ప్రపంచంలో అనేకమంది ఏ సమస్యకైనా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు రావాలని ఆలోచనలు చేస్తూ, తద్వారా ప్రణాళికలు రూపొందించే ఆలోచనలు చేస్తుంటారు. కానీ సత్వర ప్రణాళికలు లాభాలను ఇవ్వకపోగా, నష్టాలనే ఎక్కువ ఇస్తాయి. అనగా జీవక్రియలు మందగించడం, పోషకాహార లోపం, మానసిక సమస్యలు మొదలైనవి.

  2.కాలరీలను లెక్కించడం:

  2.కాలరీలను లెక్కించడం:

  ఈ తరహా ఆలోచనలు సరి కావు. శరీరానికి జీవక్రియల దృష్ట్యా అన్ని వేళలా ఒకే రకమైన కాలరీలు సరిపోవు. ఒక్కోసారి అధికంగా కూడా కావలసి ఉంటుంది. కానీ కొందరు బరువు తగ్గాలని ఆలోచన చేసేవారు, తీసుకునే ప్రతి ఆహారము నందు, ఎన్ని కాలరీలు ఉన్నాయో లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఈ పద్దతి ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చు కూడా. ఒక్కోసారి ఎక్కువ పని, అధిక ఒత్తిడి కారణంగా అధిక కాలరీలు కూడా అవసరమవుతాయి, కానీ కాలరీలను లెక్కలేస్తూ ఆహార0 తీసుకునే ఆలోచనలు చేసేవారు, అలంటి సమయంలో కూడా కాలరీల ఆలోచనలు చేస్తుంటారు. తద్వారా ఇతర సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. ఈమద్య ఇంచుమించు ఇలాంటి సమస్యలవలనే కొందరు ప్రాణాలను పోగొట్టుకుని వార్తలలో వ్యక్తులు కూడా అయ్యారు. ఇలాంటి పనులు శారీరికంగానే కాకుండా మానసిక సమస్యలను కూడా తెచ్చిపెడుతాయి.

  3.కార్బోహైడ్రేట్లను పూర్తిగా దూరం చేయడం:

  3.కార్బోహైడ్రేట్లను పూర్తిగా దూరం చేయడం:

  మీలో అనేకమంది ఇప్పుడు కీటో డైట్ పేరు వినే ఉన్నారు. చాలామంది దీనిపై ఇష్టం పెంచుకున్నారు కూడా. ఈ డైట్ ప్రకారం అధిక బరువు కోల్పోవడం దృష్ట్యా, కార్బోహైడ్రేట్లను పూర్తిగా దూరం చేయవలసి ఉంటుంది. కానీ కార్బోహైడ్రేట్లు కూడా శరీరానికి అత్యంత ఆవస్యకమైన పోషకం. సరైన మోతాదులో శరీరానికి ఎప్పుడూ అందిస్తూ ఉండాలి. లేనిపక్షంలో నీరసం, వికారం వంటి అనేక ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడే అవకాశo ఉందని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు కూడా.

  4.అన్నిరకాల క్రొవ్వు పదార్ధాలను దూరం చెయ్యడం:

  4.అన్నిరకాల క్రొవ్వు పదార్ధాలను దూరం చెయ్యడం:

  క్రొవ్వులు అనగానే బరువు తగ్గాలన్న యోచన ఉన్నవారు భయపడుతూ ఉంటారు. కానీ క్రొవ్వులలో కూడా ఆరోగ్యకర, అనారోగ్యకర క్రొవ్వులు అని విభజించబడి ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యకర ఒమేగా ౩ క్రొవ్వు పదార్ధాలు శరీరానికి అత్యంత ఆవశ్యకం. కావున పరిమితి మోతాదులో శరీరానికి క్రొవ్వులు అందించడం కూడా మంచిది. జంక్ ఫుడ్స్, శక్తి పానీయాలు, కార్బోనేటేడ్ పానీయాలు, డీప్ ఫ్రై పదార్ధాలు, ఆల్కహాల్ వంటి వాటిలో అనారోగ్యకర క్రొవ్వులు ఉంటాయి. మరియు అవకాడోస్, నెయ్యి, కొబ్బరి నీళ్ళు మొదలైన వాటిలో ఆరోగ్యకరమైన క్రొవ్వుల నిక్షేపాలు అధికంగా ఉంటాయి. కావున బరువు తగ్గాలన్న యోచన ఉన్నవారు, ఎంచుకొని ఆరోగ్యకర క్రొవ్వులు కలిగిన ఆహారాలు పరిమితిని మించకుండా తీసుకోవలసి ఉంటుంది.

  5.వ్యాయామాలు అధికంగా చేయడం:

  5.వ్యాయామాలు అధికంగా చేయడం:

  వ్యాయామాలు అధికంగా చేయడం వలన బరువు కోల్పోవడం జరుగుతుందని అనేకమంది అభిప్రాయపడుతుంటారు. బరువు తగ్గాలన్న ఆలోచన ఉన్నవారికి, సరైన ఆహార ప్రణాళికతో పాటు వ్యాయామం తప్పని సరి, కానీ వ్యాయామమే పరమావధిగా ఉంటారు కొందరు. అది సరైన లక్షణం కాదు. ఈ అలవాటు అనేక మానసిక, శారీరిక పరిస్థితుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అనేక నివేదికల సారాంశం ప్రకారం, రోజులో 15 నుండి ౩౦ నిమిషాల వ్యాయామం ఖచ్చితంగా అవసరం.

  6.తరచుగా స్నాక్స్ కు మొగ్గు చూపడం:

  6.తరచుగా స్నాక్స్ కు మొగ్గు చూపడం:

  బరువు తగ్గే అనేక ఆహార ప్రణాళికలు, ఆరోగ్యకరమైన చిరు తిండ్లను సూచిస్తుంటాయి. తద్వారా సమయానుసారం స్నాక్స్ తీసుకోవడంపై దృష్టి పెడుతుంటారు. బరువు తగ్గాలన్న ఆలోచన చేయువారు, ఆకలిని తప్పించడంలో భాగంగా మరియు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుటకొరకు స్నాక్స్ తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ స్నాక్స్ కూడా కాలరీలు అందిస్తాయని మర్చిపోకూడదు. ఇవి కాలరీలను పెంచడమే కాకుండా బరువు తగ్గే ప్రయత్నాన్ని నెమ్మదిస్తుంది. కావున పరిమితిని దాటి తీసుకోకపోవడమే మంచిది, లేదా కాలరీల లెక్కలు స్నాక్స్ కు కూడా వర్తించేలా చూసుకోవడం మంచిది.

   7.పండ్లు ఎక్కువగా తీసుకోవడం :

  7.పండ్లు ఎక్కువగా తీసుకోవడం :

  ఎక్కువగా కూరగాయలు, పండ్ల మీద దృష్టి పెట్టడం వలన బరువు తగ్గడం సుగమం అవుతుందని అనేక మంది ఆలోచనలు చేస్తుంటారు. ఇవి కాలరీలను తక్కువగా కలిగి ఉండడంతో పాటు, శరీరానికి అవసరమైన పోషకాలను మరియు నీటిశాతాన్ని కూడా అందించగలవని ఎక్కువశాతం నమ్ముతారు. కానీ వీటిలో ఎక్కువ మోతాదులో చక్కర నిల్వలు మరియు కాలరీలు ఉంటాయి. తద్వారా వీటిని ఎక్కువగా తీసుకోవడం, మీ బరువు తగ్గే ప్రయత్నాన్ని ఆలస్యం చేస్తుంది.

  8.అల్పాహారo విస్మరించడం:

  8.అల్పాహారo విస్మరించడం:

  ఇది నిజంగా అనారోగ్యకర చర్యనే. అనేకమంది తమ ఆహార ప్రణాళికలలో భాగంగా చేసే అనారోగ్యకర అలవాట్లలో ఇది ప్రముఖంగా ఉన్నది. అనేకమంది , అల్పాహారం తీసుకోకపోవడం వలన బరువు తగ్గడం త్వరగా జరుగుతుందన్న అపోహలో ఉంటారు. కానీ ఈ అలవాటు కడుపులో గాస్ చేరడం వంటి ఇతర సమస్యలకు దారితీస్తుంది. కావున అల్పాహారం మితంగా, ఖచ్చితంగా తీసుకోవలసి ఉంటుంది.

  English summary

  Worst Weight Loss Tips According To Doctors

  If you are someone who has ever been on a weight loss journey, then trying out various weight loss methods and diet tips would not be new to you, right? Well, there is no dearth of tips, advice and information when it comes to weight loss, in the world today, as losing weight is one of the biggest problems of the generation.
  Story first published: Monday, April 23, 2018, 17:10 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more