For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఊబకాయం తగ్గించుటలో కాబేజీ – ఆపిల్ జ్యూస్ ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందంటే?

ఊబకాయం తగ్గించులో కాబేజీ – ఆపిల్ జ్యూస్ ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందంటే?

|

ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా ఆహార ప్రణాళికను తెలివిగా ఎంపికచేసుకోవడం అనేది, బరువు తగ్గడంలో, ఊబకాయం మరియు ఇతర సంబంధిత వ్యాధులను నివారించడంలో మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది. ఆహారప్రణాళికలో భాగంగా తీసుకునే, బరువును తగ్గించగలిగే పానీయాలు, పండ్లరసాలు మరింత దోహదo చేస్తాయి. ఈ ఊబకాయం తగ్గించుటలో క్యాబేజీ – ఆపిల్ జ్యూస్ ఎంతో సహాయం చేయగలదు. మరిన్ని వివరాలు మీకోసం.

క్యాబేజీ మరియు ఆపిల్ రసం కేవలం మీ శరీరాన్ని పోషకాలతో నింపడమే కాకుండా అతి తక్కువ కాలరీలను కలిగి ఉంటుంది. ఈ ఆరోగ్యకరమైన రసంలో పాలకూర మరియు గుమ్మడి వంటి ఇతర శక్తివంతమైన మరియు ఆరోగ్యకర పదార్థాలు కూడా ఉన్నాయి.

Cabbage-Apple Juice For Weight Loss And Gut Health

క్యాబేజీ రసంలో ఫైబర్ అధికంగా ఉంటుంది మరియు కేలరీలలో సహజంగానే తక్కువగా ఉంటుంది. ఇది ఖచ్చితమైన బరువుని తగ్గించే గొప్ప పానీయం అవుతుంది. ఒక కప్పు క్యాబేజీ రసంలో మొత్తం 22 కేలరీలు మరియు 0.09 గ్రాముల క్రొవ్వును కలిగి ఉంటుంది. ఒక సంవత్సర కాలంపాటు వారానికి ఒకసారి క్యాబేజీ రసం తాగడం వల్ల శరీరo సుమారుగా 1.5 పౌండ్ల బరువును కోల్పోగలదు.

కాబెజీతో పాటు అదనంగా ఆపిల్ జోడించడం

కాబెజీతో పాటు అదనంగా ఆపిల్ జోడించడం

కాబెజీతో పాటు అదనంగా ఆపిల్ జోడించడం ద్వారా, మీ ఊబకాయాన్ని తగ్గించడంలో రెట్టింపు ప్రభావాన్ని చూపగలదు. ఎందువలనో తెలుసా? యాపిల్స్ బరువుని తగ్గించటంలో, క్యాన్సర్ తో పోరాడడంలో, టైప్ -2 డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, పిత్తాశయ రాళ్ళు మరియు కంటి శుక్లాలను నివారించడం వంటి అనేక సమస్యలకు చక్కటి పరిష్కారంగా ఉంది. సరైన శరీర కొవ్వు శాతం ఉండేలా చూడడంలో, మెదడు పనితీరు మెరుగుపరచడంలో, మంచి కార్డియోవాస్కులర్ ఆరోగ్యం కలిగించుటలో, అల్జీమర్స్ వ్యాధి నివారించుటలో మరియు మధుమేహం నివారించడంలో దోహదపడే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు ఫైటో ట్యూరిజెంట్లలో అధికంగా ఉండే యాపిల్స్ ఖచ్చితంగా అవసరం.

మరోవైపు, క్యాబేజీ రసంలో

మరోవైపు, క్యాబేజీ రసంలో

మరోవైపు, క్యాబేజీ రసం విటమిన్-సి, విటమిన్-ఏ , విటమిన్-బి1, విటమిన్-బి2, విటమిన్-బి6, విటమిన్-ఇ, విటమిన్-కే వంటి ముఖ్యమైన విటమిన్లు మాత్రమే కాకుండా, కాల్షియం, ఐరన్, పొటాషియం, అయోడిన్, సల్ఫర్ మరియు ఫాస్పరస్ వంటి అనేక ఖనిజాలను కలిగి ఉంటుంది. అలాగే, క్యాబేజీలో సల్ఫోరఫేన్, ఐసోథియోసైనేట్ మరియు ఇండోల్-3-కార్బినోలె(ఐ3సి) వంటి క్యాన్సర్ వ్యతిరేక సమ్మేళనాలు ఉన్నాయి. ఈసమ్మేళనాలు శరీరంలోని విషాలను తొలగించి హానికరమైన హార్మోన్లను కూడా తొలగిస్తుంది.

క్యాబేజీ మరియు ఆపిల్ రసం,

క్యాబేజీ మరియు ఆపిల్ రసం,

క్యాబేజీ మరియు ఆపిల్ రసం, ప్రేగుల యొక్క ఎగువ భాగాన్ని శుద్ది చేయడానికి గొప్పగా పనిచేస్తుంది, తద్వారా జీర్ణశక్తిని మెరుగుపరచడం తద్వారా ఊబకాయం తగ్గుదలని సులభతరం చేయడం జరుగుతుంది. మీ పెద్దప్రేగులో ఉండే అధికమైన వ్యర్ధపదార్ధాలు మీ కడుపుని చాలా అసౌకర్యానికి గురిచేస్తాయి. మరియు మీరు కడుపు ఉబ్బరానికి గురైన భావన పొందుతారు. కావున, ఆపిల్ మరియు క్యాబేజీ రసం త్రాగటం వలన ఈ కడుపు ఉబ్బర సమస్యలు కూడా తగ్గుముఖం పడుతాయి.

క్యాబేజ్ లో

క్యాబేజ్ లో

క్యాబేజ్ ఇనుము, విటమిన్-ఎ మరియు రిబోఫ్లోవిన్ల వంటి పోషకాలను కూడా చిన్న మొత్తాలలో సూక్ష్మపోషకాలుగా కలిగి ఉంటుంది. క్యాబేజీలో విటమిన్-బి6 మరియు ఫోలేట్ కూడా ఉన్నాయి, ఇవన్నీ జీవక్రియలను మెరుగుపరచడానికి మరియు నాడీ వ్యవస్థ యొక్క సాధారణ పనితీరుకు బాధ్యత వహిస్తాయి.

క్యాబేజీ అనేది క్రూసిఫెరస్ కూరగాయల రకానికి చెందినవి,

క్యాబేజీ అనేది క్రూసిఫెరస్ కూరగాయల రకానికి చెందినవి,

క్యాబేజీ అనేది క్రూసిఫెరస్ కూరగాయల రకానికి చెందినవి, దాని అనామ్లజనకాల కారణంగా దీర్ఘకాలిక వాపులు తగ్గడాన్ని గమనించారు. కొన్ని పరిశోధనల ద్వారా క్యాబేజీని తినడం వల్ల రక్తనాళాల వాపు వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పట్టినట్లు గమనించారు.

క్యాబేజీ విటమిన్-సి తో నిండి ఉంటుంది,

క్యాబేజీ విటమిన్-సి తో నిండి ఉంటుంది,

క్యాబేజీ విటమిన్-సి తో నిండి ఉంటుంది, ఇది చర్మ నిర్మాణంలో మరియు శరీరం దృడంగా ఉంచుటలో సహాయం చేస్తుంది. మరియు ఎముక కండరాలు మరియు రక్త నాళాల సరైన పనితీరుకు దోహదం చేస్తుంది. ఇది గుండె జబ్బు యొక్క ప్రమాదాన్ని తగ్గించే శక్తివంతమైన యాంతోసయానిన్లు కలిగి ఉంటుంది.

 క్యాబేజీలో విటమిన్-కె1 పుష్కలంగా ఉంటుంది,

క్యాబేజీలో విటమిన్-కె1 పుష్కలంగా ఉంటుంది,

క్యాబేజీలో విటమిన్-కె1 పుష్కలంగా ఉంటుంది, ఇది సుమారు 85శాతం వరకు ఉంటుంది. ఈవిటమిన్ రక్తం గడ్డకట్టడానికి బాధ్యత వహించే ఎంజైమ్లకు ఒక సహకారంగా పనిచేస్తుంది.

ఆపిల్ తినడం వలన మీ నరాల ఆరోగ్యానికి లబ్ది చేకూరుస్తాయి

ఆపిల్ తినడం వలన మీ నరాల ఆరోగ్యానికి లబ్ది చేకూరుస్తాయి

ఆపిల్ తినడం వలన మీ నరాల ఆరోగ్యానికి లబ్ది చేకూరుస్తాయి మరియు అల్జీమర్స్ వ్యాధి వంటి న్యూరోడెనెనరేటివ్ డిజార్డర్లను నివారించవచ్చని ఒక అధ్యయనంలో కూడా తేలింది. ప్రతి రోజు ఆపిల్ తినే పాత కాలపు మహిళలు 23శాతం తక్కువ చెడు కొలెస్ట్రాల్ మరియు 4శాతం ఎక్కువ మంచి కొలెస్ట్రాల్ కలిగి ఉన్నారని తేలింది.

ఆపిల్ ఊబకాయం ప్రమాదాన్ని తగ్గించడానికి

ఆపిల్ ఊబకాయం ప్రమాదాన్ని తగ్గించడానికి

అలాగే, ఆపిల్ ఊబకాయం ప్రమాదాన్ని తగ్గించడానికి మరియు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెంచగలిగే ప్రభావాన్ని కలిగి ఉండే జీవరసాయనిక సమ్మేళనాలను కలిగి ఉంటాయి.

ఊబకాయం నివారించడంలో గుమ్మడికాయ ప్రయోజనాలు :

ఊబకాయం నివారించడంలో గుమ్మడికాయ ప్రయోజనాలు :

గుమ్మడి ఒక మంచి వేసవి స్క్వాష్ గా ఉంటుంది, ఇది కేలరీలు మరియు సహజ చక్కెరలు కలిగి, పిండి పదార్ధాలను తక్కువగా కలిగి ఉంటుంది. ఇవి విటమిన్-ఏ, విటమిన్-సి, పొటాషియం, మరియు ఫైబర్ యొక్క మంచి మూలంగా ఉంటుంది. ఒక మద్యతరహా గుమ్మడికాయలో 33 కేలరీలు, సున్నా శాతం కొవ్వు, 2 గ్రాముల ఫైబర్, 5గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 గ్రాముల మాంసకృత్తులు, 3 గ్రాముల చక్కెర, విటమిన్-సి 3 గ్రాములు, మాంగనీస్, రిబోఫ్లోవిన్, విటమిన్-బి 6, విటమిన్-కే, 57 కిలోల ఫోలేట్ మరియు 514 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది.

పాలకూరలో ఇనుము మరియు సమృద్ధిగా కేలరీలు ఉంటాయి

పాలకూరలో ఇనుము మరియు సమృద్ధిగా కేలరీలు ఉంటాయి

పాలకూరలో ఇనుము మరియు సమృద్ధిగా కేలరీలు ఉంటాయి మరియు కొవ్వులో ఉన్న ఆరోగ్యవంతమైన మొక్క ఆధారిత ఆహారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది ఊబకాయం తగ్గించుటలో మంచి ప్రయోజనకారిగా మరియు కొవ్వు కరిగించే ఆహారoగా ఫైబర్ కలిగి ఉంటుంది. ఈ పాలకూరలోని ఫైబర్ జీర్ణక్రియ సవ్యంగా జరుగుటలో సహాయపడుతుంది, మరియు రక్తంలోని చక్కర నిల్వలను నిర్వహిస్తుంది, మలబద్ధకం మరియు అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.

ఊబకాయం తగ్గించడంలో దోహదపడే ఈ కాబేజీ – ఆపిల్ జ్యూస్ ఎలా తయారు చేస్తారు?

ఊబకాయం తగ్గించడంలో దోహదపడే ఈ కాబేజీ – ఆపిల్ జ్యూస్ ఎలా తయారు చేస్తారు?

కావలసినవి:

•ఒక మధ్య తరహా క్యాబేజీ

•ఒక ఆపిల్

•ఒక గుమ్మడికాయ

•200 గ్రా పాలకూర

తయారుచేసే విధానం:

తయారుచేసే విధానం:

• క్యాబేజీని సగంగా కోసి తరువాత చిన్ని చిన్ని ముక్కలుగా క్యాబేజీ తురమండి .

• ఇప్పుడు, ఈ క్యాబేజీ ముక్కలను జ్యూసర్లో చేర్చండి.

• ఆపిల్ చిన్నముక్కలుగా కోసి తీసుకోండి, మరియు జూసర్ లో వాటిని ఉంచండి.

• గుమ్మడికాయను ముక్కలుగా చేసి దానిని జోడించండి.

• కొన్ని పాలకూర ఆకులను జోడించండి.

• సగం కప్పు నీరు జోడించి మిక్సీ వేయండి.

English summary

Cabbage-Apple Juice For Weight Loss And Gut Health

Cabbage and apple juice is great for clearing the upper section of the intestines, thus improving digestion and making weight loss easier. The excess waste matter in your colon makes your stomach hard and gives you a bloated feeling. So, drinking apple and cabbage juice will help improve the bloated feeling.
Desktop Bottom Promotion