For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హీమోగ్లోబిన్ పెరుగుదలలో, ఊబకాయం తగ్గించడంలో క్యారెట్-ఆపిల్-దానిమ్మరసం యొక్క ఉపయోగాలు

|

ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2018: హీమోగ్లోబిన్ పెరుగుదలలో, ఊబకాయం తగ్గించడంలో కారట్-ఆపిల్-దానిమ్మరసం యొక్క ఉపయోగాలు

జూన్ 14 న వరల్డ్ రక్తదాతల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది. అనేకమంది ప్రాణాలు కాపాడే క్రమంలో భాగంగా స్వచ్చందంగా రక్త దానం చేసేవారికి, వారిని ప్రోత్సహించే రక్తదాన సంస్థలకు ధన్యవాదాలు తెలిపే క్రమంలోఈరోజు జరుపబడుతుంది.

ప్రపంచ రక్త దాన దినోత్సవం 2018 ప్రధాన నినాదం 'మనందరినీ రక్తం కలుపుతుంది' అని. ఈ వ్యాసంలో, మేము హీమోగ్లోబిన్ పెరుగుదలకై క్యారట్-ఆపిల్-దానిమ్మ జ్యూస్ చేసే మేలు గురించి వివరణను ఇవ్వబోతున్నాము మరియు ఇది బరువు తగ్గడానికి కూడా ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.

ఎర్ర రక్త కణాల సంఖ్య లేదా రక్తంలో హీమోగ్లోబిన్ యొక్క సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు వ్యక్తి రక్తహీనతకు గురవడం జరుగుతుంది.

హీమోగ్లోబిన్ అంటే ఏమిటి?

హీమోగ్లోబిన్ అంటే ఏమిటి?

హీమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాల్లో ప్రధానంగా ఉండే ప్రోటీన్, ఇది శరీరం యొక్క వివిధ భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది.

రక్తం యొక్క క్షీణత రక్తహీనతకు కారణమవుతుంది. రక్త కణ నాశనం, మరియు తక్కువ ఎర్ర కణాల ఉత్పత్తి వంటి అనేక రకాల కారణాల వలన రక్తహీనత కలుగుతుంది.

ఒక రోజులో ఎంత ఐరన్ అవసరం?

ఒక రోజులో ఎంత ఐరన్ అవసరం?

నిపుణుల సూచనల ప్రకారం పురుషునికి రోజులో 8 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం మరియు వయోజన మహిళకు రోజుకు 18 నుండి 50 మిల్లీగ్రాముల ఐరన్ అవసరమవుతుందని నమ్ముతారు.

హీమోగ్లోబిన్ పెంచడానికి దానిమ్మ:

హీమోగ్లోబిన్ పెంచడానికి దానిమ్మ:

పిప్టికాగైన్స్ అని పిలువబడే కొత్తగా కనుగొన్న సమ్మేళనాలు గుండె మరియు రక్తనాళాలకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని తేలింది. మరియు ఇనుము మరియు విటమిన్-సి యొక్క అద్భుతమైన వనరుగా ఈ దానిమ్మ ఉంది. మీ శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో మరియు బలహీనత, అలసట, మైకము మరియు వినికిడి నష్టం వంటి రక్తహీనత లక్షణాల చికిత్స కోసం ఈ పోషకాలు సమర్థవంతంగా పనిచేస్తాయి.

తక్కువ హీమోగ్లోబిన్ ఉన్న మహిళలు, ప్రత్యేకంగా స్త్రీలు, గర్భిణీ స్త్రీలు, పెరుగుతున్న పిల్లలు మరియు రోగాల నుండి కోలుకుంటున్న రోగులు తమ ఆహారంలో ఖచ్చితంగా దానిమ్మ పండును కలిగి ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఐరన్ కంటెంట్ మరియు బరువు తగ్గడానికి క్యారట్లు:

ఐరన్ కంటెంట్ మరియు బరువు తగ్గడానికి క్యారట్లు:

క్యారట్ రసంలో ప్రతి 100 గ్రాములకి 46 మిల్లీగ్రాముల ఇనుము ఉంటుంది. అంతేకాకుండా కారెట్లు పుష్కలంగా విటమిన్-సి ను కలిగి ఉంటుంది; ఈ విటమిన్ మరింతగా ఐరన్ శోషించడంలో సహాయపడుతుంది.

క్యారట్ రసంలో కేవలం 94 కేలరీలు, 0.4 గ్రాముల కొవ్వు, 21.9 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 9.2 గ్రాముల చక్కెర ఉన్నాయి. క్యారట్ రసం తక్కువ కాలరీలతో కూడి సమర్ధవంతమైన పోషకాలను కలిగి ఉన్న పానీయంగా ఉంది. ఇది మీ రోజువారీ పోషక అవసరాలను అందివ్వడమే కాకుండా, బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది మరియు దీనిలోని ఫైబర్ మీ కడుపు నిండేలా చేస్తుంది. తద్వారా, ఆకలి మీదకు మనసు వెళ్ళకుండా చేసి, నెమ్మదిగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

ఐరన్ మరియు ఊబకాయం తగ్గించడంలో యాపిల్స్ పనితనం:

ఐరన్ మరియు ఊబకాయం తగ్గించడంలో యాపిల్స్ పనితనం:

యాపిల్స్ ఇనుము మరియు అవసరమైన పోషకాలు మరియు అనామ్లజనకాలుతో సమృద్దిగా నిండిఉంటుంది. అందుకే రోజుకో ఆపిల్, వైద్యుని దూరంగా ఉంచుతుంది అని నానుడి కూడా ఉంది. ఆపిల్ రసంలో 100 గ్రాములకి 11 మిల్లీగ్రాముల ఇనుము ఉంటుంది. ఆపిల్, కేలరీలలో తక్కువగా మరియు తక్కువ మొత్తంలో సోడియం కలిగి ఉండడం ద్వారా శరీరంలోని అదనపు నీటిని విడుదల చేయడానికి సహాయపడుతుంది. దీనిలోని ఫైబర్ మీ కడుపు నిండేలా చేస్తుంది. తద్వారా, ఆకలి మీదకు మనసు వెళ్ళకుండా చేసి, నెమ్మదిగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

హీమోగ్లోబిన్ పెరుగుదలలో క్యారట్-యాపిల్-దానిమ్మ జ్యూస్ పనితనం:

హీమోగ్లోబిన్ పెరుగుదలలో క్యారట్-యాపిల్-దానిమ్మ జ్యూస్ పనితనం:

ఈ మూడు పదార్ధాలలో ప్రయోజనకరమైన అంశాలు అనేకం ఉన్నాయి. క్యారెట్లు బయోటిన్, ఫైబర్, మాలిబ్డినం, పొటాషియం, విటమిన్ కె, విటమిన్ బి1, విటమిన్ సి, విటమిన్ ఇ, మాంగనీస్, విటమిన్ బి6 మొదలైన పోషకాలతో సమృద్దిగా ఉంటుంది. ఈ పోషకాలు క్యాన్సర్ వంటి వ్యాధుల చికిత్సకు మరియు నివారించడానికి సహాయపడతాయి.

క్యారట్ రసంలో విటమిన్-కె కంటెంట్ రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. ఇది రక్తం కోల్పోకుండా నిరోధిస్తుంది మరియు వైద్య ప్రక్రియ కొనసాగేందుకు సహకరిస్తుంది.

మరో వైపు, ఆపిల్లోని ఇనుము, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్, పొటాషియం, విటమిన్ బి మరియు విటమిన్ సి, లుయూటిన్, జియాక్సాంతిన్ మరియు పాలీఫెనోల్స్ వంటి యాంటిఆక్సిడెంట్లతో పుష్కలంగా ఉంటుంది.

క్యారెట్, ఆపిల్, మరియు దానిమ్మపండు జ్యూస్ యొక్క ఇతర ప్రయోజనాలు:

క్యారెట్, ఆపిల్, మరియు దానిమ్మపండు జ్యూస్ యొక్క ఇతర ప్రయోజనాలు:

1. హృదయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది - ఈ జ్యూస్ ధమనులలో ఏర్పడే కొవ్వు ఫలకం యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండెకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది, రక్తపోటును తగ్గిస్తుంది, ఇవన్నీ గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

వృద్దాప్య లక్షణాలను తగ్గిస్తుంది

వృద్దాప్య లక్షణాలను తగ్గిస్తుంది

2. వృద్దాప్య లక్షణాలను తగ్గిస్తుంది- ఈ రసాన్ని త్రాగడం అనేది చర్మం స్థితిస్థాపకత కోల్పోకుండా సహాయపడుతుంది. ఇది కూడా ఆస్టియో ఆర్థరైటిస్ రాకుండా సహాయం చేస్తుంది మరియు మెదడులోని అమిలోయిడ్ ఫలకాల పెరుగుదలను తగ్గించడం ద్వారా వృద్దాప్యంలో అల్జీమర్స్ వ్యాధిని నిరోధిస్తుంది.

 అంగస్తంభన కోసం మంచిది

అంగస్తంభన కోసం మంచిది

3. అంగస్తంభన కోసం మంచిది - ఈ రసంలోని పోషకాల ఉనికి సెక్స్ డ్రైవ్ పెంచడానికి సహాయపడుతుంది. మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా సహాయం చేస్తుంది.

యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ అండ్ యాంటీవైరల్

యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ అండ్ యాంటీవైరల్

4. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ప్రాపర్టీస్ :- క్యారెట్, యాపిల్, మరియు దానిమ్మ రసంలో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ధమనులు గట్టి పడడంలో ఎంతో సహాయం చేస్తుంది.

క్యాన్సర్ పోరాట లక్షణాలు :

క్యాన్సర్ పోరాట లక్షణాలు :

5. క్యాన్సర్ పోరాట లక్షణాలు : అనేక పరిశోధనల ప్రకారం ఈ రసం రొమ్ము క్యాన్సర్ కణాలు, పెద్ద ప్రేగు కాన్సర్ కణాలు మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలను సైతం నాశనం చేయగలదని నిరూపించింది. ఈ రసంతో రొమ్ము క్యాన్సర్ మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేయకుండా నిరోధించవచ్చు.

ఎర్ర రక్త కణాలను పెంచడానికి క్యారెట్, యాపిల్, మరియు దానిమ్మ జ్యూస్ తయారుచేయు విధానం:

ఎర్ర రక్త కణాలను పెంచడానికి క్యారెట్, యాపిల్, మరియు దానిమ్మ జ్యూస్ తయారుచేయు విధానం:

కావలసినవి:

½ కప్ దానిమ్మ పండు

1 ఆపిల్

1 క్యారట్

తయారుచేయు విధానం:

దానిమ్మ పండు యొక్క గింజలను అరకప్పు తీసుకుని, దాన్ని జూసర్ కు జోడించండి.

ఆపిల్ చిన్న ముక్కలుగా కట్ చేసి, వాటిని కూడా జూసర్ కు జోడించండి.

ఒక క్యారట్ పీల్ చేసి, చిన్న ముక్కలుగా తురిమి వాటిని కూడా జోడించండి.

జ్యూసర్లో ½ కప్ నీరు జోడించి, బాగా కలపండి.

2 నుండి 3 నిమిషాలు మిక్సీ వేసి, సర్వ్ చేయండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్యసంబంధ విషయాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

Carrot-Apple-Pomegranate Juice For Hemoglobin And Weight Loss

The carrot-apple-pomegranate juice increases hemoglobin levels and aids in weight loss. Carrots are full of biotin, dietary fibre, molybdenum, potassium, vitamin K, vitamin B1, iron, etc. Newly discovered compounds in pomegranates called punicalagins have been shown to be extremely beneficial for the heart and blood vessels.The carrot-apple-pomegranate juice increases hemoglobin levels and aids in weight loss. Carrots are full of biotin, dietary fibre, molybdenum, potassium, vitamin K, vitamin B1, iron, etc. Newly discovered compounds in pomegranates called punicalagins have been shown to be extremely beneficial for the heart and blood vessels.
Story first published: Tuesday, July 3, 2018, 18:00 [IST]