బేబీ కార్న్ , మొక్కజొన్న, ఈరెండింటిలో మీ ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

పదివేల సంవత్సరాల క్రితం మెక్సికోలో ఈ మొక్కజొన్నను సాగు చేసేవారు, నెమ్మదిగా ఇది ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఈ విత్తనం, పోసీ(poaceae) అనే కుటుంబానికి చెందినదిగా ధృవీకరించబడింది. ఈ చెట్టు సగటున 3 మీటర్ల ఎత్తు నుండి అధికంగా 13 మీటర్ల వరకు పెరుగుతుంది. దీని విత్తనాలు, మొక్కలలో భాగంగానే వస్తాయి. ఇది ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రధానమైన ఆహారపదార్ధంగా ఉన్నది. అనగా మన దేశంలో వరి మాదిరిగా.

ముఖ్యంగా వరి మరియు గోధుమ ఉత్పత్తులతో ప్రధానంగా పోటీ పడే ప్రధాన ఆహార జాతులలో ఒకటిగా మొక్కజొన్న ఉంటుంది. దీని రంగులు ప్రధానంగా ఆంథోసియానిన్ మరియు మొక్క యొక్క Phlobaphenes నుండి విభజించబడ్డాయి.

ఇక్కడ బేబీ కార్న్ లేదా మినీ కార్న్ కూడా మొక్క జొన్న మొక్క నుండి వచ్చేదే, కానీ మొక్క జొన్న పూర్తిగా పెరగకుండానే తక్కువ వయసులోనే కోత కోయడం ద్వారా బేబీ కార్న్ వస్తుంది . ఈ బేబీ కార్న్స్ మామూలుగా లేత పసుపు రంగులో ఉంటాయి , పూర్తిగా పెరిగిన మొక్క జొన్న రంగులో ఈ బేబీ కార్న్ ఉండదు.

Corn Or Babycorn Which One Is Healthier For You?

కార్న్ , బేబీ కార్న్ యొక్క ముఖ్య ఉపయోగాలు ఏమిటి? ఎందుకు అంత ముఖ్యంగా పరిగణిస్తున్నాము?

ఇందులో 6 రకాలు ఉంటాయి Dent Corn, Flint Corn, Pod Corn, Popcorn, Flour Corn, and Sweet Corn. మొక్కజొన్నను నేరుగానే కాకుండా పొడి రూపంలో కూడా (కార్న్ పౌడర్) వంటలలో వినియోగిస్తారు. మెక్సికన్ ఆహారపదార్ధాలలో ప్రధానంగా మొక్కజొన్నే ఉంటుంది. అక్కడ వారికి మొక్కజొన్న ప్రధాన ఆహార పంటగా ఉంటుంది. ఈ మెక్సికన్లు delicacy, Huitlacoche అనే మొక్కజొన్న పైన వచ్చే ఫంగస్ ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటారు.

ఈ మొక్కజొన్నలో 76 శాతం నీటి నిల్వలతో పాటు, అధిక మోతాదులో కాలరీలు మరియు పిండిపదార్ధాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో విటమిన్ A, B, E, థయామిన్, నియాసిన్, Pantothenic Acid మరియు Folate వంటి పోషకాలు కలిగి ఉంటాయి. ఇందులో విటమిన్లు మరియు నియాసిన్ కణజాలాల అభివృద్దికి దోహదం చేస్తుంది. నిజానికి అనేకమంది ఈ రెండు ప్రధాన పోషకాల లోపాల కారణంగానే పోషకాహార సమస్యలకు గురవుతున్నారు.

లిపిడ్స్, ప్రోటీన్, కార్భోహైడ్రేట్లను కలిగి ఉన్న Pantothenic Acid, జీవక్రియలు చక్కగా పనిచేయడంలో ఎంతగానో తోడ్పడుతాయి.

ఫోలెట్, గర్భిణీ స్త్రీలకు ఎంతగానో సహకరిస్తుంది. గర్భిణీ స్త్రీలకే కాకుండా, కడుపులోని బిడ్డకు కూడా చాలా మంచిది. మొక్కజొన్నలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉన్నకారణంగా జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు రాకుండా చూచుటలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Corn Or Babycorn Which One Is Healthier For You?

మొక్కజొన్న నూనెలో anti-atherogenic ప్రభావం కారణంగా, శరీరంలోని అధిక క్రొవ్వు నియంత్రణలో ఎంతగానో దోహదం చేస్తుంది. తద్వారా ఊబకాయం తగ్గుదలకై సహాయం చేస్తుంది. తద్వారా అనేక గుండె సంబంధ సమస్యలకు కూడా చెక్ పెట్టగలదు.

బేబీ కార్న్, పూర్తిగా పెరిగిన మొక్కజొన్న తో పోల్చి చూస్తే తక్కువ సంఖ్యలో కాలరీలను, తక్కువ పిండి పదార్ధాలను మరియు తక్కువ కార్భోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరియు ఇందులో ఫైబర్ అధికంగా ఉన్నందువలన మీకు అధికంగా ఆకలివేయకుండా చూచుటలో సహాయం చేస్తుంది. గుండె పనితీరుని మెరుగుపరచి తద్వారా గుండెకి సంబంధించిన సమస్యలు రాకుండా చూచుటలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇతర ఆహారాలతో కలిపి తీసుకోవడం మూలంగా సరైన మోతాదులో శరీరానికి ప్రోటీన్ అందడం మూలంగా సరైన సంతులన ఆహార ప్రణాళికకు (balanced diet) సాధ్యం అవుతుంది.

బేబీ కార్న్ లో క్రొవ్వు శాతం 0 గా ఉంటుంది. మరియు విటమిన్ A, C ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుటలో సహాయం చేయడం ద్వారా అనేక ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడుతుంది. బేబీ కార్న్ లో ఐరన్ మోతాదు కూడా ఎక్కువగానే ఉంటుంది. తద్వారా శరీరానికి సరైన మోతాదులో ప్రాణవాయువుని అన్ని భాగాలకు పంపడంలో ప్రధాన పాత్ర పోషించగలదు. ఐరన్ గర్భిణీ స్త్రీలకు ఎంతో ముఖ్యమైన ఖనిజంగా చెప్పనదినది.

ఈ రెండు కార్న్స్ ను తినడం ఎలా?

ఈ రెండు రకాల కార్న్స్, (బేబీ కార్న్ మరియు కార్న్) నేరుగా కానీ లేదా వండడం ద్వారాకానీ తీసుకోవచ్చు. పూర్తిగా ఎదిగిన కార్న్ లో గింజలను వేరు చేసి తింటారు, బేబీ కార్న్ లో గింజలను వేరు చేయకుండా నేరుగానే తీసుకోవచ్చు. ఉడికించడం, రకరకాల వంటల పద్దతులలో ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ఆహారపదార్ధాలను ఈ జొన్నలతో తయారు చేస్తుంటారు. రోటీలలో సైడ్ డిష్ లాగా, స్వీట్ కార్న్ , కార్న్ రైస్ ఇలా తదుపరి వంటలను తయారు చేస్తుంటారు.

ఆరోగ్యానికి ఏది మంచిది:

మీరు బరువు పెరగాలని అదే సమయంలో ఆరోగ్యంగా ఉండాలని భావిస్తే మొక్క జొన్న మంచి ఆహారమనే చెప్పాలి. శరీరానికి కావలసిన కాలరీలను అందించి గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా చూస్తుంది.

బరువు తగ్గాలన్న ఆలోచనలో ఉంటే మాత్రం బేబీ కార్న్ ఎంచుకోవడం మంచిది. బేబీ కార్న్ లో కార్బో హైడ్రేట్స్, పిండిపదార్ధాలు, క్రొవ్వు అన్నీ తక్కువగానే ఉంటాయి, కావున శరీరానికి ఎంత అవసరమో అంత తీసుకోవచ్చు. ఇందులోని ఫైబర్ ఆకలి కానట్లు చేస్తుంది, తద్వారా బరువు నియంత్రించుటలో మరియు రక్తంలో గ్లూకోస్ నిల్వలను నియంత్రించుటలో కూడా సహాయం చేస్తుంది. కావున మీ ఆరోగ్యపరిస్థితి, మీ ఆలోచనలకు తగ్గట్లు కార్న్ తీసుకోవడం సూచించడమైనది.

English summary

Corn Or Babycorn Which One Is Healthier For You?

Corn and babycorn are used for preparing various dishes, but the big question remains which one is healthier for you. Corn on one hand is a good source of fiber and is brilliant for people looking forward to stay healthy while gaining weight. Babycorn, on the other hand, helps in keeping your tummy line under control by keeping you full.