For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పరిపూర్ణమైన సిక్స్-ప్యాక్ ఆబ్స్ కోసం అనుసరించదగిన ఆరోగ్యకర ఆహార చిట్కాలు

|

అత్యధిక మంది ప్రజలు, ఫిట్నెస్ వ్యాయామాలు మాత్రమే బలమైన, మరియు పరిపూర్ణమైన కండరాలను అందివ్వగలవని భావిస్తున్నారు అన్నది వాస్తవం. అందులో నిజం లేకపోలేదు. కానీ, కేవలం నీటిలో ఉప్పూ, కారం వేస్తే వంట తయారైపోతుంది అనడం ఎంత హాస్యాస్పదమో, అదేవిధంగా సరైన ఆహార ప్రణాళిక, ఆరోగ్యకర విధానాలు, జీవనశైలి లేని వ్యాయామాలు కూడా సరైన దేహధారుడ్యాన్ని ఇవ్వగలవు అనడం అంతే హాస్యాస్పదం.

ఒకవేళ మీరు, పరిపూర్ణమైన సిక్స్ పాక్ ఆబ్స్, లేదా బలిష్టమైన కండరాలను పొందాలని భావిస్తున్న వారైతే, మీరు తెలుసుకోవలసిన మరొక అంశం కూడా ఉంది. అదే ఆహార ప్రణాళికలో తీసుకోదగిన ఆరోగ్యకరమైన విధానాలు.

Diet Tips For Toned Six-pack Abs

అనేక మంది ప్రజలు సిక్స్ ప్యాక్ ఆబ్స్ కోసం సరికొత్త ఆహార ప్రణాళికలపై దృష్టి సారిస్తుంటారు, కానీ కొన్ని రోజుల తర్వాత, వారి ఆహార ప్రణాళిక అస్తవ్యస్తానికి గురవడం, ఫలితాలు రాను రాను తగ్గుముఖం పట్టడం కూడా గమనించవచ్చు. దీనికి కారణం, ఒక ఆహార ప్రణాళిక అనుసరిస్తున్నప్పుడు, కట్టుబడి ఉండవలసిన నియమాలు లేదా చిట్కాలను పాటించకపోవడమే. మీ శరీరానికి ప్రతిసారి వేకప్ కాల్ అవసరమవుతుంది, కనుక మీ కండరాలను నిర్వహించుకోవడంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాల్సి ఉంటుంది.

నిర్దిష్టమైన సిక్స్ ప్యాక్ ఆబ్స్ కోసం సూచించదగిన కొన్ని ఆరోగ్యకరమైన ఆహార చిట్కాలు ఇక్కడ పొందుపరచబడి ఉన్నాయి.

 1. శరీరానికి అందే కార్బోహైడ్రేట్స్ స్థాయిలను గమనించండి :

1. శరీరానికి అందే కార్బోహైడ్రేట్స్ స్థాయిలను గమనించండి :

తక్కువ కార్భోహైడ్రేట్లు కలిగిన ఆహార ప్రణాళికను అనుసరించడం ద్వారా, కండరాల గ్లైకోజెన్ స్థాయిలను భర్తీ చేసే సామర్ధ్యం తగ్గడం కారణంగా, కండర నిర్మాణానికి మరియు కండరాలను క్రమబద్దీకరించడంలో మీశరీరం అధికంగా సమస్యలను ఎదుర్కొంటుంది. కావున కార్భోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఆహార ప్రణాళికను ఎంచుకోనవసరం లేదు. కణజాలం క్రియాశీలకంగా ఉండేందుకు మీ కండరాలకు నిరంతర శక్తి అవసరంగా ఉంటుంది. క్రమంగా కండరాలను నిర్మించడానికి మరియు నిర్వహించడానికి తోడ్పడుతుంది. మీరు రోజులో 2500 క్యాలరీల ఆహార ప్రణాళికను కలిగి ఉన్న ఎడల, 310 గ్రాముల కార్బోహైడ్రేట్ల వరకు తీసుకోవచ్చునని గుర్తుంచుకోండి.

2. ప్రోటీన్ ఎక్కువ అవసరం :

2. ప్రోటీన్ ఎక్కువ అవసరం :

మీ ప్రధాన ఆహారం (సాధారణంగా మధ్యాహ్న భోజనం) లో ప్రోటీన్ అధికంగా ఉండేలా ప్రణాళిక చేసుకోండి. ఇది లీన్ కండరాలను నిర్మించడానికి సహాయం చేస్తుంది, అలాగే శరీరంలో అదనపు కొవ్వులను కరిగించడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా, అన్ని మాక్రోన్యూట్రియంట్స్లో, లీన్ ప్రోటీన్ శరీరంలో అత్యధిక థర్మోజెనిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుందని తెలుసుకోండి. ఇది అధిక కేలరీలను విచ్చిన్నం చేయడానికి శరీరానికి సహాయపడుతుంది.

3. ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అవసరమే :

3. ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అవసరమే :

ఆరోగ్యకరమైన కొవ్వులను, అనగా మీ ఆహార ప్రణాళికలో అవకాడో, నట్ బట్టర్, చేప మరియు ఆలివ్ నూనె వంటి మోనో సాచురేటెడ్ మరియు పాలీ సాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. ఈ మూలాల నుండి అందే డైటరీ ఫాట్, మీ ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది. మీ లక్ష్యం బెల్లీ ఫాట్ కరిగించి, సిక్స్ ప్యాక్ ఆబ్స్ పొందాలని అయితే, ఆరోగ్యకరమైన కొవ్వులను కూడా మీ ఆహార ప్రణాళికలో ఉండేలా చూసుకోవలసిందే.

Most Read: మీ రాశిని బట్టి మీరు ఎంత రొమాంటిక్ గా ఉంటారో తెలుసా ??

4. తరచుగా తినండి :

4. తరచుగా తినండి :

అనేక మంది రోజువారీ ఆహార ప్రణాళికలలో భాగంగా మూడు నుండి నాలుగు మీల్స్ తీసుకోవడం అలవాటుగా కలిగి ఉంటారు. కానీ, తరచూ మధ్యలో ఎటువంటి ఇతర ఆహారాలను స్నాక్స్ రూపంలో కూడా తీసుకోవడం లేదన్నది వాస్తవం. ఇటువంటి ఆహార ప్రణాళిక, లేదా భోజనం తీసుకునే పద్ధతి మీ శరీరంలో ఎటువంటి మార్పులను తీసుకుని రాలేదు. ముఖ్యంగా బరువు తగ్గాలని భావించేవారికి, మరియు కండరాల నిర్మాణం గురించిన ఆలోచన చేసేవారికి, ఎటువంటి ప్రయోజనమూ చేకూరదు. కావున, కొవ్వులు మరియు తీపి పదార్ధాల జోలికి వెళ్ళకుండా, ప్రతి మూడు గంటలకు ఒకసారి పోషకభరితమైన భోజనం లేదా స్నాక్స్ తీసుకోవడం మంచిది. క్రమంగా గ్లైకోజెన్ స్థాయిలు అధికంగా కాలేయం మరియు కండరాల కణజాలాలలో నిల్వ చేయబడుతుంది.

5. మీ ఆహార ప్రణాళిక మీద దృష్టి పెట్టండి :

5. మీ ఆహార ప్రణాళిక మీద దృష్టి పెట్టండి :

ఎక్కువ కొవ్వును కరిగించి, పటిష్టమైన శరీర నిర్మాణానికై, మీ ఆహార ప్రణాళికలోని భాగాలను సమయానుసారం నియంత్రించడం ముఖ్యం. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వుల సరైన నిష్పత్తి మీ ప్లేట్లో ఉండేలా ప్రణాళికను సిద్దం చేసుకోండి. ఈ పద్దతి శరీరానికి అదనపు కొవ్వులు అందకుండా మిమ్ములను నిరోధిస్తుంది.

6. వ్యాయామాల ముందు మరియు తరువాత మీ శరీరాననికి ఇంధనం అందివ్వండి :

6. వ్యాయామాల ముందు మరియు తరువాత మీ శరీరాననికి ఇంధనం అందివ్వండి :

ఆబ్స్ వర్కౌట్స్ ముందు, బ్రెడ్, అరటిపండు, పెరుగు, బెర్రీలు లేదా పీనట్ బట్టర్, మరియు ఒక గిన్నె నిండా మ్యూస్లీ తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇది వ్యాయామం చేయడానికి సరైన పాళ్ళలో శక్తిని అందివ్వగలదు. వ్యాయామం తర్వాత ఫ్రూట్ షేక్స్ తీసుకోండి, ఫ్రూట్ షేక్ తీసుకున్న 60 నుండి 90 నిమిషాల తర్వాత కొన్ని వేయించిన కూరగాయలతో పాటుగా చికెన్ బ్రెస్ట్ మరియు చిలగడదుంపలను తీసుకోవడం మంచిది.

Most Read: నేను ఆపకుండా మూడు గంటల పాటు శృంగారంలో పాల్గొన్నా సంతృప్తి లభించదు, కారణం అదే #mystory286

7. భారీగా ప్రారంభించి, తక్కువగా రోజుని ముగించండి :

7. భారీగా ప్రారంభించి, తక్కువగా రోజుని ముగించండి :

మీ కడుపుని నిండుగా ఉంచడానికి మరియు అవాంఛిత ఆహార కోరికలను నియంత్రించడానికి పిండిపదార్ధాలతో కూడిన భారీ అల్పాహారంతో మీ రోజును ప్రారంభించడం అవసరం. అదేవిధంగా రోజులో చివరి మీల్ అధికమైన కార్బొహైడ్రేట్స్ లేకుండా, లీన్ ప్రొటీన్ ఉండేలా చూసుకోవాలి.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Diet Tips For Toned Six-pack Abs

Most of the people think that fitness exercises are the only way to get those strong, sexy abdominal muscles. But, you also need to know that a combination of healthy eating tips with a solid fitness routine will give you perfect abs and core. These include having lean protein, measure your portions, consume healthy fats, eating frequently every three hours, etc.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more