బరువు తగ్గేందుకు టమాటో వలన కలిగే ఈ లాభాల గురించి మీకు తెలుసా?

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

డైటింగ్ సమయంలో మనం తీసుకునే ఆహారం వెయిట్ లాస్ పై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ కి సంబంధించిన డాక్టర్ల సూచనల ప్రకారం ట్రాన్స్ ఫ్యాట్స్ ను అవాయిడ్ చేయడం, ప్రొసెస్డ్ ఫుడ్స్ ను తక్కువగా తీసుకోవడం, రిఫైండ్ షుగర్స్ మోతాదును తగ్గించడం అలాగే శాచురేటెడ్ ఫ్యాట్స్ ని లిమిట్ చేయడం వంటివి వెయిట్ లాస్ ఎఫర్ట్ కి ఎంతగానో తోడ్పడతాయి. ఈ ఆర్టికల్ లో టమాటో స్ వెయిట్ లాస్ కి ఉపయోగకరంగా ఉంటాయో లేదో మీకు వివరిస్తున్నాము.

టమాటోస్ వంటి వెజిటబుల్స్ ని తగిన మోతాదులో ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా శరీరానికి తగినన్ని న్యూట్రియెంట్స్ అందుతాయి. టమాటోస్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అదే సమయంలో, టమ్మీ ని ఎక్కువ సేపు ఫుల్ గా ఉంచేందుకు ఈ వెజిటబుల్ తోడ్పడుతుంది.

ఒక పెద్ద టమాటో లో 33 కేలరీలు లభిస్తాయి. మీడియం సైజ్డ్ టమాటోలో 22 కేలరీలు లభిస్తాయి. చెర్రీ టమాటోలో 13 కేలరీలు లభించగా ప్లమ్ టమాటోలో 11 కేలరీలు మాత్రమే లభిస్తాయి. లో కేలరీ వాల్యూస్ మరియు టమాటోలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ వలన ఈ వెజిటబుల్ పవర్ ఫుడ్ క్యాటగిరీలోకి చేరింది. అంటే, టమాటోలు శరీర బరువు నియంత్రణలో ఉంచుకునేందుకు అలాగే సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయన్నమాట.

రసం టమాటోస్ లో ప్రోటీన్స్, మినరల్స్ అలాగే ఒకే నెలలో వెయిస్ట్ సైజ్ ను తగ్గించగలిగిన డైటరీ ఫైబర్ ఎక్కువగా లభిస్తాయి.

ఇప్పుడు, టమాటోస్ ద్వారా వెయిట్ లాస్ కై పొందే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం.

1. లో కేలరీస్:

1. లో కేలరీస్:

టమాటోస్ లో కేలరీలు తక్కువగా లభిస్తాయి. ఒక చిన్న టమాటోలో 16 కేలరీలు లభిస్తాయి. రెండు టమాటోస్ ను తీసుకున్నా కూడా మీరు తీసుకునే కేలరీల సంఖ్య 50 కంటే తక్కవే. కేలరీ ఇంటేక్ అనేది తక్కువగా ఉంటే కేలరీలను ఎక్కువగా బర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కేలరీలు ఫ్యాట్ రూపంలో నిల్వ ఉండవు.

2. హై ఫైబర్:

2. హై ఫైబర్:

కప్పుడు టమాటోస్ లో రెండు గ్రాముల ఇంసోల్యుబుల్ ఫైబర్ అలాగే 0.20 గ్రాముల సాల్యుబుల్ ఫైబర్ లభిస్తుంది. ఈ రెండు వెయిట్ లాస్ లో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. టమాటోస్ లో లభించే సాల్యుబుల్ ఫైబర్ అనేది లార్జ్ ఇంటస్టైన్ లో జెల్ వంటి పదార్థాన్ని తయారుచేస్తాయి. ఇది గట్ బాక్టీరియాకు ఫుడ్ సోర్స్ గా పనిచేస్తుంది. తద్వారా, ఫుడ్ ఆబ్సర్ప్షన్ తగ్గుతూ ఆహారం ద్వారా సంతృప్తి అనేది పెరుగుతుంది. ఇంసోల్యుబుల్ ఫైబర్ అనేది ఫ్యాట్ మాలిక్యూల్స్ ని బైండ్ చేస్తుంది తద్వారా వాటి ఆబ్సర్ప్షన్ ను అరికడుతుంది.

3. మెటబాలిజంను పెంపొందిస్తుంది:

3. మెటబాలిజంను పెంపొందిస్తుంది:

టమాటో జ్యూస్ ను తీసుకోవడం ద్వారా లిపిడ్ మెటబాలిజంను పెంపొందించి ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ లో భాగమైన జీన్స్ ఎక్స్ప్రెషన్ ను ప్రేరేపించడం జరుగుతుందని శాస్త్రవేత్తలు నిర్దారించారు. రెస్టింగ్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ (REE అనేది శరీరం రెస్టింగ్ దశలో ఉన్నప్పుడు కేలరీల అవసరాన్ని తెలుపుతుంది) టమాటో జ్యూస్ అనేది ఈ REE ని పెంచి తద్వారా శరీరంలోని ట్రైగ్లైసెరైడ్ లెవెల్స్ ని తగ్గించిందని తెలుస్తోంది.

4. లో గ్లైసెమిక్ ఇండెక్స్:

4. లో గ్లైసెమిక్ ఇండెక్స్:

టమాటోలో నున్న లో గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ అనేది 38. ఇది మిగతా ప్రొసెస్డ్ ఫుడ్స్ తో అలాగే ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది శరీరంలోకి ప్రవేశించిన ఫుడ్ ఎంతసేపట్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ గా మారుతుంది అని తెలియచేసే ఒక సూచిక. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని యాక్సెలేరెట్ చేయడానికి ఎంత ఎక్కువ సమయం తీసుకుంటే అంత మంచిది. టమాటోస్ లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలదు. ఇది, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని స్లోగా పెంచుతుంది.

5. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి:

5. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి:

టొమాటోస్ లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తుంది. ఇది హానికర ఆక్సిజెన్ రాడికల్స్ ని తొలగించేందుకు తోడ్పడుతుంది. ఆక్సిజెన్ రాడికల్స్ అనేవి DNA స్ట్రక్చర్ ని ఆల్టర్ చేసి తద్వారా శరీరంలోని ఒక స్ట్రెస్ స్టేట్ ను క్రియేట్ చేస్తాయి. శరీరంలోని ఈ స్ట్రెస్ రెస్పాన్స్ వలన ఫ్యాట్ అక్యుములేషన్ మరియు వెయిట్ గెయిన్ కి దారితీస్తుంది. కాబట్టి, శరీరంలోని టమాటోలు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించి వెయిట్ లాస్ కి తోడ్పడతాయి.

6. యాంటీ-ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్:

6. యాంటీ-ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్:

లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ టమాటోలో లభ్సితుంది. ఇది ప్రో ఇంఫ్లేమేటరీ బయో మాలిక్యూల్స్ ఉత్పత్తిని అణచివేసేందుకు తోడ్పడుతుంది. తద్వారా, ఇంఫ్లేమేషన్ ను తగ్గిస్తుంది. ఇంఫ్లేమేషన్ అనేది వెయిట్ గెయిన్ ను ప్రేరేపిస్తుంది. అందువలన, టొమాటోస్ ను తీసుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది. ఇంఫ్లేమేషన్ ద్వారా ఒబెసిటీకి దారితీసే ప్రమాదాన్ని అరికట్టవచ్చు.

7. స్ట్రెస్ ను నియంత్రిస్తుంది:

7. స్ట్రెస్ ను నియంత్రిస్తుంది:

శరీరంలోని వెయిట్ గెయిన్ కు హైపర్ టెన్షన్ కూడా ఒక కారణం. బ్లడ్ ప్రెషర్ లెవెల్ లోని స్పైక్స్ అనేవి టాక్సిక్ బిల్డ్ అప్ కి దారితీసి ఎమోషనల్ ఈటింగ్ ని ప్రేరేపిస్తుంది. తద్వారా, ఒబెసిటీకి దారితీస్తుంది. టమాటోస్ బ్లడ్ ప్రెషర్ లెవల్స్ ని తగ్గించేందుకు తోడ్పడతాయి. ఇందులో లభించే బీటా కెరోటిన్, లైకోపీన్ అలాగే విటమిన్ ఈ లు ఇందుకు తోడ్పడతాయి. ఈ విధంగా, కార్డియో వ్యాస్కులర్ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.

8. గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచుతుంది:

8. గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచుతుంది:

టొమాటోస్ ను తరచూ తీసుకోవడం వలన బ్యాడ్ కొలెస్ట్రాల్ (LDL కొలెస్ట్రాల్) అనేది తగ్గుతుంది. అలాగే గుడ్ కొలెస్ట్రాల్ (HDL కొలెస్ట్రాల్) పెరుగుతుంది. గుడ్ కొలెస్ట్రాల్ అనేది వెయిట్ లాస్ ను సపోర్ట్ చేసి కార్డియోవాస్క్యూలర్ వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని అరికడుతుంది. వెయిట్ లాస్ కు తోడ్పడడంతో పాటు అనేక రకాల ప్రాణాంతకవ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

English summary

Do You Know These Benefits Of Tomato For Weight Loss?

A large tomato has 33 calories and a medium-sized tomato has 22 calories. A cherry tomato contains 13 calories and a plum tomato contains 11 calories. The benefits of tomato for weight loss include lowering bad cholesterol, it is low in calories, high on fibre, boosts metabolism, rich in antioxidants, anti-inflammatory properties, etc.
Story first published: Monday, April 9, 2018, 13:30 [IST]