For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుట్టినరోజు సందర్భంగా హృతిక్ రోషన్ తన మేటి 10 డైట్ మరియు వ్యాయామ చిట్కాలను పంచుకున్నారు

|

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, 'సెక్సీయెస్ట్ మ్యాన్ ఆఫ్ ఏషియా’ మరియు 'థర్డ్ మోస్ట్ హ్యాండ్ సమ్ మ్యాన్ ఎలైవ్’ టైటిల్స్ చేజిక్కించుకున్న మేటి బాలీవుడ్ తారలలో ఒకరు.

ఆయన శిల్పిచెక్కిన రూపం, అపూర్వ స్టార్ డమ్, ఎప్పుడూ అదే ఉత్సాహం మరియు డ్యాన్స్ స్టేజీపై అస్సలు తడబడని అడుగులు ఇవన్నీ చాలామందిని ఆకర్షిస్తాయి. తన కండలుదిరిగిన శరీరాన్ని అదే ఆకారంలో ఉంచుకోటానికి ఆయన ప్రపంచప్రసిద్ధి చెందిన క్రిస్ గెంథిన్ తో కలిసి వ్యాయామం చేస్తారు. క్రిష్ 2 చిత్రానికి తయారవుతున్నప్పుడు వారానికి 4 రోజులు, రోజుకి 2 సార్లు వ్యాయామం చేసేవారట.

అతని ముఖ్య ఫోకస్ బలం,ఓపిక,ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవడం. దాన్ని వివిధ వ్యాయామాలైన లంజెస్, ఒక కాలితో స్క్వాట్’స్ మరియు కార్డియో, సర్క్యూట్ ట్రయినింగ్ ల సరైన మిశ్రమంతో సాధిస్తారు.

హృతిక్ తన ఆహారపు అలవాట్లను కూడా చాక్లెట్లు, మఫిన్స్ మరియు కుకీలకి దూరంగా ఉండి బ్యాలెన్స్ చేస్తారు. అందుకే ఆయన్ని గ్రీక్ గాడ్ అని కూడా అంటారు.


ఈరోజు, ఆయన జన్మదినం సందర్భంగా, అతను శరీరాన్ని ఎలా నిర్వహించుకుంటారో, ఆకారంలో ఎలా ఉంటారో తెలిపే డైట్ మరియు వ్యాయామ చిట్కాలను తెలుసుకుందాం.

హృతిక్ రోషన్ డైట్ మరియు వ్యాయామ చిట్కాలు

1.కార్డియో వ్యాయామం

1.కార్డియో వ్యాయామం

హృతిక్ ప్రతిరోజూ చాలా కఠిన వ్యాయామాలను క్రమశిక్షణతో పాటిస్తారు. ఆయన వ్యాయామాలలో కార్డియో, స్ట్రెచింగ్, పవర్ వర్కవుట్ వంటివి ఉండి శరీరానికి క్రీడాకారుడి లుక్ ను మరియు కండలు తిరిగేలా చేస్తుంది. అతను రోజుకి 20-30 నిమిషాల పాటు తప్పక కార్డియో వ్యాయామాలు చేస్తారు.

2.సర్క్యూట్ ట్రయినింగ్

2.సర్క్యూట్ ట్రయినింగ్

సర్క్యూట్ ట్రయినింగ్ లో మొత్తం శరీరం వ్యాయామం ఉంటుంది. సర్క్యూట్ ట్రయినింగ్ లాభాలు కండరాలను ఎదిగేలా చేయటం మరియు టోనింగ్ మరియు తీవ్ర కార్డియో వ్యాయామంగా ఉంటుంది. ఇందులో వివిధ కండర గ్రూపులను పనిచేసేలా చేసి, ప్రతి వ్యాయామాన్ని 10-25 రెప్స్ 20-30 నిమిషాల పాటు చేయవచ్చు.

3.చేతుల వ్యాయామం

3.చేతుల వ్యాయామం

హృతిక్ తప్పనిసరిగా చేతి వ్యాయామాలు చేస్తారు, ఇందులో స్ట్రెయిట్ డంబెల్ పుల్ ఓవర్, కేబుల్ రోప్ ట్రైసెప్స్ ఎక్స్ టెన్షన్, స్ట్రెయిట్ ఆర్మ్ పుల్ డౌన్, కాన్సన్ ట్రేటడ్ కర్ల్స్ మొదలైనవి ఉంటాయి. చేతి వ్యాయామాలు చేతులను సరైన ఆకారంలో ఉంచి కొవ్వును పేరుకోనివ్వవు.

4.ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం

4.ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం

హృతిక్ ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను తన డైట్ లో ప్రయోగిస్తారు. అతను పాన్ కేక్స్ ను పంచదార సిరప్ తో, ప్రొటీన్ పౌడర్ తో కలిపి తీసుకుంటారు. అరటిపండు స్ప్లిట్ ను ప్రొటీన్ పౌడర్ మరియు పెరుగు, మాంసం బాల్స్ కెచప్ తో కలిసి తింటారు.

5. సంక్లిష్ట కార్బొహైడ్రేట్లు

5. సంక్లిష్ట కార్బొహైడ్రేట్లు

హృతిక్ ఎప్పుడూ సంక్లిష్ట కార్బొహైడ్రేట్ డైట్ లోనే ఉంటారు ఎందుకంటే అందులో సహజ చక్కెరలు మరియు ఫైబర్ కలిగివుంటాయి.సంక్లిష్ట కార్బొహైడ్రేట్లలో బ్రౌన్ రైస్,ఓట్ మీల్ మరియు సలాడ్స్ ఉంటాయి. తినేటప్పుడు తేలికగా తినడాన్ని ఇష్టపడతారు.

6.అధిక ప్రొటీన్ డైట్

6.అధిక ప్రొటీన్ డైట్

మీ కండరాలను పెంచి, వ్యాయామం తర్వాత కండరాలు పాడవకుండా ఉండటానికి ప్రొటీన్లు అవసరమవుతాయి. హృతిక్ తన డైట్ లో ప్రొటీన్ పౌడర్, స్టీక్, టర్కీ, చేపలు మరియు తెల్ల సొనను ప్రొటీన్ల కోసం జతచేస్తారు. ఈ ఆహారం కండరాల పరిమాణం పెంచి మరియు శారీరక వ్యాయామాన్ని అందిస్తుంది.

7.రెగ్యులర్ సమయం తేడాలతో చిన్న చిన్న భోజనాలు

7.రెగ్యులర్ సమయం తేడాలతో చిన్న చిన్న భోజనాలు

హృతిక్ అనేది ఎవరైనా క్రమం తప్పకుండా చిన్న చిన్న భోజనాలను చేయాలి, అప్పుడే అది మెటబాలిజంను పెంచుతుంది. ఆయన న్యూట్రిషనిస్ట్ ప్రకారం, హృతిక్ ను రోజుకి 3 భారీ భోజనాలు కాక,6-7సార్లు ఆహారం తీసుకోమన్నారట. ఇవి మీ పదేపదే తినాలన్న ఆశని తగ్గించి మీ మెటబాలిజంను పెంచుతుంది.

8. సరైన డైట్

8. సరైన డైట్

జిమ్ లో వ్యాయామానికి ముందు తర్వాత చాలా ముఖ్యమైనది సరైన ఆహారం అని హృతిక్ చెబుతున్నారు. సరైన డైట్ లేకపోతే మీ శరీరం మీకు నచ్చిన స్థితికి ఎప్పటికీ వెళ్ళలేదు. అతను డైట్ మరియు వ్యాయామం నిష్పత్తి ఎప్పుడూ 90;10 ఉంటుందని అంటున్నారు. అంటే డైట్ చాలా ముఖ్యమని అర్థం.

9.చక్కని నిద్ర

9.చక్కని నిద్ర

ఆరోగ్యకరమైన, ఫిట్ శరీరం కోసం చక్కని నిద్ర అవసరం.శరీరం బాగా పనిచేయటానికి సరైనంత విశ్రాంతి అవసరం. మంచి రాత్రి నిద్ర బరువు పెరగటాన్ని నియంత్రించి రోజువారీ పనుల్లో మీ ఏకాగ్రతను కూడా పెంచుతుంది.

10. వారాంతపు చిరుతిళ్ళు

10. వారాంతపు చిరుతిళ్ళు

హృతిక్ స్వభావసిద్ధంగా ఆహారాన్ని ఇష్టపడే వ్యక్తి. ఆయనకి చాకొలెట్లు,పిజ్జాలు, ఐస్ క్రీములు, స్వీట్లు అన్నీ ఇష్టమే. వారానికి ఒకసారి డైట్ మానేసి తనకి ఇష్టమైనవన్నీ తినేస్తారు. కానీ సరైన అంకితభావంతో మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుంటారు.

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే, మీ స్నేహితులు, కుటుంబంతో పంచుకోండి.

English summary

Hrithik Roshan Shares Top 10 Diet And Workout Tips On His Birthday

Hrithik Roshan Shares Top 10 Diet And Workout Tips On His Birthday,Hrithik Roshan's strict fitness mantra, diet plans and disciplined workout have made him one of the hottest and the sexiest actors of Bollywood. Check out Hrithik Roshan's diet and workout tips here.
Desktop Bottom Promotion