For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలబద్దకం నివారించడానికి ఓట్ మీల్ ఏ విధంగా సహాయపడుతుంది

|

మీరు ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి, బాత్రూంలో గంటల కొద్దీ సమయం గడపవలసి వస్తుందా? అయితే, మీరు ఖచ్చితంగా మలబద్ధకం బాధితులే!

కొంతమంది ప్రజలు ఇతరులతో పోలిస్తే, వారి జీవితకాలంలో అధికంగా వ్యాధులు మరియు అనారోగ్య పరిస్థితులకు లోనవుతారని, మనకు తెలిసినదే.

ప్రతి వ్యాధికి వివిధ కారణాలు ఉంటాయి మరియు కొన్ని వ్యాధులకు ఒక నిర్దిష్ట కారణం కూడా ఉండకపోవచ్చు. అయితే, అనేక పరిశోధన అధ్యయనాలు మరియు విశ్లేషణ ద్వారా తెలుసుకున్నదేమిటంటే, మన జీవనశైలి మరియు అలవాట్లు అనేక సాధారణ వ్యాధులకు ప్రధాన కారణం కావచ్చు.

మలబద్ధకం లింగ వయోభేదాలు లేకుండా అనేక మందిపై దాడిచేసే, ఒక జీవనశైలి వ్యాధిగా చెప్పుకోవచ్చు. ఆహారపు అలవాట్లు, దైనందిన వ్యాయామం, ఒత్తిడి స్థాయిలు, మొదలైనవి, మలబద్ధకం కలగడానికి ముఖ్య కారణాలు.

మలబద్ధకం నుండి ఉపశమనం పొందటానికి, ఎన్నో మంది లేక్సేటివ్ ఔషధాలను వినియోగిస్తారు. ఇవి మలాన్ని మృదువుగా చేసే శక్తివంతమైన మందులు.

దీర్ఘకాలం పాటు లేక్సేటివ్లను తీసుకుంటే, మీ ప్రేగుల ఆరోగ్యం నాశనం కావచ్చు. ఎందుకంటే , వీటి తయారీ కొరకు బలమైన రసాయనాలను ఉపయోగిస్తారు. కనుక మలబద్దకం సమస్య పరిష్కారానికి, సహజ పదార్ధాలను ఉపయోగించి సహజమైన నివారణ చర్యలు చేపట్టడమే ఎల్లప్పుడూ మంచిది.

మలబద్ధకం చికిత్సకు ఓట్స్ అద్భుతంగా సహాయపడతాయని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకోండి!

మలబద్ధకం అంటే ఏమిటి?

మలబద్ధకం నివారణకు చేసే చికిత్సను గురించి తెలుసుకోబోయే ముందు, అసలు మలబద్దకం అంటే ఏమిటో తెలుసుకోవాలి.

మలబద్దకం అనే ఒక పరిస్థితిలో, ప్రేగులలోని మలం గట్టిపడి, శరీరం నుండి బయటకు రావడం చాలా కష్టం అవుతుంది. దీని మూలంగా, మలం ప్రేగులలో నిలిచిపోయి, అనేక సమస్యాత్మకమైన లక్షణాలు కలుగుతాయి.

మలవిసర్జన కష్టం అవటం, మలం గట్టిపడడం, అపానవాయువులు, కడుపులో గ్యాస్ చేరి ఉబ్బరం కలగడం, కడుపు నొప్పి, వికారం, తరచూ మూత్రవిసర్జన, పురీషనాళంలో నొప్పి, ఆకలిలో హెచ్చుతగ్గులు మొదలైనవి మలబద్ధకం యొక్క కొన్ని లక్షణాలు.

అందువల్ల, మలబద్ధకానికి ఎంత త్వరగా వీలైతే, అంత త్వరగా చికిత్స తీసుకోవడం చాలా అవసరం. చికిత్స చేయని యెడల మలబద్ధకం తర్వాత దశలలో, పైల్స్, ఐబిఎస్ (ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్) మరియు పేగు క్యాన్సర్లకు దారితీస్తుంది.

మలబద్ధకం కలగడానికి కారణాలు:

మలబద్ధకానికి దారితీసే అత్యంత సాధారణ కారణాలు కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికిని, అతిగా తినడం.

2. తరచుగా ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు అనారోగ్యకరమైన చిరుతిళ్ళను తీసుకోవడం

3. నూనె, చక్కెర మరియు గ్లూటెన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం

4. ప్రతిరోజూ వ్యాయామం చేయక పోవడం

5. పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తినకపోవడం.

6. మటన్, బీఫ్ మాంసాన్ని అధికంగా సేవించడం

7. పాడి ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం

8. అధిక మద్యపానం మరియు ధూమపానం


ఓట్ మీల్ ను తినడం మలబద్దకం నివారణకు ఏ విధంగా ఉపయోగపడుతుంది?

మనలో చాలామందికి ఇప్పటికే, ఓట్ మీల్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే ఒక సహజ పదార్ధంగా తెలుసు. ఓట్స్ లో కరగని పీచుపదార్థాలు సమృద్ధిగా ఉండటం మరియు పీచుపదార్థాలు అధికంగా ఉన్న ఆహారాలు, మలబద్ధకంను అత్యుత్తమంగా పనిచేయడం వలన ఇవి మలబద్దకం నివారణకు ఉన్న ఉత్తమ సహజ మార్గాలలో ఒకటి.

ఒక కప్పు ఓట్ మీల్ లో 4 గ్రాముల పీచుపదార్ధం ఉన్నట్లు అంచనా వేయబడింది, వీటిలో 2 గ్రాములు మలబద్దకం నివారణకు అవసరమైన చికిత్స చేయగల కరగని ఫైబర్. దీనిలి ఫాస్ఫరస్, మెగ్నీషియం, జింక్, థయామిన్, సెలీనియం, మాంగనీస్ మరియు ఇనుము వంటి ఖనిజాలు కూడా మెండుగా ఉంటాయి.

దీనిలో ఉన్న కరగని ఫైబర్ జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించి, గట్టిపడిన మలంతో కలిసి మృదువుగా మారుస్తుంది.

ఓట్స్ తినడం వలన విసర్జకాలు ఎటువంటి నొప్పి కలుగజేయకుండా, సులభంగా శరీరం నుండి బయటికి వస్తాయి.

కనుక ప్రతిరోజూ అల్పాహారంలో ఒక గిన్నెడు ఓట్ మీల్ ను తీసుకోవడం ఉత్తమమని సిఫార్సు చేయబడింది.

ఓట్ మీల్ వలన ఒనగూరే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు

1. బరువు కోల్పోవడానికి సహాయ పడుతుంది

ఓట్స్ లో యాంటీఆక్సిడెంట్ మరియు పీచుపదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మీ జీవక్రియ వేగాన్ని పెంచుతాయి. అంతేకాక, శరీరంలో పేరుకున్న కొవ్వు కణాలను త్వరగా విచ్ఛిన్నం చేయడానికి వీలు కల్పిస్తాయి. తద్వారా బరువును తగ్గిస్తాయి. అంతేకాక, ఓట్ మీల్ తినడం వలన కడుపు నిండిన భావన కలిగి, అతిగా తినకుండా నియంత్రిపబడుతుంది., తద్వారా, బరువు పెరుగుడం కూడా నివారింపబడుతుంది.

2. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

వోట్స్ లో పీచుపదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని, LDL కొలెస్టరాల్ (చెడు కొలెస్ట్రాల్) స్థాయిలను తగ్గించి, నియంత్రణలో ఉంచగలవని పరిశోధన అధ్యయనాలు నిరూపించాయి.

3. మధుమేహానికి చికిత్సగా పనిచేస్తుంది

మన శరీరంలోని ఇన్సులిన్ హార్మోన్ హెచ్చుతగ్గులు కారణంగా, రక్తంలో చక్కెర స్థాయి అసాధారణంగా పెరుగుతుంది. ఓట్ మీల్ లో ఉన్న బీటా-గ్లూకాన్ అని పిలువబడే సమ్మేళనం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది కనుక, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచబడతాయి. ఈ విధంగా మధుమేహ నియంత్రణ సాధ్యమవుతుంది.

4. క్యాన్సర్ తీవ్రతను తగ్గిస్తుంది

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఒక పరిశోధన అధ్యయనం ఓట్ మీల్ లో ఉన్న ఖనిజాలు మరియు యాంటిఆక్సిడెంట్లు, క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయమైన స్థాయిలో తగ్గించవచ్చని తెలిపింది.

5. హృద్రోగాలను నిరోధిస్తుంది

ఓట్ మీల్ లో ఉండే పీచుపదార్థాలు, మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నందున, ఇది గుండె వ్యాధులను నిరోధిస్తుంది. ఎందుకంటే అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, గుండె జబ్బులకు ప్రధాన కారణం.

English summary

Is Oatmeal Really Good For Constipation?

If you are someone who has been having troubles going to the bathroom in the morning and you spend a lot of time trying to pass stools, then, you could be suffering from constipation. As we know, people are affected by a number of diseases and conditions in their lifetimes, some more than the others.
Story first published: Tuesday, August 7, 2018, 8:00 [IST]