For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కీటో డైట్ : కీటో డైట్ పాటించే ముందు ఈ 6 దుష్ప్రభావాల గురించిన అవగాహన ముఖ్యం

|

అధికబరువు లేదా ఊబకాయంతో భాదపడేవారు క్రమంగా దైనందిక జీవితంలో అనేక ఆరోగ్య, సామాజిక సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. క్రమంగా ఆత్మన్యూనత లేదా డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు లోనవ్వడం పరిపాటిగా ఉంటుంది. బాధాకరమైన విషయం ఏమిటంటే, సత్వర నివారణా చర్యలలో భాగంగా తీసుకునే కఠిన నిర్ణయాలు ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తున్నాయి. ఈ క్రమంలో భాగంగా సులభమైన ఆరోగ్యకర పద్దతుల వైపుకు, పెద్దలు సూచిస్తున్న, ప్రామాణికాలు కలిగిన డైట్లను అనుసరించడం పరిపాటిగా జరుగుతుంది. దశాబ్దాలుగా, అనేక డైట్లు మనుగడలోనికి వచ్చినా ఉనికిని నిలుపుకున్నవి మాత్రం కొన్నే.

శారీరిక, మానసిక ఆరోగ్యాలు, అలవాట్లు, శరీరతత్వం, నివసించే ప్రాంతం, జన్యు సంబంధ సమస్యలు, సంక్రమణ వ్యాధులు మొదలైన అనేక అంశాలను పరిగణనలోనికి తీసుకుని, నిపుణుని పర్యవేక్షణలో డైట్స్ ఆచరించవలసి ఉంటుంది.

Keto Diet: 6 Surprising Side Effects You Need To Know About

సాధారణంగా కొందరిలో ఫలితాలు కనిపించాయని, అదే డైట్ మనమూ పాటించడం చేస్తుంటాము. కానీ పైనచెప్పిన కొన్ని అంశాలు సహకరించకపోవడం మూలాన, ఫలితాల సంగతి ఏమో కానీ, ప్రతికూల ప్రభావాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావొచ్చు.

ఏ డైట్ కూడా ఖచ్చితంగా 100శాతం ఫలితాలను ఇవ్వకపోవడానికి కారణాలు కూడా ఇవే;

నిజానికి కొన్నిరకాల ఆరోగ్య ప్రణాళికలు ఎంతో ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంటే, కొన్ని అబద్దపు ప్రణాళికలు ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకపోయినా కూడా, ఎవరో ఒకరికి పని చేసిందంటూ విస్తృతంగా చలామణీ అవుతున్నాయి. నిజానికి కొన్ని తాత్కాలికంగా పని చేసినప్పటికీ, భవిష్యత్తులో జీవక్రియలకు ఆటంకంగా పరిణమించి ఆరోగ్య సమస్యలు తెచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని, వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఉదాహరణకు, "యో-యో డైట్" , 70వ దశకంలో ముఖ్యంగా మహిళలలో అత్యంత ప్రజాదరణ పొందింది. అనారోగ్యకర ఆహారాలకు దూరంగా ఉండడమే కాకుండా, ఆకలితో ఉన్నప్పుడు కూడా ఆహారం తీసుకోకూడని విధంగా ఈ డైట్ రూపుదిద్దుకుంది. దీనికారణం చేత ప్రజలు అనేక దీర్ఘకాలిక సమస్యలను సైతం ఎదుర్కోవలసి వచ్చింది.

కావున, ఏదైనా డైట్ అనుసరించే ముందు, సానుకూల, ప్రతికూల ఫలితాల గురించిన అవగాహన కూడా ముఖ్యమే.

ఈ మద్య కాలంలో కీటోడైట్ ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుందో మనందరికీ తెలుసు, పైగా అనేకమంది ఈ ఆహార ప్రణాళిక ద్వారా ప్రయోజనం పొందుతున్నామని కూడా చెప్తున్నారు. ప్రధానంగా కార్బోహైడ్రేట్లను ఆహారప్రణాళిక నుండి తొలగించడం ద్వారా, అతి తక్కువకాలంలో అధిక బరువుకు స్వస్తి పలకవచ్చన్న అంశంతో ముందుకు వచ్చింది ఈ కీటోడైట్.

కీటోడైట్ బరువు తగ్గడానికి సహాయపడుతుందని అనేకమంది చెప్తున్నా, వైద్యుల ప్రకారం ఈ డైట్లో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.

1.తీవ్రమైన అలసట

1.తీవ్రమైన అలసట

బరువుతగ్గే క్రమంలో ఎటువంటి డైట్ మీరు అనుసరించడం ప్రారంభించినా, కొన్ని రోజుల వ్యవధిలోనే మీరు నీరసానికి, అలసటకు లోనవ్వడం పరిపాటి. ఆహారాన్ని తక్కువగా తీసుకోవలసి రావడం, లేదా తీసుకునే సాధారణ ఆహారాన్ని పూర్తిగా మార్చివేయడం, లేదా త్యజించడం, ద్రవాహారాలకు మళ్లడం మొదలైన అంశాలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఏదేమైనా, అతి తక్కువ సమయంలోనే ఇటువంటి డైట్స్ శరీరానికి సరిపోయేలా జీవక్రియలు మారుతుంటాయి.

కీటోడైట్ విషయంలో, శరీరం కార్బోహైడ్రేట్స్ పూర్తిగా త్యజించవలసి ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ శక్తికి ప్రధాన వనరుగా ఉంటుంది. కాబట్టి, ప్రజలు నిరంతర మరియు దీర్ఘకాలిక అలసటను ఎదుర్కొనవలసి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది వారి రోజువారీ కార్యకలాపాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. దీర్ఘకాలిక అలసట వంటి సమస్యల కారణంగా వారు జ్వరం కలిగిన అనుభూతికి సైతం లోనవుతుంటారు.

2. పునఃస్థితికి అధిక అవకాశాలు

2. పునఃస్థితికి అధిక అవకాశాలు

కీటోడైట్ బరువుతగ్గడంలో సహాయపడుతున్నప్పటికీ, కార్బోహైడ్రేట్లను పూర్తిగా త్యజించి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన శక్తి అందక కొన్ని అనారోగ్య పరిస్థితులను సైతం ఎదుర్కొనవలసి వస్తుంది. కొందరు ఉత్తమ ఫలితాలను పొందినప్పటికీ, కొన్నినెలల వ్యవధిలోనే బరువును కోల్పోయిన వ్యక్తులు తిరిగిపొందే అవకాశాలు అధికంగా ఉన్నాయి. క్రమంగా జీవక్రియలు, ఆహార విషయాలలో అసమతుల్యత లోపిస్తుంది.

ఈ కీటోడైట్ ముఖ్యంగా శరీరంలోని నీటిశాతం మీద ప్రభావం చూపడం కారణంగా, వ్యక్తులు అతి తక్కువ సమయంలోనే బరువు కోల్పోయారన్న అపోహకు కూడా లోనవుతుంటారు. కానీ ఇక్కడ ఈ డైట్ వారి జీవక్రియల రేటును మందగించే అవకాశాలు ఉన్నాయి. క్రమంగా ఎప్పుడైనా ఈ డైట్ ప్రణాళికను పక్కనపెట్టి తిరిగి సాధారణ ఆహారప్రణాళికకు వచ్చినప్పుడు అతి తక్కువ వ్యవధిలోనే కోల్పోయిన బరువును తిరిగిపొందే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

3. అధికమైన దాహం

3. అధికమైన దాహం

కీటోడైట్ ప్రణాళిక అనుసరిస్తున్న వ్యక్తి తన శరీరానికి ఎటువంటి కార్బోహైడ్రేట్లను‌ అందించరాదని సూచించబడతారు. మనకు తెలిసినంతవరకు, మరియు శాస్త్రీయ నివేదికల ప్రకారం శరీర జీవక్రియలకు పోషకాలు, కార్బోహైడ్రేట్లను సమతుల్యత లోపించకుండా అందించబడాలి.

శరీరానికి శక్తిని అందించడంలో, జీవక్రియలను ప్రోత్సహించడంలో మరియు మరింత శక్తిని ఉత్పత్తి చేయడానికి కార్బోహైడ్రేట్లు అంతర్గతంగా పనిచేస్తాయి. ఇటువంటి సందర్భంలో కార్బోహైడ్రేట్లను కోల్పోయినప్పుడు, శరీరం అదనపు కృషి చేసినప్పుడు, అది నిర్జలీకరణం లేదా అధిక దాహానికి దారితీస్తుంది. కావున మీరు కీటోడైట్ పాటిస్తున్న ఎడల సమయానుసారం నీటిని అధికంగా తీసుకొనవలసి ఉంటుంది.

4.మలబద్దకం

4.మలబద్దకం

కీటోడైట్ ప్రణాళికను అనుసరించడం కారణంగా శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు అందకుండా పోతాయి. ఇందులో ఎటువంటి ఆశ్చర్యము లేదు. క్రమంగా కార్బోహైడ్రేట్లు కలిగి ఉన్న తృణధాన్యాలు, బీన్స్, ఫైబర్ కలిగి ఉన్న పండ్లు మరియు కూరగాయలను కూడా త్యజించవలసి ఉంటుంది.

మనకు తెలిసినంతవరకు జీర్ణక్రియ సక్రమంగా కొనసాగుటకు ఆహారంలోని ఫైబర్ నిక్షేపాలు అత్యవసరం. కావున ఫైబర్ లేని ఆహారాన్ని తీసుకోకపోవడం మూలంగా అది కచ్చితంగా మలబద్దకం లేదా ఇతర జీర్ణసంబంధిత సమస్యలకు కారణమవుతుంది

5. మూత్రపిండాల సమస్యలు

5. మూత్రపిండాల సమస్యలు

కీటో డైట్లో కార్బోహైడ్రేట్లను తగ్గించడం అనేది ఒక నియమం అయితే, మరొక నియమం ప్రకారం ప్రొటీను సంబంధిత ఆహారాలను తీసుకొనవలసి ఉంటుంది. ప్రొటీన్ అనేది శరీరంలోని కండరాలను పునర్నిర్మించడంలో సహాయపడుతుంది. క్రమంగా శరీరాన్ని ఎక్కువ ప్రోటీన్తో నింపవలసిన అవసరం ఉంటుంది. అనగా మాంసం, గుడ్లు మొదలైనవి మీ ఆహారప్రణాళికలో అధికంగా జతచేయవలసి ఉంటుంది. శరీరంలో ప్రొటీన్ నిక్షేపాలు అధికమవడం వలన మూత్రపిండాలు వ్యర్ధాలను వడకట్టి బయటకు పంపడంలో అధిక శ్రమ చేయవలసి ఉంటుంది. క్రమంగా మూత్రపిండాలపై ఒత్తిడి పెరగడం, ఆరోగ్య సమస్యలు తలెత్తడం వంటివి పరిపాటి.

6.గుండె సమస్యలు

6.గుండె సమస్యలు

కీటోడైట్లో ప్రోటీన్ నిక్షేపాలను అధికంగా తీసుకోవలసి ఉన్న కారణాన, రక్తంలో ప్రోటీన్ అధికమవడం వలన ధమనులలో కొవ్వు నిక్షేపాలు పేరుకొని పోతాయి. క్రమంగా రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు అధికంగా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

English summary

Keto Diet: 6 Surprising Side Effects You Need To Know About

Many people follow the keto diet to lose weight, in order to get fitter and healthier. The keto diet is a new diet trend which is popular as it promises quick weight loss. A few side effects of this diet are that it can lead to persistent fatigue, raise the chances of weight gain, cause excess thirst and constipation, & it can also harm the kidneys and the heart.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more