TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
ఈ చిన్న చిట్కాలతో పొట్ట చుట్టూతా చేరి ఉన్న కొవ్వును తగ్గించుకోవచ్చు
మీలో కొంతమందికి పొట్ట చుట్టూ కొవ్వు చేరి, సమస్య పరిష్కారం దిశగా కొన్ని వందల వ్యాసాలు చదివి ఉండవచ్చు. నిజానికి పొట్ట చుట్టూ చేరి ఉన్న కొవ్వు తగ్గించడం అంత సులువైన విషయమయితే కాదు. దీనికి కాస్త సమయం వెచ్చించాలి మరియు ఓర్పు ముఖ్యంగా ఉండాలి. ఏది ఏమైనా, పొట్ట చుట్టూ కొవ్వు చేరి ఉండడం మాత్రం ఎప్పటికైనా అనారోగ్యాలను తెస్తుంది అన్నది సత్యం. కావున జాగరూతులై వ్యవహరించడం మేలు.
పొట్ట చుట్టూ చేరిన కొవ్వు, మనిషి ఆత్మవిశ్వాసాన్ని సైతం దెబ్బతీయగలదు. ఈ సమస్యను తగ్గించుకొనుటకు ముందుగా మీపై, మీ ఆరోగ్యంపై మీకు ప్రేమ ఉండాలి. క్రమంగా ఆరోగ్యంపై దృష్టి సారించాలి. పట్టుదలతో, ఓర్పుతో కొన్ని చర్యలను పాటించడం ద్వారా, ఖచ్చితమైన ఫలితాలను పొందగలరు. ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం ఉన్నవాళ్ళు అనారోగ్యాలను లెక్క చేయరు.
కొంతమందికి పొట్ట ముందుకు వేలాడుతూ కనిపిస్తుంది. దీన్ని టమ్మీ ఫాట్, లేదా విసరల్ ఫాట్ అని వ్యవహరిస్తారు. ఈ కొవ్వు నెమ్మదిగా శరీర అంతర్గత అవయవాలకు కూడా వ్యాపిస్తుంది. తద్వారా, రక్తపోటు, గుండె, మధుమేహ సమస్యలతో పాటు కాన్సర్ వంటి అనేక ఇతర దీర్ఘకాలిక ప్రాణాంతక సమస్యలకు కూడా కారణమవుతుంది.
కావున ఎంత వీలయితే అంత త్వరగా పొట్ట చుట్టూ చేరి ఉన్న కొవ్వును తగ్గించుకోవడం మంచిదిగా వైద్యులు సూచిస్తుంటారు. పొట్ట చుట్టూ చేరి ఉన్న కొవ్వును తగ్గించే క్రమంలో భాగంగా ఇక్కడ కొన్ని పద్దతులను పొందుపరచడం జరిగినది.
1.ఎక్కువ నీటిని తాగండి:
మనిషి జీవించడానికి నీరు అనేది ప్రాధమిక అవసరంగా ఉండడం మాత్రమే కాకుండా, మన జీవక్రియలను వేగవంతం చేయడానికి మరియు స్వేదం లేదా మూత్రం ద్వారా శరీరంలోని విషతుల్య రసాయనాలను బయటకు పంపడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. అందుకని ఆహారం తీసుకునే అరగంట ముందు కనీసం ఒక గ్లాస్ నీళ్ళైనా తీసుకోవలసి ఉంటుంది. తద్వారా ఆకలి తగ్గి తక్కువ ఆహారం తీసుకునేలా చేస్తుంది. మరియు సమయానుసారం శరీరానికి తగిన మోతాదులో నీటిని అందివ్వడం మూలంగా, శరీరాన్ని డీ-హైడ్రేట్ వంటి సమస్యల నుండి తప్పించవచ్చు. మరియు రోజంతా శరీరం ఉత్సాహంగా ఉండడంలో, చక్కర పదార్దాలవైపుకి మనసు వెళ్ళకుండా చేయడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది.
2.కంటి నిండా నిద్ర:
ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ రాత్రి పగలు అనే తేడా లేకుండా చదువు, పని వంటి అనేక అంశాలతో కూడిన బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. ఏది ఏమైనా అన్నిటికన్నా ముఖ్యం శరీర ఆరోగ్యం. కంటికి సరైన నిద్రని ఇచ్చినప్పుడే శరీరం ఉత్సాహంగా ఉంటుంది. నిద్రలేమి అనునది, శరీరానికి నిస్తేజాన్ని ఇవ్వడమే కాకుండా, అనేక శారీరిక, మానసిక అనారోగ్యాలకు కూడా కారణమవుతుంది. కావున కనీసం రోజుకు 8గంటలు నిద్ర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
సరైన మోతాదులో నిద్రలేని పక్షంలో గ్రెలిన్ అనే హార్మోను ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ జంక్-ఫుడ్ మరియు చక్కర పదార్దాల వైపుకు మొగ్గు చూపేలా ప్రేరేపిస్తుంది. మరియు కార్టిసాల్ హార్మోన్ నిల్వలు కూడా పెరుగుతాయి, ఇవి శరీరంలో గ్లూకోస్ నిల్వలను పెంచి మధుమేహానికి దారితీస్తుంది. అంతేకాకుండా, పొట్ట చుట్టూ కొవ్వు చేరడానికి ప్రధాన కారకంగా మారుతుంది. కంటినిండా నిద్ర పోవడం మూలంగా ఇటువంటి అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
3.వ్యాయామం:
రోజూవారి ప్రణాళికలలో భాగంగా వ్యాయామం కూడా తప్పనిసరిగా ఉండాలి. పొట్ట చుట్టూ చేరిన కొవ్వును తగ్గించడంలో వ్యాయామం ఎంతగానో సహాయం చేస్తుంది. వ్యాయామం, జీవక్రియల రేటును పెంచడమే కాకుండా శరీరoలోని అదనపు కొవ్వును తగ్గిoచడంలో సహాయం చేస్తుంది. కార్డియో కండరాల పటుత్వం కోల్పోకుండా కాపాడడమే కాకుండా దాదాపు 20% కడుపు కొవ్వును కూడా తగ్గిస్తుంది.
4.కాలరీలకు చెక్ పెట్టండి:
మీ పొట్ట చుట్టూ చేరి ఉన్న కొవ్వును తగ్గించుకోవాలని భావిస్తున్న ఎడల, అధిక కాలరీలకు వీలైనంత దూరంగా ఉండడం మేలు. ముఖ్యంగా నూనె పదార్ధాలు, డీప్-ఫ్రై పదార్ధాలు, ఫాస్ట్-ఫుడ్, జంక్-ఫుడ్, నిల్వ ఉంచిన పదార్ధాలకు దూరంగా ఉండడం ఎంతో మేలు. వీటికి బదులుగా ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్ధాలు తీసుకోవడం ద్వారా ఆకలి తగ్గడం, క్రమంగా శరీరంలోని చెడు కొవ్వు కూడా తగ్గడం జరుగుతుంది.
5.దైనందిక జీవనంలో మార్పులు అవసరం:
సోమరితనం, వ్యాయామం చేయకపోవడం, జంక్-ఫుడ్, ఫాస్ట్-ఫుడ్ వంటి వాటికి మొగ్గు చూపడం, చెడు వ్యసనాలు వంటి అనేక అనారోగ్యకర జీవనశైలికి ఉదాహరణలు. మీ పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించుకోవాలని మీరు భావిస్తున్నట్లయితే, మీ జీవనశైలిలో కూడా మార్పులు అవసరమవుతాయి. పైన చెప్పిన అంశాలలో ఏ ఒక్కటి మీలో ఉన్నా, అది మీలక్ష్యానికి అవరోధంగానే పరిణమిస్తుంది.
6.ఒత్తిడిని జయించండి:
ఎలా ఒత్తిడిని అధిగమించవచ్చు? అనేక అధ్యయనాల ప్రకారం ఒత్తిడి అనేది స్వతహాగా మనకు మనమే ఆహ్వానించే అంశం. మనమే పిలిచి, మనమే ప్రభావితమై, మనమే దానిని తరిమికొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాము.
ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఈ కార్టిసోల్ హార్మోన్, మధుమేహానికి ప్రధాన కారకంగా ఉండడమే కాకుండా, పొట్ట చుట్టూతా కొవ్వు చేరడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. దీనికి తోడుగా అనారోగ్యకర ఆహారప్రణాళిక తోడైతే, ఫలితాలు తీవ్రంగా ఉంటాయి కూడా. కావున ఒత్తిడిని తగ్గించడానికి, ఆరోగ్యకర ఆహారప్రణాళిక ఎంతో అవసరం. మరియు, తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ పదార్ధాలను తీసుకునేలా ప్రణాళిక ఉండాలి. తద్వారా కార్టిసోల్ ను నియంత్రించవచ్చు.
7.గ్రీన్-టీ తాగండి:
గ్రీన్-టీ అనేది శరీరంలోని కొవ్వును తగ్గించడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్స్, కెఫీన్ జీవక్రియల రేటును పెంచడంలో తోడ్పడుతాయి. ఒక అద్యయనం ప్రకారం రోజులో రెండు సార్లు గ్రీన్-టీ తీసుకున్న వారిలో 16శాతం ఎక్కువగా పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడం జరిగింది.
8.ఆహారం:
పొట్ట చుట్టూతా కొవ్వును తగ్గించడంలో సమతుల్య ఆహారం అనేది అత్యంత ముఖ్యమైన అంశంగా ఉంది. ఆహారంలో తక్కువ కేలరీలతో కూడిన పండ్లు, తృణ ధాన్యాలు మరియు కూరగాయలు తప్పనిసరిగా ఉండాలి. అధిక ఉప్పు, చక్కెర పదార్ధాలు మరియు అధిక కొవ్వు పదార్ధాలకు వీలైనంత దూరంగా ఉండడమే మేలు.
పొట్ట చుట్టూ చేరిన కొవ్వు ఎంత తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందో ఇదివరకే మనం చర్చించాము. కావున సమయం వృధా చేయకుండా, ఆరోగ్యంపై దృష్టి సారించి తగుచర్యలు తీసుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందగలరు.