For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధుమేహం నియంత్రణ నుండి, జ్వరాలను తగ్గించే వరకు అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉన్న పొట్లకాయ.

|

పొట్లకాయను, స్నేక్ గార్డ్, సర్పెంట్ గార్డ్ (లేదా) చిచిండా అని కూడా పిలుస్తారు. కుకుర్బిటాసియా, దోసకాయ మరియు స్క్వాష్తో కూడిన గుమ్మడి కుటుంబానికి చెందిన కూరగాయల్లో ప్రసిద్ది చెందింది పొట్లకాయ. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిచెందినప్పటికీ, ఈ కూరగాయలలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినవారు మాత్రం తక్కువే. ఇది దక్షిణ మరియు ఆగ్నేయాసియా ప్రాంతాలైన భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక మరియు చైనా వంటి దేశాలలో విరివిగా లభిస్తాయి.

ఈ కూరగాయల అసాధారణ ఆకారం నుండి దానికి స్నేక్ గార్డ్ అని పేరు వచ్చింది. మరియు అనేక పోషక పదార్ధాలతో నిండి ఉంటుంది. అసలు ఎందుకు మనం పొట్లకాయను తరచుగా వంటలలో జోడించాలి ? ఇప్పుడు తెలుసుకుందాం.

Snake Gourd: Nutritional Value, Health Benefits & Side-effect

ముందుగా పొట్లకాయలో ఉండే పోషకవిలువలు :

• విటమిన్స్ – ఎ,బి మరియు సి

• పిండిపదార్థాలు

• ఖనిజాలు - ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, అయోడిన్, పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్ మరియు మెగ్నీషియం

• సులభంగా జీర్ణమయ్యే ఫైబర్

• నీరు

1. మధుమేహం యొక్క ప్రభావం తగ్గిస్తుంది :

1. మధుమేహం యొక్క ప్రభావం తగ్గిస్తుంది :

టైప్-2 మధుమేహంగల వ్యక్తులకు పొట్లకాయ గొప్ప ఆహారపదార్ధంగా ఉన్నది, ఇది కేలరీలలో తక్కువగా ఉంటుంది మరియు బరువు నిర్వహణలో కూడా సహాయపడుతుంది. మధుమేహం చికిత్సకోసం, చైనీస్ చికిత్సలో విరివిగా ఉపయోగించే ఈ పొట్లకాయ వాడకం వలన, దీనిలోని పోషకతత్వాలు మరియు లక్షణాల కారణంగా డయాబెటిస్ ప్రభావాలు తగ్గుతాయని నిరూపించబడింది.

2. బిలియస్ మరియు మలేరియా జ్వరములను తగ్గించడంలో :

2. బిలియస్ మరియు మలేరియా జ్వరములను తగ్గించడంలో :

పొట్లకాయతో చేసిన డికాషన్ తీసుకోవడం ద్వారా జ్వరం ప్రభావాలు తగ్గుతాయని చెప్పబడింది. రక్తస్రావం, జ్వరం లేదా వికారం మరియు విరేచనాలు వంటి అంతర్గత శరీర ఉష్ణోగ్రతను పెంచే ఏ జ్వరాన్నైనా తగ్గించే ప్రభావాన్ని పొట్లకాయ కలిగి ఉంటుందని చెప్పబడింది. కొద్దిగా తేనె మరియు ఛిరెట్టా అని పిలవబడే మూలికను పొట్లకాయతో కలిపి తీసుకోవడం ద్వారా బిలియస్ మరియు మలేరియా జ్వరాల చికిత్సలో మరింత ప్రభావవంతంగా చేస్తుందని చెప్పబడింది.

౩. కామెర్లు :

౩. కామెర్లు :

కామెర్లతో బాధపడుతున్న ప్రజలు తేలికపాటి మరియు సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవలసి ఉంటుంది. కొత్తిమీర, పొట్లకాయ ఆకులను కలిపి తీసుకోవడం కామెర్ల చికిత్సలో అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. బైలిరూబిన్ స్థాయిలను తగ్గించి, కామెర్ల చికిత్సకు ఎంతగానో దోహదం చేస్తుంది. రోజులో మూడు మార్లు కనీసం ఈపానీయం తీసుకోవలసి ఉంటుంది. గృహచికిత్స అయినా అద్భుతంగా పనిచేస్తుంది.

4. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

4. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

పొట్లకాయలోని పోషకపదార్ధాలు హృదయ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను అరికట్టడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. ముఖ్యంగా తలనొప్పి వంటివి. మరియు నాడీ వ్యవస్థను క్రమబద్దీకరించడం ద్వారా రక్తపోటును సైతం తగ్గించగలదు. ఒత్తిడి మరియు హృదయ సంబంధిత నొప్పిని తగ్గించడంలో పొట్లకాయలోని విటమిన్లు ఖనిజాలు అద్భుతంగా సహాయపడగలవు. హృదయ సంబంధిత సమస్యలను దూరం చేయడానికి రోజులో కనీసం 2కప్పుల పొట్లకాయరసం తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణుల సూచన.

5. మలబద్ధకం తగ్గించడంలో :

5. మలబద్ధకం తగ్గించడంలో :

మలబద్ధకం, మీ ఆహారంలో నీరు మరియు ఫైబర్ లేకపోవడం మరియు సరైన శారీరిక వ్యాయామం లేకపోవడం మొదలైన కారణాల వలన వస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి, డయాబెటిస్, ప్రేగు ప్రకోప సిండ్రోమ్, మొదలైనవి తీవ్రమైన అనారోగ్య స్థితి లక్షణాలుగా కూడా ఉంటాయి. మలబద్దకాన్ని నివారించడంలో పొట్లకాయ పనితీరు : మీ ప్రేగుకదలికను మెరుగుపరుచుకోవడానికి ప్రతి ఉదయం 1-2 టీస్పూన్స్ పొట్లకాయ రసాన్ని తీసుకోవలసినదిగా సూచించబడింది. ఇది లాక్సేటివ్ వలె పనిచేసి, మలబద్దక సమస్యను దూరంచేయగలదు.

6. బరువును క్రమబద్దీకరిస్తుంది :

6. బరువును క్రమబద్దీకరిస్తుంది :

పొట్లకాయ తక్కువ కేలరీలతో ఉండడమే కాకుండా, కొవ్వుపదార్థాలు లేని కూరగాయగా కూడా ఉంటుంది. నీరు మరియు ఫైబర్తో పాటు ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది, తద్వారా బరువును క్రమబద్దీకరించడంలో అద్భుతంగా సహాయం చేస్తుంది. మీరు బరువు తగ్గించుకోవాలని చూస్తుంటే మీ ఆహారంలో పొట్లకాయను జోడించడం ఉత్తమం.

7. చుండ్రును దూరంగా ఉంచుతుంది :

7. చుండ్రును దూరంగా ఉంచుతుంది :

మీరు చుండ్రు సమస్యలతో బాధపడుతున్నట్లయితే, మీతలపై పొట్లకాయ రసం రుద్దడం ద్వారా ఈసమస్యను సులభంగా వదిలించుకోవచ్చని చెప్పబడింది. చుండ్రు సంబంధిత సమస్యల చికిత్సలో ఈరసం ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది, మీజుట్టుపై రసం వర్తించి, ఉత్తమ ఫలితాలను పొందడానికి 30నిమిషాలు కనీసం ఉంచి, ఆతర్వాత మీజుట్టును కడిగివేయడం మంచిది.

8. శరీరం నుండి విషతుల్య రసాయనాలను తొలగించడంలో :

8. శరీరం నుండి విషతుల్య రసాయనాలను తొలగించడంలో :

అప్పుడప్పుడు శరీరంలో నిర్విషీకరణకు పూనుకోవడం ఆరోగ్యానికి మంచిది. అందుకే అనేకమంది నిమ్మకాయ-తేనె కలిపిన నీరు, పీచుపదార్ధాలు తీసుకోవడం, గ్రీన్–టీ అలవాటుపడడం, త్రిఫల చూర్ణాలు, ఆయుర్వేద లేహ్యాలు, లాక్టో సంబంధిత పదార్ధాలను ఆహారంలో తీసుకుంటూ మలబద్ధకం సమస్యలను దూరంచేస్తూ, నిర్విషీకరణకు పూనుకుంటూ ఉంటారు. అదేవిధంగా పొట్లకాయ కూడా మీ శరీరంలోని విషపూరిత రసాయనాలు, పదార్ధాలను బయటకు విసర్జించడం ద్వారా మీఅవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. పొట్లకాయ రసం, మూత్ర మరియు మలవిసర్జనను మెరుగుపరచడం ద్వారా నిర్విషీకరణకు సహాయపడుతుంది. మరియు కాలేయ పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

9. దంతాలను మరియు ఎముకలను బలపరుస్తుంది :

9. దంతాలను మరియు ఎముకలను బలపరుస్తుంది :

మీ పళ్ళు మరియు ఎముకలను బలోపేతం చేయడంలో పొట్లకాయలోని కాల్షియం సహాయపడుతుంది. కాల్షియం లేకపోవడం కారణంగా బోలు ఎముకల వ్యాధి(ఆస్టియో పోరాసిస్), ఆస్టెయోపెనియా మరియు హైపోకాల్సేమియా వంటి వివిధ వ్యాధులకు దారితీస్తుంది. ఈ ఆరోగ్య పరిస్థితులు ప్రధానంగా విటమిన్-డి లేకపోవడం వలన కలుగుతాయి. పొట్లకాయ మన శరీరంలో కాల్షియం శోషణను ప్రోత్సహిస్తుంది. క్రమంగా ఎముక ఆరోగ్యంలో కాల్షియం అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. వయసు రీత్యా కాల్షియం మోతాదులు శరీరంలో సరైన మోతాదులో ఉండేలా చూసుకోవడం మన భాద్యత.

10. చర్మం లోపాల నివారణలో :

10. చర్మం లోపాల నివారణలో :

అలోపేసియా వంటి చర్మలోపాల అదనపు ఒత్తిడి వలన లేదా మీ రోగనిరోధక వ్యవస్థ తగ్గుదల వలన, మీ జుట్టు ఫొలికల్స్ మీద ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితి యొక్క ప్రధాన లక్షణం జుట్టు రాలడం. ఇది తాత్కాలిక లేదా శాశ్వత సమస్యగా మారవచ్చుకూడా. మీరు ఈ పరిస్థితి కారణంగా బాధపడుతున్నట్లయితే మీ జుట్టు ప్రభావిత ప్రాంతాల్లో పొట్లకాయరసాన్ని దరఖాస్తు చేయడం ద్వారా ప్రయోజనాల్ని పొందగలరని చెప్పబడింది.

English summary

Snake Gourd: Nutritional Value, Health Benefits & Side-effect

Snake gourd is a low-calorie veggie which has numerous health benefits like controlling diabetes, treating bilious fever, managing weight, curbing scalp-related disorders, improving bowel movement, etc. It's a good source of vitamins A, B & C, carbs, minerals, fibre & water content. Pregnant women should avoid over-consumption of this veggie
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more