For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రోజు నుంచే యోగా మొదలుపెట్టండి, యోగా చేసే ముందు ఇవి మాత్రం మరిచిపోకండి

మనసును కూడా స్పర్శించి, శరీరాన్ని, మనస్సును బ్యాలెన్స్ చేసే శక్తి ఒక్క యోగాభ్యాసానికి మాత్రమే ఉంది. యోగా చేసే ముందు సూచనలు, యోగాకు ముందు జాగ్రత్తలు, యోగా ఎలా చేయాలి

|

ఆరోగ్యం అంటే అందరూ శరీరానికి సంబంధించినదని అనుకుంటారు. కానీ నిజమైన ఆరోగ్యానికి మూలాలు మనస్సులో ఉంటాయి. మనసు నిర్మలంగా, నిశ్చలంగా ఉన్న చోట వ్యాధులకు ఆస్కారం చాలా తక్కువ. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు. మనం రకరకాల వ్యాయామాలు చెయ్యొచ్చు. పుష్టినిచ్చే ఆహారం తీసుకోవచ్చు. మందులు వేసుకోవచ్చు. ఎన్ని చేసినా ఇవన్నీ శరీరాన్ని తప్పించి మనసును తాకలేవు.

మనసును కూడా స్పర్శించి

మనసును కూడా స్పర్శించి

మనసును కూడా స్పర్శించి, శరీరాన్ని, మనస్సును బ్యాలెన్స్ చేసే శక్తి ఒక్క యోగాభ్యాసానికి మాత్రమే ఉంది. శరీరాన్ని, మనస్సును ఒక గాడిలో పెట్టి, రెండింటిని సమతుల్యంలోకి తెచ్చేదే యోగ. యోగాకున్న సమగ్రత, సంపూర్ణత్వం మరే ఇతర సాధారణ వ్యాయామాలకు ఉండదు. శారీరక వ్యాయామాన్ని మించిన ప్రయోజనాలున్నందునే పాశ్చాత్య ప్రపంచం కూడా ఇప్పుడు యోగా పట్ల ఆకర్షితులవుతున్నారు.

రక్త ప్రసరణ మెరుగు

రక్త ప్రసరణ మెరుగు

యోగాసనాల వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరం నుంచి విషతుల్యాలు వేగంగా బయటకు వెళ్లిపోతాయి. అవయవాల పనితీరు బాగుంటుంది. మనసును శ్వాస ప్రక్రియపై లగ్నం చేసి, ఏకాగ్రత సాధన చెయ్యడం వల్ల మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యము పెరుగుతుంది. నానా రకాల ఒత్తిళ్లలో కూరుకుపోతున్న నేటి తరానికి యోగా అత్యంత ఆవశ్యకంగా మారింది.

యవ్వనంగా జీవించవచ్చు

యవ్వనంగా జీవించవచ్చు

యోగాతో సంపూర్ణ ఆరోగ్యంతో, మానసిక బలంతో నిత్యం యవ్వనంగా జీవించవచ్చు. రోజు కొద్దిసేపు యోగా చేస్తే ఆసుపత్రికి పరుగు తీయాల్సిన అవసరం ఉండదు. యోగా ఒక మతానికి సంబంధించినది కాదు ఇది కేవలం ఆరోగ్యానికి మాత్రమే సంబంధించిన ప్రక్రియ అనే విషయాన్ని గుర్తించాలి.అయితే యోగా చేయడానికి ఒక విధానం ఉంది. దాని ప్రకారం చేస్తేనే మనం చేసే యోగా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. అయితే యోగాను అలక్ష్యదోరణిలో చేస్తే పలు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంది.

చాప మీద యోగా సాధన

చాప మీద యోగా సాధన

ముఖ్యంగా యోగా పరకడుపున చేయాలి. తేలికపాటి ఆహారం తీసుకుని ఉన్నా పర్వాలేదు. దుప్పటిపైన గానీ, చాప మీద కానీ యోగా సాధన చేయాలి. మహిళలు గర్భిణిలుగా ఉన్నప్పుడు, లేదా ఆరోగ్యం బాగోలేనప్పుడు యోగా చేయకూడదు. యోగా చేసే వారు సౌకర్యంగా ఉండే తేలికపాటి దుస్తులను ధరించి యోగా సాధనను చేయాలి.

విశ్రాంతిగా ఉన్న స్థితిలో

విశ్రాంతిగా ఉన్న స్థితిలో

బాగా అలసటగా ఉన్నప్పుడు, ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సందర్భంలో ప్రశాంతమైన వాతావరణంలో బాడీ, మైండ్ విశ్రాంతిగా ఉన్న స్థితిలో యోగా మొదలుపెట్టాలి. ప్రార్ధనతో సాధన ప్రారంభించాలి. ప్రార్ధన వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. శ్వాస తీసుకోవడం కానీ, వదలడం కానీ నాసిక ద్వారా మాత్రమే చేయాలి. యోగా సాధన ముగిశాక 20 - 30 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఆహారం కూడా యోగా చేసిన తర్వాత 20 -30 నిమిషాలకు చేయాలి.

గంట సమయం కేటాయిస్తే మంచిది

గంట సమయం కేటాయిస్తే మంచిది

యోగసనాలు ఎవరుబడితే వారు వేయకూడదు. యోగసనాలు వేసేవారు పాటించాల్సిన అంశాలు కొన్ని వున్నాయి. అవి ఆసనాలకు కేటాయించే సమయం. తర్వాత ప్రాణాయామం, ధ్యానంకు నిర్దేశించుకున్న సమయం. ఇందుకు సంబంధించి ప్రతి రోజు యోగకు గంట సమయం కేటాయించాలి. దానిలో అరగంట ఆసనాలకు, పది నిమిషాలు ప్రాణాయామం, ఇరవై నిమిషాలు ధ్యానంకు కేటాయించుకుంటే మంచి ఫలితం వస్తుంది.

స్నానం చేస్తే మంచిది

స్నానం చేస్తే మంచిది

8 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల వాళ్లు మాత్రమై యోగా చేయాలి. తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత యోగాసనాలు వేయాలి. ఆసనాలు వేసే ముందుగా గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే మంచిది. ఉదయాన్నే ఆసనాలు వేయడం వలన ఆ సమయంలో ఏర్పడే గాలిలో ప్రాణ శక్తి ఎక్కువగా ఉంటుంది. శబ్దాలు, గోలలు లేకుండా ఉండే ప్రదేశాలలో మాత్రమే యోగా చేయాలి.

ఛాతీ ద్వారా గాలి పీల్చుకుంటే

ఛాతీ ద్వారా గాలి పీల్చుకుంటే

పలుచటి బట్టను నేలపై పరిచి పద్మాసనం లేదా సుఖాసనం లేదా మీకు ఇష్టమైన ఆసనాన్ని వేయాలి. ఆ తరువాత ప్రశాంతంగా కనులు మూసుకొని ధ్యాస శ్వాసమీదే నిలపాలి. గాలి వదిలినప్పుడు పొట్టను లోపలకు పీల్చినపుడు ముందుకు వస్తుందో లేదానని గమనించాలి. దీనికై పొట్ట ద్వారా కాకుండా, ఛాతీ ద్వారా గాలి పీల్చుకుంటే మాత్రం శ్వాససరి కాదని గుర్తించుకోవాలి.

ఎప్పుడూ తొందర పడకూడదు

ఎప్పుడూ తొందర పడకూడదు

ఆసన ప్రారంభ సమయంలో పద్మాసనం, వజ్రాసనం ఏదైనా వేయాలి. ఆసనం వేసేటప్పుడు ఎప్పుడూ తొందర పడకూడదు నెమ్మదిగ వేయాలి. ఆసనం వేసిన తరువాత కొన్ని నిమిషాల పాటు అలానే ఉండాలి. ఆసనం వేసేటపుడు ఎంత నెమ్మదిగా వేస్తామో అంతకంటే నెమ్మదిగా మామూలు స్థానంలోకి రావాలి. గాలి పీల్చటం, వదలటం వంటి ఆసనాల్లో పైకి శబ్దం వచ్చేలా వదలటం, పీల్చటం చేయకూడదు.

ఆయాస పడుతూ చేయకూడదు

ఆయాస పడుతూ చేయకూడదు

ఏ ఆసనమైనా వేసేటపుడు రొప్పుతూ లేదా ఆయాస పడుతూ చేయకూడదు. ఇలా చేయడం మీ శరీర ఆరోగ్యానికి హానికరం. కావున ఆసనాలు వేయాలనుకుంటే కాస్తే నెమ్మదిగా, జాగ్రత్తగా వేయాలి. అప్పుడే మీరు చేయాలకున్నది చేయగలుగుతారు. యోగా చేసేటపుడు తొలరపాటుతనం పనికిరాదు. ఉదయాన్నే యోగాచేయుటవలన మంచి ఆరోగ్యం లభిస్తుంది, రోజంతా ప్రశాంతంగా ఉంటుంది

నిర్ధారించుకోవాలి

నిర్ధారించుకోవాలి

ఆసనాలు వేస్తున్నామని ఇప్పటికే వాడుతున్న మందులు, వైద్యులను సంప్రదించటాన్ని మాత్రం మానకూడదు. తర్వాత ఆసనాలు వేసే విషయంలో ఏ ఇబ్బంది వచ్చినా దగ్గరిలోని యోగ మాష్టారును సంప్రదించి ఆసనాలను సరిగా వేస్తున్నారో లేదో నిర్ధారించుకోవాలి.

శరీర సామర్థ్యాన్ని గుర్తించి

శరీర సామర్థ్యాన్ని గుర్తించి

గాలి పీల్చటం, వదలటం లాంటి ఆసనాల్లో పైకి శబ్దం వచ్చేలా వదలటం, పీల్చటం చేయకూడదు. ప్రతిదీ నెమ్మదిగా, సరళంగా ప్రశాంతంగా చేయాలి. ఏ ఆసనం అయినా సరే రొప్పుతూ, ఆయాసపడుతూ చేయకూడదు. శరీర సామర్థ్యాన్ని గుర్తించి అంత సేపే వుండాలి. అంతేకాని అలుపుసొలుపు లేకుండా యోగ చేయాలనుకుంటే సమస్యను కొని తెచ్చుకున్నట్లే.

Read more about: యోగా
English summary

warm ups before yoga asanas

warm ups before yoga asanas
Story first published:Wednesday, June 20, 2018, 17:48 [IST]
Desktop Bottom Promotion