వెచ్చని నీటితో తేనె మరియు ముడి వెల్లుల్లి తీసుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చా :

Posted By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

కొంతమంది తమ శరీరాన్ని ఎలా ఉంటే అలాగే ప్రేమిస్తారు, అటువంటి వ్యక్తులు నిజానికి చాలా సంతోషంగా ఉంటారు. కానీ కొందరు ఒత్తిడికి లోనవ్వడం కారణంగా కానీ, శరీరానికి సరిపడని అధిక కొవ్వులు కలిగిన ఆహారం వలన కానీ శరీరం అధిక బరువుకు లోనవ్వడం జరుగుతుంది. సమస్యలన్నీ ఆలోచనా విధానంలోనే ఉంటాయనేది జగమెరిగిన సత్యం.

బరువు తగ్గడం అనేది మాత్రం వ్యక్తి యొక్క విశ్వాసం మరియు ఏకాగ్రతల మీదే ఆధారపడి ఉంటుంది. భాధాకరమైన విషయం ఏమిటంటే, ఆ రెండూ ఎక్కువమందిలో లేకపోవడమే. జీవితం సాఫీగా సాగాలి అంటే సరైన బరువుని నియంత్రించుకోక తప్పదు. కానీ ఏదైనా సరే వెంటనే జరిగిపోవాలి అని కోరుకోవడం మానసిక అశాంతినే చివరికి మిగులుస్తుంది.

Drink Warm Water With Honey And Raw Garlic For Weight Loss

బరువు వేగంగా కోల్పోవడానికి మీరేం చేస్తారు? ఆహార పద్దతులను మారుస్తారా? శస్త్రచికిత్సలను ఆశ్రయిస్తారా? స్లిమ్మింగ్ కార్యక్రమాలు చేపడుతారా? లేక అధిక వ్యాయామ కార్యక్రమాలకు పూనుకుంటారా?

ఇవన్నీ మీకు తాత్కాలిక ఫలితాలనే ఇస్తాయి. కానీ మీరు వాటిని ఆపే నిమిషం, మరలా మొదటికే వస్తుంది. బదులుగా, ఆరోగ్యకరమైన మరియు సహజమైన పద్దతులను ఆశ్రయించడం ద్వారా శరీరంలోని విషపదార్ధాలను తరిమికొట్టి, తద్వారా బరువు తగ్గే ఆలోచనలు చేయవచ్చు కదా.

బరువు తగ్గడానికి రెండు అత్యంత ప్రభావవంతమైన సహాయకాలు అనేక వందల సంవత్సరాల నుండి వారసత్వంగా వింటున్నవే , తేనె మరియు ముడి వెల్లుల్లి కలిపిన వెచ్చని నీరు.

Drink Warm Water With Honey And Raw Garlic For Weight Loss

వెచ్చని నీటితో తేనె:

సరైన మోతాదులో నీరు తీసుకున్నంత మాత్రాన, శరీర విధులు క్రమం తప్పకుండా జరిగిపోతాయి అని అనుకోడానికి లేదు. కానీ సరైన పద్దతిలో వినియోగించినప్పుడు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. నీటిని వేడి చెయ్యడం లేదా గోరువెచ్చని నీటిని తీసుకోవడం ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేయవచ్చు.

ఈ వెచ్చని నీటిలో తేనె జోడించినప్పుడు, శరీరంలో కొవ్వు అదనపు పాళ్లను తొలగిస్తుంది. ఇక్కడ కొవ్వుని కరిగించి శక్తిగా మార్చి శరీర జీవక్రియలను పెంచుటలో సహాయం చేస్తుంది. ఖాళీ కడుపుతో ఉదయాన్నే ప్రారంభించినప్పుడు ఈ “ఆల్కలీన్ కంకషన్”( తేనె కలిపిన నీరు) అన్ని అవాంఛిత విషాలను శరీరం నుండి బయటకు వెళ్లగొట్టడంలో సహాయం చేస్తుంది. కానీ ఒక వారం తాగినంత మాత్రాన బరువు మొత్తం కోల్పోవచ్చని ఆశించకండి. ఈ ప్రక్రియ మన ఆహార విధానాలపై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ పానీయం బరువు తగ్గుటకు ప్రధానo గా పనిచేసే విషయాలలో ఒకటి. ఎందుకంటే మనం తినే చక్కెరకు , తేనె ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఈ ప్రత్యామ్నాయం 60% మీ క్యాలరీ తీసుకోవడం తగ్గిస్తుంది!

కావున, ప్రతి ఉదయం వెచ్చని నీటిలో తేనెని కలిపి ఒక గ్లాసు త్రాగాలి, అది బాగా పనిచేయడానికి సగం నిమ్మకాయ రసాన్ని కలపండి. తర్వాత ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోండి.

Drink Warm Water With Honey And Raw Garlic For Weight Loss

ముడి వెల్లుల్లి:

వెల్లుల్లి ఒక ఉబ్బిన, సులభంగా సాగు చేయదగిన మొక్క. ఇది ఉల్లిపాయల కుటుంబానికి చెందినది. ఉల్లిపాయలో బరువు తగ్గుదలకు కారణమయ్యే అనేక సల్ఫర్ కలిగిన సమ్మేళనాలు ఉన్నాయి.

ఇది శరీరానికి చాలా ముఖ్యమైనది మరియు ఇది బరువు నష్టం కోసం అద్భుతంగా పరిగణించబడుతుంది. ఇది ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయికి సంబంధించిన హెచ్చుతగ్గులు నియంత్రిస్తుంది. తద్వారా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మరియు శక్తివంతమైన డిటాక్సిఫైయర్గా పనిచేస్తుంది.

ఇది వివిధ మార్గాల్లో వినియోగించుకోవచ్చు:

వెచ్చని నీటితో, తేనె తో, కలబంద రసంతో, నిమ్మతో, ఆపిల్ సైడర్ తో, వెనిగర్ తో లేదా హెర్బల్ టీ తో కలిపి తీసుకోవడం వలన అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం.

ముడి వెల్లుల్లి 4-5 రెబ్బలు కన్నా అధికంగా తీసుకున్న ఎడల నిరాశ, కడుపు మంట, గుండె మంట మరియు అనేక ఇతర దుష్ప్రభావాలకు కారణమవుతాయి. కావున ఏదైనా మితంగానే తీసుకోవలసి ఉంటుంది.

ఈ విధంగా, నియంత్రణలో వెల్లుల్లి వాడకం మీ అదనపు పౌండ్ల భారాన్ని తగ్గించి క్రమంగా అద్భుతాలను చేయగలదు.

వెచ్చని నీటిలో తేనె లేదా ముడి వెల్లుల్లి తీసుకోవడం వల్ల బరువు తగ్గిపోతుందని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇది ఆరోగ్యకరమైన ఆహారం . మరియు ఇక్కడ మోస్తరు వ్యాయామం కూడా అవసరం. ఈ రెండు మీ జీవక్రియలను పెంచుటకు మరియు అవాంఛనీయ ఆకలికి అడ్డుకట్ట వేసి తద్వారా అధిక బరువు తగ్గించుటలో సహాయం చేస్తుంది.

బరువు తగ్గడానికి సులభ మార్గాలు అన్వేషిస్తే మొదటికే మోసం వస్తుంది, ఈ సందర్భంలో నిదానమే ప్రధానం అన్న సూత్రం వర్తిస్తుంది. పై విధంగా చేయడం వలన బరువు కోల్పోవటానికి మాత్రమే కాకుండా, మీ శరీర అంతర్గత స్థితి మరియు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

English summary

Drink Warm Water With Honey And Raw Garlic For Weight Loss

Drink Warm Water With Honey And Raw Garlic For Weight Loss,Honey and raw garlic have awesome health benefits. But when you combine the two with warm water and drink it every day, you also reap the benefit of losing weight.