For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేడి నీళ్ళలో తేనె కలుపుని తాగడం మరియు ముడి వెల్లుల్లి తినడం మూలంగా ఊబకాయం తగ్గుతుందా

|

సరైన శరీర బరువు కలిగి దృడమైన శరీరంతో ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. కానీ వాస్తవానికి ఏదో ఒకలోపం మనసులో కనిపిస్తూనే ఉంటుంది. కన్ను బాలేదనో, ముక్కు బాలేదనో, హైట్ గా ఉండాలనో , వేరే వాళ్ళతో మన శరీరాలను పోల్చి చూసుకుంటూ మనిషి తన సహజత్వాన్ని కోల్పోతున్నాడు. ఎందరితోనో పోల్చి చూస్తే తాము వంద రెట్లు మేలు అన్న ఆశావహ దృక్పధం మనుషుల్లో లోపిస్తూ ఉంది. కొన్ని లోపాలు సహజంగా వస్తే, కొన్ని జీవన శైలి అసహజ పద్దతుల వలన సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అందులో ఊబకాయం కూడా ఒకటి. కొందరికి జన్యు పరమైన సమస్యల వలన ఊబకాయం తలెత్తితే, కొందరు చేతులారా అసహజ జీవనశైలిని అవలంభించి కోరి ఊబకాయాన్ని తెచ్చుకుని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు.

అయితే వాస్తవానికి శరీర బరువు, క్రొవ్వు, సన్నగా ఉండడం గురించి కాదు, ఎలా ఉన్నా కూడా ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అన్నదే ప్రధాన అంశంగా ఉండాలి. మీ స్నేహితుల్లో ఎవరైనా జీరో సైజ్ అవలంబిస్తే, వారిని చూసి అసూయ చెందుతూ తాము కూడా అలా మారాలని భావించేవారు అనేకులు. కానీ ఏది కూడా వెంటనే ఫలితాలను చూపించవు. వైద్యుని పర్యవేక్షణలో, శరీరానికి తగ్గ విధంగా ఆహారపు అలవాట్లను పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, సరైన జీవన శైలిని అవలంబిస్తూ ఉన్న ఎడల ఎదో ఒక రోజు మీరు అనుకున్న ఫలితాలను పొందగలరు.

మీరు ఈ ఫాన్సీ-సౌండింగ్ క్రాష్ డైట్లు, ఆరోగ్యకరమైన రీతిలో బరువు కోల్పోవడంలో మీకు సహాయం చేస్తాయని భావిస్తున్నారా? ఖచ్చితంగా క్లారిటీ మిస్ అవుతుంది. అవునా?

క్రాష్ డైట్స్ శీఘ్ర ఫలితాలను చూపుతాయి కానీ మీ శరీరంలో అత్యంత ముఖ్యమైన పోషకాలను అందివ్వకుండా, కొత్త సమస్యలకు కారణభూతాలవుతాయి. అలాగే, క్రాష్ డైట్స్ తాత్కాలిక పరిష్కారాలుగానే చూడాలి. వాటిని ఆపిన తర్వాత, మీరు కోల్పోయిన బరువును తిరిగి రెట్టింపు వేగంతో పొందుతారు. ఇది నిజం. అలాగని అదే డైట్ జీవితాంతం పాటించాలని చూస్తే, కోరి సమస్యలను తెచ్చుకున్నట్లే. ఈ మద్య కాలంలో కొందరు అనాలోచిత డైట్స్ తీసుకోవడం మూలంగా, ప్రాణాల మీదకు తెచ్చుకుని ఆసుపత్రుల పాలవడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం.

మీరు శాశ్వత ఫలితాలతో పాటు మంచి ఆరోగ్యానికి హామీ ఇచ్చే నిదానమైన మరియు స్థిరమైన పద్ధతిలో బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను పాటించడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

వందల సంవత్సరాలుగా పూర్వీకుల నుండి నేటి దాకా, తేనె మరియు ముడి వెల్లుల్లి ఊబకాయం తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతున్నాయి.

వేడి నీళ్ళలో తేనె కలుపుని తాగడం మరియు ముడి వెల్లుల్లి తినడం మూలంగా ఊబకాయం తగ్గుతుందా:

వెచ్చని నీటితో తేనె కలిపి తీసుకోవడం:

శరీరానికి సరైన మోతాదులో నీటిని ఇవ్వడం ద్వారా శరీరాన్ని నిర్జలీకరణం లేకుండా కాపాడుతూ జీవక్రియలను, శారీరిక అవసరాలను చక్కగా నిర్వహించవచ్చు.

రోజువారీ విభాగంలో కనీసం 8 గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి. నీరు, శరీరం యొక్క కార్యాచరణకు సహాయపడుతుంది. కానీ తగినంత నీరు త్రాగటం అనేది బరువు తగ్గడంలో కూడా కీలక పాత్రను పోషిస్తుంది.

అదేక్రమంలో భాగంగా వెచ్చని నీటిని తీసుకోవడం మూలంగా, బరువు కోల్పోయే ప్రక్రియ వేగవంతమవుతుంది. వెచ్చని నీటికి తేనె కలపడం ద్వారా శరీరంలోని అదనపు క్రొవ్వు నిక్షేపాలు తొలగించడంలో శరీరానికి సహాయపడుతుంది. ఇది శరీరం జీవక్రియలను నిర్వహించడానికి కావలసిన శక్తిని అందిస్తూ శరీరంలో ఉన్న విషతుల్య మలినాలను, తొలగించడంలో సహాయం చేస్తుంది.

మరియు కేలరీలను అత్యంత వేగంగా కరిగించే ప్రక్రియగా చెప్పబడుతోంది. నిజానికి ఇది ఒక ఆల్కలీన్ ద్రావణం. ఈ పానీయం అన్ని హానికర విషాలను శరీరం నుండి తరిమేసే ద్రావణంగా కూడా చెప్తారు. నిద్ర లేచిన వెంటనే వెచ్చని నీటిలో, తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం మూలంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారని అనేక మంది ద్వారా మీకు ఇదివరకే తెలిసి ఉంటుంది. దీనికి కారణం ఆ ద్రావణంలో ప్రధానంగా ఉన్న ఆల్కలీన్ లక్షణాలే.

ఏది ఏమైనా ఒక వారం లేదా నెల ప్రయత్నించి ఫలితాలు కనపడమంటే అంతగా కనిపించకపోవచ్చు. సుదీర్ఘ ప్రయోజనాల కోసం రోజూవారీ ప్రణాళికలో భాగంగా ఒక అలవాటుగా చేస్కోవాలి.

వేడి నీటితో కలిపి తేనె ఒక అద్భుత పానీయంగా మరియు సంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే చక్కెరను నేరుగా తీసుకోకుండా నిరోధించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ తేనె, చక్కరకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఈ విధంగా మన క్యాలరీలను 60 శాతం వరకు తగ్గించవచ్చు.

ఒక ఆరోగ్యకర రోజును ప్రారంభించే క్రమంలో భాగంగా పరగడుపునే ఈ ద్రావణాన్ని తీసుకోవలసినదిగా పెద్దలు సూచిస్తుంటారు.

ముడి వెల్లుల్లి వినియోగం:

వెల్లుల్లి తేలికగా సాగు చేయగల ఉత్తమమైన లక్షణాలు కలిగిన మొక్క. ఇది ఉల్లిపాయల కుటుంబానికి చెందినది. వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.

వెల్లుల్లి ఒక అద్భుతమైన బరువు నష్టం చేయగలిగిన పదార్ధంగా పరిగణించబడుతుంది. వెల్లుల్లికి రక్తంలో చక్కెర స్థాయిల హెచ్చుతగ్గులు నియంత్రించగల శక్తి ఉన్నందువల్ల ఇది మన అవాంఛిత ఆహార కోరికలను దూరంగా ఉంచగలుగుతుంది కూడా.

వెల్లుల్లికి చెడు కొలెస్ట్రాల్ తగ్గించగల సామర్ధ్యం కూడా ఉంది, ఇది శక్తివంతమైన డిటాక్సిఫైయర్గా పనిచేస్తుంది.

వేడి నీటితో, తేనె మరియు ముడి వెల్లుల్లితో తీసుకునే విధానాలు :

ముఖ్యంగా ఈ ముడి వెల్లుల్లిలో ఊబకాయాన్ని లేదా బరువు నష్టం చేకూర్చే పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ముడి వెల్లుల్లిని, వెచ్చని నీటితో కలిపి తేనె, అలోవేరా, నిమ్మ రసం లేదా ఆపిల్ సైడర్ వినెగర్ కలిపి తీసుకోవచ్చు.

హెర్బల్ టీ: ముడి వెల్లుల్లినితో పాటు హెర్బల్ టీ తీసుకోవడం కూడా బరువు నష్టానికి చక్కగా పనిచేస్తుంది. మరియు ముడి వెల్లుల్లిని పరగడుపున తీసుకోవడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలను పొందగలరని చెప్పబడింది.

కానీ ఎక్కువ లాభాల కోసం కొందరు అధికంగా తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. రోజులో 4 లేదా 5 ముడి వెల్లుల్లి రెబ్బల కన్నా అధికంగా తీసుకున్న ఎడల, అది వేరే ఆరోగ్య సమస్యలకు కారణంగా మారుతుంది.

ముడి వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవడం మూలంగా గుండెల్లో మంట వంటి ఇతర దుష్ప్రభావాలకు కారణం కావచ్చు. అదనపు పౌండ్లను వదిలించుకోవటానికి, ముడి వెల్లుల్లిని రోజూవారీ ఆహరప్రణాళికలో భాగంగా తీసుకోవడం సరైనదే కానీ, పరిమితిలో తీసుకొనవలసి ఉంటుంది.

కేవలం తేనె మరియు ముడి వెల్లుల్లితో వేడి నీటిని తీసుకోవడం ద్వారా మీ ఊబకాయం తగ్గించడంలో అద్భుతాలు చేయలేరు. ఒక ఆరోగ్యకరమైన జీవన శైలి మరియు ఆరోగ్యకరమైన ఆహారం ప్రణాళిక కూడా అవసరమే. తేలికపాటి మరియు సాధారణ వ్యాయామం మీ దైనందిక కార్యకలాపాలలో భాగంగా చేయండి.

తేనెతో ముడి వెల్లుల్లి తినడం:

కొన్ని పరిశోధనల ఆధారంగా, ఖాళీగా ఉండే కడుపుతో తేనెతో కలిపి ముడి వెల్లుల్లి తీసుకోవడం ద్వారా బరువు కోల్పోవడంలో సహాయపడుతుందని నిర్ధారించబడింది. ఇది మీ శరీర కొవ్వును కరిగించి, అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది.

వినడానికి అది ఒక బేసి కలయికగా అనిపిస్తున్నప్పటికీ, ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం మూలంగా బరువు కోల్పోవడంలో మంచి అద్భుతాలను పొందగలుగుతారు. తేనె మరియు ముడి వెల్లుల్లిని ఉపయోగించి ఖాళీ కడుపుతో రోజువారీగా తీసుకోవాలి. ఇది శరీర జీవక్రియలను మెరుగుపరచడమే కాకుండా అదనపు కొవ్వును కూడా తొలగిస్తుంది.

బరువు నష్టం కోసం తేనె మరియు వెల్లుల్లి ఫార్ములా:

ఈ రెండు అద్భుతమైన ఆహారపదార్ధాల కలయికతో సరైన ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు, క్రింద చెప్పిన విధంగా చేయండి:

• 2 నుండి 3 ముడి వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి. వాటిని చాప్ లేదా మెత్తగా నలపడం చేయండి.

• ముడి తేనె ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి.

ఈ రెండింటిని కలిపి మిశ్రమంగా చేసి ఖాళీ కడుపుతో రోజూవారీ భాగంగా తీసుకోండి. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది, మరియు బరువు కోల్పోవడంలో సహాయపడుతుంది . అంతేకాకుండా మీ శరీరాన్ని బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది.

మీరు ఈ రెండు పదార్ధాలను ఉపయోగించి మిశ్రమాన్ని సిద్ధం చేయడమే కాకుండా, ఈ మిశ్రమాన్ని గాలి దూరని జార్లో నిల్వ చేయవచ్చు. ఫ్రిజ్ లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం శ్రేయస్కరం.

ఈ రెండు పదార్థాలు ప్రతి ఇంటిలో లభ్యమవుతాయి మరియు మీరు కొన్ని వారాల వ్యవధిలోనే అద్భుతమైన బరువు నష్టం ఫలితాలను చూడాలని కోరుకున్న ఎడల ముందు చెప్పినట్లు ఖాళీ కడుపుతోనే తీసుకోవాలి.

తేనె మరియుముడి వెల్లుల్లితో వేడినీటిని తీసుకోవడం, మీ శరీరం యొక్క జీవక్రియను పెంచి, తద్వారా బరువు నష్టం వైపుకు మార్గనిర్దేశం చేస్తాయి. ఆకలి కోరికను తగ్గించి, ఆహారం తక్కువ తీసుకునేలా శరీరాన్ని ప్రేరేపిస్తుంది కూడా.

బరువు కోల్పోవడం వైపు సత్వరమార్గాలు తీసుకోవడం హానికరం కావచ్చు. కావున ఇటువంటి సాధారణమైన నిరపాయమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా మీరు మీ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకోవచ్చు. బరువు కోల్పోవడం మీ ఆత్మస్థైర్యాన్ని పెంచడంలో సహాయపడడమే కాకుండా ఆత్మ విశ్వాసంతో అడుగులు ముందుకుపడేలా చేస్తుంది.

English summary

Weight Loss: Will Drinking Warm Water With Honey And Raw Garlic Really Effective?

Weight Loss: Will Drinking Warm Water With Honey And Raw Garlic Really Effective?Drinking warm water with honey and raw garlic can effectively help you burn excess fat from your entire body, including the belly. Read on to know more.
Story first published: Monday, July 2, 2018, 14:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more