కేంబ్రిడ్జ్ డైట్ అంటే ఏమిటి? ఈ కొత్త ట్రెండ్ గురించి మీకు తెలియాల్సిన విషయాలు

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ఆరోగ్యంగా బ్రతకడానికి అవసరమైన వాటిల్లో సరైన బిఎంఐ ఉండటం కూడా ఒకటి. ప్రతి వ్యక్తి యొక్క బాడీ మాస్ ఇండెక్స్ వారి ఎత్తు,బరువుల నిష్పత్తి ప్రకారం నిర్ణయించబడుతుంది. ఈ ముఖ్య కొలతల ద్వారా ఆ వ్యక్తి ఎంత ఆరోగ్యంగా లేదా అనారోగ్యంగా ఉన్నాడో తెలుసుకోవచ్చు.

ప్రతి వ్యక్తి ఎత్తు మారదు కాబట్టి, పెద్దయ్యాక ఎలాగో దాన్ని మార్చలేం కాబట్టి, బరువు గురించి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఇది మార్చుకోగలం.

బరువు పెరగటం సులభమైన పని. దానికి మీరు చేయాల్సింది కేవలం అన్నీ ఎక్కువగా తినటమే(క్యాలరీలు ఎక్కువ వున్న కార్బొహైడ్రేట్ ఆహారం).

కానీ బరువు తగ్గటం దురదృష్టవశాత్తూ అంత సులభం కాదు. హఠాత్తుగా కార్బొహైడ్రేట్లను తీసుకోవటం మానేయలేరు. అలా చేస్తే కేవలం రక్తపోటు తగ్గిపోవటమే కాదు, చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.

అదే సమయంలో,మీరెంత కష్టపడి వ్యాయామం చేసినా, ఆ వ్యాయామాలు మీకు సరైనవి కాకపోతే మీరు బరువు తగ్గలేరు. అందుకని డైట్ ప్లాన్ అమలుచేయటానికి చాలా శ్రద్ధగా ప్లానింగ్ అవసరం. అలాగే బరువు తగ్గాలనుకునేవారికి చాలా రకాల డైటింగ్ ఆఫ్షన్లు కూడా ఉన్నాయని తెలుసుకోవటం ముఖ్యం.

What is Cambridge Diet? All You Need To Know About This New Trend

ఈ ఆర్టికల్ లో ఈ మధ్య బాగా పాపులర్ అవుతోన్న ఒక అలాంటి డైట్ గురించి చర్చించబడుతుంది. మనం కేంబ్రిడ్జ్ డైట్ గురించి మాట్లాడుతున్నాం.

ఏమిటది?

పైపైన చెప్పాలంటే కేంబ్రిడ్జ్ డైట్ ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చాలా వేగంగా బరువు తగ్గించే ఒక విధానం. ఇక్కడ బరువు తగ్గాలనుకుంటున్న వ్యక్తికి పోషకాలు కావాల్సినంత మొత్తాలలో న్యూట్రిషన్ బార్స్,సూపులు, షేక్స్ తీసుకునేలా చేస్తారు.

అలా అతనికి ఎన్ని ఎంత పోషకాలు అందాలో దాని ప్రకారం ఆహార సప్లిమెంట్లు తీసుకుంటూ రోజులు గడుపుతారు. ఇప్పుడున్న బరువు, తగ్గాలనుకుంటున్న బరువు ఆధారంగా ఇందులో ఆరు రకాల డైట్ ప్లాన్లు ఉంటాయి. వీటిద్వారా రోజుకి తన డైట్ ద్వారా మినిమం 415 క్యాలరీలనుంచి గరిష్టంగా 1500 క్యాలరీల వరకూ కరిగించవచ్చు.

ఎలా పనిచేస్తుంది?

ఇదివరకే చెప్పినట్లు, శరీర అవసరాలకి అనుగుణంగా, అలాగే స్పెషలిస్టుల పర్యవేక్షణలో ఈ ఛార్టు తయారుచేయబడుతుంది. టార్గెట్ బరువును బట్టి, కేంబ్రిడ్జ్ డైట్ ను మామూలు డైట్ కి అదనంగా జోడించవచ్చు లేదా అదే నేరుగా ఒకటే పాటించవచ్చు. ఈ డైట్ పాటిస్తున్నరోజుల్లో ముందుకెళ్తున్నకొద్దీ స్పెషలిస్టు మార్పులు చేస్తూ వివరిస్తారు. అలా బరువు తగ్గే క్రమంలో శరీరం పోషకాలను కోల్పోకుండా ఉంటుంది. ఈ డైట్ ద్వారా బరువు తగ్గటం కోసం కొంచెం గైడెన్స్, బరువు తగ్గాక అదే బరువు మెయింటేయిన్ చేయటానికి సపోర్ట్ అవసరం.

కేంబ్రిడ్జ్ డైట్, భారతీయ విధానం

మనదేశంలో ఈ కేంబ్రిడ్జ్ డైట్ ను 1970ల్లో ఇంగ్లీషు డాక్టర్, డా. అలాన్ హోవర్డ్ ప్రవేశపెట్టారు.నిజానికి మన దేశ పద్ధతులకి ఈ డైట్ చాలా చక్కగా సరిపోతుంది. ఎందుకంటే మన దేశ పద్ధతిలో అన్నం,రోటిలు ముఖ్య ఆహారం, ఈ రెండింటిలో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. అందుకే చాలామంది బరువు తగ్గలేరు. 2018 నాటికి, కేంబ్రిడ్జ్ డైట్ ఐఎంఎ రికమండేషన్స్ ప్రక్రారం మనకి కూడా సరిపోయింది.

సురక్షత విషయం

ఆరోగ్యవంతమైన సాధారణ వ్యక్తికి, రోజువారీ క్యాలరీలు తీసుకోవడం 600 కన్నా తగ్గితే, శరీరంపై వెంటనే ఏదో ప్రభావం పడుతుంది. సైడ్ ఎఫెక్ట్లు వచ్చేసి నోటి దుర్వాసన, మత్తుగా ఉండటం, నిద్రలేమి వంటివి ఉంటాయి. ఇవన్నీ ఊహించదగ్గవే, అలాగే నివారణ చర్యలను ఈ డైట్ సూచించిన స్పెషలిస్టు మీకు వివరిస్తారు. ఈ డైట్ ను మీరు సుదీర్ఘంగా పాటించకూడదు. నిజానికి ఎవరూ కూడా రోజుకి 1000 క్యాలరీల కన్నా తక్కువ వరుసగా 12 రోజులకి మించి తినకూడదు. కానీ పాజిటివ్ విషయం ఏంటంటే ఈ డైట్ కి సంబంధించి చాలా కేసులను స్పెషలిస్టు చూస్తారు కాబట్టి, సురక్షత విషయంలో ఢోకా ఉండబోదు.

English summary

What is Cambridge Diet? All You Need To Know About This New Trend

The Cambridge diet is a low-cal diet, which aids you in shedding upto 415-1500 calories per day. This diet includes nutrition bars, soups and shakes to fulfil your body's nutritional requirements. This diet has side-effects like bad breath, insomnia and dizziness and it shouldn't be followed for prolonged periods.