For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Allu Arjun Diet & Fitness Secrets:పుష్ప లాంటి ఫిజిక్ కావాలంటే.. ఈ డైట్ ఫాలో అవ్వండి...

అల్లు అర్జున్ డైట్ అండ్ ఫిట్ నెస్ రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

Allu Arjun:ఐకానిక్ స్టార్, స్టైలీష్ స్టార్ పుష్ప పార్ట్-1 సినిమాతో అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ప్రతి సినిమాలో వైవిధ్యంగా కనిపించే అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం కూడా చాలా కష్టపడ్డారట.

Allu Arjun reveals his fitness and diet secrets and shares tips in telugu

ముఖ్యంగా తన ఫిట్ నెస్, లుక్ విషయంలో, ఫిజిక్ విషయంలో కొత్తగా కనిపించేందుకు చాలా కసరత్తులు చేశారట. దేశముదురు సినిమాతో టాలీవుడ్ సిక్స్ ప్యాక్ ట్రెండ్ ను ప్రారంభించిన అల్లు అర్జున్.. అప్పటి నుండి ఇప్పటిదాకా ప్రతి ఒక్క సినిమాలోనూ చాలా అందంగా.. సినిమా సినిమాకీ సరికొత్తగా కనిపించే ప్రయత్నం చేశారు.

Allu Arjun reveals his fitness and diet secrets and shares tips in telugu

అందుకే తను ఐకాన్ స్టార్ గా ఎదిగిపోయారు. తన తొలి సినిమా గంగోత్రిలో చిన్న పిల్లాడిలా కనిపించినా.. ఆర్య, బన్నీ, దేశముదురు వంటి సినిమాలోకొచ్చేసరికి తన ఫిజిక్ లో భారీగా మార్పులొచ్చాయి. ఇదే చూసి ఇండస్ట్రీలో అందరూ షాకయ్యారు.

Allu Arjun reveals his fitness and diet secrets and shares tips in telugu

అయితే అల్లు అర్జున్ ఇంత పర్ఫెక్ట్ ఫిగర్ రావడానికి ఎంతగానో కష్టపడ్డారు. ప్రతి సినిమాలోనూ తను అందరికంటే విభిన్నంగా కనిపిస్తూ.. తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పుష్ప సినిమా కోసం రెండు సంవత్సరాల వరకు గుబురు గడ్డం, కండలు పెంచిన బాడీని మెయిన్ టెయిన్ చేస్తూ వచ్చాడు. ఈ సందర్భంగా ఫిజిక్ పరంగా రెండు సంవత్సరాలు ఒకే లుక్ లో కనిపించేందుకు బన్నీ ఎంతగా కష్టపడ్డారో మాటల్లో చెప్పలేం.. అయితే తను ఇలా స్థిరంగా ఉండేందుకు ఎలాంటి డైట్ ఫాలో అయ్యారు.. ఎలాంటి వర్కవుట్స్ చేశారనే వివరాలను రివీల్ చేశారు.. ఆ విశేషాలేంటో మీరే చూడండి..

Hbday Allu Arjun : 'పుష్ప' గురించి ఈ సీక్రెట్స్ మీకు తెలుసా...Hbday Allu Arjun : 'పుష్ప' గురించి ఈ సీక్రెట్స్ మీకు తెలుసా...

45 నిమిషాలు జాగింగ్..

45 నిమిషాలు జాగింగ్..

బన్నీ తన పవర్ ప్యాక్డ్ జాగింగ్ వ్యాయామంతో తన రోజును ప్రారంభిస్తాడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ప్రతిరోజూ ఉదయం మంచిగా రన్నింగ్ చేస్తాను. అలా చేయడం వల్ల తనకు హ్యాపీగా ఉంటుంది. తన జాగింగ్ సెషన్ సాధారణంగా 45 నిమిషాల నుండి గంట వరకు ఉంటుంది' అని చెప్పాడు.

హార్డ్ వర్క్..

హార్డ్ వర్క్..

హార్డ్ వర్క్ మరియు స్థిరత్వం అనేది బాడీని మెయింటెన్ చేయడానికి, మైండ్ ఫిట్ గా ఉంచుకునేందుకు చాలా కీలకం. అల్లు అర్జున్ షెడ్యూల్ లో వారానికి ఆరు నుండి ఎనిమిది వర్కౌట్ల సెషన్లు ఉండేలా చూసుకుంటారట. తనకు బద్ధకంగా అనిపించినప్పుడల్లా, మూడు లేదా నాలుగు సెషన్లకు తగ్గకుండా వర్కౌట్లు చేస్తారట.

సైక్లింగ్..

సైక్లింగ్..

అల్లు అర్జున్ తన వర్కవుట్ సెషన్లను ఆహ్లాదకరంగా మరియు ఆనందించేలా చేయడానికి, వాటిని వెరైటీగా తీసుకురావడానికి ఇష్టపడతాడట. అందుకే తన బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు అప్పుడప్పుడు సైక్లింగ్ ను ఎంచుకుంటారట.

కాలిస్టెనిక్స్ ఎక్సర్ సైజ్..

కాలిస్టెనిక్స్ ఎక్సర్ సైజ్..

ఈ రకమైన వ్యాయామంలో సొంత శరీర బరువును ఉపయోగించి ఒక రకమైన పనిని చేస్తారు. పుష్ అప్ లు, ఫుల్ అప్ లు, చిన్ అప్ లు, డిప్, క్రంచెస్ మరియు జంపింగ్ రోప్ వంటివి కొన్ని ప్రసిద్ధ కాలిస్టెనిక్ వ్యాయామాలు. తన వర్కవుట్ సెషన్లలో బన్నీ వీటిని క్రమం తప్పకుండా చేస్తారట.

అల్పాహారం..

అల్పాహారం..

బన్నీ ప్రతిరోజూ ఉదయం 7:30 నుండి 8:30 గంటల మధ్యలో అల్పాహారం తీసుకుంటారట. అది కూడా సొన లేకుండా గుడ్డుతో వేసిన ఆమ్లెట్ ను తీసుకుంటారు. పుష్ప సినిమా వేళ ప్రతిరోూ మూడు గుడ్లను మిక్స్ చేసి ఆమ్లెట్ తయారు చేసి తీసుకునేవారట.

భోజనం సమయంలో..

భోజనం సమయంలో..

ఇక మధ్యాహ్నం సమయ కంటే ముందు ప్రీ లంచ్ సమయంలో సూప్.. గ్రీన్ సలాడ్ లు తీసుకుంటారట. కొన్నిసార్లు ప్రోటీన్ల కోసం చికెన్ లేదా గుడ్లను తీసుకుంటాడట. ఇక మధ్యాహ్నం 1:30 నుండి 2 గంటల సమయంలో కఠినమైన డైట్ కాకుండా అప్పుడప్పుడు తన మెనూలో మార్పులు చేసుకుంటాడట బన్నీ. మాంసం, కార్బొహైడ్రేట్స్ ఉండే పదార్థాలను, కూరగాయలను ఎక్కువగా తీసుకుంటాడట.

సాయంకాలం స్నాక్స్..

సాయంకాలం స్నాక్స్..

ఇక సాయంత్రం వేళలో 4:30 నుండి 5 గంటల మధ్యలో స్నాక్స్ కచ్చితంగా తీసుకుంటారట. నూనె పదార్థాలను మాత్రం తీసుకోడట. కాఫీ లేదా జ్యూస్ ను మాత్రమే తాగుతాడట. కొన్ని ఉడకబెట్టిన గింజలను స్నాక్స్ గా తీసుకుంటాడట ఈ స్టైలీష్ స్టార్.

రాత్రి వేళలో..

రాత్రి వేళలో..

ఇక డిన్నర్ సమయంలో ప్రత్యేకమైన వంటకాలేవీ తీసుకోడట. కానీ వీలైనంత త్వరగా రాత్రి భోజనాన్ని పూర్తి చేస్తాడట. ముఖ్యంగా బ్రౌన్ రైస్, కూరగాయలు, చికెన్ లేదా చేపలు డిన్నర్లో ఉండేలా చూసుకుంటాడట. అప్పుడప్పుడు అంటే వారంలో ఒకట్రెండు సార్లు చీట్ మీల్ ను కూడా తీసుకుంటాడట.

FAQ's
  • అల్లు అర్జున్ ఎప్పుడు జన్మించారు?

    అల్లు అర్జున్ 1982 సంవత్సరంలో ఏప్రిల్ 8వ తేదీన అల్లు అరవింద్, నిర్మల దంపతులకు జన్మించారు. గంగోత్రి సినిమాతో వెండితెరపై ఆరంగేట్రం చేశారు. వరుడు సినిమాలో నటించిన స్నేహాలత రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు క్యూట్ కిడ్స్ కూడా ఉన్నారు.

English summary

Allu Arjun reveals his fitness and diet secrets and shares tips in telugu

Here we are talking about the Allu Arjun reveals his fitness and diet secrets and shares tips in Telugu. Have a look
Desktop Bottom Promotion