For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Eating Too Much: మీకిష్టం లేకపోయినా ఎక్కువ తినేస్తున్నారా? మైండ్‌ఫుల్‌ ఈటింగ్ పాటించండి

చాలా మంది వారికి తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటారు. వారు భోజనం ముగించే వరకు అతిగా తింటున్నామన్న విషయం వారు గుర్తించలేరు. ఇలాంటి సమయంలోనే మైండ్‌ఫుల్‌నెస్‌ ఈటింగ్ సహేతుకంగా తినేందుకు సహాయపడతాయి.

|

Eating Too Much: తినడం ఎవరికైనా ఇష్టమే. కొందరికి బిర్యానీ చూస్తే నోట్లో నీళ్లూరుతుంటాయి.. మరికొందరికి ఇంగువ వేసిన పులిహోరా తినాలని జిహ్వ తహతహలాడుతుంది. ఇలా అప్పుడప్పుడు కడుపు నిండుగా తినడం అత్యంత సాధారణం. అయితే తిన్న ప్రతీసారి కడుపు నిండుగా తినడం అనేది అతిగా తినే సమస్య కావొచ్చు. అంటే ఫుడ్ అడిక్షన్ కావొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.

Are you eating too much? Practice mindful eating in Telugu

చాలా మంది వారికి తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటారు. వారు భోజనం ముగించే వరకు అతిగా తింటున్నామన్న విషయం వారు గుర్తించలేరు. ఇలాంటి సమయంలోనే మైండ్‌ఫుల్‌నెస్‌ ఈటింగ్ సహేతుకంగా తినేందుకు సహాయపడతాయి.

మైండ్‌ఫుల్ ఈటింగ్ అంటే ఏంటి?

మైండ్‌ఫుల్ ఈటింగ్ అంటే ఏంటి?

తినేటప్పుడు పూర్తి శ్రద్ధ వహించడం. ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ తక్కువ మొత్తంలో తినడం. భోజనాన్ని నెమ్మదిగా పూర్తిగా నమిలి తినడం. ఎంత తింటున్నారు, ఏం తింటున్నారు అనేది గమనిస్తూ తినడం వల్ల అతిగా తినడాన్ని నివారించవచ్చు. దీనినే మైండ్‌ఫుల్ ఈటింగ్ అంటారు.

* తినేటప్పుడు పరధ్యానంగా ఉండకూడదు. అంటే టీవీ చూస్తూనో, ఫోన్ వాడుతూనో, కంప్యూటర్ ఆపరేట్ చేస్తూనే తినడం వల్ల ఎంత తింటున్నాం అనేదానిపై ఒక అంచనా ఉండదు.

* భోజనాన్ని త్వరత్వరగా ముగించకూడదు. నెమ్మదిగా ఆహారాన్ని పూర్తిగా నములుతూ తినాలి. దీని వల్ల జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలు తలెత్తవు.

భోజనంలో ఫైబర్ ఉండేలా చూసుకోవాలి

భోజనంలో ఫైబర్ ఉండేలా చూసుకోవాలి

తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల మనకు తెలియకుండానే తక్కువ తింటాం. భోజనంలో తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే వాటిలోని ఫైబర్ అందుతుంది. ఫైబర్ వల్ల కడుపు నిండినట్లుగానే కాకుండా జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య తలెత్తదు.

భోజనం దాటవేయవద్దు

భోజనం దాటవేయవద్దు

బరువు తగ్గాలనో ఇంకేదైనా కారణంతోనో భోజనం తినకుండా ఉండొద్దు. దీని వల్ల ఆకలి ఎక్కువగా అవుతుంది. భోజనం తిన్నప్పుడు కడుపును పూర్తిగా నింపేయడానికి ప్రయత్నిస్తారు. భోజనం చేయకపోవడం తీవ్రమైనక ఆకలిని కలిగిస్తుంది.

హైడ్రేటెడ్‌గా ఉండాలి

హైడ్రేటెడ్‌గా ఉండాలి

వేసవికాలం, శీతాకాలం, వర్షాకాలం, కాలంతో సంబంధం లేకుండా నీరు ఎక్కువగా తాగాలి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల హైడ్రేటెడ్‌గా ఉండటంతో పాటు చర్మం కాంతివంతం అవుతుంది.

తినడానికి కొంత సమయం ముందు ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగితే తక్కువగా తినడానికి సహాయపడుతుంది.

మరోసారి భోజనం వేసుకుంటున్నారా

మరోసారి భోజనం వేసుకుంటున్నారా

భోజనాన్ని ఒక్కసారి మాత్రమే వడ్డించుకోండి. కొద్దిగా ఆహారం వడ్డించుకుంటే దానితోనే సరిపెట్టండి. కావాలంటే గంటా రెండు గంటలు అయ్యాక మరోసారి ఆహారం తినడం అలవాటు చేసుకోండి.

మైండ్‌ఫుల్‌నెస్‌ వ్యాయామాలు:

మైండ్‌ఫుల్‌నెస్‌ వ్యాయామాలు:

తినేటప్పుడు దృష్టిని కేంద్రీకరించడం వల్ల మైండ్‌ఫుల్‌నెస్‌ ద్వారా తినడాన్ని కంట్రోల్ చేయవచ్చు.

శ్వాసపై దృష్టి:

సరిగ్గా ఊపిరి పీల్చుకోవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. శ్వాసపై దృష్టి పెడుతూ గాలి ఎలా లోపలికి వెళ్తుందో గమనించాలి. దీనిని సాధన చేయడం వల్ల మెదడు, గట్ మధ్య సమతుల్యత మెరుగుపడుతుంది.

కండరాల సడలింపు:

ప్రధాన కండరాల సమూహాన్ని బిగించి విడుదల చేస్తూ చేసే వ్యాయామమే మజిల్ రిలాక్సేషన్ అంటారు. కండరాల సంకోచాన్ని విడుదల చేస్తున్నప్పుడు, కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి ఎలా అనిపిస్తుందో గమనించాలి.

ఏకాగ్రతతో నడవడం:

ఆరు బయట, పార్కుల్లో, పొలాల గట్లపై ఏకాగ్రతతో నడవడం ప్రాక్టీస్ చేయండి. నాలుగు గోడల మధ్య ట్రేడ్‌మిల్‌పై నడవడం కంటే ఆరుబయట నడవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

English summary

Are you eating too much? Practice mindful eating in Telugu

read on to know Are you eating too much? Practice mindful eating in Telugu
Story first published:Tuesday, December 6, 2022, 17:30 [IST]
Desktop Bottom Promotion