For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిక్స్ ప్యాక్ స్టార్ల డైట్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడే చూసెయ్యండి...

|

టాలీవుడ్ లో ఒకప్పుడు సిక్స్ ప్యాక్ ట్రెండ్ నడిచింది. అల్లుఅర్జున్ తో మొదలైన ఈ ట్రెండ్ ఆ తర్వాత ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రానాతో పాటు సునీల్, మహేష్ బాబు, నాగార్జున, నితిన్, నిఖిల్ వరకు కొనసాగింది.

ఎందుకంటే ఈరోజుల్లో హీరో కావాలంటే డ్యాన్సులు, యాక్టింగ్ మాత్రమే కాదు మంచి ఫిజిక్ కూడా ఉండాలి. మరీ ముఖ్యంగా కొత్తగా వచ్చే ప్రతి హీరో సిక్స్ ప్యాక్ చేసి చూపిస్తున్నారు.

వారిలో సుధీర్ బాబు, కార్తీ తమ సిక్స్ ప్యాక్ తో అలరించగా.. తాజాగా అక్కినేని వారసుడు అఖిల్ కూడా సిక్స్ ప్యాక్ లుక్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సిక్స్ ప్యాక్ చూపించే టాలీవుడ్ హీరోల డైట్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందామా...

ఈ అరుదైన వ్యాధితో అతినిద్ర... అది కూడా ఏకంగా ఏడాదికి 300 రోజులు నిద్రలోనే...ఈ అరుదైన వ్యాధితో అతినిద్ర... అది కూడా ఏకంగా ఏడాదికి 300 రోజులు నిద్రలోనే...

అల్లు అర్జున్..

అల్లు అర్జున్..

టాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ తో అలరించిన మొట్టమొదటి హీరో అల్లు అర్జున్. దేశముదురు సినిమాతో కొత్త లుక్ లో కనిపించి అందరినీ అలరించాడు. బన్నీ ఓసారి బాలీవుడ్ కార్యక్రమానికి హాజరవ్వగా.. అప్పుడు ఓ యాంకర్ తనతో ఇలా అన్నారట. దక్షిణ భారతంలో హీరోలు ఫిట్ నెస్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరని అనడంతో.. దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని తన తర్వాతి సినిమాలో సిక్స్ ప్యాక్ తో కనిపించి ఆ యాంకర్ కు సమాధానమిచ్చాడు. అయితే సిక్స్ ప్యాక్ సాధించే క్రమంలో బన్నీ డైట్ ను పక్కాగా ఫాలో అయ్యేవాడట. ముఖ్యంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న గుడ్డు తెల్లసొనను మాత్రమే తీసుకుంటాడు. కొవ్వు పదార్థాలను అస్సలు టచ్ చేయడు.

మహేష్ బాబు..

మహేష్ బాబు..

టాలీవుడ్ ప్రిన్స్ గా పిలుచుకునే మహేష్ బాబు కూడా ‘వన్ నేనొక్కడినే' సినిమాతో సిక్స్ ప్యాక్ చూపించేశాడు. ఈ పాలబుగ్గల హీరో తన స్టైలీష్ బాడీ చూపించేందుకు డైట్ ను పక్కాగా ఫాలో అయ్యేవారట. ఆయన ఓట్స్, పాస్తా, స్పినాచ్, చేపలు, గ్రిల్ చికెన్ ను ఎక్కువగా తీసుకునేవారట. ఇలా ఆయన తీసుకున్న ఆహారంతో మూడు నెలల్లో తన బాడీ షేప్ మార్చుకుని చూపించేశారు.

నాగార్జున..

నాగార్జున..

టాలీవుడ్ కింగ్, మన్మథుడు అక్కినేని నాగార్జున కూడా సిక్స్ ప్యాక్ ల విషయంలో యంగ్ హీరోలను ఫాలో అయ్యాడు. తను ‘ఢమరుకం' సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించేశాడు. ఇందుకోసం తాను కూడా డైట్ ఫాలో అయ్యాడు. డైట్ లో భాగంగా.. ఉదయం వేళ గుడ్లలోని తెల్లసొనలు, బ్రెడ్ మధ్యాహ్నం రైస్, రోటీ, నాలుగు కర్రీలు.. రాత్రి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే చేపలు, గ్రిల్ చికెన్ తీసుకునేవాడట. ఉదయం, మధ్యాహ్నం సమయంలో దోస, పెసరట్టు లేదా పొంగల్ తీసుకునేవాడట.

జూనియర్ ఎన్టీఆర్..

జూనియర్ ఎన్టీఆర్..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా సిక్స్ ప్యాక్ హీరోగా తన ‘టెంపర్' చూపించాడు. అయితే తను ఈ స్టైలిష్ బాడీ కోసం డైట్ ను స్టిట్ గా ఫాలో అయ్యేవాడట. ముఖ్యంగా తన డైట్ లో చల్లని పదార్థాలు, కూరగాయలు, పండ్లు, ప్రోటీన్లు ఉన్న ఆహారం కచ్చితంగా ఉండాల్సిందేనట. డైట్ లో భాగంగా తక్కువ స్థాయిలోనే భోజనం చేసేవారట.

<strong>డయాబెటిస్ ఉన్నవారికి అంగస్తంభన సమస్య ఉంటుందా?</strong>డయాబెటిస్ ఉన్నవారికి అంగస్తంభన సమస్య ఉంటుందా?

ప్రభాస్..

ప్రభాస్..

రెబల్ స్టార్ ప్రభాస్ కూడా సిక్స్ ప్యాక్ తో టాలీవుడ్ ను షేక్ చేసేశాడు. ఆ తర్వాత బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ప్రభాస్ తన డైట్ ను క్రమం తప్పకుండా ఫాలో అయ్యేవాడట. ప్రతి రెండున్నర గంటలకు ఒకసారి ఏదో ఒక ఫుడ్ తీసుకునేవాడు. ఉదయం టిఫిన్ లో ప్రోటీన్ పౌడర్ తో పాటు 40 గుడ్ల తెల్ల సొనలను తీసుకునేవాడు. కార్బోహైడ్రేట్ పదార్థాలను ముట్టుకోకుండా గింజలు, చేపలు, బాదం లాంటి వాటిని ఎక్కువగా తీసుకునేవాడు. ఇలా తీసుకున్న ఆహారంతో సుమారు 2-4 కేలరీలను పొందేవాడట.

రామ్ చరణ్..

రామ్ చరణ్..

మెగాస్టార్ తనయుడిగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ కూడా ధ్రువ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీ చూపించి తన విశ్వరూపాన్ని చూపించేశాడు. అయితే ఈ సినిమా కోసం స్టిట్ డైట్ ఫాలో అయ్యేవాడట. కాఫీలు, డైరీ ఐటమ్స్, షుగర్ వచ్చే ఐటమ్స్, ఆల్కహాల్ జోలికి అస్సలు వెళ్లేవాడు కాదట. ఇక ప్రోటీన్, కార్బోహైడ్రేట్ ఫుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టేవాడట. ఇందులో భాగంగా చేపలను, ఓట్ మీల్స్, బ్రౌన్ రైస్, బంగాళదుంపలను ఎక్కువగా తీసుకునేవాడట. వీటితో పాట ఉడికించిన కూరగాయలను, వెల్లుల్లి ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకునేవారట.

రానా..

రానా..

భళ్లాలదేవ్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దగ్గుబాటి రానా సిక్స్ ప్యాక్ బాడీ కోసం ఎక్కువగా కష్టపడ్డాడట. ఉదయం ఓట్స్, బైడ్, ఎనిమిది గుడ్ల తెల్ల సొనలు, పుచ్చకాయ, బొప్పాయి లాంటివి తీసుకునేవాడట. బ్రేక్ ఫాస్ట్ కి, లంచ్ కి మధ్య ప్రోటీన్లు కలిగి ఉన్న పండ్ల రసాన్ని తాగేవాడట. ప్రోటీన్లు కలిగి ఉన్న ఒమేగా-3 చేపలు, పచ్చని కూరగాయలు తీసుకొనేవాడు. సాయంత్రం 4 స్లైస్ లు, అరటి పండ్లు, రాత్రి ప్రోటీన్ ఫుడ్ తీసుకునేవాడట.

నితిన్..

నితిన్..

టాలీవుడ్ లో అందరూ సిక్స్ ప్యాక్ చూపితే.. నితిన్ మాత్రం ఏకంగా ఎయిట్ ప్యాక్స్ చూపించేశాడు. అయితే ఇందుకోసం కఠినమైన డైట్ పాటించేవాడట. డైట్ లో భాగంగా రోజూ 24 గుడ్డు తెల్లసొనలు, కేజీన్నర గ్రిల్ చికెన్, మూడు ప్రోటీన్ జ్యూస్ లు తీసుకుంటాడట. ఉదయం పూట 12 గుడ్ల తెల్లసొనలు, ఒక ప్రోటీన్ జ్యూస్.. తీసుకునేవాడట. మధ్యాహ్నం సమయంలో గ్రిల్ చికెన్ తినేవాడట. ఇలా చేసిన తర్వాత ‘విక్టరీ' సినిమాలో 8 ప్యాక్ బాడీ చూపించేశాడు.

ఖర్జూరాలను పాలతో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు...ఖర్జూరాలను పాలతో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు...

సునీల్..

సునీల్..

టాలీవుడ్ లో కమెడీయన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ కూడా హీరోగా మారేసరికి సిక్స్ ప్యాక్ బాడీ చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ‘పూల రంగడు'లో తన బాడీ షేప్ ఫిట్ గా కనిపించేందుకు గుడ్డు తెల్ల సొన, నీళ్లు ఎక్కువగా తాగేవాడట. అలాగే ప్రతిరోజూ ఐస్ క్యూబ్స్, 12 గుడ్డు తెల్ల సొనలు తినేవాడట.

సుధీర్ బాబు..

సుధీర్ బాబు..

టాలీవుడ్ లో మహేష్ బాబు బంధువు అయిన సుధీర్ బాబు కూడా సిక్స్ ప్యాక్ బాడీ కోసం కఠినమైన డైట్ ఫాలో అయ్యాడట. తనకు శక్తి కోసం ఆరెంజ్ జ్యూస్, తేనే, ఒక అరటి పండు, మూడు గుడ్లతో పాటు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునేవాడట. మధ్యాహ్నం సమయంలో తాజా పండ్లు, గింజలు తినేవాడట. రాత్రి డిన్నర్ సమయంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే చేపలను తినేవాడట.

కార్తీకేయ..

కార్తీకేయ..

RX-100 సినిమాతోనే సిక్స్ ప్యాక్ తో కనిపించి అమ్మాయిల మనసులందరినీ దోచేశాడు కార్తీకేయ. అయితే తను ఈ బాడీ కోసం కచ్చితమైన డైట్ ఫాలో అయ్యేవాడట. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటాడట. అలాగే మధ్యాహ్నం సమయంలో అన్నం, చేపలు తినేవాడట. బర్గర్లు, మిల్క్ షేక్, పిజ్జాలు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ జోలికి మాత్రం అస్సలు వెళ్లేవాడు కాదట.

English summary

Diet Secrets Of Tollywood Six-Pack Heroes

Here are the diet secrets of tollywood six pack heros. Take a look
Story first published: Friday, July 16, 2021, 8:00 [IST]