For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HBDay Virat Kohli : విరాట్ డైట్ అండ్ ఫిట్ నెస్ సీక్రెట్స్ ఫాలో అయితే ఈజీగా బరువు తగ్గొచ్చు...!

|

క్రికెట్ మైదానంలో అడుగు పెడితే చాలు పరుగుల వరద పారిస్తూ.. సెంచరీల మీద సెంచరీలు కొట్టే ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2020, నవంబర్ 5వ తేదీన 32వ పడిలోకి అడుగుపెడుతున్నాడు.

ప్రతి మ్యాచ్ లోనూ దాదాపు హాఫ్ సెంచరీ లేదా సెంచరీ కొట్టే కొహ్లీ వయసు పెరుగుతున్నా కూడా అంత బలంగా ఎలా ఉంటాడు.. మాంసాహారం కూడా మానేసిన ఈ క్రికెటర్ బంతిని బలంగా ఎలా బాదుతాడనే అనుమానం చాలా మందికి వచ్చింది.

తన బాడీ ఫిట్ నెస్ కోసం విరాట్ కోహ్లీ గంటల తరబడి జిమ్ లో గడుపుతాడా? ప్రతిరోజూ కఠినమైన వర్కవుట్లను చేస్తాడా? లేదా ఆహారం విషయంలో ఏవైనా జాగ్రత్తలు పాటిస్తాడా అనే ప్రశ్నలన్నింటికీ విరాట్ కోహ్లీనే ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ డైట్ అండ్ ఫిట్ నెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం రండి...

కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్ : పరుగుల యంత్రానికి అభినందనల వెల్లువ..

కోడిగుడ్డుతో ప్రారంభం..

కోడిగుడ్డుతో ప్రారంభం..

కోహ్లీ ఉదయం తీసుకునే ఆహారంలో కోడిగుడ్డు కచ్చితంగా ఉండాలట. ప్రతిరోజూ మూడు కోడిగుడ్లను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటారట. దీంతో పాటు ఆకుకూరలు, బ్లాక్ పెప్పర్, వెన్నను క్రమం తప్పకుండా తీసుకుంటాడట. ఆ తర్వాత బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, పుచ్చకాయను రెగ్యులర్ గా తీసుకుంటాడట. చివరగా గ్రీన్ టీతో తన టిఫిన్ ను ముగిస్తాడట.

మధ్యాహ్నం వేళ..

మధ్యాహ్నం వేళ..

విరాట్ కోహ్లీ బ్రేక్ ఫాస్ట్ తీసుకున్న తర్వాత లంచ్ మాత్రం లైట్ గా తీసుకుంటాడట. మధ్యాహ్నం లంచ్ సమయంలో ఉడికించిన బంగాళదుంపలు, పాలకూర, ఇతర కూరగాయాలను ఎక్కువగా తీసుకుంటాడట. డిన్నర్ ను మాత్రం డాక్టర్ల సలహా మేరకే స్వీకరిస్తాడట.

ఫిట్ గా ఉండేందుకు..

ఫిట్ గా ఉండేందుకు..

ఇంటర్నేషనల్ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో రాణించాలంటే ఫిట్ నెస్ అనేది అత్యంత ముఖ్యమైన విషయం. కాబట్టి తాను క్రికెట్ అయిపోయిన వెంటనే గంటల కొద్దీ సమయాన్ని జిమ్ లోనే గడుపుతుంటానని చెప్పాడు.

వర్కవుట్లు..

వర్కవుట్లు..

విరాట్ కోహ్లీ జిమ్ లో ఎక్కువగా ఈ వర్కౌట్లను బాగా ఇష్టపడతాడట. ఇదే విషయాన్ని ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. తన బరువును బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎక్కువగా వెయిట్లు, కార్డియోలను చేయడానికి ఆసక్తి చూపుతాడట. బరువు తగ్గేందుకు ఇది ఉత్తమమైనదని చెప్పాడు. తాను కూడా రెగ్యులర్ గా ఇదే ఫాలో అవుతానన్నాడు.

రెండురోజుల రెస్ట్..

రెండురోజుల రెస్ట్..

విరాట్ కోహ్లీ వారంలో మొత్తం 5 రోజుల పాటు వర్కవుట్లు చేస్తే... రెండు రోజులు మాత్రం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటాడట. వర్కవుట్ల తర్వాత రెస్ట్ అనేది చాలా అవసరమని, వర్కవుట్ల తర్వాత విశ్రాంతి తీసుకుంటేనే బాడీ రీచార్జ్ అవుతుందని.. ఈ విషయాన్ని మరచిపోవద్దని చెప్పాడు.

నో బ్యాడ్ హ్యాబిట్స్..

నో బ్యాడ్ హ్యాబిట్స్..

విరాట్ కోహ్లీ మూడు పదుల వయసు దాటినా కూడా పూర్తి ఫిట్ గా ఉండటానికి కారణం తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేకపోవడమే. ఈ విషయంలో కోహ్లీ చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకు పొగతాగడం మరియు మందు తాగడం అలవాట్లే లేవంట. చాలా మంది సెలబ్రెటీలంతా రాత్రి వేళ పొగతాగడం.. మందు కొట్టడం చేస్తుంటారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం చాలా కంట్రోల్ లో ఉంటాడట.

జంక్ ఫుడ్ జోలికెళ్లడట..

జంక్ ఫుడ్ జోలికెళ్లడట..

విరాట్ కోహ్లీ రాత్రి సమయంలో లైట్ ఫుడ్ తీసుకోవడాన్ని ఇష్టపడతాడట. ముఖ్యంగా ప్రోటీన్ షేక్స్ మరియు పిండి పదార్థాలు(ఆరోగ్యకరమైన వనరులు) ఉండే ఆహారాన్ని తీసుకుంటాడట. అంతేగానీ.. జంక్ ఫుడ్ జోలికి మాత్రం అస్సలు వెళ్లడట.

బ్రాండెడ్ వాటర్..

బ్రాండెడ్ వాటర్..

విరాట్ కోహ్లీ ఫుడ్ విషయంలో ఎంత కేర్ తీసుకుంటాడో.. వాటర్ విషయంలో కూడా అంతే కేర్ తీసుకుంటాడట. అతను తన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి కావాల్సినంత నీటిని ప్రతిరోజూ తాగుతాడట. అయితే అది కూడా వరల్డ్ లోనే బెస్ట్ బ్రాండ్ వాటర్ ని మాత్రమే తాగుతాడట.

ఇతర ఆటలు..

ఇతర ఆటలు..

తనకు ఫిట్ నెస్ ముఖ్యం కాబట్టి.. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఫుట్ బాల్, వాలీబాల్, టెన్నిస్ వంటి ఆటలు కూడా ఆడుతుంటాడట. ఇలా ఆడటం వల్ల క్రికెట్ పై విసుగు పుట్టకుండా ఉంటుందట. అంతేకాదు ఎక్సర్ సైజ్ చేయడానికి ఇవి అత్యుత్తమైన మార్గాలని చెబుతున్నాడు.

English summary

Happy Birthday Virat Kohli : Diet and Fitness Secrets of Indian Cricket Team Captain

Virat Kohlis known for his hyper-intensive workout regime, but theres a precise diet that makes it all possible.