For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్యాట్ టు ఫిట్ : ‘పూల రంగడు‘ లాంటి బాడీ షేప్ కావాలంటే సునీల్ డైట్ ఫాలో అవ్వండి...

|

మన తెలుగు రాష్ట్రాల్లో వెండి తెరపై సినిమా హీరో సిక్స్ ప్యాక్ తో కనిపించగానే కుర్రకారు చేసే హడావుడి అంతా ఇంతా కాదు.. ఈలలు వేస్తూ తెగ గోల చేయడం వంటి వాటిని నిత్యం మనం చూస్తూ ఉంటాం. చాలా మంది అభిమానులు తమకే ఆ సిక్స్ ప్యాక్ వచ్చినట్టు ఫీలవుతుంటారు. నిజంగా మన లాంటి వారికి సిక్స్ ప్యాక్ వస్తుందా? ముఖ్యంగా బబ్లీగా, చబ్బీగా ఉండే వారికి సిక్స్ ప్యాక్ అనేది సాధ్యమా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

ఎందుకంటే ఈ ప్రపంచంలో అసాధ్యమనేది ఏదీ లేదు. ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే. ఇందుకు చక్కటి ఉదాహరణే మన తెలుగు కమెడీయన్ అండ్ హీరో సునీల్. ఈ భీమవరం బుల్లోడు ఒకప్పుడు బాగా బబ్లీగా కనిపిస్తూ.. కామెడీ రోల్స్ వేసుకుంటూ అందరినీ తెగ నవ్వించేవాడు. అయితే 'పూల రంగడు' తర్వాత సునీల్ ఒక్కసారిగా సిక్స్ ప్యాక్ హీరోగా మారిపోయాడు. ఇదంతా రాత్రికి రాత్రి సాధ్యం కాలేదు. ఇందుకోసం ఈ నటుడు ఎంతగానో కష్టపడ్డాడు. ఈరోజు సునీల్ పుట్టినరోజు సందర్భంగా సునీల్ కు సిక్స్ ప్యాక్ ఎలా వచ్చిందో.. ఇందుకోసం ఎలాంటి డైట్ అండ్ వర్కవుట్స్ చేశాడో సునీల్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం...

హృతిక్ రోషన్ బర్త్ డే స్పెషల్ : తనలాగా డైట్ అండ్ వర్కవుట్స్ చేస్తే మీకు సిక్స్ ప్యాక్ ఖాయం...

కోచ్ కేర్...

కోచ్ కేర్...

ఏ గురువు అయినా తన శిష్యుడికి ఇచ్చే మోటివేషన్ చాలా గొప్పది. అలాగే జిమ్ కోచ్ ఇచ్చే శిక్షణ చాలా అద్భుతమైనది. జిమ్ లో మనం అడుగుపెట్టిన నాటి నుండి తన బాడీకి పరిపూర్ణమైన ఫిట్ నెస్ వచ్చేంత వరకు ఆ కోచ్ చాలా కేర్ తీసుకున్నారంట.

సిక్స్ ప్యాక్ ఈజీ కాదు..

సిక్స్ ప్యాక్ ఈజీ కాదు..

ప్రతి ఒక్కరికీ సిక్స్ ప్యాక్ బాడీ అనేది అంత ఈజీ కాదు. అయితే కొంచెం కష్టపడితే అది సాధ్యమే అని చెబుతున్నాడు సునీల్. ఎందుకంటే ఎంతో లావుగా ఉండే తానే సిక్స్ ప్యాక్ సాధించానంటే, మిగిలిన వారికి కూడా ఇది కచ్చితంగా సాధ్యపడుతుందని భరోస్తా ఇస్తున్నాడు సునీల్.

ఎంజాయ్ చేస్తూ..

ఎంజాయ్ చేస్తూ..

ఎంజాయ్ చేస్తూ ఏ పని చేసినా కచ్చితంగా ఫలితం ఉంటుంది. అయితే చాలా మంది సిక్స్ ప్యాక్ కోసమే జిమ్ కు వెళ్తుంటారు. అయితే ఫిట్ నెస్ కోసం కూడా జిమ్ కు వెళ్లొచ్చు.

రైస్ మానేశారట..

రైస్ మానేశారట..

సునీల్ హీరోగా మారాక ‘పూల రంగడు‘ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీలో కనిపించేందుకు చాలా కఠోర శ్రమలే చేశాడట. ముఖ్యంగా తాను డైట్ విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకున్నాడట. రైస్ ను కొన్ని రోజుల పాటు పూర్తిగా మానేశారట.

అల్పాహారం..

అల్పాహారం..

అప్పటి నుండి ప్రతిరోజూ ఉదయం గుడ్లలోని పచ్చని సోనను వదిలేసి మిగిలింది తినేవారట. అది కూడా రోజుకు నాలుగు గుడ్లు తినేవారట. అదీ కూడా సాధారణ ఆయిల్ తో కాదండోయ్. ఆలివ్ ఆయిల్ తో చేసినవి తినేవాడంట. అయితే అదీ కూడా అతి తక్కువగా వాడేవారట. వీటితో పాటు రా బ్రెడ్ ను తీసుకునేవాడట.

ఫిష్ ఫుడ్..

ఫిష్ ఫుడ్..

సిక్స్ ప్యాక్ బాడీ కోసం సునీల్ సిక్స్ మంత్స్ వరకు కేవలం ఫిష్ ఫుడ్ తీసుకున్నారట. చేపల నుండి సహజంగా ప్రోటీన్లు లభిస్తాయి కాబట్టి వాటిని ఎక్కువగా తీసుకున్నారట. మధ్యాహ్నం ఓట్స్ తీసుకునేవారట. సాయంత్రం పచ్చి కూరగాయాలు తీసుకునేవారట.

అమ్మో! ఫిట్ నెస్ కోసం ఆలియా భట్ ఎలాంటి ఫీట్స్ చేస్తుందో మీరే చూడండి...

ఎక్కువగా నీరు..

ఎక్కువగా నీరు..

ఆహారంతో పాటు ప్రతిరోజూ మూడు లీటర్ల నీటిని తాగేవారట. వీటితో పాటు అప్పుడప్పుడు కొబ్బరి నీళ్లు తీసుకునేవారట. కొన్ని సమయాల్లో కూల్ డ్రింక్స్ కూడా తాగేవారట.

స్టెరాయిడ్స్ జోలికి వెళ్లడట..

స్టెరాయిడ్స్ జోలికి వెళ్లడట..

అయితే జిమ్ కు వెళ్లి సిక్స్ ప్యాక్ వంటి బాడీ కోసం సునీల్ ఎప్పటికీ స్టెరాయిడ్స్ జోలికి వెళ్లలేదట. మీరు కూడా ఎప్పటికీ అలాంటి ఉత్ప్రేరకాల జోలికి వెళ్లొద్దని సలహా ఇస్తున్నాడు సునీల్.

సిక్స్ ప్యాక్ వచ్చాక..

సిక్స్ ప్యాక్ వచ్చాక..

తనకు ఒక్కసారి సిక్స్ ప్యాక్ వచ్చాక చాలా సినిమాల్లో వరుసగా అవకాశాలు వచ్చాయని చెప్పాడు. ‘పూలరంగడు‘ తర్వాత మిస్టర్ పెళ్లికొడుకు, తడాఖా, భీమవరం బుల్లోడు, క్రిష్ణాష్టమి, జక్కన్న వంటి సినిమాల్లో అద్భుతమైన అవకాశాలు వచ్చాయని చెప్పాడు.

రెండేళ్లు చేశాడట..

రెండేళ్లు చేశాడట..

సునీల్ సిక్స్ ప్యాక్ కోసం రెండు సంవత్సరాల పాటు కఠోర శ్రమ చేశాడు కాబట్టే తనకు నాలుగేళ్ల వరకు శరీర ధారుడ్యం చెక్కు చెదరకుండా అలాగే ఉందని కచ్చితంగా చెబుతున్నాడు. అందుకే ఇప్పటికీ ఇంత ఆరోగ్యంగా ఉన్నానని చెబుతున్నాడు.

విపరీత ధోరణులకు వెళ్లొద్దు..

విపరీత ధోరణులకు వెళ్లొద్దు..

సునీల్ సిక్స్ ప్యాక్ గురించి ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలనే చెప్పాడు. ఎవ్వరు కూడా సిక్స్ ప్యాక్ కోసం విపరీత ధోరణులకు వెళ్లొద్దని చెప్పాడు. ఎందుకంటే షార్ట్ కట్ లో వచ్చింది షార్ట్ కట్ లోనే వెళ్లిపోతుందని చెప్పాడు.

చూడచక్కని బాడీ కోసం..

చూడచక్కని బాడీ కోసం..

సునీల్ తన శరీరాన్ని అద్భుతమైన షేప్ లోకి తీసుకొచ్చేందుకు ప్రఖ్యాత ఫిట్ నెస్ కోచ్ వెంకట్ వద్ద శిక్షణ తీసుకున్నాడట. ఇందుకోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డాడట. ముఖ్యంగా కార్డియో వర్కవుట్స్, సర్క్యూట్స్ వంటివి చేశారట.

చూశారు కదా సునీల్ డైట్ అండ్ వర్కవుట్స్ విశేషాలు. మీకు కూడా ఇలాంటి బాడీ సొంతం కావాలంటే సునీల్ పాటించిన చిట్కాలను పాటించండి...

English summary

Telugu Actor Sunil Diet and Workouts

Here we talking about telugu actor sunil diet and workout. Take a look
Story first published: Friday, February 28, 2020, 13:07 [IST]