For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL 2021: స్టార్ ప్లేయర్ల సూపర్ డైట్ ప్లాన్స్ ఇవే...!

|

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)క్రికెట్ అంటే కేవలం ఫోర్లు, సిక్సర్లు.. కళ్లు చెదరే క్యాచులు.. రివ్వున దూసుకొచ్చే బంతులు, రెప్పపాటులో పడిపోయే వికెట్లే కాదు.. ప్రతి ప్లేయర్ కు ఫిట్ నెస్ అనేది చాలా ముఖ్యం.

ముందుగా ప్రతి ఒక్క ప్లేయర్ ఫిట్ గా ఉంటేనే మ్యాచ్ లో ఎలాంటి అద్భుతాలైనా సాధించొచ్చు. దీని కోసం చాలా మంది ప్లేయర్లు కఠినమైన వర్కవుట్లు మరియు డైట్ ఫాలో అవుతూ ఉంటారు. అయితే కొందరు ఆటగాళ్లు మాత్రం వర్కవుట్ల కంటే తమ డైట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

వారి డైట్ లో ఎక్కువగా పాలు, తాజా పండ్లు, కూరగాయలతో పాటు మరికొన్నింటినీ క్రమం తప్పకుండా తీసుకుంటున్నారు. ఇంతకీ ఆ ప్లేయర్లెవరు.. ఆరోగ్యంగా ఉండేందుకు వారు ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారు.. మనం కూడా అవి ఫాలో అవ్వొచ్చా లేదా అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఐపిఎల్ ఆటగాళ్ల డైట్ ఫాలో అవ్వండి... మీరూ ఫిట్ గా మారిపోండి...ఐపిఎల్ ఆటగాళ్ల డైట్ ఫాలో అవ్వండి... మీరూ ఫిట్ గా మారిపోండి...

విరాట్ కోహ్లీ..

విరాట్ కోహ్లీ..

టీమిండియా కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ డైట్ ను ఫాలో అయితే మీరు కచ్చితంగా ఫిట్ గా మారిపోతారు. ఒకప్పుడు చికెన్ ను బాగా ఇష్టపడే కోహ్లీ 2012 సంవత్సరం నుండి మాంసాహారాన్ని పూర్తిగా మానేశాడట. అంతేకాదు తనకు ఇష్టమైన ఆహారాలలో కొవ్వు పదార్థాలు ఉంటాయని తెలిస్తే వాటిని పక్కనపెట్టేస్తున్నాడట. ప్రస్తుతం విరాట్ కోహ్లీ పూర్తిగా శాఖాహారిగా మారిపోయాడు. ఇప్పుడు ప్రతిరోజూ తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకుంటున్నాడట. దీని వల్లే మైదానంలో తన ఆటతీరు బాగా మెరుగుపడిందని విరాట్ కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

రోహిత్ శర్మ..

రోహిత్ శర్మ..

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రతిరోజూ గుడ్లు తీసుకుంటాడట. ప్రాక్టీస్ సెషన్లకు వెళ్లే ముందు కనీసం డజన్ గుడ్లను తీసుకుంటాడట. అలాగే తన అల్పాహారంగా వోట్స్ మరియు పాలను రెగ్యులర్ గా తీసుకుంటాడట. మధ్యాహ్నం, డిన్నర్ సమయంలో రోటీ, కొన్ని రకాల సూప్ లను తీసుకుంటాడట.

ఎప్పుడూ ఫిట్ గా ఉండేందుకు ‘హిట్ మ్యాన్'ఏమి చేస్తాడో చూసేయ్యండి...ఎప్పుడూ ఫిట్ గా ఉండేందుకు ‘హిట్ మ్యాన్'ఏమి చేస్తాడో చూసేయ్యండి...

రవీంద్ర జడేజా..

రవీంద్ర జడేజా..

చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు గుజరాతీ వంటకాలంటే చాలా ఇష్టమట. అయితే కొవ్వు మరియు ఎక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని అవాయిడ్ చేస్తాడట. ఇక ప్రతిరోజూ ఉదయాన్నే పాలు తప్పనిసరిగా తీసుకుంటాడట. ప్రోటీన్స్ బ్యాలెన్స్ గా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటాడట. ఇక భోజనం చేసిన తర్వాత కచ్చితంగా పండ్లను స్నాక్స్ గా తీసుకుంటాడట.

సచిన్ టెండూల్కర్..

సచిన్ టెండూల్కర్..

క్రికెట్ దేవుడిగా పేరు తెచ్చుకున్న సచిన్ రమేష్ టెండూల్కర్ క్రికెట్ నుండి రిటైర్ అయినప్పటికీ, ఫిట్ నెస్ విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటున్నాడు. ఇటీవలే కరోనా నుండి కోలుకున్న సచిన్ సూపర్ డైట్ ఫాలో అవుతాడంట. ప్రతిరోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్టులో ఎక్కువగా ఉడికించిన వంటలను తింటారట. అవి అందుబాటులో లేకపోతే, పాలు, తాజా పళ్ల రసం తీసుకుంటాడట. ఇక తన భోజనంలో ప్రతిరోజూ రోటీ మరియు పెరుగు కచ్చితంగా ఉండాల్సిందేనట. ఇక డిన్నర్ సమయంలో కాల్చిన చేపలు, చపాతి, కొద్దిగా సలాడ్ తీసుకుంటాడట.

హార్దిక్ పాండ్య..

హార్దిక్ పాండ్య..

ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య డైట్ అండ్ వర్కవుట్ విషయంలో చాలా సీరియస్ గా ఉంటాడు. ఈ ఆటగాడు కూడా కఠినమైన డైట్ ను ఫాలో అవుతాడు. ఉదయాన్నే తాజా పండ్లను మరియు నట్స్ తీసుకుంటాడు. వీటితో పాటు కొబ్బరినీళ్లు, గ్రీన్ టీ, పండ్ల రసాలను రెగ్యులర్ గా తీసుకుంటాడు. మధ్యాహ్నం సమయంలో కూరగాయల సూప్, స్వీట్ కార్న్, బ్రెడ్, టమోటా, రోటీ, ఉడికించిన రైస్, పెరుగన్నం తీసుకుంటాడు. సాయంత్రం స్నాక్ తందూరి చికెన్, బిస్కెట్లు, ఫ్రూట్ కేక్, రాత్రి వేళ వెజిటెబుల్ సలాడ్, రోటీ మరియు నాన్ వంటి వాటిని రెగ్యులర్ గా తీసుకుంటాడు.

ఎంఎస్ ధోనీ..

ఎంఎస్ ధోనీ..

చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ప్రతిరోజూ ఉదయాన్నే పాలు కచ్చితంగా తీసుకుంటాడు. తను ఇప్పటికీ అంత బలంగా ఉండటానికి కారణం తన కఠినమైన డైట్ అని చెబుతూ ఉంటాడు. అలాగే మధ్యాహ్నం, రాత్రి వేళలో చికెన్ కబాబ్, చికెన్ టిక్కా, చికెన్ బటర్ ను ఎక్కువగా తీసుకుంటాడట. ధోనీకి గాజర్ కా హల్వా మరియు కీర్ ను బాగా ఇష్టపడతాడంట. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్లే.. తను ఇప్పటికీ హెల్దీగా ఉంటున్నాడట.

ధోనీ డైట్ సీక్రెట్స్, వర్కవుట్లను ఫాలో అయితే మీకు సిక్స్ ప్యాక్ ఖాయం...!ధోనీ డైట్ సీక్రెట్స్, వర్కవుట్లను ఫాలో అయితే మీకు సిక్స్ ప్యాక్ ఖాయం...!

భువనేశ్వర్ కుమార్..

భువనేశ్వర్ కుమార్..

సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ డైట్ అండ్ ఫిట్ నెస్ పై ఎక్కువ ఫోకస్ పెడతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ యువ బౌలర్ డైట్ అందరికంటే భిన్నంగా పాటిస్తాడు. తను ఎప్పుడూ హోమ్ మేడ్ రెసిపీలనే ఇష్టపడతాడంట. వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ.. వాటినే ఎక్కువగా తీసుకుంటాడట. భువనేశ్వర్ కుమార్ తల్లి చేత్తో తయారు చేసిన బ్లాక్ గ్రామ్ ను చాలా ఇష్టంగా తీసుకుంటాడట.

రవిచంద్రన్ అశ్విన్..

రవిచంద్రన్ అశ్విన్..

ఐపిఎల్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్న మరో ఆల్ రౌండర్ అశ్విన్ కూడా హోమ్ మేడ్ రెసిపీలనే బాగా ఇష్టపడతాడట. వాటిని ఎక్కువగా తీసుకుంటాను కాబట్టే.. ఇప్పటికీ చాలా ఫిట్ గా ఉంటానని చెబుతుంటాడు. శాఖాహారి అయిన అశ్విన్ కు క్యాప్సికమ్ పన్నీర్ అంటే బాగా ఇష్టమట. తన తల్లి చేసిన వంటకాలను ఎక్కువగా ఆరగిస్తాడంట.

రిషబ్ పంత్..

రిషబ్ పంత్..

ఢిల్లీ కెప్టెన్ గా బాధ్యతలు అందుకోవడమే కాదు.. తొలి మ్యాచ్ లోనే గురువు ధోనీని ఓడించిన రిషబ్ పంత్ డైట్ విషయంలో చాలా కఠినంగా ఉంటాడట. తను ఎక్కువగా చోలే భటురే, ఆలూ పరాఠా, ఐస్ క్రీమ్ లను ఎక్కువగా తీసుకుంటాడట.

స్టీవ్ స్మిత్..

స్టీవ్ స్మిత్..

గత సీజన్లో రాజస్థాన్ తరపున ఆడి.. ఈ సీజన్లో ఢిల్లీ జట్టులో చేరిన స్టీవ్ స్మిత్ ఆరోగ్యకరమైన డైట్ ను ఫాలో అవుతాడంట. తన అల్పాహారంలో ఎక్కువగా వోట్స్, పాలు, తాజా పండ్ల రసం ఉండేలా చూసుకుంటాడట. ఇక భోజనం సమయంలో చికెన్ శాండ్ విచ్ తో పాటు రెగ్యులర్ గా అరటిపండు తీసుకుంటాడట.

English summary

These Are the Super Diets of the Superstars of Ipl Cricket

Here are these are the super diets of the superstars of ipl cricket. Have a look
Story first published: Monday, April 12, 2021, 14:10 [IST]