Just In
- 2 hrs ago
ఈ 5 రాశుల వారు తమ భాగస్వామిని ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటారు..మాటలతో చిత్రహింసలకు గురిచేస్తారు
- 3 hrs ago
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- 4 hrs ago
ఈ హనుమాన్ మంత్రం శనిదోషాన్ని తొలగిస్తుంది, ఎంతో శక్తివంతమైనది
- 5 hrs ago
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
Stay Motivated: జిమ్‌కు వెళ్లాలన్న మూడూ, ఉత్సాహం లేదా.. ఇలా చేయండి అయితే
Stay Motivated: ఫిట్‌గా ఉండటం ఎవరి ఇష్టం ఉండదు? ప్రతి ఒక్కరికీ మంచి ఫిజిక్‌ను సొంతం చేసుకోవాలని ఉంటుంది. కానీ దాని కోసం పట్టుదలగా శ్రమించలేరు. కొంతమంది జిమ్‌లో జాయిన్ అవుతారు. ఓ వారం పాటు కరెక్ట్ టైంకే వెళ్తారు. తర్వాత నొప్పులను కారణంగా చూపి, లేదంటే ఇతర కారణాలతో జిమ్‌కు వెళ్లడం మానేస్తుంటారు. ఇలా జిమ్‌కు ఫీజు కట్టి వెళ్లకుండా ఎగ్గొట్టిన వారు చాలా మందే ఉంటారు.
శారీరక ఫిట్‌నెస్ ఒక్క రోజులో జరిగేది కాదు. దానికోసం నిరంతరం వ్యాయామం చేస్తుండాలి. చెమట చిందించాలి. ఏది పడితే అది తినకుండా నోటిని అదుపులో ఉంచుకోవాలి.
మీరు కూడా జిమ్‌కు వెళ్లాలని ఉన్నా వెళ్లలేకపోతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించారనుకోండి జిమ్‌కు వెళ్లాలన్న ఉత్సాహం రోజూ ఉంటుంది.

1. లక్ష్యం ముఖ్యం గురూజీ
జిమ్‌కు ఎందుకు వెళ్తారు? ఈ ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కో సమాధానం ఇస్తుంటారు. కొందరు బరువు తగ్గాలని, మరికొందరు పొట్ట తగ్గించాలని, ఇంకొందరు కండలు తిరిగిన బాడీ కావాలని, సిక్స్ ప్యాక్ కోసం, ఒంట్లోని కొవ్వు కరిగించడానికి, ఫిట్‌గా ఉండాలా ఇలా రకరకాల జవాబులు వినిపిస్తాయి.
అలాగే మీకేం కావాలో ముందుగా ఒక లక్ష్యాన్ని సెట్ చేసుకోవాలి. బరువు తగ్గడమే మీ లక్ష్యం అనుకుంటే మీరెంత వెయిట్ ఉన్నారు, ఎన్ని కిలోలు తగ్గాలనుకుంటున్నారు, ఎన్ని రోజుల్లో తగ్గాలనుకుంటున్నారో తేల్చుకోవాలి. అయితే ఈ లక్ష్యాలు సాధించే విధంగా ఉండాలి. నెల రోజుల్లో 20 కిలోలు తగ్గాలనుకోవడం అవివేకం అవుతుంది. సహేతుకమైన లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. మీ జిమ్‌లో పర్సనల్ ట్రైనర్ ఉంటే తనతో అన్ని చర్చించాలి. మీ ఆహారపు అలవాట్లు, శరీరాకృతి, BMI, చేసే పని ఇలా అన్ని చెబితే.. నెలకు ఎన్ని కిలోలు తగ్గవచ్చో సూచిస్తారు. దానిని లక్ష్యంగా పెట్టుకొని కష్టపడాలి. ఆ లక్ష్యాన్ని చేరుకుంటే వచ్చే ఉత్సాహంతో జిమ్‌ను కంటిన్యూ చేయవచ్చు.

2. శారీరక శ్రమను పనిలో భాగం చేసుకోండి
వ్యాయామం చేయడానికి టైం లేదనే సాకులు చెప్పడం మానుకోండి. మీరు షిఫ్ట్ తరహా పనుల్లో ఉద్యోగం చేస్తుంటే.. ఉద్యోగానికి ఆటంకం కలగకుండా, వ్యాయామాన్ని చేయడాన్ని అలవాటు చేసుకోవాలి.
ఎలివేటర్‌కు బదులు మెట్లు ఎక్కడం, బైక్‌పై కాకుండా కొంత దూరంలో ఉన్న దుకాణాలను నడుచుకుంటూ వెళ్లడం, పిల్లలతో మైదానంలో ఆడుకోవడం, పని మధ్యలో కాసేపు అటు ఇటు నడవడం లాంటి చేస్తుండాలి. మీరు కుక్కలు, పిల్లలు లాంటి పెంచుకుంటే వాటితో పాటు నడకకు వెళ్లవచ్చు.

౩. కాగితంపై రాసుకోండి
మీరు బరువు తగ్గాలని ఆశిస్తున్నారా.. శక్తిని పెంచుకోవాలా.. బాగా నిద్రపోవాలా.. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారంగా జిమ్‌కు వెళ్తున్నారా ఇలా మీ లక్ష్యాలను కాగితంపై రాసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను చూడటం, లక్ష్యాలను కాగితంపై రాయడం వల్ల వాటి నుండి ప్రేరణ పొందవచ్చు.
వ్యాయామ డైరీని నిర్వహించడం కూడా చక్కగా పని చేస్తుంది. మీ ట్రాన్స్‌ఫర్మేషన్ ను రోజూ ఫోటో తీసుకోండి. మీరు వ్యాయామం ప్రారంభించిన రోజు నాటి నుండి మీ శరీరాన్ని ఒక్కో ఫోటో తీస్తూ వెళ్లండి. కొన్ని రోజులయ్యాక ఎలాంటి ఫలితం వచ్చిందో వాటిని చూస్తే తెలిసిపోతుంది.

4. స్నేహితులు, పరిచయస్తులతో కలిసి జిమ్‌కు వెళ్లండి
జిమ్‌కు వెళ్లేటప్పుడు ఎవరినైనా ఫ్రెండ్‌ను చేసుకోండి. దాని వల్ల అయినా జిమ్‌కు వెళ్లడం అలవాటు అవుతుంది. ఫ్రెండ్స్, పరిచయస్తులు, సహోద్యోగులు వారితో జిమ్‌కు వెళ్లడం వల్ల మీకు జిమ్‌కు వెళ్లాలని లేనప్పుడు వారు మిమ్మల్ని మోటివేట్ చేస్తుంటారు.

5. విరామం మంచిదే
రోజూ జిమ్‌కు వెళ్లారు ఓ వారం రోజులు అయ్యాక జిమ్‌కు వెళ్లాలన్న మూడు, ఉత్సాహం లేవనుకోండి. ఆరోజు విశ్రాంతి తీసుకోండి. సరిపోలేదా మరో రోజూ విశ్రాంతి తీసుకోండి. కానీ తర్వాత మళ్లీ ట్రాక్‌లోకి రావాలని మిమ్మల్ని మీరే ఆదేశించుకోండి. ఒకటీ రెండు రోజులు విశ్రాంతి తీసుకోవడం వల్ల మీ లక్ష్య సాధనలో వెనక బడిపోయారని చింతించాల్సిన అవసరం లేదు. ఇలా విశ్రాంతి తీసుకోవడం వల్ల మీలో కొత్త ఎనర్జీ వస్తుంది. కండరాలకు తగిన రెస్ట్ దొరుకుతుంది.