For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాలీవుడ్ హీరోల మాదిరిగా ఈ ‘వర్కవుట్లు’చేస్తే.. మీకు కొత్త లుక్ గ్యారంటీ...!

|

కరోనా సమయంలో షూటింగులు లేకపోవడంతో, టాలీవుడ్ లో కొందరు హీరోలు లాక్ డౌన్ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నారు. లాక్ డౌన్ ఉన్నంతసేపు ఇంట్లోనే ఉంటూ తమ జిమ్ ట్రైనర్ సారథ్యంలో అనేక వర్కవుట్లు చేసేవారట. అలాగే ఆహారం విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకునేవారట. ప్రతిరోజూ కోడిగుడ్లలోని తెల్లసొనను తప్పకుండా తీసుకునేవారట.

వీటితో పాటు పండ్లు, చపాతి, రోటీలు, బ్రౌన్ రైస్ తో పాటు కూరగాయలను ఎక్కువగా తీసుకునేవారట. అలాగే సైక్లింగ్ లేదా జాగింగ్ కు వెళ్లడం కూడా చేసేవారట. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల జిమ్ లు ఓపెన్ కావడంతో.. చాలా మంది గంటకొద్దీ సమయాన్ని అక్కడే గడిపేస్తున్నారు. కొందరు తమ తర్వాతి సినిమాల కోసం బరువు పెరిగేందుకు ప్రయత్నిస్తే.. మరికొందరు మాత్రం బరువు తగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నించారంట.

అందులో భాగంగానే సందీప్ కిషన్ కేవలం వారం రోజుల్లోనే రెండు కిలోల బరువు తగ్గేశాడంట. మిగతా హీరోలు తమ తదుపరి సినిమాలో కొత్తగా కనిపించేందుకు అనేక కసరత్తులు చేస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా మహేష్ బాబు కూడా చేరిపోయాడు. తాను సర్కారు వారి పాటలో కొత్తగా కనిపించేందుకు ఎలా వర్కవుట్లు చేస్తున్నాడో మీరే చూడండి. మహేష్ బాబుతో పాటు లాక్ డౌన్ టైమ్ లో ఎక్కువగా వర్కవుట్లు ఏయే హీరోలు చేశారో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ ను పూర్తిగా చూడండి...

ఆదిపురుష్ ప్రభాస్..

ఆదిపురుష్ ప్రభాస్..

బహుబలి కోసం ప్రభాస్ ఎలాంటి వర్కవుట్లు చేశాడో.. తన సినిమా చూస్తే మనందరికీ తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చిన సాహో సినిమాలోనూ తాను అదే బాడీ ఫిట్ నెస్ మెయింటెయిన్ చేశాడు. అందుకు సహాయపడిన తన జిమ్ కోచ్ కు ఖరీదైన కారును బహుమతిగా కూడా ఇచ్చాడు. అయితే డార్లింగ్ ప్రభాస్ తాజాగా ఆదిపురుషుడిగా కొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఇందుకోసం జిమ్ లో తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇటీవల సిక్స్ ప్యాక్ తో ఉన్న కొత్త పోస్టర్ ను విడుదల చేశాడు. అది అభిమానులందరినీ విపరీతంగా ఆకట్టుకుంది.

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ

టాలీవుడ్ అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ బాడీ ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అభిమానులను రౌడీ బాయ్స్ అని పిలుచుకునే ఈ యంగ్ హీరో, లాక్ డౌన్ టైమ్ లో ఎక్కువగా తన ఇంటిదగ్గరే గడిపినప్పటికీ, ప్రస్తుతం జిమ్ లు ఓపెన్ కావటంతో తన తర్వాతి మూవీ కోసం, జిమ్ లోనే ఎక్కువసేపు గడుపుతున్నాడంట.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

టాలీవుడ్ సినిమాలో సిక్స్ ప్యాక్ లుక్ లో కొత్తగా కనిపించిన వారిలో ముందు వరుసలో ఉండే హీరో ఎవరంటే అల్లుఅర్జున్ అని ఎవరైనా టక్కున చెప్పేస్తారు. దేశముదురు సినిమాలో తొలిసారిగా సిక్స్ ప్యాక్ లుక్ లో ఈ హీరో కనిపించడంతో.. ఆ తర్వాత చాలా మంది హీరోలు ఇదే స్టైల్ ను ఫాలో అయ్యారు. హీరోలతో పాటు చాలా మంది కుర్రాళ్లు తమ బాడీ ఫిట్ నెస్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టారు.

వరుణ్ తేజ్

వరుణ్ తేజ్

నాగబాబు ముద్దుల కుమారుడు వరుణ్ తేజ్ కూడా తన బాడీ ఫిట్ నెస్ పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా లాక్ డౌన్ టైమ్ లో తన చెల్లెల్లి ఎంగేజ్ మెంట్ లో కనిపించిన వరుణ్ తేజ్.. ఆ తర్వాత ఎక్కువగా జిమ్ లోనే గడుపుతున్నాడట. ప్రతిరోజూ కొన్ని గంటల పాటు జిమ్ లోనే గడపటంతో పాటు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

నిఖిల్

నిఖిల్

ఇక కొత్త పెళ్లి కొడుకు నిఖిల్ యాదవ్.. లాక్ డౌన్ టైమ్ లో ఓ ఇంటివాడైన సంగతి అయిన విషయం తెలిసిందే. అయితే నిఖిల్ కూడా తన తదుపరి సినిమా కోసం జిమ్ లో ప్రతిరోజూ కొన్ని గంటల పాటు గడుపుతున్నాడట. అంతేకాదు తన కొత్త లుక్ ను ఇటీవలే ట్విట్టర్లోను పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

నాగ శౌర్య

నాగ శౌర్య

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్లలో ఒకడైన నాగశౌర్య కూడా అభిమానులను అలరించేందుకు జిమ్ బాట పట్టాడు. అంతేకాదు లాక్ డౌన్ సమయంలో ఫుల్లుగా వర్కవుట్లు చేసి తన బాడీషేప్ ను పూర్తిగా మార్చుకున్నాడు. కరోనా సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుని సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేశాడు. అంతేకాదు ఫుడ్ సైతం చాలా తక్కువగా తీసుకునేవాడట. అయితే ఇదంతా సినిమా కోసం కాదంట. తనకు తానే బాడీని ఇలా మార్చాలని అనుకున్నట్టు తెలిపాడు. అయితే న్యూ లుక్ నాగశౌర్య బాడీ అమ్మాయిలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

అడివి శేషు

అడివి శేషు

మరో తెలుగు హీరో అడివి శేష్. గూఢచారి సినిమా పూర్తై రెండు సంవత్సరాలు పూర్తయినందున, తాను కూడా న్యూ లుక్ లో కనిపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడంట. ఈ టాలీవుడ్ యంగ్ హీరో కూడా లాక్ డౌన్ టైమ్ లో ఎక్కువగా వర్కవుట్లు చేశాడట.

నారా రోహిత్

నారా రోహిత్

ఇక టాలీవుడ్ లో నారా వారి కుటుంబం తరపున హీరోగా అడుగుపెట్టిన నారా రోహిత్ ఇదివరకు బాగా బొద్దుగా కనిపించినప్పటికీ, ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా భారీగా బరువు తగ్గాడట. అంతేకాదు ఈ సమయంలో తన బాడీని సరైన షేప్ తీసుకొచ్చేందుకు చాలా కష్టపడ్డాడట.

సందీప్ కిషన్

సందీప్ కిషన్

టాలీవుడ్ లో మరో హీరో సందీప్ కిషన్. ఈ హీరోకు తెలుగులో ఇప్పటివరకు అనుకున్నంత హిట్ రాకపోయేసరికి.. ఈసారి బాడీ చేంజ్ తో కొత్త లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచేందుకు సిద్ధంగా ఉన్నాడట. ఇందుకోసం లాక్ డౌన్ సమయంలో ఫుల్ వర్కవుట్స్ చేశాడట. అంతేకాదు జిమ్ లో కూడా ప్రతిరోజూ గంటలకొద్దీ గడిపేవాడట.

సుధీర్ బాబు

సుధీర్ బాబు

మహేష్ బాబు బావమరిదిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన మరో హీరో సుధీర్ బాబు. ఇటీవలే ఓటిటి ప్లాట్ ఫామ్ లో ‘వి' సినిమాతో తన సిక్స్ ప్యాక్ బాడీని మరోసారి అభిమానులకు చూపించాడు. తాను ఇలా సిక్స్ ప్యాక్ రావడంతో గంటలకొద్దీ జిమ్ లోనే గడిపేవాడినని.. ఆహారం విషయంలో డైట్ జాగ్రత్తలు తీసుకునేవాడినని పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.

అక్కినేని అఖిల్..

అక్కినేని అఖిల్..

టాలీవుడ్ లో మరో హీరో అక్కినేని అఖిల్ ఇప్పటివరకు వెండితెరపై ఒక్క హిట్ కూడా కొట్టలేదు. అతని సోదరుడు నాగచైతన్య కనీసం కొంత మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ అఖిల్ కు అంతగా పేరు రాలేదు. అందుకే ఈసారి తాను కూడా తన బాడీ షేప్ ని పూర్తిగా మార్చుకునేందుకు సిద్ధమయ్యాడట. అందులో భాగంగానే జిమ్ లో గంటలకొద్దీ గడుపుతున్నాడంట. త్వరలో తాను కూడా సిక్స్ ప్యాక్ సాధిస్తానని చెప్పేస్తున్నాడు ఈ కుర్రహీరో.

English summary

Tollywood Heroes Workouts during lockdown period

Here are the tollywood heros workouts during lockdown period. Take a look