For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీ కేర్ ఫుల్! కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే కండరాలు పట్టేస్తాయని మీకు తెలుసా..

|

'పెద్దల మాట పెరుగన్నం మూట' అన్న మాట మీరు చిన్నప్పుడే వినే ఉంటారు. పెద్దలు చెప్పే విషయాల్లో చాలా పరమార్థం దాగి ఉంటుంది. పురాణాల కాలం నాటి నుండి నేటి ఆధునిక యుగం వరకు పెద్దలు మాటలను విన్నవారు ఎందరో బాగుపడినట్లు అనేక సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాం. కానీ ప్రస్తుత జనరేషన్ వారు పెద్దల మాటను బొత్తిగా లెక్క చేయడం లేదు.

అందుకే ప్రతి చిన్న విషయానికి డాక్టర్లను సంప్రదిస్తున్నారు. అనవసరంగా డబ్బును ఆస్పత్రి పాలు చేసుకుంటున్నారు. ఇప్పటికీ మన ఇళ్లలో ఆడపిల్లలు కాలిపై కాలు వేసుకుని కూర్చుంటే ఇంట్లోని బామ్మలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు లేదా ఇతర పెద్దలు కోపగించుకోవటం చూస్తూనే ఉంటాం. కానీ వారి మాటలను పట్టించుకోకుండా చాలా మంది మహిళలు వారి మాటలను కొట్టిపారేస్తుంటారు. అంతేకాదు దర్జాగా కాలుపై కాలు వేసుకుని కూర్చుంటారు. కానీ ఇలా కూర్చోవడం వల్లే వచ్చే ప్రమాదాలేంటో ఇటీవల కొందరు విదేశీ శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు (ఆర్థిపెడిక్ సర్జన్స్) శాస్త్రీయంగా వివరించారు. ఆ విశేషాలేంటో తెలుసుకోండి...

ఆడవారు ఇలా కూర్చుంటే..

ఆడవారు ఇలా కూర్చుంటే..

మహిళలు రెండు కాళ్లు బాగా దగ్గరగా పెట్టి లేదా కాలిపై కాలు వేసుకుని, పాదాలు క్రాస్ చేసి అటూ ఇటూ పెట్టి కూర్చోవడం చాలా మహిళలకు అలవాటు. కానీ ఇది మంచిది కాదని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బర్బరా బెర్గిన్ చెబుతున్నారు. ఎముకల డాక్టర్ అయినా ఆమె సయాటికా, మోకాలి నొప్పులు, కండరాల సమస్యలకు సంబంధించిన కారణాలపై పరిశోధనలు చేశారు.

కాళ్లు కాస్త ఫ్రీగా..

కాళ్లు కాస్త ఫ్రీగా..

తన స్వీయ అనుభవం తర్వాత 2010 నుంచి ఇప్పటివరకు తాను చాలా ఆసుపత్రులలో ఇలా మహిళలు కూర్చోనే భంగిమలపై పరిశోధనలు చేసినట్లు ఆమె ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు. పురుషుల మాదిరిగా కాళ్లను కాస్త ఫ్రీగా పెట్టుకోవాలని ఆమె మహిళలకు సూచించారు. అంతే కాదు ‘సిట్ లైక్ ఎ మ్యాన్ (Sit Like A Man)‘ అంటూ డాక్టర్ బర్బరా ఓ ఉద్యమం కూడా చేస్తున్నారు.

‘పెల్విన్‘

‘పెల్విన్‘

మహిళల నడుము కింది భాగంలో ఉండే రెండు కాళ్లను, శరీరంలో పై భాగాన్నికలిపే అతి పెద్ద ఎముకల జాయింట్ ‘పెల్విన్‘. మహిళల శరీర నిర్మాణ (అనాటమీ) పరంగా చూస్తే ఈ భాగం పురుషుల కంటే మహిళలకు పెద్దగా, వెడల్పుగా ఉంటుంది.

తీవ్ర ఒత్తిడి...

తీవ్ర ఒత్తిడి...

మహిళలు మగవారి లాగా కాలుపై కాలు వేసుకుని కూర్చున్న సమయంలో వారి తొడ ఎముక ఒకవైపుకు లాగినట్టుగా తిరుగుతుంది. దీని వల్ల ఇటు మోకాలి భాగంలో జాయింట్ అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అలాగే పిదురుల (పెల్విన్) భాగంలోనూ వీటికి తీవ్ర ఒత్తిడి ఉంటుంది.

బర్బరా అధ్యయనంలో...

బర్బరా అధ్యయనంలో...

మహిళలు అలా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల ఎముకలు, కండరాల నొప్పులు వస్తాయని, దీర్ఘకాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తన అధ్యయనంలో తేలినట్లు డాక్టర్ బర్బరా పేర్కొన్నారు. సయాటికా, కండరాల నొప్పులు, కీళ్ల సమస్యకు కారణం ఇదేనని హెచ్చరించారు.

పురుషులకు కూడా...

పురుషులకు కూడా...

కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనే నిబంధన ఒక్క మహిళలకే కాదు. పురుషులకు కూడా వర్తిస్తుందని ఆ డాక్టర్ చెప్పారు. ఎవ్వరైనా కూర్చునే సమయంలో ఎముకలు మరియు కీళ్లు నిటారుగా ఉండాలి. మీరు సరిగ్గా కూర్చోవడం వల్ల మీ ఎముకలు, వెన్నుపాము ఒత్తిడికి గురికావు. అప్పుడు ఎలాంటి నొప్పులు రావు.

English summary

Women have problems when they sit in this position

Here we talking about Women have problems when they sit in this position. Read on