For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్త్మాకు కారణమయ్యే వీటికి దూరం..దూరం..

|

ఆస్తమా (శ్వాస సంబంధిత సమస్య)ఒక క్రోనిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఇది శ్వాసక్రియకు చాలా ఇబ్బందికరమైన ఆరోగ్య సమస్య . ఆస్తమా సమస్య ఉన్నవారిలో దినచర్య కూడా రోజు రోజుకి కష్టతరం అవుతుంది. ఆస్తమా సమస్య ఎక్కువ అయితే ప్రాణానికే చాలా ప్రమాదం. ఆస్తమా యొక్క లక్షణాలు ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తి మారుతుంది. కొన్ని శ్వాస కష్టంగా ఉండటం, దగ్గు,ఛాతీ బిగుతు, శ్వాస సరిగా ఆడకపోవడం, శ్వాసలో గురక వంటి లక్షణాలు ఆస్తమా యొక్క ప్రధాన లక్షణాలు. ఆస్తమాను నివారించలేము, కానీ ఆస్తమా లక్షణాల కంట్రోల్ చేసుకోవచ్చు.

పర్యావరణ లక్షణాలు కూడా ఆస్తమాను మరింత హానికరం చేయవచ్చు. ఆస్తమాకు ఉత్తమ చికిత్స, ఆస్తమా యొక్క లక్షణాలను గుర్తించడం మరియు ఆస్తమా లక్షణాలకు కారణం అయ్యే అలర్జీను నివారించుకోవడం. ఆస్త్మా నివారించడానికి కొన్ని ఆహారాలు సహాయపడుతాయి.

 7 Foods That Worsen Asthma: Health Tips in Telugu

ఈ ఆహారాలను మన రెగ్యులర్ డైట్ నుండి మినహాయించడం ద్వారా ఆస్త్మా లక్షణాలను తగ్గించుకోవచ్చు. మరి మన డైట్ నుండి మినహాయించాల్సిన ఫుడ్స్ ఏంటో చూద్దాం....

గుడ్లు:

గుడ్లు:

గుడ్డు అలర్జీ ఉన్న వారిలో ఆస్త్మా లక్షణాలు కనిపించే అవకాశాలు ఎక్కువ. ఎగ్ వైట్ లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి . ఈ ప్రోటీన్స్ ఆస్త్మాకు మరింత అలర్జీని కలిగిస్తాయి.

షెల్ ఫిష్ :

షెల్ ఫిష్ :

మీకు ఇదివరికటికే ఆస్త్మా ఉన్నట్లైతే షెల్ ఫిష్ కు దూరంగా ఉండాలి . ఆస్త్మాకు కారణం అయ్యే అంత్య ప్రమాధకరమైన ఆహారాల్లో ఇది ఒకటి. . షెల్ ఫిష్ ను తినడం వల్ల అలర్జిక్ రియాక్షన్ కు కారణం అవుతుంది.

MOST READ:పింక్ పెదవుల కోసం అప్పటికప్పుడు అద్భుతంగా పనిచేసే ఇంటిచిట్కాలు MOST READ:పింక్ పెదవుల కోసం అప్పటికప్పుడు అద్భుతంగా పనిచేసే ఇంటిచిట్కాలు

పాలు:

పాలు:

పాలలో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో ఎముకలు మరియు దంతాలను మరింత స్ట్రాంగ్ గా ఉంచుతాయి. అయితే ఆస్త్మా అలర్జిక్ లక్షనాలున్న వారికి ఇది ప్రమాధకరమైన ఆహారంగా భావించాలి. మిల్క్ ప్రోటీన్స్ ఆస్త్మాకు కారణం అవుతాయి.

పీనట్స్:

పీనట్స్:

చాలా మందికి వేరుశెనగలు అలర్జీని కలిగిస్తాయి. అంతే కాదు ఈ అలర్జీ ఆస్త్మాకు కూడా కారణం అవుతుందని కొన్ని పరిశోధన ద్వారా వెల్లడించారు.

MOST READ:నెలరోజులలో ఉదరభాగంలో కొవ్వు తగ్గడానికి సమర్ధవంతమైన మార్గాలుMOST READ:నెలరోజులలో ఉదరభాగంలో కొవ్వు తగ్గడానికి సమర్ధవంతమైన మార్గాలు

వైన్:

వైన్:

రెడ్ వైల్ లో ఉండే సల్ఫైట్ ప్రిజర్వేటివ్స్ జలుబు మరియు దగ్గుకు కారణం అయ్యి ఆస్త్మాకు దారి తీస్తుంది. అలర్జిక్ రియాక్షన్ కలిగించడంలో రెడ్ వైన్ ఒకటి. ఆల్కహాల్లోని అసిడ్ రిఫ్లెక్షన్ వల్ల ఆస్త్మాను మరింత తీవ్రతరం చేస్తుంది.

గోధుమలు:

గోధుమలు:

గోధుమల్లో గులిటెన్ మరియు ప్రోటీన్ ను కనుగొనడం జరిగింది . గులిటెన్ ఇన్ఫ్లమేషన్ కు కారణం అవుతుంది . ఇది వ్యక్తిలో శ్వాస సమస్యలకు గురిచేస్తుంది.

సోయా:

సోయా:

ఆస్త్మాకు కారణం అయ్యే ఆహారాల్లో సోయా ఒకటి. సోయాలో అనేక అలర్జిక్ ప్రోటీన్స్ కలిగి ఉంటాయి. కాబట్టి, అలర్జిక్ రియాక్షన్ కలిగిస్తాయి. కాబట్టి, ఆస్త్మా లక్షణాలు ఉన్నవారు ఈ ఆహారాలకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండటం మంచిది.

English summary

7 Foods That Worsen Asthma: Health Tips in Telugu

Asthma is a chronic inflammatory disease that causes difficulty in breathing. Asthma interferes with the day to day activates. It can be life threatening if it gets severe. The symptoms of asthma varies from person to person.
Desktop Bottom Promotion