For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాణాంతక ప్రొస్టేస్ట్ క్యాన్సర్ హెచ్చరిక సంకేతాలు....

|

మగవారిలో వయసుతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యల్లో ప్రోస్టేట్‌గ్రంథి వాపు ఒకటి. 60 ఏళ్లు వచ్చేసరికి సుమారు 70% మంది దీని బారినపడుతున్నట్టు అంచనా. మధ్య వయసు దాటిన పురుషుల్లో ప్రొస్టేట్‌ గ్రంథి పెద్దదవుతుంది. దీన్నే ప్రాణాపాయరహిత ప్రొస్టేట్‌గ్రంథి పెరుగుదల (బిపిహెచ్‌-బినైన్‌ ప్రొస్టేటిక్‌ హైపర్‌ప్లాసియా) అంటారు. తరచుగా ఇది 50 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితి కేన్సర్‌ కాదు.

ఇది మూత్రాశయానికి చుట్టుకుని ఉండడం వల్ల బిపిహెచ్‌ మూత్ర విసర్జనకు ఆటంకం కలిగిస్తుంది. బిపిహెచ్‌ ప్రొస్టేట్‌ గ్రంథి క్యాన్సర్‌ లక్షణ రహితంగా వృద్ధి చెందుతుంది. ఈ వృద్ధి మూత్రనాళాన్ని (శరీరం నుండి మూత్రాన్ని బయటకు పంపించేది) ముడుచుకుపోయేలా చేయడం వల్ల మూత్రాశయం ఖాళీ కావడాన్ని జటిలం చేస్తుంది. నలభై నుంచి యాభై ఏళ్లపైబడిన వాళ్లు ప్రతి సంవత్సరం ''సెరమ్‌ ప్రొస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటిజైన్‌'' పరీక్ష చేయించుకోవాలి. ఇంట్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే, మూత్ర సంబంధిత ఇబ్బందులుంటే కూడా చేయించుకోవాలి. ప్రొస్టేట్‌ గ్రంథి సమస్యలు, క్యాన్సర్‌గురించి...

మూత్రాశయం దిగువన ప్రొస్టేట్‌ గ్రంథి ఉంటుంది. పురుషులకు మాత్రమే ఉండే గ్రంథి ఇది. ఇది ఉత్పత్తి చేసే ఒక విధమైన ద్రవం వీర్యకణాలను రక్షిస్తుంది. పురుషాంగం నుంచి మూత్రాన్ని, వీర్యాన్ని బయటకు తీసుకెళ్ళే మూత్రమార్గం వెలుపలి భాగాన్ని చుడుతూ ఉంటుంది. ఈ గ్రంథి దీని ఉండే నరాలు అంగస్తంభనలో పాలు పంచుకుంటాయి. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు గురైతే క్యాన్సర్‌ కణాలు గ్రంథి అవతలి భాగాలకు కూడా విస్తరిస్తాయి. ఈ క్యాన్సర్‌ నెమ్మదిగా ఎదుగుతుంది. ఎలాంటి వ్యాప్తిని లేదా లక్షణాలను ప్రదర్శించవు. పెద్ద వయస్సులో, ఇతర వ్యాధుల కారణంగా మరణించిన వారిలో ఎంతోమందికి ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు తదనంతరం నిర్వహించిన శవపరీక్షల్లో వెల్లడైంది. కొన్ని రకాల ప్రొస్టేట్‌ క్యాన్సర్‌లు మాత్రం వేగంగా వృద్ధి చెందడంతో పాటు వేగంగా విస్తరిస్తాయి కూడా. 50 ఏళ్ళ పై బడిన పురుషులకు ఎక్కువగా ఈ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది.

పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు: నివారణ చర్యలు

క్యాన్సర్‌ ఉన్నవారికి తొలిదశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. చాలావరకు ఈ క్యాన్సర్‌లు రొటీన్‌గా నిర్వహించే మలాశయ పరీక్షల సందర్భంగానే వెల్లడవుతాయి. వ్యాధి తీవ్రత పెరిగిన తరువాత, మూత్రవిసర్జన ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆ సమయంలో బాగా బాధగా ఉండవచ్చు. వెన్ను లేదా మూత్రనాళం మొదలు లేదా పొత్తి కడుపు ప్రాంతంలో నొప్పిగా ఉండవచ్చు. మూత్రమార్గం చుట్టూ ఉండే ప్రోస్టేట్‌గ్రంథి వాపు మూలంగా మూత్రం ధార సన్నబడటం, బొట్లుబొట్లుగా పడటం, తరచుగా మూత్రం రావటం, ఎంతోకొంత మూత్రం లోపలే ఉన్నట్టు అనిపించటం, వెంటనే మూత్రానికి వెళ్లాల్సి రావటం, మంట వంటి రకరకాల లక్షణాలు కనబడతాయి. వీటితో పాటు మరికొన్ని బయటకు కనిపించే లక్షణాలు మీకోసం కొన్ని....

యూరిన్ లో బ్లడ్:

యూరిన్ లో బ్లడ్:

ప్రొస్టేట్ గ్రంథుల్లో క్యాన్సర్ కణాలు ఉత్పత్తి కావడం వల్ల బ్లడ్ సెల్స్ ను డ్యామేజ్ చేస్తుంది. దాంతో యూరిన్ లో బ్లడ్ లీక్ అవ్వడానికి కారణం అవుతుంది. అలాగే స్కలనం తర్వాత వీర్యంలో కూడా బ్లడ్ కనబడితే ప్రొస్టేట్ క్యాన్సర్ కు వార్నింగ్ లక్షణంగా గుర్తించాలి.

బ్యాక్ పెయిన్:

బ్యాక్ పెయిన్:

ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధపడే వారు తరచూ లోయర్ బ్యాక్ పెయిన్ తో బాధపడుతుంటారు. ముఖ్యంగా కలయిక తర్వాత స్కలన సమయంలో బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను కలవాలి. ప్రొస్టేట్ క్యాన్సర్ కు ఇది ఒక మంచి లక్షణం.

అంగస్తంభన:

అంగస్తంభన:

ప్రొస్టేట్ క్యాన్సర్ కు మరో హెచ్చరి సంకేతం అంగస్తంభన. అంగస్తంభన మాత్రమే కాదు, స్ఖలన సమయంలో నొప్పిగా అనిపించడం మరియు ఇలాంటి లక్షణాలే మరికొన్ని ఉన్నాయి.

మూత్రవిసర్జన సమస్యలు:

మూత్రవిసర్జన సమస్యలు:

మూత్రం అనిశ్చితంగా, ఆగి ఆగి సన్నగా రావడం. మూత్రం తొందరగా రావడం, కారటం లేదా బొట్టు బొట్టుగా పడటం. అత్యంత తరచుగా మూత్ర విసర్జన, ప్రత్యేకించి రాత్రి సమయంలో. మూత్ర విసర్జన సమయంలో మంటగా/నొప్పిగా ఉండటం. అత్యవసరంగా రావటం, మూత్రవిసర్జనను ఆపుకోలేకపోయే అనుభూతి. మూత్ర విసర్జనకు ప్రారంభించడానికి, కష్టపడటం లేదా ఒత్తిడికి అవసరం కావటం వంటి లక్షణాలుంటాయి.

మంట:

మంట:

మూత్రవిసర్జన సమయంలో మంటగా అనిపించడం లేదా నొప్పితో బాధపడటం లక్షణాలు కనబడితే సాధారణమే అనుకోకుండా వెంటనే డాక్టర్ ను కలిసి, చికిత్స తీసుకోవాలి.

 వాపు నొప్పి:

వాపు నొప్పి:

సున్నితమైన పురుషాంగం ఎర్రబడటం మరియు వాపు వంటి లక్షణాలు ప్రొస్టేట్ క్యాన్సర్ కు చిహ్నంగా గుర్తించాలి . ఈ సమస్యతో పాటు, మూత్రవిసర్జన సమస్యలు మరియు లైంగిక గందరగోళాన్ని ఎదుర్కొటారు.

మూత్ర విసర్జనను కంట్రోల్ చేసుకోలేకపోవడం:

మూత్ర విసర్జనను కంట్రోల్ చేసుకోలేకపోవడం:

వ్యాధి తీవ్రత పెరిగిన తరువాత, మూత్రవిసర్జన ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆ సమయంలో బాగా బాధగా ఉండవచ్చు. వెన్ను లేదా మూత్రనాళం మొదలు లేదా పొత్తి కడుపు ప్రాంతంలో నొప్పిగా ఉండవచ్చు. మూత్రం ప్రయాణించే మార్గం కష్టంగా మారుతుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాల్లో ఇది ఒకటి. ప్రొస్టేట్ గ్రంథిలో కణతులు పెరగడం వల్ల ఇలాంటి సమస్యలు ఏర్పడవచ్చు.

English summary

Alarming Signs Of Prostrate Cancer: Health Tips in Telugu

Alarming Signs Of Prostrate Cancer: Health Tips in Telugu,The concept of 'No-Shave November' is to increase awareness by embracing our hair. It is in honour of prostrate cancer patients who lose their hair after chemotherapy. To observe no-shave November month, all you need to do is donate the money you usual
Story first published: Saturday, November 7, 2015, 11:43 [IST]
Desktop Bottom Promotion